24, మే 2016, మంగళవారం

సమస్య - 2043 (భీతిం జెందిరి ధర్మనందనుని...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్”
లేదా...
“భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే”
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

106 కామెంట్‌లు:

 1. శుభోదయం !

  తప్పొప్పులు తెలియవు !

  జూదం లో ఓడి , మళ్ళీ మరో మారు జూదానికి రమ్మన్నారని ప్రాతికామి చెబ్తే , వెంటనే తమ్ముళ్ళందరి నీ బయలు దేర మని జెప్పిన అగ్రజుడు ధర్మ రాజుని గని :)


  ఖ్యాతింబొందిరి రాజసూయమును సాకారంబు గావించగన్
  జూదంబందున సర్వమోడిరి గదా ! జువ్వాడ రమ్మా యనన్
  మోదంబొందుచు, ప్రాతికామి నిడ నామోదంబు తాజెప్పగన్
  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్కని ఘట్టాన్ని ఎన్నుకున్నారు పూరణకు. శార్దూలవృత్తాన్ని కూడా అలవోకగా వ్రాశారు కాని రెండవ, మూడవ పాదాల్లో ప్రాస తప్పింది. సవరించండి.

   తొలగించండి
  2. ఆరోగ్యం, మనస్సు రెండూ బాగా లేవు. లేకుంటే నేనే సవరించేవాణ్ణి.

   తొలగించండి
  3. జిలేబి గారు 2,3 పాదాలనీ విధముగ మార్చిన నెట్లుండును?

   ద్యూతంబందున సర్వమోడిరి గదా ! తోరంబుగన్ రమ్మనిన్
   చాతుర్యమ్ముగఁ బ్రాతికామి నిడ తాసమ్మోదముందెల్పగన్

   తొలగించండి
  4. కామేశ్వర రావు గారూ,
   మీ సవరణ బాగున్నది. ధన్యవాదాలు.

   తొలగించండి
 2. డా.ఎన్.వి.ఎన్. చారి 98666610429
  శాంతింగోరెడు ధర్మ మూర్తి సమరో త్సా హంబు దీపింపగన్
  ప్రీతింబొంది విరామమందు శిబిరం బేగంగ, కాటేసె నా
  సంతానంబును ద్రోణ పుత్రు డని ప్రస్తావిం చన్ జేరి ని
  ర్భీతిన్ చెందిరిధర్మ నందనుని సంవీక్షించిభీమార్జునుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగుంది.
   కాని మొదటి, మూడవ పాదాలలో ప్రాస తప్పింది. మూడవపాదం చివర గణదోషం. ‘ప్రస్తావించగన్ జేరి ని...’ అనండి. ప్రాస సవరించి మరో పద్యం వ్రాయండి.

   తొలగించండి
 3. ఖ్యాతిం గాంచిన యన్నయె
  ద్యూతంబున నోడినట్టి యోచన తోడన్
  రీతిం దప్పిన విధమున
  భీతిల్లిరి ధర్మజు గని భీమార్జునులే!

  రిప్లయితొలగించండి
 4. డా.ఎన్.వి.ఎన్. చారి 98666610429
  Sk2031 అకస
  జాతిన్ గావగ ధర్మ మూర్తి సమరో త్సా హంబు దీపింపగన్
  ప్రీతింబొంది విరామమందు శిబిరం బేగంగ, కాటేసె నా
  సత్సంతానము ద్రోణ పుత్రు డని ప్రస్తావిం చన్ జేరి ని
  ర్భీతిన్ చెందిరిధర్మ నందనుని సంవీక్షించిభీమార్జునుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరించిన పూరణ బాగుంది. కానీ మూడవపాదంలో సంయుక్తాక్షరం వేయడంతో ప్రాస తప్పింది.

   తొలగించండి
 5. మాతా! కర్ణుడు కొడుకా?
  ఎంతటి దుస్థితి! సమరము యెందుకు? యనుచున్
  కుంతికి శాపము నీయగ
  భీతిల్లిరి ధర్మజుఁగని భీమార్జునులే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగున్నది మీ పూరణ. అభినందనలు.
   ‘సమరము+ఎందుకు+అనుచున్’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘..యెంతటి దుస్థితియొ! సమర మెందు కటంచున్’ అనండి.

