9, మే 2016, సోమవారం

సమస్య - 2028 (నీరు జల్లినంత...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
నీరు జల్లినంత నిప్పు రగిలె.

88 కామెంట్‌లు:

  1. కలసిమెలసి యుండు గ్రమస్తుల నడుమ
    గొడవ పెట్టినారు కుర్రకారు
    హోలిపండుగనుచు నోపిల్లపై రంగు
    నీరు జల్లినంత నిప్పు రగిలె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలసిమెలసి యుండు గ్రామస్తుల నడుమ
      గొడవ పెట్టినారు కుర్రకారు
      హోలిపండుగనుచునోపిల్లపై రంగు
      నీరు జల్లినంత నిప్పు రగిలె.

      తొలగించండి
    2. చంద్రమౌళి సూర్యనారాయణగారూ!
      భలే పూరణ అందించారు .. ధన్యవాదములు

      తొలగించండి
    3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      రంగునీళ్ళతో చిచ్చు రగిల్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములు ఊకదంపుడు గారు, ధన్యవాదములు మాష్టారు

      తొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణగారూ! మీ పూరణ సింప్లీ సూపర్బ్.

    రిప్లయితొలగించండి
  3. చెఱకు పంట తెవుల జిక్కిపనికిరాక
    పెట్ట మంట తగుల బెట్ట దలచి
    అంత నింధ నమును యజమాని యౌ”యింజ
    నీరు” జల్లి నంత నిప్పు రగిలె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంజనీరు నిప్పు పెట్టిన మీ పూరణ బాగున్నది.అభినందనలు.

      తొలగించండి
  4. మాతృ దినోత్సవ సందర్భముగా అందరినీ ఆశీర్వదించి అమ్మ
    ----------------------------
    చక్క నైన జంట మక్కువగా నుండె
    చూచి యోర్వ లేని చుప్ప నాతి
    జేరి పలికె నకట చేదువంటి విషపు
    నీరు జల్లి నంత నిప్పు రగిలె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      విషపు నీరు అంటూ రూపకంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. పొయ్యిమీద వెన్న పెట్టిమరచిపోగ
    పొంగిపొరలి నెయ్యి పొగలఁ గ్రమ్మె
    చల్లబఱచుకొరకు నిల్లాలు కాసిన్ని
    నీళ్ళు జల్లినంత నిప్పురగిలె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      ధన్యవాదాలు. యతిదోషాన్ని నేను గమనించలేదు. పనిలో పనిగా సవరణ కూడా సూచిస్తే ఓ పని అయిపోయేది కదా!

      తొలగించండి
  6. పొయ్యిమీద పాలు పొంగుట సతిఁజూచి
    ఆర్పివేయఁదలచి అచటి కెళ్ళి
    చెంబు చేతబట్టి జేతజిలకరించె
    నీళ్లు జల్లినంత నిప్పు రగిలె.

    రిప్లయితొలగించండి
  7. జాతి, మతము లనుచు జనులమధ్య యెపుడు
    లేని గొడవ తెచ్చు లేకి తనము
    పుండు ముదిరినాడు పుట్టించగలవెన్నొ
    నీరు జల్లి నంత నిప్పు రగిలె

    రిప్లయితొలగించండి
  8. డా.ఎన్.వి.ఎన్. చారి 9866610429
    నమ్మకమ్ము నంత వమ్ము జేయగ తాను
    కోపమగ్ని యగుచు కొలువు జేసె
    నాదు మనము నందు నను జేరి కపటి క
    న్నీరు జల్లి నంత నిప్పు రగిలె

    రిప్లయితొలగించండి
  9. బండకాడి అంజయ్య గారి పూరణ.....

    అన్ని ప్రాణులకును నాదార మెయ్యది
    పొలము లోన విత్తు మొలక లెత్తు
    యజ్ఞ యాగములలొ నాజ్యము వేయగ
    నీరు జల్లి నంత నిప్పు రగిలె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లో' ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. యాగములను.... అనండి.

      తొలగించండి
  10. ధరణీశ్వరి గారి పూరణ....

    ఇరుగు పొరుగు నున్న ఇద్దరు మిత్రులు
    మాట మాట పడక మాటలేక
    మనసు విరిగి వారి మధ్య ముదముగా
    నీరు జల్లినంత నిప్పు రగిలె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధరణీశ్వరి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ముదముగా... అనకుండా 'వారి మధ్య నెప్పుడు గాని... అందామా?

