20, మే 2016, శుక్రవారం

సమస్య - 2039 (అనుమానించెడు పతి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అనుమానించెడు పతి గల యతివ సుఖించున్.

89 కామెంట్‌లు:

  1. దినమంతయునీరీతిన
    పని భారముతో నలసెడు పత్నిని సరిగా
    తినుచున్నద యన్నమనుచు
    ననుమానించెడు పతి గల యతివ సుఖించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దినమంతయునీరీతిన
      పని భారముతో నలసెడు పత్నిని సరిగా
      తినుచున్నద వేళకనుచు
      ననుమానించెడు పతి గల యతివ సుఖించున్

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రీతిని... తినుచున్నదొ..’ అనండి.

      తొలగించండి
  2. తనువులు వేరే యైనను
    మనమున సంతసము నొందు మానిని సతిగా
    అనువుగ ప్రేమను పంచున
    అనుమానించెడు పతిగల యతివ సుఖించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పూరణ బాగుంది. ‘ప్రేమను పంచుట| కనుమానించెడు..’ అనండి.

      తొలగించండి
  3. కవివరులు చెప్పినాక కాదన గలమా :)

    శుభోదయం !


    వినుమా జిలేబి కవివరు
    డనువాడెల్లపుడు యోగ్యు డాశాపరుడున్
    తనకనిపించిన నిజమే!
    అనుమానించెడు పతి గల యతివ సుఖించున్ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నిజమని’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  4. గురువు గారికి నమస్కారములు

    మనసును చంపుకుని బ్రతుకు
    నవమానించెడు పతిగల యతివ, సుఖించున్
    తననభిమానించుచు మ
    న్ననజేయు మగడు కలిగిన నారియె సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      టైపాటువల్ల ‘అనుమానించెడు’.. ‘అవమానించెడు’ అయి ప్రాస తప్పింది.

      తొలగించండి
    2. మనసును చంపుకుని బ్రతుకు
      ననుమానించెడు పతిగల యతివ, సుఖించున్ 
      తననభిమానించుచు మ
      న్ననజేయు మగడు కలిగిన నారియె సుమ్మీ

      గురువు గారు క్షమించాలి

      తొందరపాటు వలన జరిగిన పొరపాటు

      తొలగించండి
  5. దినమును రాత్రియు టీవీ
    కనుచును కోడలిని యత్త కర్కశ పెట్టన్!
    తన తల్లి మాటనైనను
    అనుమానించెడు పతి గల యతివ సుఖించున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘ఐనను+అనుమానించు’ అన్నపుడు సంధి నిత్యం కదా! మీరు విసంధిగా వ్రాశారు. ‘తన తల్లి చెప్పు మాటల| ననుమానించెడు...’ అనండి.

      తొలగించండి
  6. కనులార జూచు కొంచును
    దన మనసుం బంచు కొనెడి దన సతి జెంతం
    దన కింత బ్రేమయా! యని
    యనుమానించెడు పతిగల యతివ సుఖించున్!

    రిప్లయితొలగించండి
  7. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    మనువాడిన తన సతికిని
    మనుగడ ముప్పు న్నదనుచు మాన్యుడు తెలుపన్
    తన భార్య ముప్పు పైనను
    యనుమానించెడి పతి గల యతివ సుఖించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పైనను+అనుమానించెడి’ అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! ‘తన భార్యకు ముప్పగునని| యనుమానించెడి...’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  8. పెనిమిటి చూడని వేళలొ
    తను, జీతము జేబునుండి తరలించినచోన్
    తన తల్లే తీసెననుచు
    అనుమానించెడు పతిగల యతివ సుఖించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పుండరీకుడు తాను దొంగిలించి తల్లిమీద పెట్టాడు. ఈ అభినవ పుండరీకుడు తన భార్య దొంగతనాన్ని తల్లిపై మోపాడు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      ‘వేళలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాయరాదు. ‘వేళన్’ అనండి. అలాగే ‘తల్లియె’ అనండి.

