కల
రచన : అమరవాది రాజశేఖర
శర్మ
ఉదయమాదిగ చేసిన యూడిగములు
కలుగు కష్టాలు నష్టాల
కలతమాని
నిదురపోయెడి వేళలో
మధురమైన
కలను గంటిని దేవుని
కనుల గంటి
ఓయి మానవా! కుశలమా!
యుర్వి జనులు
శాంతి సౌఖ్యాల సౌభాగ్యశాలు
రగుచు
నున్నతిని బొంది జీవించు
చున్నవారె?
యనుచు హితమున ప్రశ్నించె
నమర నుతుడు.
సౌఖ్య మననేమొ దానితో
సఖ్యమునకు
బ్రతుకు బ్రతుకంత వ్యర్థమై
చితికిపోయె
శాంత మనుమాట కర్థము
సారసాక్ష
మనిషి కలనైన గనలేని
ఖనిజమయ్యె.
అన్నదమ్ముల మధ్య నాత్మీయతలు
లేవు
తలి దండ్రుల నెవడు తలచుకొనడు
పొరుగు వారికి ప్రేమ
నొరుగబెట్టుట లేదు
ప్రాణ మైత్రిని సేయు ప్రజలు లేరు
నీతిగా జీవించు నియమ
నిష్ఠలు లేవు
చేటు మోసము లేని చోటులేదు
స్త్రీలను పూజించు
శీల మెక్కడ లేదు
పాప పుణ్యాలన భయము లేదు
కులము మతముల పేరిట
కుమ్ములాట
క్షణములో కోట్లనార్జించ
పెనగులాట
నాయకత్వము సాధించ మాయమాట
లవని నిండె నిదేలకో
లలిత హృదయ.
అని విన్నవించ దైవము
తన కనులను సగము మూసి
తడవును కొంతన్
మనసున యోచన సేయుచు
ననుగని చిరు నగవు తోడ
ననియెన్ వినగన్
ఇన్నిటికి మూల మొక్కటై
యున్నదేమి
స్వార్థపు పిశాచి మనిషిపై
స్వారి చేసి
లోభమందున ముంచియు క్షోభ
పెట్టి
రాక్షసునిగను మార్చిన
సాక్ష మిదియె.
పరుల కుపకార మొనరించ
వరము తనువు
మానవాళికి నొనరించు
మహిని సేవ
మాధవార్చన యగునని మనసు
నిండు
మంచి సూక్తుల నెన్నడో
మరచినారు.
పరుల క్షేమము కాంక్షించి
పనిని జేసి
వారి సంతసానికి తాము
కారణముగ
తలచి సంతృప్తి నొందుట
తపము గాదె
పరుల మోదమే పండుగై
వరమునొసగు.
పందికొక్కులు తన పొట్ట కింద దాచి
మనిషి కాదర్శమై నేడు
మసలు చుండె
పరుల హితమును కోరెడి
తరువు గుణమె
యేవగింపుగా మారిన దేమి
పుడమి.
అన్ని ప్రాణుల హృదయాన
నాత్మ నగుచు
నున్నవాడిని తెలుసుకో
కన్నబిడ్డ
స్వార్థభావము విడి
పరమార్ధ దృష్టి
అలవరచుకొనినను శాంతి
నందగలవు.
మంచి బోధించి పరమాత్మ
మాయ మయ్యె
తెల్లబోయితి నింతలో
తెల్లవారె
కనులు తెరిచితి స్వప్నమే
మనసు నిండ
దేవదేవుని బోధనల్ తేజరిల్లె.
రాజ శేఖర శర్మచే రమ్యముగను
రిప్లయితొలగించండివ్రాయ బడినట్టి యీ కృతి పామరులరు
సహిత మయ్యది బాగుగ జదువ గలరు
శైలి సులభమ గుగతన గలను నైన
ధన్యవాదాలు సర్
తొలగించండిరాజశేఖర శర్మ గారు మీ ఖండ కావ్యము “కల” కలకాలము నిలుచు సత్యము లా శోభిస్తున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి“రాక్షసునిగను మార్చిన సాక్ష మిదియె.” “సాక్ష్యము” సాధువు. “సాక్షి యిదియ” అంటే బాగుంటుందేమో?
“దృష్టి/ నలవరచుకొనినను” అంటే బాగుంటుంది.
అభినందలకు సూచనలకు ధన్యవాదాలు సర్
తొలగించండిశ్రీ అమరవాది రాజశేఖరశర్మ గారికల కళగా వర్ణనబాగున్నది వందనము
రిప్లయితొలగించండిఅమరవాదిరాజ|ఆరనిస్వార్థమ్ము
నిండియుండె మనిషి కండలాగ|
అండ నదియె గాగ? నిండుమనసుయేది?
బ్రతుకు స్వప్న మాయె-బ్రమల యందు.
ధన్యోస్మి
తొలగించండిధన్యోస్మి
తొలగించండిదైవవాణిని కలలో స్పృహతో విన్న మీకు అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యోస్మి
తొలగించండిధన్యోస్మి
తొలగించండిశ్రీ అమరవాది రాజశేఖరశర్మ గారూ మీ కల ఖండిక చాలా బాగున్నది.
రిప్లయితొలగించండి"గబ్బిలము" లాంటి కావ్యాన్ని గుర్తుకు తెచ్చే విధముగా అలరారుతున్నది.
మన:పూర్వకాభినందనలు.
ధన్యవాదములు సర్
రిప్లయితొలగించండిధన్యవాదములు సర్
రిప్లయితొలగించండిఅద్భుతం స్వప్నం!
రిప్లయితొలగించండిఅద్భుతం స్వప్నం!
రిప్లయితొలగించండిప్రీతిగ శాంతిని వలచే
రిప్లయితొలగించండిఖ్యాతినినిలలోబడసిన కంకుడు నలుగన్
భూతలి యేమగునోయని
భీతిల్లిరి ధర్మజుగని భీమార్జునులే