మీ ప్రయత్నం చాలవరకు సఫలమయింది. కొన్ని లోపాలు. ‘నాతిన్ వీడెను, భ్రాతలన్ వదలె’ అన్నపుడు పూర్వబిందువు రాదు. ద్రుతం తర్వాత పరుషాక్షరాలు సరళాలుగా మారినపుదే బిందువు వస్తుంది. ‘నాతిన్ + చూచెను = నాతిం జూచెను, నాతిఁ జూచెను, నాతి న్జూచెను’ ఇలా. ‘మానంబు పోయె’ను ‘మానంబోయె’ అన్నారు. ‘మోహం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. మీ పద్యానికి నా సవరణ...
ఇక్కడ గమనించ వలసిన విషయము: ప్రాసాక్షారము వెనుక బిందువున్న నాలుగు పాదములయందు బిందువుండవలెను. ప్రాసాక్షారము తరువాత బిందువుండ వచ్చును లేక పోవచ్చును. పరవాలేదు.
ఈనాటి మీ పూరణ బాగున్నది. రెండవపాదం చివర తప్పక గురువు ఉండాలి. ‘వాక్కుల పెంపౌ’ అనండి. సవరించిన మీ నిన్నటి పూరణ బాగుంది. కొంత అన్వయలోపం ఉంది. వృత్తరచనా ప్రారంభంలో ఈ దోషం సాధారణమే. పరవాలేదు.
ఫణి కుమార్ గారు ఛందోబద్ధముగా చక్కగా పూరణ జేసిన మీరు మిక్కిలి యభినందనీయులు. ఇప్పుడిక శబ్దార్థ లాలిత్యానికి ప్రయత్నించాలి. “భాతింగల్గెడు” కన్న “భాతిన్ వెల్గెడు”; “కావించు జూదంబునన్” కన్న ”కష్టంపు జూదంబునన్” అంటే బాగుంటుంది. అన్వయము కొరకు “వస్త్రాపహరణమునకు ఖిన్నుడయి చింతిస్తున్న రాజు ధర్మనందనుని యవస్థకు నేమవుతాడోనన్న భయము భీమార్జునులకు కలిగిందని భావము” వచ్చేటట్లుగా మూడవ పాదము. సవరణ చూడండి.
తంగిరాల తిరుపతి శర్మ గారికి స్వాగతం. వారి పూరణ బాగున్నది. ‘నేరములను+ఎత్తి, శూన్యము+అనుకొను’ అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా కాని, యడాగమంతో కాని వ్రాయరాదు. ‘నిందింపంగా’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. వారి పద్యానికి నా సవరణ...
నిన్న TVలో వచ్చిన వార్తను చూచి( కన్నతల్లియే రొంపిలోనికి దింప ప్రయత్నింప ఆత్మహత్య చేసికొన్న అమాయకురాలి ఆత్మ శాంతికి)
రిప్లయితొలగించుప్రారబ్ధ గణిక వృత్తిని
ప్రారంభింప సుతను బలవంతము చేయన్
ఘోరము చూడగ క్రీడా
నారికి దన పుట్టినిల్లు నరకమ్ము గదా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుశారద దక్షుని యజమున
రిప్లయితొలగించునేరకతా వెడలినంత నిర్వేదమునన్
వైరాగ్యము నొంది దలచె
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఇరగ దీసారు పో!...
తొలగించుకోరిన వేమియు నందక
రిప్లయితొలగించుసారెకు నీ వాడ యంచు సంసారంబం
దూరక నిడుమల నొందెడి
నారికి దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ కొంత తికమకగా ఉంది. ఇలా చెప్తే ఎలా ఉంటుంది?
తొలగించుకోరిన వేమియుఁ బొందక
సారెకు నీదాన ననుచు సంసారమునన్
దూరక యిడుములఁ బెట్టెడి
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
గురువుగారికి నమస్సులు...నీవు ఆడ అంచు....నీవు ఆడపిల్లవని అనుచు.....అని నా అభిప్రాయము
తొలగించుఆడపిల్ల... ఆడ-పిల్ల అనడం జనవ్యవహారంలోని ఒక చమత్కారం. అంతే!