      తొలగించండి
  9. క్షమించండి...విరించిగారు. మీ కందము రెండవ పాదంలో ప్రాస గమనించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాపం! అది టైప్ పొరపాటు... అనుమానించు... అవమానించు .. అయింది.
      మిత్రుల పూరణలను నిశితంగా పరిశీలిస్తూ స్పందించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  10. గురువు గారికి నమస్కారములు.
    .
    దినమంతయు నేదో యొక
    పని జేయుచు నలసిపోవు భార్యను గనుచున్
    తన యారోగ్యము గూరిచి
    అనుమానించెడు పతిగల యతివ సుఖించున్

    రిప్లయితొలగించండి
  11. అనయము శోకించుభువిని
    ననుమానించెడు పతిగల యతివ,సుఖించున్
    మనమున నెనరును బంచుచు
    వనముల జూపించువిభుడు వరియింపంగన్.

    రిప్లయితొలగించండి
  12. మనువాడిన సుకుమారికి
    ననితరసౌందర్యరాశి కాతప మది సో
    కిన తనువు కందునని మది
    ననుమానించెడు పతిగల యతివ సుఖించున్.

    రిప్లయితొలగించండి
  13. తనకంటి పాపవనుచుచు
    ననవరతము పతి స్వస్థత నాకాంక్షించున్
    తనశ్రీమతి బాగోగుల
    ననుమానించెడు పతిగలయతివ సుఖించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      రెండవ పాదంలో గణదోషం. 'పతికి మేలు నాకాక్షించున్' అనండి.

      తొలగించండి
  14. చామర్తి అరుణ గారి భావానికి నా పద్యరూపం...

    దిన మంతయు నుద్యోగ
    మ్మున నలసి గృహమ్ముఁ జేరు ముద్దుల సతి కిం
    టను పని భారమ్మగునని
    యనుమానించెడు పతి గల యతివ సుఖించున్.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారికి నమస్కారములు . మీరు సూచించిన విధంగా సవరించిన పూరణాన్ని ఇక్కడ వుంచాను.
    ధన్యవాదములు. శ్రీధర రావు.

    దినమును రాత్రియు టీవీ
    కనుచును కోడలిని యత్త కర్కశ పెట్టన్!
    తన తల్లి చెప్పు మాటల
    ననుమానించెడు పతి గల యతివ సుఖించున్!

    రిప్లయితొలగించండి
  16. తనకోసమె జూచుచు సతి
    కనిపెట్టుకొనుండు తాను కలవరపడుచున్
    తినెనో? లేదో? యనుచు
    న్ననుమామించెడు పతిగల యతివ సుఖించున్!!!


    అనుదినము గుమిలిపోవును
    అనుమానించెడు పతిగల యతివ, సుఖించున్
    అనురాగము గురిపించుచు
    తనమనసెరిగినడచుకొను ధవుడున్న సతిన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      'కొని + ఉండు' అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ 'కనిపెట్టుకొను నని తాను' అనండి. అలాగే 'లేదో యని తా | ననుమానించెడు. ..' అనండి. రెండవ పద్యంలో 'అనుదినము బిట్టుగ గుములు |ననుమానించెడు...' అనండి

      తొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    "కనులా, మీనములా? యా
    ననమా, పద్మమ? సువీక్ష, నన తూపుల? దం
    శనముల, మల్లియల?" యనుచు

    ననుమానించెడు పతి గల యతివ, సుఖించున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భ్రాంతిమదలంకారంతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. చాలాచక్కని పూరణమందించిన మధుసూదన్ గారికి ధన్యవాదములు
      అస్తినాస్తిహేతువిచికిత్సాశాతోదరి అనే పదదళాన్నీ (శ్రీనాధకవిసార్వ భౌముడిది అనవచ్చునా)
      వేటూరి వారి నడకా? హంసధ్వని రాగమా? అనే చిత్రగేయాన్ని గుర్తుచేసారు

      తొలగించండి
    3. నిస్సందేహంగా ఇది సందేహాలంకారమే శంకరయ్యగారూ!

