గురువు గారికి నమస్కారములు . అతిశయము నెక్కి ' అంటే 'ఎక్కువైన ఆధిక్య భావన కలిగినవై' అనే ఉద్దేశ్యంతో ప్రయోగించాను. (ట్రాక్టర్ల లాంటివి వచ్చాక దున్నడం, కుప్పలు నుర్చడం వంటి పనుల్లో తమకు శ్రమ తగ్గినందన్న సంతోషంతొ గంతులేశాయి అన్న భావనను కల్గించడానికి నేను చేసిన ప్రయత్నమది) సవరణ ఏమైనా కుదిరితే సూచింప గోరుతాను. ధన్యవాదములు. శ్రీధర రావు.
మా మావయ్యగారు శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారి పూరణ: క. సమరము లెన్నియొ సల్పియు క్రమముగ నొక చక్రవర్తి కట్టెను కోటన్ సమయము పో నిపుడా కు డ్యము నెక్కి లులాయములు విహారము సల్పున్
పద్యం లక్షణంగా ఉంది. కాని సమస్య పరిష్కారం కానట్టుంది. లులాయములు హయము నెక్కిన వన్న అపార్థం వస్తున్నది. ‘కమనీయ సికత సముదా|యము నెక్కి...’ అంటే ఎలా ఉంటుంది?
తమనమ్మె కటిక వానికి
రిప్లయితొలగించండిశ్రమ చేయుటకునివి పనికి రావికయని - పా
పమది తెలియక 'లారీ'ని ర
యము నెక్కి లులాయములు విహారము సల్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవపాదంలో గణదోషం. ‘పా|ప మెఱుగకను ‘లారీ’ని ర...’ అనండి.
అమితో గ్రపు మహిష నికా
రిప్లయితొలగించండియము భీషణరణము జేసి హతమార్పగ లే
యమును పడద్రొక్కి మృతకా
యమునెక్కి లులాయములు విహారము సల్పున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅమితమగు కౄర మహిషుని
రిప్లయితొలగించండితమకము తోత్రొక్కి చంపె దాక్షాయణి యౌ
కుమతుడు యసురుని యశ:కా
యము నెక్కి లులాయములు విహారము సల్పున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగుంది. మూడవపాదంలో గణదోషం. నా సవరణతో మీ పద్యం....
అమితక్రూరుడు మహిషుని
దమకముతో ద్రొక్కి చంపె దాక్షాయణి యా
కుమతు డసురుని యశఃకా
యము నెక్కి....
రిప్లయితొలగించండిఅమరెను కుదురుగ కందము
సమసెను శంకరు సమస్య సత్యము జూడన్
అమలిన పద్య జిలేబీ
యము నెక్కి లులాయములు విహారము సల్పున్
సావేజిత
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రమజేసి యలసి బోవగ
రిప్లయితొలగించండిక్రమ మందున వాటి కొసగు గడ్డిని దినగం
దమ దాపున కసవు నికా
యము నెక్కి లులాయములు విహారము సలుపున్!
నికాయము=ప్రోగు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండిగురువు గారూ కొద్దిగా సవరించిన...
శ్రమజేసి యలసి బోవగ
క్రమ మందున వాటి కొసగు గ్రాసము దినగం
దమ దాపున కసవు నికా
యము నెక్కి లులాయములు విహారము సల్పున్!.
నికాయము=ప్రోగు
శ్రమపడి రైతులు వ్యవసా
రిప్లయితొలగించండియము జేయగ వచ్చినట్టి సస్యము నూర్పన్
ప్రమదముతో నట ఫలసా
యము నెక్కి లులాయములు విహారము సల్పున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండియముడను నేనంచు నొకడు
యమపురి జేరగ యముండు నాగ్రహమొందెన్
తమనెక్క వచ్చిన మాయా
యమునెక్కి లులాయములు విహారము సల్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవపాదంలో గణదోషం. ‘తమ నెక్క వచ్చు మాయా...’ అనండి.
అకస
రిప్లయితొలగించండిసక2033/15
సమస్యాపూరణం
తిమిమన సులనిం డగపా
పములను జేయుజ నులు యమపురికిం జనగా
యమరాజు శిక్షలతొకా
యము నెక్కి లులాయములు విహారము సల్పున్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరెండవపాదంలో యతి తప్పింది. ‘..యమపట్టణ మేగన్’ అనండి. ‘శిక్షలతొ’ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘శిక్షలకు...’ అనండి.