      తొలగించండి
  11. జాతి, మతము లనుచు జనులమధ్య యెపుడు
    లేని గొడవ తెచ్చు లేకి తనము
    పుండు ముదిరినాడు పుట్టించగలవెన్నొ
    నీరు జల్లి నంత నిప్పు రగిలె

    రిప్లయితొలగించండి
  12. మకిలి మనిషి యొకడు మంచిగా కొనసాగు
    కాపురమున చిచ్చు గాంచ దలచి
    సత్య దూరమైప 'చాడీ'లను బురద
    నీరు జల్లి నంత నిప్పు రగిలె.

    రిప్లయితొలగించండి
  13. ప్రేమ పేరు తోడ వేధించ నొక్కడు
    ఒప్పు కొనక పిల్ల తప్పుకొనగ
    పగను బూని యతడు పడతిపై నామ్లపు
    నీరు జల్లినంత నిప్పు రగిలె!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఒక్కడు + ఒప్పుకొనక... అని విసంధిగా వ్రాసారు. 'వేదింపగా నొక్క | డొప్పుకొనక' అనండి.

      తొలగించండి
  14. ఊరు వాడయు నొక దీరుగా నుండంగ
    పోరు లేపి నారు పొగరుబోతు
    లిపుడు గ్రామమందు నిడుపులు పొడసూపె
    నీరు జల్లినంత నిప్పు రగిలె!

    ఇడుపు=చీలిక

    రిప్లయితొలగించండి
  15. Sk2033
    అయుతకవిసమ్మేళనం
    కవితసం:4
    చేపూరిశ్రీరాం
    నీటికొరతపెరిగెకన్నీటివరదతోను
    తల్లడిల్లిజనముతగవులాడ
    హద్దులెక్కువయ్యిపొద్దుగడుచుచుండె
    నీరుజల్లినంతనిప్పురగిలె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'నీటి కొరతఁ గంటినీటి వరదతోడ' అనండి.

      తొలగించండి
  16. పర్వదినమునందు బజ్జీలు వేయుచు
    సంతసించు వేళ సతిని జూసి
    పతియు పిలవగ పొరపాటున నూనెలో
    నీరు జల్లినంత నిప్పు రగిలె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ యెర్రోజు జయసారథి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. శూర్పణకయె వచ్చి సూది గుచ్చినర రీతి
    మాట లాడియన్న మనసు మార్ప
    కంట నీరు బెట్టి కార్చిన మొసలిక
    న్నీరు జల్లి నంత నిప్పు రగిలె
    సవరించిన గృూపులొపెట్టగలను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      టైపు దోషాలున్నవి. మీ పద్యానికి నా సవరణ.....

      శూర్పణఖయె వచ్చి సూది గ్రుచ్చిన రీతి
      మాటలాడి యన్న మనసు మార్చఁ
      గంట నీరు పెట్టి కార్చిన మొసలి క
      న్నీరు జల్లినంత నిప్పు రగిలె.

      తొలగించండి
  18. ఇంద్రజాలమచట నింపుగా జూపించు
    నతడు 'స్టేజి ' పైన నా రుమాలు
    బట్టి ' స్టిక్కు ' చుట్టు పలుమార్లు త్రిప్పుచు
    నీరు జల్లినంత నిప్పు రగిలె.

    రిప్లయితొలగించండి
  19. సవరణతో
    నీటికొరతపెరిగి నేటి రోజులలోన
    తల్లడిల్లిజనముతగవులాడ
    హద్దులెక్కువయ్యిపొద్దుగడుచుచుండె
    నీరుజల్లినంతనిప్పురగిలె

    రిప్లయితొలగించండి
  20. అంబటి భానుప్రకాశ్,
    గద్వాల.
    ఆ**
    భామలంత గూడి బావినీళ్ళకు వెళ్ళి
    మాటలాడు చుండ మాట మారె,!
    నీరు జల్లినంత నిప్పురగిలెను జూడ,
    తిట్టుకొనుచు వారు కొట్టుకొనిరి, !!


    సార్ నమస్కారాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెళ్ళి' అనడం వ్యావహారికం. 'పోయి' అనండి.
      నిన్న గద్వాల స్టేషన్లో మిమ్మల్ని, నాయుడుగారి జయన్న గారిని కలిసి మాట్లాడినందుకు ఆనందంగా ఉంది.