      సుకవులు శ్రీ ఊఁకదంపుడు గారికి...శ్రీ కంది శంకరయ్య గారికి ధన్యవాదములు!

      తొలగించండి
  18. కనఁ జక్కని రూపమ్మును
    విన నింపగు మాటలఁ దనివి నొసంగుచు మో
    మున మోము మోదముగ, నిజ
    మను, మానించెడు పతి గల యతివ సుఖించున్.
    [నిజము+అనుము+ఆనించెడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  19. కృతజ్ఞతలు శంకరార్య.

    టైపు పొరబాటే... సరిచేసుకుంటారని సూచించాను.క్షమించాలి.

    రిప్లయితొలగించండి
  20. తననే సర్వం బనుకొని
    యనునిత్యము గొల్చు సతికి హాయిని గూర్చన్
    క్షణమైనవిడుతునా "యని"
    యనుమానించెడుపతిగల యతివ సుఖించున్

    రిప్లయితొలగించండి
  21. అనవరతమిడుములన్ బడు
    ననుమానించెడు పతిగలయువతి, సుఖించున్
    మనమున స్వచ్ఛత గల్గిన
    వినీతుడగు పతి లభించి ప్రేమను బంచన్

    రిప్లయితొలగించండి
  22. ​​దినమంతయు పనిజేయుచు
    ​దనవారలకై శ్రమించు​ తరుణి తన గే
    హిని ​యారోగ్యముకై నెపు
    డనుమానించెడు పతిగల యతివ సుఖించున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. ‘తరుణి తనదు గే...’ అనండి.

      తొలగించండి
  23. అనయము కంటికి రెప్పగ
    కనుచున్నానాతికెపుడు కవచమువోలెన్
    మనుచున్నందము చెడునని
    యనుమానించెడు పతిగల యతివ సుఖించున్

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. అనయము నరకము జూచును
    న నుమానించె డు పతిగల యతివ, సు ఖించు
    న్దనపై ప్రేమను జూపుచు
    వినయము గల భర్త గలుగ వేయింతలు గాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...జూచును+అనుమానించు = జూచు ననుమానించు...’ అనాలి కదా! ‘అనయము నరకమ్మునె కను| ననుమానించెడు...’ అనండి.

      తొలగించండి
  26. అనిశము హింసల బెట్టుచు
    ననుమానించెడు పతిగలయతివ సుఖించున్
    యనుటది సత్యము గాదుర
    అనుమానమ్ము పెనుభూత మని వినలేదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సుఖించున్+అనుట’ అన్నపుడు యడాగమం రాదు. ‘సుఖించు| న్ననుటయు...’ అనండి.

      తొలగించండి
  27. అనవరతముబాధ లుపడు
    ననుమానించెడు పతిగల యతివ,సుఖించున్
    యనయము తననతి ప్రేమగ
    కనిపెట్టెడు పతి గలసతి కలలో నైనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సుఖించు| న్ననయము...’ అనండి.

      తొలగించండి

  28. అనిశము తన నిజ పడతిని
    గని యిడుములు కలుగు ననుచు కటకట బడుచున్
    చనుదెంచు పరిస్థితులను
    “అనుమానించెడు పతి గల యతివ సుఖించున్.”
    అమరవాది రాజశేఖర శర్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పరిస్థితుల| న్ననుమానించెడు...’ అనండి.