యమహా యను వాహనమె
రిప్లయితొలగించండిక్కి మనుమడగు పోతరాజు కీసర కేగన్
గమనించిన తాత పలికె
యమునెక్కి లులాయములు విహారము సల్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివిరించి వారు అదురహో !!
చీర్స్
జిలేబి
జిలేబి గారూ _/|\_
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండితమతమ యిండ్లను వెడలియు
నమర విహర తల శిలోచ్చయము నెక్కి లులా
యములు విహారము సల్పున్
రమణీయమ్మైన ప్రకృతి రంజనమిడఁగన్!
మీ పూరణ వైవిధ్యంగా మనోహరంగా ఉంది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు శంకరయ్య గారూ!
తొలగించండిమధురకవి గారూ రమణీయం మీ పూరణం
రిప్లయితొలగించండిసుకవి మిత్రులు బొడ్డు శంకరయ్యగారికి ధన్యవాదములు!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణలో ప్రాస తప్పింది. ‘యమునిస్సాయుతుడు’...? సవరించండి.
తొలగించండికమతము సేయగ మర యం
రిప్లయితొలగించండిత్రములు బిర బిర నవయుగపు రైతును చేరన్!
తమ పని తప్పెనని యతిశ
యమునెక్కి లులాయములు విహారము సల్పున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాని ‘అతిశయాన్ని ఎక్కడం’...?
గురువు గారికి నమస్కారములు .
తొలగించండిఅతిశయము నెక్కి ' అంటే 'ఎక్కువైన ఆధిక్య భావన కలిగినవై' అనే ఉద్దేశ్యంతో ప్రయోగించాను. (ట్రాక్టర్ల లాంటివి వచ్చాక దున్నడం, కుప్పలు నుర్చడం వంటి పనుల్లో తమకు శ్రమ తగ్గినందన్న సంతోషంతొ గంతులేశాయి అన్న భావనను కల్గించడానికి నేను చేసిన ప్రయత్నమది) సవరణ ఏమైనా కుదిరితే సూచింప గోరుతాను.
ధన్యవాదములు. శ్రీధర రావు.
సమనీల వర్ణ దృఢ వి
రిప్లయితొలగించండిక్రమ దేహద్యుమ్న ఘోర కర్కశ మృగముల్
ద్రుమ శాద్వల గోత్ర నికా
యము నెక్కి లులాయములు విహారము సల్పన్.
[“సల్పన్” : వచన భేదము తలచి మార్చితిని.]
‘సల్పన్’ అసమాపక క్రియ. దీనికి అన్వయం? ‘లులాయములు విహారము సల్పున్’ అనడంలో వచనభేదం ఉన్నట్లు నాకు తోచడం లేదు. ‘గోవులు దుగ్ధము నిచ్చున్, పక్షులు నభమున నెగురున్’ వంటిదే కదా!
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. వచనభేదము లేకపోతే యిబ్బంది లేదు. అనుమానము వచ్చింది. అంతేనండి. “సల్పున్” పదమునే గ్రహించుచున్నాను. కొండలలో విహారము సలుపుట వలన ధృడములైనవి యని నా భావన. పద్యము యెలా యున్నది తెలుప గోర్తాను.
తొలగించండిమా మావయ్యగారు శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారి పూరణ:
రిప్లయితొలగించండిక. సమరము లెన్నియొ సల్పియు
క్రమముగ నొక చక్రవర్తి కట్టెను కోటన్
సమయము పో నిపుడా కు
డ్యము నెక్కి లులాయములు విహారము సల్పున్
శ్యామలరావు గారూ,
తొలగించండిశ్రీ ప్రసాద్ ఆత్రేయ పూరణ బాగున్నది. వారికి అభినందనలు, మీకు ధన్యవాదాలు.
వరికుప్ప నూర్పిడిలో సంతోషముగా బంతి తిరిగే దున్న పోతులు గుర్తుకొచ్చాయి.