   తొలగించండి
  2. రెండు, మూడు పాదాలలో ప్రాసకు బిందు పూర్వక త కారం వేశారు

   తొలగించండి
  3. శర్మ గారూ,
   ధన్యవాదాలు. నేను గమనించలేదు. ఆ పద్యానికి నా సవరణ....

   మాతా! కర్ణుఁడు నీ కొడు
   కా? తెలిసిన పిదప సమర మెందు కటంచున్
   ప్రీతి విడి శాప మీయగ
   భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే.

   తొలగించండి
  4. గురువు గారూ...అద్భుతముగా నున్నది

   తొలగించండి
  5. గురువు గారూ...అద్భుతముగా నున్నది

   తొలగించండి
 6. గీతా చార్యుని దలచుచు
  కా తరమున్లేక మదిని కార్చిచ్చు వలె
  న్నేతల నందఱజంపగ
  భీ తిల్లిరి ధర్మజు గని భీమా ర్జునులే

  రిప్లయితొలగించండి
 7. మా బావగారు తంగిరాల తిరుపతి శర్మగారి పూరణ

  భీతిల్లక శల్యునితో
  భీతావహముగ సమరము పెంపు దలిర్పన్
  భ్రాతకు నేమగునోయని
  భీతిల్లిరి ధర్మజుగనిభీమార్జులే
  (ధర్మరాజు శల్యుని తో ద్వంద్వ యుధ్దము చేయుచున్న ఘట్టమునకు సంబంధించి.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చివరి లైను: భీతిల్లిరి ధర్మజుగని భీమార్జునులే లాస్ట్ లో "ను" మిస్ అయింది. క్షమించవలెను.

   తొలగించండి
  2. తంగిరాల తిరుపతి శర్మ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. కాంతింజూడక మారువేష
  ములలో కాలంబు సాగించుచున్
  చింతించన్ మదినా విరాటు సభలో, చీకాకుభూపాలుడు న్
  ప్రీతింగానక నట్టిపాచికలచే ప్రామాణికున్ కొట్టగా
  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. వృత్తరచనలోను ప్రావీణ్యాన్ని సాధించారు. సంతోషం. అభినందనలు.

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. కాని మొదటి, రెండవ పాదాల్లో ప్రాస తప్పారు. మూడవ పాదంలో యతి కూడ తప్పింది. నా సవరణ....

   ఖ్యాతిన్ వీడియు మారువేషములతో గాలంబు సాగించుచున్
   చేతశ్శూన్యత నా విరాటసభలో చీకాకు పుట్టించగా
   ప్రీతిం గానక నట్టి పాచికలతో వ్రేయంగ నా భూపతిన్
   భీతిం జెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్.

   తొలగించండి
 9. నీతిని దప్పని వాడే
  రీతిగ లౌక్యము వచించు ప్రియ గురు వధకు?
  న్నాతురులై రణమందున
  భీతిల్లిరి ధర్మజుఁగని భీమార్జునులే!

  రిప్లయితొలగించండి
 10. గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ఆ తన్విన్ సభ కీడ్చు వేళ పటు
  . . శౌర్యావేశము౦ బొ౦దియున్ ,

  జేతన్ బూనియు ద౦డమున్ - ధనువు ,
  . నిస్తేజమ్ముగా నిల్చుచున్ >

  భీతిన్ జె౦దిరి దర్మన౦దనుని స౦వీక్షి౦చి
  . భీమార్జునుల్ |

  భ్రాతల్ గౌరవ మీయ నగ్రజునకున్ ,
  . భావ్యమ్ము కాదే యిలన్ ?