      తొలగించండి
  29. పెనిమిటి భార్యతొ నన్నిట
    యనువుగ గడపుచు, నమర్చు నన్నిసుఖములున్;
    పనిగా తిరుగుచు వెంబడి
    అనుమానించెడు పతిగల యతివసుఖించున్.
    (వెంట వెంట తిరిగే భర్త ఉన్న భార్య అదృష్టవంతురాలని భావన)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భార్యతొ’ అని ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘సతితో నన్నిట| ననువుగ... వెంబడి| ననుమానించెడు...’ అనండి.

      తొలగించండి
  30. పెనిమిటి చూడని వేళలొ
    తను, జీతము జేబునుండి తరలించినచోన్
    తన తల్లే తీసెననుచు
    అనుమానించెడు పతిగల యతివ సుఖించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వేళలొ’ అని ‘లో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘వేళన్’ అనండి.

      తొలగించండి
  31. పని కే యంకిత మౌచును
    కునుకైన లేక పతి కి కూడు నొసగగన్
    తను తినునా వేళ కనుచు
    ననుమానించెడు పతి గల యతివ సుఖించున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. ‘కునుకైనను లేక...’ అనండి.

      తొలగించండి
  32. మనుగడ వ్యర్థమని తలచె
    ననుమానించెడు పతి గల యతివ, సుఖించున్
    పెనిమిటి తత్వము మారిన
    మనసుకు శాంతియె లభించి మానిని మురియున్

    రిప్లయితొలగించండి
  33. మనమున బాధను మ్రింగుచు

    తనకేమియు చెప్పకుండ దాచగ సతియున్

    కనుగొని వగపును బాపగ

    ననుమానించెడు పతి గల యతివ సుఖించున్.

    రిప్లయితొలగించండి
  34. తనకోసమె తనపతియని
    తనసుఖ మేతనకురక్ష దగ్గర జేరన్
    దినములు గడుపగ తెలియక
    అనుమానించెడి “పతిగలయతివ”సుఖించున్|

    రిప్లయితొలగించండి
  35. తనువున అర్ధ శరీరము
    మనసున నెలకొన్న సతిని మరచుట యగునా?
    అనవరతము తనకోసమె
    ననుమానించెడి పతిగల యతివ సుఖించున్|

    రిప్లయితొలగించండి
  36. ఖండకావ్యము
    నరసింహావతారము

    1.కం:సనకాదులు శాపంబిడ
    జనియించిజయవిజయులగా భువిలో
    కనకాక్షుడుకన కశిపుగ
    మునుల కు బాధల నిడుచును మోదము తోడన్.

    2.ఆ.వె:దుష్ట రక్కసునకు శిష్టుడై ధరలోన
    సుతుడుగాను బుట్టి సురలు మెచ్చ
    బాలభక్తుడైన ప్రహ్లాదు డవనిలో
    వాని జూచి తండ్రి బాధ పడియె.



    3.ఆ.వె:తండ్రి హింసలిడగ తనయుండు భరియించి
    యెదురు చెప్పకుండ యిలను నిలిచె
    తల్లి చేత విషము తనయున కిప్పింప
    హరిని తలచి నిలిచె నర్భకుండు.


    4.ఆ.వె:ఎందు గలడు హరియు నిందె జూపు మనగ
    భక్తి తోడ పల్కె బాలు డపుడు
    అన్నితావులందు హరిగలడు వలదు
    సందియంబనుచును చక్క /సారి దెలిపె.

    5.ఆ.వె:బాలు వాక్కు నపుడె వాసిగా వినుచును
    కంబమందు నుండి కదలివచ్చి
    కనకకశిపు జంపె కమలేశు డప్పుడే
    మునులు సురలు పొగడ ముదము నందె.

    6.హరిహరి యని తలువ హరియించు పాపాలు
    హర్ష మొదవు చుండు ననవరతము
    సకల సంపదలున సందిటనే చేరు
    భక్తి తోడ గొలువ భ్రమలు తొలగు.

    రిప్లయితొలగించండి
  37. వినరాని మాట వింటిని
    'అనుమానించెడి పతిగల అతివ సుఖించున్ '
    అనుదినము నరకయాతనె
    మనమందిరువురక శాంతి మసలుచు నుండున్.