తొలగించుసారెకు నీవబల వనుచు
తొలగించుభారముగా దలచునట్టి భావము నందున్
యూరక యిడుముల నొందెడి
నారికి దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ తాజా పూరణ బాగున్నది.
తొలగించు‘అందున్+ఊరక’ అన్నపుడు యడాగమం రాదు.‘భావమునన్ దా| నూరక...’ అనండి.
శుభోదయం !
రిప్లయితొలగించుజవానుని మనువాడి వాడు పటాలము న కు బోవ నింట వేచిన జిలేబి !
వీర జవానుని గాంచెను
హారము వేసెను జిలేబి ఆరతి గొని,అం
గారిక వలె వేచిన ఆ
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుగురువు గారికి నమస్కారములు!
రిప్లయితొలగించు.
వేరుపడవలెనని దలచి,
కోరికతో మెట్టినింట గొడవలుపడి,సం
సారమ్ము వదిలి పెట్టిన
నారికి దన పుట్టినిల్లు నరకము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఆరకనె ముక్కుపచ్చలు
రిప్లయితొలగించుదారుణమది పెండ్లిజేయ దలపోయంగన్
కారడవిగ మారనిల్లు
నారికిదనపుట్టినిల్లునరకమ్ముగదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమూడవపాదం మూడవగణంగా జగణం వేశారు. ‘కారడవిగ మార గృహము’ అనండి.
ధన్యవాదములు సార్
తొలగించునిన్న మీరు ఆరోగ్యం,మనసు బాగా లేవంటే చాలా బాధ వేసింది.మేమంతా మీ కుటుంబ సభ్యులమే.పంచుకుంటే బాధ తగ్గుతుంది ఒకసారి కలుస్తాను సార్
జారిన వ్యాపారమ్మును
రిప్లయితొలగించుదారిన బడయవలె నింట దాతల గోరెన్
తీరిక లేదనె మరి పిసి
నారికి దన పుట్టినిల్లు నరకమ్ము గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు‘దారిన బడవేయ నింట...’ అనండి.
నిన్నటి పూరణ...మొదటిసారి శార్దూలం ప్రయత్నించా, వ్యాఖ్యానించమని ప్రార్థన.
రిప్లయితొలగించు"నాతిం వీడెను భ్రాతలం వదిలె మానంబోయె ద్యూతంబునన్
అంతంబా యిది? స్వీయకృత్యమిది! మోహం వీడె దుర్యోధనున్
పంతంబేగొని గెల్చె! నగ్రజుడు యీ భంగంబు నెట్లోర్తునో?"
భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్
మీ ప్రయత్నం చాలవరకు సఫలమయింది. కొన్ని లోపాలు.
తొలగించు‘నాతిన్ వీడెను, భ్రాతలన్ వదలె’ అన్నపుడు పూర్వబిందువు రాదు. ద్రుతం తర్వాత పరుషాక్షరాలు సరళాలుగా మారినపుదే బిందువు వస్తుంది. ‘నాతిన్ + చూచెను = నాతిం జూచెను, నాతిఁ జూచెను, నాతి న్జూచెను’ ఇలా. ‘మానంబు పోయె’ను ‘మానంబోయె’ అన్నారు. ‘మోహం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. మీ పద్యానికి నా సవరణ...
“నాతిన్ వీడెను భ్రాతలన్ వదలె దైన్యంబందె ద్యూతంబులో
నంతంబా యిది? స్వీయకృత్య మిది! మోహం బంది యా జ్ఞాతియే
పంతంబే కొని గెల్చె! నగ్రజు డయో భంగంబు నెట్లోర్చునో?”
భీతిం జెంచిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్దునుల్.
రెండు,మూడు పాదాలలో ప్రాసాక్షరములు బిందు పూర్వకములైనవి గదా
తొలగించురెండు,మూడు పాదాలలో ప్రాసాక్షరములు బిందు పూర్వకములైనవి గదా
తొలగించుగురువుగారూ, చాలా బావుంది మీ పూరణ. మీరన్నవి దిద్దుకుంటాను.
తొలగించుశర్మగారూ, మీరెత్తిన సందేహం ఛందం software కూడా చూపింది తప్పని! కాని నాకు అందులో స్పష్టత లేదు. గురువుగారే చెప్పాలి మరి!