  రిప్లయితొలగించండి
 11. రిప్లయిలు
  1. “అశ్వత్థామోహతః” యను మాటలు ద్రోణుడు వినిన సందర్భము:

   “హా తండ్రీ” యని వీడి బాణములు ద్రోణాచార్యు లావేదనన్
   భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి, భీమార్జునుల్
   చాతుర్యంబుగ సంజ్ఞలీయఁ గని ధృష్టద్యుమ్ను డత్యుగ్రతన్
   వీతప్రాణునిఁ జేసె ద్రోణునని గంభీరాస్త్ర ఘాతంబునన్

   యక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చి ధర్మరాజు తమ్ములను విడిపించు కొన్న సందర్భము:

   ప్రీతిని నీరము తెండన
   నాతత వీర్యాతిశయులు నట యక్ష కృతా
   చేతనులై బదులాడన్
   భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే

   తొలగించండి
  2. మీ మొదటి పూరణ విరుపుతో అత్యద్భుతంగా ఉంది. అభినందనలు.
   రెండవ పూరణలో ‘అచేతనులు’ భయపడటం...?

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధర్మారాజు వచ్చి బ్రతికించక పూర్వము తమ్ముళ్లందరు నచేతనులై పడియున్నారు గద. అప్పటి తమ యసమర్థతకి సిగ్గుపడి అన్నగారికి ముఖము చూపించడానికి భయపడ్డారని నాభావము. “కృతా/చేతనులే” యని సవరించిన బాగుండునా? తెలుప గోర్తాను.

   ప్రీతిని నీరము తెండన
   నాతత వీర్యాతిశయులు నట యక్ష కృతా
   చేతనులే బదులాడన్
   భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే

   తొలగించండి
  4. ప్రీతిని నీరము తెండన
   నాతత వీర్యాతిశయులు నట యక్ష కృతా
   చేతనులగుటన్ సిగ్గిలి
   భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే

   తొలగించండి
  5. మీ సవరణలో రెండవది సమర్థనీయంగా, ఉత్తమంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 12. యుద్ధమునకు సన్నద్ధమవుతూ శ్రీకృష్ణుడిని,ధర్మరాజును చూచి భీమార్జునుల్ నిర్భీతిని ( ధైర్యమ్ము ) పొందిరనే భావన........

  నీతిన్ దప్పిన కౌరవాధములఁ తాఁ నిర్జించగానెంచి స
  త్ఖ్యాతిన్ గాంచిన కృష్ణదేవుని సహాయంబుల్ బలంబౌచు వి
  ఖ్యాతంబైన నిజప్రతాపములు దీక్షాదక్షతల్ గల్గఁ ని
  ర్భీతిన్ జెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్.

  రిప్లయితొలగించండి
 13. భీ తింజెందిరి ధర్మ నందనుని సంవీ క్షించి భీ మా ర్జును
  ల్భీ తిన్జెందగ గారణం బును మరి వీ క్షించగా నత్తరి
  న్జేతో మోదముగా గనంబడె యది చిత్రంబుగా నిప్పుడు
  న్శాన్తిన్గోరెడు ధర్మ రాజు సమారో త్సాహ ముప్పొంగుట న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే. కాని మూడు పాదాల్లోను గణదోషం. సవరించండి.

   తొలగించండి

  2. భీ తింజెందిరి ధర్మ నందనుని సంవీ క్షించి భీ మా ర్జును ల్భీ తిన్జెందగ గారణం బును మరి వీ క్షించగా నత్తరి న్జేతో మోదముగా గనంబడె నుగాచిత్రంబుగానిప్పుడు
   శాంతిన్గోరెడుధర్మరాజునమరోత్సాహంబునుప్పొంగుటన్

   తొలగించండి
  3. సవరించినందుకు సంతోషం. అయినా రెండవపాదంలో గణదోషం అలాగే ఉంది. ‘...గారణం బది కదా వీక్షించగా...’ అనండి.

   తొలగించండి
 14. 🌺☘🌺


  కం**
  శాంతము గలిగియు నెప్పుడు,
  శాంతిగ నుండుట సుఖమని శాంతిని గోరే !
  శాంతిని రణమున నొదలిన,
  భీతిల్లిరి ధర్మజుని గని భీమార్జునులే !!


  ☘🌺☘

  అంబటి భానుప్రకాశ్,
  గద్వాల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది మీ పూరణ.
   ‘కోరే, ఒదలిన’ అనడం వ్యావహారికం. ‘సుఖమని శాంతుడయున్| ...రణమున వదలిన...’ అనండి.

