6, మే 2016, శుక్రవారం

పద్యరచన - 1216

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

30 కామెంట్‌లు:

  1. పెద్దచెట్ల నరకి పేదరాండ్రచ్చట
    మోయుచుండ్రి కట్టె మోపులకట
    పుట్టకూటి కొరకు పూర్తిగా దినమంత
    కష్ట పడిన వారి కడుపు నిండు

    రిప్లయితొలగించండి
  2. పట్టెడు మెతుకుల కొఱకని
    కట్టెల మోపులును మోసి కష్ట పడంగన్
    బుట్టెడు పూవుల నమ్మిన
    గిట్టును సుఖమేమొ కొంత క్లేశము తగ్గున్

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. మెత్తని దేహము వారిది
    సత్తువ లేకున్నగాని సైతురు తలపై
    నెత్తుక కట్టెల మోపుల
    నెత్తెఱగునొ బ్రతుకు బరువు నీడ్చుట కొరకున్!

    రిప్లయితొలగించండి
  6. మెత్తని దేహము వారిది
    సత్తువ లేకున్నగాని సైతురు తలపై
    నెత్తుక కట్టెల మోపుల
    నెత్తెఱగునొ బ్రతుకు బరువు నీడ్చుట కొరకున్!

    రిప్లయితొలగించండి
  7. చెట్టులను గొట్టి బాగుగ
    కట్టెల మోపులను గట్టి గరితలు తలపై
    బెట్టుకుని బోవు చుండిరి
    పట్టెడు మెతుకులకు వారి పాటులు గనరే!!!

    రిప్లయితొలగించండి
  8. శ్రమ జీవుల గమ్య మపా
    రము శిరమున భార మద్దిర గగన నిభమే
    తిమిరము గ్రమ్మక మునుపే
    క్రమముగ జనుదేరు చున్న కాంతల గనుడీ

    రిప్లయితొలగించండి
  9. కట్టెల మోపును మోయుచు
    బిట్టున నట పోవుచుండ్రి బేలలు వరుస
    న్నిట్టుల మోయుచు వారలు
    పట్టున మరి వండు కొండ్రు వంటను నింట న్

    రిప్లయితొలగించండి
  10. కట్టెలు మోయు కాంతలిట కారడవందునవెళ్లి కష్టమౌ
    పట్టును వీడ బోక తమభర్తలవోలెను జీవితాశయా
    మెట్టును నెక్కబూనుటకె మిక్కిలి మక్కువ విద్య లేదనే
    కట్టడు లందు కాపురము గౌరవమేతమ భోగ భాగ్యముల్.|

    రిప్లయితొలగించండి

  11. పొట్ట కూటికొరకు పుడమిపై పడతులు
    కట్టెలమ్మి కడుపు నింపుకొనగ
    కష్టమునకు తగిన కాసులేవియురాక
    తరుణిమణులు యచట తిరుగువారు.

    రిప్లయితొలగించండి
  12. తలపై కట్టెల మూటలు
    తలపై నిండిన తమ కలతల దొంతరలున్
    తలపై రవినెంచక నెల
    తల పైటంచున చెమటల తల తుడిచి చనెన్॥

    రిప్లయితొలగించండి
  13. తలపై బెట్టుకు కట్టెల
    నిలలో నమ్మగ తిరుగుతు నింతులు యరుగో
    బలమన్నది లేకున్నను
    కలవరపాటునెదదాచి కదిలెడి వారల్.

    రిప్లయితొలగించండి
  14. అంబటి భానుప్రకాశ్ .గద్వాల.
    **
    ఆ*
    పల్లెబతుకు గడువ పడతులందరు గూడి,
    కూడి తెద్దురెపుడు కూటి కొరకు,!
    నడవి యంత దిరిగి ,మండెడి కట్టెలు
    మోయు చుందురెపుడు మోపు గట్టి !!

    ఆ*
    ఆధు నికత యేది అరకులో యలయందు
    అడవి పక్కి లాగ నాదు కొనరె !
    నాగరికులు నేడు నవ్వుకో జూతురా ?
    మనసు గలిగి యున్న మమత లేద. !!

    రిప్లయితొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఎ౦డల కోర్చి యా యువిద. లెల్లరు కొ౦డల
    లోన కేగి , తా

    మె౦డిన కట్టెల౦ గొనుచు , ని౦తలు మోపులు
    గట్టి , నెత్తి పై

    మె౦డగు బాధ కోర్చుచు --- త మి న్ దమ
    యి౦టికి దెచ్చి , యమ్ముచున్

    కొ౦డొక వైన వారి బ్రతుకుల్ నడిపి౦చుచు
    ను౦దు రక్కటా !


