16, మే 2016, సోమవారం

ఖండకావ్యము - 23

పరమపద సోపాన పటము
రచన : గుండు మధుసూదన్

కం.      నిముసమునఁ బాము దిను, మఱు
నిముసము నిచ్చెనల నెక్కు నిక్కపుఁ గ్రీడన్,
శ్రమపడి యాడుచు నుండఁ,
రమపద సోపాన పటము రాగిలుచుండున్!

కం.      సుమతులకు నాట యందున
సమమగు నిశ్శ్రేణితతులు, ♦ సర్ప కబళముల్!
కుమతులనుఁ బాము మ్రింగును;
గమనింపఁగ నిచ్చెనలు ''♦కారమ్మె యగున్!

తే.గీ.     హితుల 'వైకుంఠ పాళి' హిష్ణుతఁ గని,
యాడ, వైకుంఠుఁ డెప్పుడు నైక్య మంద
నీయఁ, డెంతయును ఘన పరీక్ష సేసి,
పిదప నెగ్గించి, తన దరిన్ వేగఁ జేర్చు!

ఆ.వె.     పిల్ల లాడు నాట, ♦ పెద్ద లాడెడి యాట,
నిచ్చెనలును పాము లిచ్చి పుచ్చు!
వారి వారి కర్మ పరిపాకమునుఁ బట్టి

ముందు వెనుకలుగను మోక్ష మొదవు!!

11 కామెంట్‌లు:

 1. పిల్ల పెద్ద లనక నెల్లవా రునునాడు
  కొనెడి యాట యీ వైకుంఠ పాళి
  ముందు వెనుక లుగను మోక్ష మందుదు రట
  గుండు వారి యాట గొప్ప దనము

  రిప్లయితొలగించండి
 2. మనిషి జీవితం వైకుంఠపాళి వంటిదని చక్కగా చెప్పారు.

  రిప్లయితొలగించండి
 3. తరగతి గదిలో చదువుల్
  బురోగతి వలయు ననంగ పుస్తకమందున్
  సరగున పాఠ్యాంశముగన్
  దొరలించగ మేటి పద్య తోరణమిదియౌ!

  రిప్లయితొలగించండి

 4. పరమ పదపు సోపానము
  విరివిగ మాన్యులు జిలేబి విదురులు జూడన్
  పరిచిరి పాఠపు పటము వ
  నరులుగ గుండు మధుసూధన కవి వరులిటన్ !

  రిప్లయితొలగించండి
 5. 16గుండు మధుసూధనార్యా
  కొండగు సోపానపటము కోర్కెల చేతన్
  నిండు మనస్సున నిచ్చెన
  అండగనేనాడ?గెలుపు నందుట సులువే|

  రిప్లయితొలగించండి
 6. జీవితమే ఒక వైకుంఠపాళి...నిజంతెలుసుకోభాయీ....యన్నట్లు మీ పద్యరచన విశదం చేస్తోంది

  రిప్లయితొలగించండి