   తొలగించండి
 15. ☘🌺☘

  కం**


  నీతిని మరువక నాతడు,
  పూతన సంహరు వచింప, పోరొద్దనగా!
  నాతని శాంతము జూచియు,
  భీతిల్లిరి ధర్మజుగని భీమార్జునులే !!

  అంబటి భానుప్రకాశ్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మరువక’ కళ. ద్రుతప్రకృతికం కాదు. కనుక ‘మరువక యాతడు’ అనాలి. రెండవపాదాన్ని ‘పూతాత్ముడు హరి వచింప, పోరు వలదనన్| వీతోత్సాహులు కాగన్...’ అనండి.

   తొలగించండి
 16. జ్ఞాతులు మోసము తోడుత
  నీతిని విడి సారెలాడ, నిశ్చల మదితో
  నాతిని పందెము నొడ్డిన
  భీతిల్లిరి ధర్మజుఁగని భీమార్జునులే

  రిప్లయితొలగించండి
 17. ద్యూతమ్మున నోడించియు

  ద్యూతమునకు మరల పిలువ దుర్యోధనుడున్

  భ్రాతయు సమ్మతి తెలుపగ

  భీతిల్లిరి ధర్మజు గని భీమార్జునులే.

  రిప్లయితొలగించండి
 18. ద్యూతమ్మున నోడించియు

  ద్యూతమునకు మరల పిలువ దుర్యోధనుడున్

  భ్రాతయు సమ్మతి తెలుపగ

  భీతిల్లిరి ధర్మజు గని భీమార్జునులే.

  రిప్లయితొలగించండి
 19. శంకరాభరణం సమస్యాపూరణం
  24-05-2016
  అతిరథ మహారథులతో,
  సతతము శస్త్రాస్త్ర సహిత సమరము నంద
  ప్రతిహతముగ జెలరేగగ
  భీతిల్లిరి ధర్మజు గని భీమార్జునులే!
  గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిత్రులు కాంతి కృష్ణ గారు క్షమించాలి
   సమస్య పాదం గురువు తో ప్రారంభమైనది కబా మీరా విషయంగమనించలే దనుకుంటాను ...,.,,

   తొలగించండి
  2. కాంతికృష్ణ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసింప దగినది. కాని గురువుతో పాదాలను ప్రారంభిస్తూ మరొ ప్రయత్నం చేయండి.

   తొలగించండి
 20. గు రు మూ ర్తి ఆ. చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గు రు వ ర్యు ల కు న మ స్సు లు
  ………………………………………………………

  స మ స్య ను క౦ ద ము లోను , తి రి గి
  అ దే స మ స్య ను వృ త్త ము లోను
  పూ రి ౦ చ మ ని అ డ గ డ ము జ రి గి ౦ ది.

  ఇ ది చా లా స౦ తో ష క ర మై న వి ష య ము
  ఎ వ ర కి తో చి న దా ని లో వా రు

  పూ రి స్తా రు. ము న్ము౦ దు కూ డా

  స మ స్య ను .ద్వి వి ధ రూ ప ము ల లో

  ఇ స్తే బా గు౦ టు౦ ద ని మ. న. వి .

  """"""""""""""""""""""₹"""""""""""""""

  రిప్లయితొలగించండి
 21. *
  ద్యూతమ్మందున భ్రాతలన్ ఫణముగా యుక్తమ్మునే మర్చియున్
  నాతిన్ సైతము యొడ్డినట్టి తమ యన్నన్ గాంచుచున్ ఖిన్నులై
  ఖ్యాతిం బొందిన ధర్మమూర్తి యని విఖ్యాతుండి చర్యన్ గనన్
  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్

  *
  ఖ్యాతిని గలిగిన వాడే
  ద్యూతము నందున ఫణముగ యుక్తము మరచీ
  నాతిని యొడ్డిన తీరుకు
  భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే

  *నిన్నటి సమస్యకు నా పూరణ

  1.
  మనసే లేనిమగనిపై
  కనికరమున్ జూపదగదు కాంతల పైనన్
  కినుకను పూనుట మూఢుల
  పనియనుచునెఱంగువాడె ప్రాజ్ఞుడు సుమ్మీ

  2.
  వనితలను గౌర వించుచు
  వినయముతో మెలగ వలెను పెనిమిటు లైనన్
  తననెప్పుడు కోపముతో
  గని కరమున్ జూప దగదు కాంతల పైనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
   శార్దూలంలో ‘విఖ్యాతుండి’ అన్నచోట ‘ధర్మాపత్యు’ అనండి. ‘ధర్మదేవత యొక్క సంతానం - ధర్మరాజు’
   రెండవపూరణలో ‘మరచీ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘యుక్తము విడి యా| నాతిని...’ అనండి.
   ‘కనికరముం జూపదగదు’ సమస్యకు మీ రెండు పూరణలు బాగున్నవి.