తొలగించునిజమే. ప్రాసదోషం నా దృష్టికి రాలేదు. మన్నించండి.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించురఘురాం గారు మొదటి ప్రయత్నము చాలా బాగుంది. వ్రాసిన వెంటనే తొందర పడక తప్పుల కోసము వెదకాలి. అప్పుడు పద్యము హృద్యముగ నుంటుంది.
తొలగించుఈ క్రింది సవరణ చూడండి.
“నాతిన్ వీడెను భ్రాతలన్ వదలె దైన్యంబందె ద్యూతంబులో
పాతంబా యిది? స్వీయకృత్య మిది! భీభత్సంబుగన్ జ్ఞాతియే
ఘాతంబేర్పడ గెల్చె! నగ్రజు డు భంగంబెట్లుదానో ర్చునో?”
భీతిం జెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్
కామేశ్వర రావుగారూ నమస్సులు...మీ పూరణమద్భుతం
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుఇక్కడ గమనించ వలసిన విషయము: ప్రాసాక్షారము వెనుక బిందువున్న నాలుగు పాదములయందు బిందువుండవలెను. ప్రాసాక్షారము తరువాత బిందువుండ వచ్చును లేక పోవచ్చును. పరవాలేదు.
తొలగించుకామేశ్వరరావుగారూ, మీ పూరణ అమోఘం!! మీ వివరణతో నా తప్పు అర్థమైంది. ధన్యాలు!
తొలగించుకామేశ్వరరావుగారూ, మీ పూరణ అమోఘం!! మీ వివరణతో నా తప్పు అర్థమైంది. ధన్యాలు!
తొలగించుభారంబగునని తలచచు
రిప్లయితొలగించుకూరిమి నటియించి తల్లి ఘోరపు పనులన్
నేరుపుతో చేయించగ
నారికి తన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు‘తలచుచు’.. ‘తలచచు’ అని టైపాటు...
చేరగ తలిదండ్రి దివికి
రిప్లయితొలగించుభారముగా తలచుచున్న వదినన్నలతో
పోరును బడుచును కుమిలెడు
నారికి తన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఊరక దిట్టుచు కొట్టుచు
రిప్లయితొలగించునేరము మోపుచు సణుగుచు నిత్యము గొడవే!
ఘోరము! సవతికి కూతుర!
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకోరి వరించిన పతి మమ
రిప్లయితొలగించుకారముతో జూచుకొనగ గలతలు రేగెన్
జేరెను బుట్టింటికి నా
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుభారపు జీవితమున నో
రిప్లయితొలగించుదారుపు నందంగఁ బోవఁ దాళని వదినల్
కారాల్ మిరియాల్ నూరగ
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపేరిమి బంచక నిత్యము
రిప్లయితొలగించుదారుణముగ నేపు సవతి దల్లియె నున్నన్
కారాగారముతోసరి
నారికి తన పుట్టినిల్లు నరకమ్ముగదా!!!
గారాబము నందించును
నారికి తన పుట్టినిల్లు , నరకమ్ముగదా
ఘోరముగా హింసించుచు
ఆరళ్ళను బెట్టి మురిసె నత్తింటబడన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుకోరిన ప్రియుడిని వలదని
రిప్లయితొలగించువారించగ తల్లిదండ్రి పగవారేగా|
చేరిన మగడే తియ్యన
నారికి తనపుట్టి నిల్లునరకమ్ముగదా|
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచేరగ తన పతి సన్నిధి
రిప్లయితొలగించుతీరని యాశలు ఫలింప దివి తలపింపన్
మారుటి తల్లికి లొంగిన
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుకూరిమితోచూచెడు పతి
దూరంబవగా తలచెడి తొందరపడుచున్
భారంబగుచూ చేరిన
నారికి తనపుట్టినిల్లు నరకమ్ము గదా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు‘భారం బగుచున్’ అనండి.
కూరిమి జూపని దండ్రియు
రిప్లయితొలగించుమారామును జూపనట్టి మాతయు దమ్ముల్
నేరము లెంచుచు నుండగ
నారికి దనపుట్టినిల్లు నరకమ్ముగదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుగురువు గారికి ధన్యవాదములు
తొలగించు
రిప్లయితొలగించుభీరువుగామారి తనను
ఘోరాటవిలో వదిలిన కూరిమి పతియున్
నేరములెంచక క్రుంగెడి
నారికి తనపుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు‘కూరిమి పతిపై’ అనండి.
నారికిఁ నాథుడు దైవము
రిప్లయితొలగించువారిజ నోరిమి విడి తన వాక్కుల పెంపగు
వైరంబున పతి విడిచిన
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా
సవరించిన నిన్నటి పూరణ. పూర్ణముతో కూడిన ద త లకు ప్రాస కుదురుతుంది అనుకున్నాను. మీ సూచనలకు ధన్యవాదములు.
తొలగించుభాతింగల్గెడు రాజధర్మపరులై భాసిల్లిరా పాండవుల్
ఘాతంబొందిరి పాండు వీరులకటా కావించు జూదంబునన్
భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్
నాతిన్ వస్త్రములూడ్చ బాధపడి మౌనంబున్న ధర్మాత్మునిన్
ఈనాటి మీ పూరణ బాగున్నది.
తొలగించురెండవపాదం చివర తప్పక గురువు ఉండాలి. ‘వాక్కుల పెంపౌ’ అనండి.
సవరించిన మీ నిన్నటి పూరణ బాగుంది. కొంత అన్వయలోపం ఉంది. వృత్తరచనా ప్రారంభంలో ఈ దోషం సాధారణమే. పరవాలేదు.
ఫణి కుమార్ గారు ఛందోబద్ధముగా చక్కగా పూరణ జేసిన మీరు మిక్కిలి యభినందనీయులు. ఇప్పుడిక శబ్దార్థ లాలిత్యానికి ప్రయత్నించాలి. “భాతింగల్గెడు” కన్న “భాతిన్ వెల్గెడు”; “కావించు జూదంబునన్” కన్న ”కష్టంపు జూదంబునన్” అంటే బాగుంటుంది. అన్వయము కొరకు “వస్త్రాపహరణమునకు ఖిన్నుడయి చింతిస్తున్న రాజు ధర్మనందనుని యవస్థకు నేమవుతాడోనన్న భయము భీమార్జునులకు కలిగిందని భావము” వచ్చేటట్లుగా మూడవ పాదము. సవరణ చూడండి.
తొలగించుభాతిన్ వెల్గెడు రాజధర్మపరులై భాసిల్లిరా పాండవుల్
ఘాతంబొందిరి పాండు వీరులకటా కష్టంపు జూదంబునన్
నాతిన్ వస్త్రములూడ్చ ఖిన్నుడగు మౌనక్ష్మాపతిం జింతితున్
భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి భీమార్జునుల్
మీ సవరణకి ధన్యవాదములు.
తొలగించుధారుణి జననీ ప్రేమకు
రిప్లయితొలగించుమారెక్కడ మాఱుతల్లి మాతయు నగునే
దారుణ విమాతఁ గల్గిన
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఆరయ దివియే యగుమరి
రిప్లయితొలగించునారికి దన పుట్టినిల్లు, నరకమ్ము గదా
జారుల జీవిత మెప్పుడు
వారల రానీయ రాదు పడతుల దరికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువేరుపడిన కాపురమున
రిప్లయితొలగించుచేరగ గృహ పెత్తనమ్ము చెచ్చెర తనకున్
తీరగ కోరిక లన్నియు
నారికి ద నపుట్టినిల్లు నరకమ్ముగదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు☘🌺☘
రిప్లయితొలగించుకం**
సారెకు మనమున దలచుచు,
నీరము నైనను విడువని నీచుడు దానై !
నేరము సలిపెడు నాపిసి,
నారికి దన పుట్టినిల్లు నరకమ్ము గదా !!
🙏 🌺🙏
అంబటిభానుప్రకాశ్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు1.
రిప్లయితొలగించుచీరలు సారెలు భూరిగ
కోరిన కానుకలను సమ కూర్చ విఫలులౌ
వారు తలిదండ్రులైనను
నారికి దన పుట్టినిల్లు నరకమ్ముగదా
2.
కౄరుడు మగడంచును శ్రీ
వారిని విడనాడినట్టి పడతికి లేదే
గౌరవ మెచ్చట నపుడా
నారికి దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
3.
వారిజ నేత్రులు గడుసుకు
మారులు, పతియాదరించి మన్నన సేయన్
వారికి పతియే లోకము
నారికి దనపుట్టినిల్లు నరకమ్ము గదా.
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించువేరు కులము యువకునిఁ దా
రిప్లయితొలగించునారాధించెనని తెలిసి యామెను పెద్దల్
కూరిమి విడి బంధించగ
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మా బావగారు తంగిరాల తిరుపతి శర్మ గారి పూరణ:
రిప్లయితొలగించుసారెకు తన తలిదండ్రులు
నేరములను ఎత్తి జూపి నిందింపంగా
గారము శూన్యము యనుకొను
నారికి తనపుట్టినిల్లు నరకమ్ముగదా
తంగిరాల తిరుపతి శర్మ గారికి స్వాగతం.
తొలగించువారి పూరణ బాగున్నది. ‘నేరములను+ఎత్తి, శూన్యము+అనుకొను’ అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా కాని, యడాగమంతో కాని వ్రాయరాదు. ‘నిందింపంగా’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. వారి పద్యానికి నా సవరణ...
సారెకు తన తలిదండ్రులు
నేరమ్ముల నెత్తి చూపి విందింపంగన్
గారము శూన్య మ్మనుకొను
నారికి....
చేరగ తన పతి సన్నిధి
రిప్లయితొలగించుతీరని యాశలు ఫలింప దివి తలపింపన్
మారుటి తల్లికి లొంగిన
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుదారికి పతి రాలేదని
రిప్లయితొలగించుపోరుచు తలిదండ్రి లేని పుట్టిన గృహమున్
చేరగ వదినెలు గానని
“నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా”
అమరవాది రాజశేఖర శర్మ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుభారపు జీవితమున నో
రిప్లయితొలగించుదారుపు నందంగఁ బోవఁ దాళని వదినల్
నేరము లెన్నియొ మోపగ
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకోరిన కోర్కెలు దీర్చక
రిప్లయితొలగించుభారముగా జూచుగాదె భగభగమనుచున్
మారట తల్లులు గలిగిన
నారికి దన పుట్టినిల్లు నరకమ్ముగదా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకూరిమి గల పతి నీడయె
రిప్లయితొలగించునారికి దన పుట్టినిల్లు! నరకమ్ము కదా
కోరిన సంపద లున్నను
దారులు కలియని మనుజుల దరి జీవింపన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుదూరము చేయు తలంపున
రిప్లయితొలగించునేరములన్ సవతి తల్లి నెట్టుచు తనపై
ఘోరముగా హింసించగ
నారికి దన పుట్టినిల్లు నరకమ్ము గదా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుగారాబము వాత్సల్యము
రిప్లయితొలగించుకూరిమి లభియించు పెండ్లి కూతురు వరకే
మారను బంధము, చేరిన
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు‘మారను’ అంటే మారగా అనే అర్థమా? లేక అది మారును కు టైపాటా?
కోరిన వరునే తెచ్చియు
రిప్లయితొలగించుతీరని కోర్కెలను దీర్చ , తిండికి లేకన్
పేరుకె తలిదండ్రు లయిన
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించు[చెఱసాల నరకము వంటిది. చెఱసాలలోఁ గృష్ణుఁడు జన్మించినప్పుడు వసుదేవునకు నిజముగ నరకమే కనఁబడినది. ’వసుదేవు నంతటివాఁడే గాడిద కాళ్ళు పట్టినాఁ’ డను నానుడి దీని వలననే గదా పుట్టినది!]
శౌరియె చెఱను జనించఁగ
నే, రాసభ మోండ్రపెట్ట, నిడె ఖరపద జో
హారు వసుదేవుఁ! డా యవ
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుకూరిమి నిండిన స్వర్గము
రిప్లయితొలగించునారికిఁ దన పుట్టినిల్లు; నరకమ్ము గదా
తీరని కోరికతో హృది
దారను పంపిన మగనిది దడదడ లాడన్ :)