    రిప్లయితొలగించండి
  38. వినరాని మాట వింటిని
    'అనుమానించెడి పతిగల అతివ సుఖించున్ '
    అనుదినము నరకయాతనె
    మనమందిరువురక శాంతి మసలుచు నుండున్.

    రిప్లయితొలగించండి
  39. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "సంయుత వినయ సంభ్రమముల తోడ" లో “సం” కు “సంభ్ర” లో “భ్ర” కు యతి చెల్లుతుందా తెలుప గోర్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యతి చెల్లదు. ఈ ద్విపదపాదం ఎక్కడిది?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. యతి దోషమని తలచి “సంయుత వినయ సుసంభ్రమములను” గా మార్చితిని. ఇది నేను వ్రాసినదియే. “చందము” లో సరియని చూపిస్తోంది. సంశయ నిర్మూలనకై మిమ్ముల నడిగితిని. “సమ్” తో కూడుకున్నవి కదా యీ రెండు పదములు. అందుకని యట్లు చూపించుచున్నదేమో?

      తొలగించండి
  40. ప్రణయ కలహంపు వేళను
    కొనగోరది జాబిలి ముఖ కోమలమంటన్!
    చిన మచ్చగు నేమోనని
    యనుమానించెడు పతి గల యతివ సుఖించున్!

    రిప్లయితొలగించండి
  41. [18:48, 20/05/2016] Kanthi Krishna: శంకరాభరణం సమస్యా పూరణ
    20-05-2016
    1.
    పనులందున సాయపడుచు
    ననవరతము వెంటనుండి యాపదగలుగన్
    తనసతి కేమగునోయని
    యనుమానించెడు పతిగల యతివ సుఖి౦చున్.
    2.
    " వినికిడి చెవులకు దక్కువ
    కనులేమో గానరావు కాయము వణుకున్
    మనునా? నే లేక" ననుచు
    ననుమానించెడు పతిగల యతివ సుఖించున్.
    .

    గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ.
    [21:44, 20/05/2016] Kanthi Krishna: శకరాభరణము సమస్యాపూరణము
    20-05-2016
    3.
    ఘనచరితము గల వంశము
    జనియించియు నన్ను వలచి సతిగా రాగా
    గనునే సుఖమా స్త్రీ? యం
    చను మానించెడు పతిగల యతివ సుఖించున్.
    4.
    చనుదోయి భారమునకును
    కనిపించని నడుము వంపు కనుగొని బ్రేమన్
    మునుగు టెపుడో? యనుచు నెపు
    డను మానించెడు పతిగల యతివ సుఖిoచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘నే లేక యనుచు’ అనండి.

      తొలగించండి

  42. 🌹🙏🌹

    నేటి శంకరాభరణం సమస్యకు పూరణము.
    ""అనుమానించెడు పతిగల యతివ సుఖించున్"

    కం**
    చనువది గలిగిన సతియే,
    సినిమా జూడగ వెడలెను చీకటి వేళన్ !
    తనమది తహతహ లాడగ,
    అనుమానించెడు పతిగల యతివ సుఖించున్*

    కం**
    తనపై గలిగిన ప్రేమను,
    కనుగొని మురిసెడి మగండు కాంతను గనియే!
    వెనుకనె మరువక దలచుచు,
    అనుమానించెడు పతిగల యతివ సుఖించున్*
    *********************
    అంబటి భానుప్రకాశ్,
    గద్వాల.
    *********************


    🙏🌹🙏

    రిప్లయితొలగించండి
  43. కనివిని యెరుగని నగలను
    ఘనమగు చీరలను వంద కాళ్ళకు చెప్పుల్
    కొని చాలునొ లేదో యని
    యనుమానించెడు పతి గల యతివ సుఖించున్

    రిప్లయితొలగించండి