   తొలగించండి
 22. కవిమిత్రులకు మనవి...
  మా బావగారు (బాబాయి కూతురు భర్త) మరణించాడని ఇప్పుడే తెలిసి వెళ్తున్నాను. తిరిగి ఏ రాత్రికి వస్తానో? దయచేసి పూరణల పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 23. జ్ఞాతుల్ గెల్చిరి జూదమందు నకటా! సామ్రాజ్యము,న్నాపయి
  న్నాతిన్నోడితి, నైదు నూళ్లనయిన న్నర్ధించితిన్నంచు తా
  చైతన్ బట్ట గదన్, ప్రహారమున కున్ చింతించుచుండంగ నే
  “భీతింజెందిరి ధర్మనందనుని సంవీ,క్షించి భీమార్జునుల్”

  భీతిల్లెను భీముడు తన
  జ్ఞాతులతో రణమునకని చక్రిబలుక గా
  చేతను గద బట్టి, యలుగ
  “భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే”

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలలోను కొంత అన్వయదోషం ఉన్నట్టుగా అనుమానం. భావం స్పష్టంగా, సుబోధకంగా లేదు.

   తొలగించండి
 24. ప్రయుత కవితా యజ్ఞము :సందిత
  Sk:2020:కవిత సంఖ్య :104
  సమస్యాపూరణ

  త్రాతయసత్యవచనమె!య
  చేతనమయెపాండుసేనచెడి ద్రోణహతిన్
  భ్రాతయసత్యమునాడమి
  భీతిల్లిరి ధర్మజు గని భీమార్జునులే!

  రిప్లయితొలగించండి
 25. ఖ్యాతింజెందిన ధర్మమూర్తియయి తా గాంచెన్విరాడ్రాజుని
  న్నేతెంచెన్నటు కంకుభట్టగుచు నో నిష్కామ సేవార్థియై
  చేతంబందున రేడు కృద్ధత కతన్ జేయెత్తి గర్జింపగా
  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్.

  రిప్లయితొలగించండి
 26. చేతులు ముడువగ నేరక
  చేతలతో రిపుల తాక సిద్ధము కాగా
  దూతలు, నీతులు నచ్చక
  భీతిల్లిరి ధర్మజు గని భీమార్జునులే!
  గురువు గారికి, మిత్రులకు నమస్కారములు. నిన్నటి సమస్యకు నేను వ్రాసిన పూరణ కూడా చదువ గోరుతాను.
  ధన్యవాదములు. శ్రీధర రావు.

  వనితల వేధింప నిలను
  కనికరముం జూపదగదు! కాంతల పైనన్
  మనమున నాదర భావము
  ననవరతము నింపవలయు నాలోచింపన్!

  రిప్లయితొలగించండి
 27. పూతాత్ముడైన వీరుడు
  ఖ్యాతింగలయట్టి ధర్మకర్మడు తానై
  చేతంబు మార్చుకొనగను
  భీతిల్లిరి ధర్మజు గని భీమార్జునులే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘కర్ముడు తానై/ కర్మిష్ఠుండై’ అనండి.

   తొలగించండి
 28. ప్రీతిగ పెంచిన తల్లియె
  సత్యము దాచినదనివిని సంతాపముతో
  డన్,తల్లికెశాపంబిడ
  భీతిల్లిరి ధర్మజుఁగని భీమార్జునులే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఉమాదేవి గారు మీ పూరణ బాగుంది. 2 పాదము లో ను 3 పాదములో("డన్ త" / "డంద") కూడ ప్రాస తప్పింది. సవరిస్తే బాగుంటుంది.