      తొలగించండి
  21. నిప్పు చల్ల గనగు నీరజ !తెలియుము
    నీరు జల్లి నంత, నిప్పు రగిలె
    భోగి మంట నుండి భుగ భుగ మనుచును
    గట్టె వేయ గనది యట్టు లుండు

    రిప్లయితొలగించండి
  22. Sk 2032 ఆకస
    డా.ఎన్.వి.ఎన్. చారి 9866610429
    నీరు జల్లినంత నిప్పురగిలెనంచు
    విస్మయంబు తోడ తస్మదీయ
    శాస్త్ర వేత్త నడుగ జలముగాంచి తెలిపె
    మండు గుణమ గలదు మెండు గనుచు

    రిప్లయితొలగించండి
  23. పర్వ దినము లందు పరిణయ వేళలఁ
    బూజ లందు జనులు తేజ మలర
    నగ్ని హోత్ర మందు ననువుగ నానెయ్యి
    నీరు జల్లినంత నిప్పు రగిలె.
    [నీరు = అల్పము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీరు శబ్దాన్ని విశేషణంగా గ్రహించి చేసిన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  24. వచ్చి యిచ్చెదమని ప్రత్యేక హోదాను
    యందలమ్మునెక్కి యాటలాడి
    వ్రాతపూర్వ కముగ రాష్ట్రంపు టాశపై
    నీళ్లు జల్లినంత నిప్పురగిలె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రత్యేకహోదా ఆశలపై ‘నీరు’ చల్లారన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. కోరికలడరంగ కుంభి చెచ్చెర నాము
    నీరుచల్లి నంత, నిప్పురగిలె
    కుంభిని గుమిలోన కొలను దద్దరిలగ
    నీరుకమ్మివైచె నింగినంత
    ఆమునీరుః మదజలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజు, విగత సర్ప రాజు కళేబర
      ము, ముని మెడను వేసె, ముని తనయుడు,
      శృంగి, రాజు పట్ల కృపను జూపక
      నీరు జల్లి నంత, నిప్పు రగిలె

      తొలగించండి
    2. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. హనుమంత రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రాజు చచ్చిన యహిరాజు కలేబర...’ అనండి.

      తొలగించండి
  26. గు రు మూ ర్త ఆ చా రి



    ఆలు పుట్టిని౦టిి కరిగె | ె గారెలు సేయ

    పెనము లోన నూనె వేడి చేసి

    మసలు నూనె లోన మరచిపోయియతడు
    నీరు జల్లి న౦త నిప్పు రగలె

    రిప్లయితొలగించండి
  27. మిత్రులందఱకు నమస్సులు!


    పారిజాత సుమముఁ బడఁతి రుక్మిణి కిచ్చు
    వార్త సత్య చెంతఁ బఱఁగఁ దెల్పి
    మనము నందుఁ జెలియ మాత్సర్య మను వేఁడి

    నీరు జల్లినంత నిప్పు రగిలె!

    రిప్లయితొలగించండి
  28. అలిగి పండుకొనిన యతివను బ్రతిమాల
    కాళ్ళు పట్టబోయి గళము బట్టె
    నంధుడైన భర్త ; యది గుగ్గిలమ్మయ్యె
    నీరు జల్లినంత నిప్పు రగిలె.

    రిప్లయితొలగించండి
  29. ఇరుగు పొరుగు పోరు పెరిగిన తరుణాన
    నీరుజల్లినంత?నిప్పురగిలె|
    మనిషి మనసులందు మలినపుబుద్దిచే
    కలుషితంబుజేర కారుచిచ్చె|
    2.ఎన్నికలు జరుప?కొన్ని సందర్భాలు
    నీరుజల్లినంత ?నిప్పురగిలె
    అన్నచందమందె నావేష రోషాలు
    త్రాగు డందు మునిగి వాగునపుడు|

    రిప్లయితొలగించండి
  30. నా రెండవ పూరణ:

    విందులోన నొక్క పిల్లఁడు నీటినిఁ
    ద్రావి, పాత్ర నుమిసె! దానిఁ గనక,
    విస్తరులను వేసి, వేగ నా యుమిసిన

    నీరు జల్లి నంత, నిప్పు రగిలె!

    రిప్లయితొలగించండి
  31. అగ్ని కార్య మునకు నా బ్రహ్మచారి వి
    చ్ఛిన్న మైన నగ్ని చేర్చి మరల
    వందనమ్ము చేసి పరిషేచనము సేయ
    నీరు జల్లినంత, నిప్పు రగిలె.

    రిప్లయితొలగించండి
  32. గురుదేవులకు వందనములు! కవి మిత్రులందరకు అభివందనములు!!

    నీటి కొరత యున్న చోట బాధను దీర్చ
    పుర జనులకు నీరు పోయునట్టి
    బండివద్ద నీరు పారబోయుటకయ
    నీరు జల్లి నంత నిప్పురగిలె!