రిప్లయితొలగించండిసమయమున పొలము దున్నుచు
శ్రమశక్తిని సంతతమ్ము రైతుల కిడుచున్
కమతములందు వరినికా
యమునెక్కి లులాయములు విహారము సల్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికమతముల పనులు తీరెను
రిప్లయితొలగించండిసమయంబిది పశువులెల్ల చరియించుటకున్
అమితపు హృదయానంద మ
యము నెక్కి లులాయములు విహారము సల్పన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండియమునా నదితీరములో
రిప్లయితొలగించండిసమరంబేలేనివేళ సఖ్యము గలుగన్
గమనీయమయిన విమల హ
యము,నెక్కి లులాయములు విహారము సల్పున్
పద్యం లక్షణంగా ఉంది. కాని సమస్య పరిష్కారం కానట్టుంది. లులాయములు హయము నెక్కిన వన్న అపార్థం వస్తున్నది. ‘కమనీయ సికత సముదా|యము నెక్కి...’ అంటే ఎలా ఉంటుంది?
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి‘పాముకు గల గాయము నెక్కి..’ అర్థం కాలేదు. ‘మెచ్చే’ అనడం వ్యావహారికం. ‘మెచ్చన్’ అనవచ్చు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొమరుదనపు యెనుముల నా
రిప్లయితొలగించండిహిమాలయపు సీమలందు హేలగ జూడన్
శ్రమమని యె0చక ప్రాలే
యము నెక్కి లులాయములు విహారము సల్పున్
+
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅమితానందము తోకు
రిప్లయితొలగించండిడ్యమునెక్కి లులాయములు విహారము సల్పన్
నిమిషంబాగక రేగుచు
శ్రమతో కట్టిన మనుజుడు శౌర్యము చూపెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅమలా!వినుమీసంగతి కమతముమూలానవచ్చుకసరునుబరుప న్నమలంబగుగ్రాసపునిచయ యమునెక్కిలులాయములువిహారముసల్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి‘నిచయయము’ అని ఒక య ఎక్కువైనది.
క్రమముగ వార్ధక్యపు కా
రిప్లయితొలగించండియమున పనిని జేయ లేక వ్యధ జెందంగన్
యముని దరికి వాహన సా
యము నెక్కి లులాయములు విహారము సల్పున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేటి శంకరాభరణం వారి సమస్యాపూరణం -2037
రిప్లయితొలగించండిసమస్య : యమునెక్కిలులాయములు విహారము సల్పున్
కం . యమహా నెక్కి యువకులుర
యమునన్ వీధులలొచేరి యువతుల నవమా
నము చేయ పల్కెజనులున్
యమునెక్కిలులాయములు విహారము సల్పున్
మీ ఫూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘వీధులలొ’ అని ‘లో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాశారు. ‘వీధులను’ అంటే సరి!
రిప్లయితొలగించండితమకమున కాపరి కటిక
కమానుషమ్ముగను యమ్మగ నవి బెదరగన్
సమీప గిరులన్ జూచి ర
యమునెక్కి లులాయములు విహారము సల్పున్
🙏 చెన్నకేశవ, రాయచోటి 🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘అమానుషమ్ముగ+అమ్మగ=అమానుషముగ నమ్మగ’ అవుతుంది.
ధన్యవాదాలు శంకరయ్యగారూ
తొలగించండిరెండవపాదాన్ని ‘...కమానుషమ్ముగను నమ్మ నవి బెదరంగన్’ అనండి.
తొలగించండియమునెక్కిరింత సెలవిడి
రిప్లయితొలగించండియమలోకము వీడి మిత్రులందరు కూడన్,
ప్రమదమున మేఘసముదా
యమునెక్కి లులాయములు విహారము సల్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి1.
రిప్లయితొలగించండియముడెవ్వడు గొనిపోవగ
యమ పాశమ దేమనంచు నరచెడి వానిన్
యమభటులీడ్వనతని కా
యము నెక్కి లులాయములు విహారము సల్పున్
2.
సముదాయము నుండి దప్పి
క్రమమెరుగక దిరుగుచుండి గాసిల; నొకచో
తమవారల గని యా కు
డ్యము నెక్కి లులాయములు విహారము సల్పున్
సమస్యా పూరణం 2
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘సముదాయము దప్పి యను|క్రమ మెరుగక...’ అందామా?
. శ్రమకున్ పంటలు బండగ
రిప్లయితొలగించండిక్రమమున్ తూర్పార పంట కల్లమునందున్
సమసినగడ్డియె ఫలసా
యము నెక్కి లులాయములు విహారము సల్పన్|
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమముగ కోతల నారం
రిప్లయితొలగించండిభము నందున వానహెచ్చి వరదలు మెండౌ
సమయమ్మున మునిగిన స
స్యము నెక్కి లులాయములు విహారము సల్పున్!