   తొలగించండి
  2. ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. ‘సంతాపముతో| నా తల్లికి...’ అనండి.

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   ధన్యవాదాలు.

   తొలగించండి
 29. శంకరయ్యగారు. ఆ దుర్వార్త మాకును నెంతో బాధ కలిగించినది. మీ బావగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము.

  రిప్లయితొలగించండి
 30. విరించి గారు క్షమించాలి. మీ శార్దూలంలో మూడవ పాదంలో "విఖ్యాతుండి'అని పడింది.టైపు దోషమనుకుంటాను!కావాలనే వేస్తే సాధువేనా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సానుభూతి తెలిపినందుకు, విరించి గారి దోషాన్ని చూపినందుకు ధన్యవాదాలు

   తొలగించండి
 31. . జాతింజాగృతిజేయుపద్దతుల విశ్వాసంబె సన్మార్గమై
  ఖ్యాతింబొందిరిపాండవుల్ మనల నాకర్షించుధర్మంబునన్
  నీతింబంచిరి నిర్మలత్వమున సాన్నిధ్యాన నన్నోన్య ని
  ర్భీతిన్ జెందిరి ధర్మ నందనుని సంవీక్షించి భీమార్జునుల్|
  2.జాతికి మేలొన గూర్చెడి
  దాతగ ధర్మంబు బంచి ధరణీపతిగా
  నేతగ నిలచిన యటని
  ర్భీతిల్లిరి ధర్మజు గని భీమార్జునులే|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఒకే భావంతో రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   కొన్ని టైపు దోషాలున్నవి.

   తొలగించండి
 32. ప్రీతిగ జూదము నాడుచు
  ఘాతుకము ను జేయబూని గాంధారిసుతుల్
  నాతిని పణముగ గోరగ
  భీతిల్లిరి ధర్మజు గని భీమార్జునులే!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారు మీ పూరణ చక్కగనున్నది. మంచి యితివృత్తము. "గాంధారి" ఈ కారాంత స్త్రీలింగపదము. కనుక "గాంధారీసుతుల్" సాధువు. "కౌరవ్యులటన్" అంటే సరిపోతుంది.

   తొలగించండి
  2. "గాంధారి" తెలుగు పదము గ తీసుకుంటే గాంథారి సుతు లన వచ్చనుకుంటాను.

   తొలగించండి
  3. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  4. కామేశ్వర రావు గారూ,
   అవనిసుత, అవనీసుత... అన్నట్టుగా గాంధారి సుతులు, గాంధారీసుతులు.. రెండు సరియైనవే.

   తొలగించండి
 33. మిత్రులందఱకు నమస్సులు!

  ద్యూతక్రీడకు దుష్ట కౌరవతతుల్ ద్రోహాత్మకుల్ పిల్వఁగన్;
  జేతోమోదము నొందుచున్ జనియుఁ, దా శీఘ్రమ్మె యా ధౌర్త్యపుం
  ద్యూతమ్మందున సర్వ మోడి, తమ నొడ్డున్ బందెమం దంచు వే

  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి, భీమార్జునుల్!

  రిప్లయితొలగించండి
 34. జ్ఞాతుల్ వేసిన యుచ్చులోన పడిరా కౌంతేయు లయ్యో! విధి
  వ్రాతన్ మార్చ తరమ్మెభూతలమునన్ పద్మాక్షుడౌ శౌరికిన్
  చేతల్ జూపక వైరిమూకకును సంశ్లేషించు మార్గమ్ముఁ బో
  భీతిన్ జెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘విధి వ్రాత’ అన్నపుడు ‘ధి’ గురువు కాదు. దానితో గణదోషం. ‘కౌంతేయు లా బ్రహ్మదౌ| వ్రాతన్...’ అందామా?

   తొలగించండి
 35. సూతసుతుని వక్రోక్తులు
  చేతమ్మును తుత్తునియలు జేయ౦గసమా
  ఘాతము వలదని పల్కిన
  భీతిల్లిరి ధర్మజుఁగని భీమార్జునులే!