    ఇ౦తలు = ఇ౦తి౦త లేసి ; తమిన్ = త్వరగా ; కొ౦డొక వైన = చిన్నవియైన

    ………………………………………………………
    ి

    ి

    రిప్లయితొలగించండి
  16. . కట్టెలు గాలుచున్ వెలిగి కమ్మని వంటకు సాయ మౌను|ఆ
    కట్టెలు మోయుచున్ గనెడి కాంతలు యింటికి తిండితిప్పలున్
    పెట్టెడి మార్గ గామినులె | పిల్లల,పెద్దల జీవనంబుకున్
    కట్టెడు లందు కాపురము కాలము బంచగ?యింట వంటలౌ|

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఇంటర్ నెట్ స్పీడ్ మరీ తక్కువగా ఉండడం వల్ల ఒక్కొక్కరి పద్యాన్ని వ్యాఖ్యానించడానికి కనీసం ఐదు నిమిషాల సమయం పడుతున్నది. ఈ ఇబ్బంది రేపటి వరకు ఉంటుంది. అందువల్ల అందరికీ కలిపి ఒకే వ్యాఖ్య పెడుతున్నాను.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శిష్ట్లా శర్మ గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కారడవి+అందున’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘కారడవిన్ జని యెంతొ కష్టమౌ’ అనండి. ‘జీవితాశయా’..? ‘జీవనానికై’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘తరుణీమణు’ లనాలి కదా! ‘తరుణు లెల్ల నచట...’ అనండి.
    రెండవ పద్యంలో ‘తిరుగుతు’ కాదు ‘తిరుగుచు’ అనాలి. ‘ఇంతులు+అరుగో’ అన్నపుడు యడాగమం రాదు. ‘తిరుగెడు నింతుల గనుమా’ అనండి.
    *****
    తంగిరాల రఘురామ్ గారూ,
    శబ్దాలంకార శోభితమైన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    భానుప్రకాశ్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కాంతలు నింటికి’ అనండి. అక్కడ యడాగమం రాదు.

    రిప్లయితొలగించండి
  19. అంబటి భానుప్రకాశ్ .గద్వాల.
    **
    ఆ*
    పల్లెబతుకు గడువ పడతులందరు గూడి,
    కూడి తెద్దురెపుడు కూటి కొరకు,!
    నడవి యంత దిరిగి ,మండెడి కట్టెలు
    మోయు చుందురెపుడు మోపు గట్టి !!

    ఆ*
    ఆధు నికత యేది అరకులో యలయందు
    అడవి పక్కి లాగ నాదు కొనరె !
    నాగరికులు నేడు నవ్వుకో జూతురా ?
    మనసు గలిగి యున్న మమత లేద. !!

    రిప్లయితొలగించండి
  20. అంబటి భానుప్రకాశ్ .గద్వాల.
    **
    ఆ*
    పల్లెబతుకు గడువ పడతులందరు గూడి,
    కూడి తెద్దురెపుడు కూటి కొరకు,!
    నడవి యంత దిరిగి ,మండెడి కట్టెలు
    మోయు చుందురెపుడు మోపు గట్టి !!

    ఆ*
    ఆధు నికత యేది అరకులో యలయందు
    అడవి పక్కి లాగ నాదు కొనరె !
    నాగరికులు నేడు నవ్వుకో జూతురా ?
    మనసు గలిగి యున్న మమత లేద. !!

    రిప్లయితొలగించండి
  21. అన్నమయము లైన యవని మానవులకే
    కోటిబాధలవియె కూటి కొరకు
    సుదతులు గద మిగుల సుకుమారులైనను
    మోయలేని బరువు మోయుచుండ్రి

    నీన్నటీ పద్యరచన

    1.
    వాసిగ కొత్మీరల్లము
    వేసిన మజ్జీగదియె ఘన పీయూషముయే
    వేసవి తాపము దీర్చుచు
    వేసారిన జనులకిలను వేదన దీర్చున్

    2. మట్టికుండలోని మజ్జిగ యందున
    అల్లముప్పు మిరపనందు వేసి
    కొత్తిమీరు జిదిమి కూర్చిన జాలును
    వేసవందునదియె భేషజమ్ము

    3. ఘుమఘుమలను పెంచు కొత్తిమీరును ద్రుంచి
    యల్లముప్పు మిరపనందు జేర్చి
    మట్టికుండలోని మజ్జిగలో వేయ
    దాహమదియె దీర్చు తాపమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పద్యాలు (నిన్నటివాటితోను) బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  22. పోట్ట కూటి కొరకు కట్టెల నమ్ముచున్
    జీవితంబు నెఱపు జీవులకును
    గ్యాసు పోయ్యి వచ్చా కష్టాల దెచ్చెను
    కాసులివ్వలేని కష్టమయ్యె

    రిప్లయితొలగించండి
  23. కడుపు కొరకు వనము కేగి కట్టెలన్ని దెచ్చియున్
    అమ్ము కొనుచు బ్రతుకు చుందు రతివలిలను కట్టెలన్
    జడమతులను గాంచి జనలు చౌక బేర మాడుచున్
    అడుగు చుంద్రు తప్పదు గద అమ్మకున్న కట్టెలన్.

    రిప్లయితొలగించండి
  24. కట్టెలు కొనువారెవ్వరు
    కట్టుగనే పల్లెలందు గ్యాస్ పొయ్యిలనే
    పెట్టుకొనుందురు జనులే
    కట్టెదుటనెవరు కొనంగ కన్ పట్టరుగా!

    రిప్లయితొలగించండి
  25. పర్యావరణ రక్షక రాజకీయ నేతలు: 👇

    కట్టెలు కొట్టెడి యమ్మల
    కొట్టెదరీ యుగము నందు క్రూరులు ననుచున్
    గుట్టుగ పోషించెదరహొ
    పుట్టెడు బుద్ధుల నడవుల పులి వీరప్పన్ :)

    రిప్లయితొలగించండి