    రిప్లయితొలగించండి
  33. HANU PRAKASHమే 09, 2016 9:34 [AM]
    అంబటి భానుప్రకాశ్,
    గద్వాల.
    ఆ**
    భామలంత గూడి బావినీళ్ళకు పొోయి,
    మాటలాడు చుండ మాట మారె,!
    నీరు జల్లినంత నిప్పురగిలెనులెే,
    తిట్టుకొనుచు వారు కొట్టుకొనిరి, !!


    సవరించిన పద్యం.


    సార్ నిన్న మిమ్మల్ని కలవడం మాకూ సంతోషం.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. కారుచిచ్చు రగిలె కట్టెల రాపిడి
    నిప్పు నార్ప వచ్చు నీరు జల్లి,
    నీరు జల్లి నంత నిప్పు రగిలెననగ
    నీటి చిచ్చు నార్ప నేర్చు నెవడు?

    రిప్లయితొలగించండి
  35. పిన్నక నాగేశ్వరరావు గారి పూరణ...

    సమసి పోయి తగవు సఖ్యతతో నుండ
    నారదుండు వంటి నరుడొకండు
    అడ్డుపుల్ల వేసి యాప్తుల మధ్యన
    నీరు జల్లినంత నిప్పు రగిలె.

    రిప్లయితొలగించండి
  36. పతిని బాసి యేడ్చు పడతి చెంతనజేరి
    సానుభూతి దెలుపు సమయ మందు
    తగ్గినట్టి బాధ తన్నుకువచ్చెను
    నీరు జల్లినంత నిప్పురగిలె

    రిప్లయితొలగించండి
  37. పెద్దతండ్రిబుధ్ధి బిడ్డలయాసపై
    నీరు జల్లినంత నిప్పురగిలె
    పాండుసుతుల హృదయపద్మంబు లందున
    ధార్తరాష్ట్రకులవిదారణముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆశలపై నీళ్ళు చల్లడం విషయంగా మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. నేటి శంఖరాభరణం వారి సమస్యాపూరణం
      సమస్య : నీరుజల్లినంత నిప్పు రగిలె
      పూరణ :
      ఆ. వె :
      కడుపులోన అగ్ని కణ కణ మండంగ
      చల్ల బరచ నట్లు చేయ బోగ
      అట్లపెనముపైన నూనెఅధికమయ్యి
      నీరు జల్లినంత నిప్పు రగిలె

      తొలగించండి
  38. HANU PRAKASHమే 09, 2016 9:34 [AM]
    అంబటి భానుప్రకాశ్,
    గద్వాల.
    ఆ**
    భామలంత గూడి బావినీళ్ళకు పొోయి,
    మాటలాడు చుండ మాట మారె,!
    నీరు జల్లినంత నిప్పురగిలెనులెే,
    తిట్టుకొనుచు వారు కొట్టుకొనిరి, !!


    సవరించిన పద్యం.


    సార్ నిన్న మిమ్మల్ని కలవడం మాకూ సంతోషం.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  39. వేసవినను యెండ వేడిదట్టుకొనక
    తెలివి దప్ప నెటుల దిరిగి లేచు ?
    రాయి రాయి జేర్చి రాపాడ నేమాయె?
    నీరు జల్లినంత, నిప్పు రగిలె

    రిప్లయితొలగించండి
  40. అవని యందు చూడ అన్నదమ్ముల మధ్య

    నీరు జల్లినంత నిప్పు రగిలె
    ననుచు పల్కు జనుల నాపలేక
    మౌనమాశ్రయించె మనుజ జాతి.

    రిప్లయితొలగించండి
  41. అరాశ
    sk72

    పచ్చి గడ్డివేయ భగ్గున మండెడి
    శత్రు జంట మధ్య సంధి గూర్చ
    ఇతరులు తలబెట్టి హితమును గూర్చగా
    నీరుజల్లి నంత నిప్పురగిలె!

    రిప్లయితొలగించండి
  42. అరాశ
    sk72

    పచ్చి గడ్డివేయ భగ్గున మండెడి
    శత్రు జంట మధ్య సంధి గూర్చ
    ఇతరులు తలబెట్టి హితమును గూర్చగా
    నీరుజల్లి నంత నిప్పురగిలె!

    రిప్లయితొలగించండి
  43. నల్లనయ్యఁ దూచు నారదీయమ్మైన
    పందె మందు నెగ్గి పరవశిల్లు
    రుక్కిణమ్మ మీద రొండు చుక్కల్లు ప
    న్నీరు జల్లినంత నిప్పు రగిలె :)

    రిప్లయితొలగించండి