  రిప్లయితొలగించండి
 36. భేదంబెన్నడు లేని వారలగుచున్ భాసిల్లిరా పాండవుల్
  ఖేదంబొందిరి పాండు వీరులకటా క్రీడించి జూదంబునన్
  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్
  నాతీ వస్త్రములూడ్చ ఖిన్నుడగుచున్నోపేటి ధర్మాత్మునిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణి కుమార్ గారు 1,2 పాదాలలో ప్రాస తప్పింది. "నాతీ" దీర్ఘము సరికాదు. "నా" కు "న్నో" / "ఓ" లకు యతి లేదు. "ఓపేటి" వ్యవహారికమనుకుంటాను. సవరణలు చేసి పూరిస్తే బాగుంటుంది. తప్పక చేయగలరు. ప్రయత్నించండి.

   తొలగించండి
  2. ఫణికుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   కామేశ్వర రావు గారి సూచనలను గమనించారు కదా! మొదటిపాదంలోను యతి తప్పింది. మరో ప్రయత్నం చేయండి.

   తొలగించండి
 37. కురుక్షేత్రంలో ధర్మజుడు అసత్యము పలికిన సందర్భం

  నీతిందప్పక లెస్సగా నడచుచున్ నిత్యమ్ము సత్యమ్ము కే
  ఘాతంబున్ పడనీయకన్ మసలుచున్ గార్యమ్ము సాధించుచున్
  ఖ్యాతింజెంది యసత్య వాక్కులను సంగ్రామమ్మునన్ బల్కగా
  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్!

  రిప్లయితొలగించండి
 38. సవరించిన పద్యాలు ......  కం**
  శాంతము గలిగియు నెప్పుడు,
  శాంతిగ నుండుట సుఖమని శాంతుడయున్!
  శాంతిని రణమున వదలిన,
  భీతిల్లిరి ధర్మజుని గని భీమార్జునులే !!

  కం**
  నీతిని మరువక యాతడు,
  పూతాత్ముడు హరివచింప పోరు వలదనన్!
  వీతోత్సాహులు కాగన్,
  భీతిల్లిరి ధర్మజుగని భీమార్జునులే !!

  అంబటి భానుప్రకాశ్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరించిన మీ పద్యాలు బాగున్నవి. కాని ‘శాంతు డయ్యున్’ అన్నచోట టైపాటు.

   తొలగించండి
 39. మొదటి పద్యములో యతి తప్పినది రెండవ పద్యము చూడండి

  నీతిన్ దప్పిన కౌర వాధములతో నిర్నీత జూదంబు సం
  ప్రీతిన్నాడగ సిద్ధ మౌట గని సంవిజ్ఞాన చిత్తంబుతో
  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్
  తాతా చార్యులు చూచుచుండ సభలో తా నొడ్డి యోడెన్ క్షితిన్.

  రిప్లయితొలగించండి
 40. ధన్యవాదాలండీ కామేశ్వరరావుగారూ.
  సవరించిన పద్యాన్ని చూడగలరు.
  ప్రీతిగ పెంచిన తల్లియె
  సత్యము దాచినదనివిని సంతాపముతో
  మాతకె శాపం బిడగా
  భీతిల్లిరి ధర్మజుఁగని భీమార్జునులే.

  రిప్లయితొలగించండి
 41. నీతిన్ దప్పిన కౌర వాధములతో నిర్నీత జూదంబు సం
  ప్రీతిన్నాడగ సిద్ధ మౌట గని సంవేగంపు చిత్తంబుతో
  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్
  తాతా చార్యులు చూచుచుండ సభలో తా నొడ్డి యోడెన్ క్షితిన్.

  రిప్లయితొలగించండి
 42. "నాతిం వీడెను భ్రాతలం వదిలె మానంబోయె ద్యూతంబునన్
  అంతంబా యిది? స్వీయకృత్యమిది! మోహం వీడె దుర్యోధనున్
  పంతంబేగొని గెల్చె! నగ్రజుడు యీ భంగంబు నెట్లోర్తునో?"
  భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ పూరణపై నా సమీక్షను ‘నారికి తన పుట్టినిల్లె...’ సమస్య క్రింద చూడండి.

   తొలగించండి
 43. చక్కని పదాన్ని సూచించారు.ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి