8, మే 2016, ఆదివారం

పద్యరచన - 1218

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

23 కామెంట్‌లు:

 1. తోడుగ బిడ్డకు డోలిక,
  జోడెడ్లను రై తు పొలము జోరుగ దున్నన్
  కాడెకు మధ్యాంతములన్
  క్రీడగ కట్టె నిటబాబు కేరింతలిడన్.

  రిప్లయితొలగించండి
 2. నాగేటి చాలు పైనను
  తూగన్ దనబిడ్డనుంచి దున్నుచు నుండెన్
  రాగాలు బాడుకొంటూ
  సాగే దన యెడ్ల దోలి సాగును జేయన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   'పాడు కొంటూ, సాగే' అని వ్యావహారికం ప్రయోగించారు. "రాగమ్ముల బాడుకొనుచు|సాగుకు..." అనండి.

   తొలగించండి
 3. సవరించిన పద్యం

  నాగేటి చాలు పైనను
  తూగన్ దనబిడ్డనుంచి దున్నుచు నుండెన్
  రాగమ్ముల బాడు కొనుచు
  సాగుకు దన యెడ్ల దోలి సాగును జేయన్!

  రిప్లయితొలగించండి
 4. తనదు కొమరుని నాగటి దరువు మీద
  నునిచి దున్నసా గె నునట తనివి తీర
  తొలకరించగ నానేల సులువు గాను
  నాతడే కద మనకు గా నన్నదా త

  రిప్లయితొలగించండి
 5. వలపట దాపట నెద్దుల
  జలమున బాలుని నడుమను సాకగ నెలమిం
  గలుపును దీయగ సాగెను
  బొలమున గనువిందుగ మన పొలమరి దీక్షన్

  రిప్లయితొలగించండి
 6. కాడి మధ్యన నుయ్యేల కదలుచుండ
  కదలకుండగ నుండె నా కన్నబిడ్డ
  భావి వ్యవసాయదారుని ఠీవిగనగ
  చక్రవర్తిని తలదన్ను చంద్రవదన!

  రిప్లయితొలగించండి
 7. రైతు బిడ్డ వెంట దంతులు కొట్టంగ
  రెండు యెడ్ల తోడ యేరువాక
  సాగుచుండె దినము సమయమెరుగకుండ
  జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

  రిప్లయితొలగించండి
 8. రైతు బిడ్డ వెంట దంతులు కొట్టంగ
  రెండు యెడ్ల తోడ యేరువాక
  సాగుచుండె దినము సమయమెరుగకుండ
  జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

  రిప్లయితొలగించండి
 9. ఉదరమ్ములు మూడైనను
  పదములు పదియుండునంట పరికింపంగన్
  ముదముగ నారట కన్నులు
  పదనుగలుగు చోటతిరుగు వసుధన గాంచన్

  అరక బట్టి రైతు మెరకనే దున్నుచున్
  నారు వోసి తగిన నీరు బెట్టి
  పగలు రాత్రి యనక పాటిగా కష్టించి
  అవని జనుల పాలిటన్నదాత

  వృషభములను గట్టి బీడు భూములదున్ను
  కాలమిపుడు లేదు కాంచినంత
  యంత్రసాయమందు వ్యవసాయమే జేయు
  రోజు లొచ్చె జనుల మోజు తీర్చె

  రిప్లయితొలగించండి
 10. కన్న తల్లి లేక కాడియె నుయ్యాల!
  పగ్గ మంది తండ్రి పాడె జోల!
  నాడి పాడి పనులఁ గూడి చేసెడు రైతు
  బిడ్డఁ బెంచు! భూమి పేర్మిఁ బండ!

  రిప్లయితొలగించండి
 11. భాను దష్కర కిరణాలు భావిరైతు
  శిరముమీదనుపడకుండ కరముప్రీతి
  జాగరూకత వహియించి జనకుడంత
  భూమి దున్నుచు మదిలోన పులకరించె.

  రిప్లయితొలగించండి
 12. భాను దష్కర కిరణాలు భావిరైతు
  శిరముమీదనుపడకుండ కరముప్రీతి
  జాగరూకత వహియించి జనకుడంత
  భూమి దున్నుచు మదిలోన పులకరించె.

  రిప్లయితొలగించండి
 13. కాడి మధ్యన నుయ్యేల కదలుచుండ
  కదలకుండగ నుండె నా కన్నబిడ్డ
  భావి వ్యవసాయదారుని ఠీవిగనగ
  చక్రవర్తిని తలదన్ను చంద్రవదన!

  రిప్లయితొలగించండి
 14. కలుపుమొక్కలఁదొలగించ కర్షకుండు
  గొర్రు దున్నుచు నొకవైపు గుడ్డమందు
  బిడ్డ నాడించు చుండెను ప్రియముగాను
  చూడ చక్కని దృశ్యము సొంపుగూర్చె
  గుడ్డముః పొలము

  రిప్లయితొలగించండి
 15. కాడికి గట్టు నూయల సకాలము నందున ఎద్దు లూపగా?
  పాడగ గాలిపాటవిని పాపయు నిద్దుర బోవ?రైతుకే
  జాడలు జూపి వెళ్ళుచును జాగృతు లందున పంట కూర్పు కై
  ఆడెడి పిల్ల లట్లుగనె నద్భుత రీతిగ యెద్దులుండెగా|
  2.ఎద్దుల ముద్దుపాపడివి యెంతటి యోర్పుగ నిన్ను సాకునో?
  సద్దిని మూట గట్టుకొని సాగెడి సాలున రైతు వంశమున్
  వృద్దిని గోరుచున్ తగిన విద్యను నేర్చియుపంటభూమికిన్
  బద్దత గూర్చి కాడిమెడ పై నిడు యెద్దులె ముద్దు రైతుకున్

  రిప్లయితొలగించండి
 16. వృషభములకు నడుమ బిడ్డనునిచి రైతు
  పొలము దున్నుచుండె పుడమి యందు
  పైరు చూసి తాను పరవశించుచు నుండ
  వరుణు కరుణ జూపె వాసి గాను.

  రిప్లయితొలగించండి
 17. స్కూలుకు పోవా భడవా!
  మేలైనది నీ బ్రతుకిట మిట్టూరోడా!
  చాలున పచార్లు వెంటనె
  చాలించిక నే.బి.సీ.లు చదువుర కన్నా!

  https://te.m.wikipedia.org/wiki/మిట్టూరోడి_పుస్తకం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మిట్టూరోడబ్బోడా
   పట్టుగ చదువువలె, నీవు పట్నము బోవన్
   గట్టెక్కదవయ కొడుకా
   చెట్టూపుట్టలను వీడి చిత్తూరుకు బో :)

   జిలేబి

   తొలగించండి


  2. https://te.m.wikipedia.org/wiki/మిట్టూరోడి_కతలు


   :) జిలేబి

   తొలగించండి