11, మే 2016, బుధవారం

సమస్య - 2030 (కోతిని పెండ్లాడి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కోతిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

105 కామెంట్‌లు:

  1. ఆతని ప్రేమను బొందుచు
    నాతి, యతడు "మాలు" జేరి నయగారమునన్
    నేతి మిఠాయిలు మరి"చా
    కో" తిని, బెండ్లాడి, నాతి కొమరుని బడసెన్!
    (సరదాగా)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో చాకో తినిపించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మాలు జేర్చ’ అంటే అన్వయం కుదురుతుందేమో?

      తొలగించండి
    2. ఈనాటి సమస్యను స్వల్పంగా మార్చడానికి మీరే కారణం. ‘కోతినిఁ బెండ్లాడి = కోతినిన్+పెండ్లాడి’ అని విరుపు. ‘చాకో తినిన్’ అనే విరుపుతో మీ పూరణ కుదరదు. అందువల్ల సమస్యనే మార్చాను.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురువు గారూ.....చేరి=చేరుకొని యని నా అభిప్రాయం... అన్వయం సరిపోతుందనుకుంటాను

      తొలగించండి
    4. ‘చేర్చ’ అంటేనే అక్కడ అన్వయం కుదురుతున్నది. ఒకసారి నిశితంగా పరిశీలించండి.

      తొలగించండి
  2. కోతుల రాజగు వాలియు
    రీతిగ చెలి తార జేరి లిప్సను తెలుపన్
    ప్రీతిని నెచ్చెలి మరియా
    కోతిని బెండ్లాడి నాతి కొమరుని బడసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాలి వివాహ ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఆది గురుడు యిలను అద్వైతమును చెప్పి
      బ్రహ్మ సూత్రములకు భాష్య మిచ్చి
      షణ్మతంబులిచ్చి జ్ఞానభిక్షను పెట్టె
      చంద్ర వంక లేని శంకరుండు

      ఈ సమస్యకి సంబంధము లేకపోయినా ఈ రోజు శంకరుల పుట్టినరోజు సందర్భముగా వారి గూర్చి ఒక పద్యం

      తొలగించండి
    3. శంకర భగవత్పాదులను స్తుతించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      నిన్న పోస్టులను షెడ్యూల్ చేసే సమయంలో ఈరోజు శంకరుల జన్మదినమని గుర్తు లేదు. లేకుంటే తత్సంబంధమైన సమస్యనో, పద్యరచననో ఇచ్చేవాణ్ణి. ధన్యవాదాలు.

      తొలగించండి
  3. ఘాతుక హిమ శైల పవన
    శీతల బాధన్ సహించ శీలముదప్పెన్
    హేతువు చలింప మతులన్
    కోతిని బెండ్లాడి నాతి కొమరుని బడసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శీతబాధకు మతి చలించిన మగువ కోతిని పెండ్లాడిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. సీతయ్య కురూపి యగుట
    ‘కోతీ’ యని పిలుచుచుంద్రు కుగ్రామములో
    నాతఁడు తన బావ యనుచు
    కోతినిఁ బెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

    రిప్లయితొలగించండి
  5. కవిమిత్రులకు మనవి...
    ఈనాటి సమస్యను ముందుగా ‘కోతినిఁ బెండ్లాడి...’ అని ఇచ్చాను. దానిని ఇప్పుడు ‘కోతిని పెండ్లాడి...’ అని స్వల్పంగా మార్చాను. దీనివల్ల వైవిధ్యమైన పూరణలు వచ్చే అవకాశం ఉంది. గమనించండి.

    రిప్లయితొలగించండి
  6. ఆ తరుణి రోగపీడిత
    యేరీతిగఁ బెండ్లి సేతు నీమె కటంచున్
    భీతిలఁ బిత మందో మ్రాఁ
    కో తిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువర్యులకు నమస్సులు. రెండవ పాదంలో ప్రాస సవరించండి.

      తొలగించండి
    2. రెడ్డి గారూ,
      ధన్యవాదాలు. సవరిస్తున్నాను.

      తొలగించండి
    3. ప్రాసదోషాన్ని సవరించిన నా రెండవ పూరణ.....

      ఆ తరుణి రోగపీడిత
      యేతీరునఁ బెండ్లి సేతు నీమె కటంచున్
      భీతిలఁ బిత మందో మ్రాఁ
      కో తిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

      తొలగించండి
  7. రాతిరి కలగనె భామిని
    రాతను మార్చిన బ్రమ్మ రాజుకు బదులున్
    యాతన తప్పదు తనకని
    కోతిని పెండ్లడి నాతి కొమరునిఁ బడసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      రెండవపాదంలో గణదోషం. ‘మార్చెనట బ్రహ్మ’ అనండి.

      తొలగించండి
    2. రాతిరి కలగనె భామిని
      రాతను మార్చెనట బ్రమ్మ రాజుకు బదులున్
      యాతన తప్పదు తనకని
      కోతిని పెండ్లడె నాతి కొమరునిఁ బడసెన్


      తొలగించండి


  8. శుభోదయం !


    గీతిక, జిలేబి వోలెన్
    రీతిగ బెండ్లియగు కలుగు రివ్వురు కొమరుల్
    జాతిక యందుకొను! సరి ! య
    కో! తిని, పెండ్లాడి నాతి కొమరుని బడసెన్!

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్న్దది.
      ‘అకో’... ‘అక్కో’కు రూపాంతరమా? అంతే అయి ఉంటుంది! ‘ఇవ్వురు’ కాదు ‘ఇర్వురు’ అనండి. ‘జాతిక యందుకొను’... అర్థం కాలేదు.

      తొలగించండి
    2. కంది వారు !

      నెనర్లు !

      జాతిక అంటే జాజి కాయ ! సురభి అన్న అర్థం ఉంటేను :)

      అకో ! ఆశ్చర్యార్థకము :)

      జిలేబి

      తొలగించండి
  9. గీతములనుపాడుచు సం
    గీతంబును వినుచునింతి గేయములెల్లన్
    ప్రీతిన్ వ్రాయుచు 'చా
    కొ'తిని పెండ్లాడి నాతి కొమరుని బడసెన్.

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందఱకు నమస్సులు!

    భాతిగఁ గేసరి ప్రేమను
    నాతియ యా యంజని గొనె! నయగారమునన్
    ఖ్యాతిగఁ బెద్దల యనుమతిఁ

    గోతినిఁ బెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంజనీ కేసరుల పరిణయ వృత్తాంతంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. ఆ తార వనిలో తానా
    కోతిని బెండ్లాడి నాతి కొమరుని బడసెన్
    యాతనయుండును రాముని
    ప్రీతిన్ బొంది దశకంఠుఁభీతున్ జేసెన్.

    3.సీతను తనయుడు కాంచగ
    నాతుర పడుచును మనమున నంజనియును తా
    ప్రీతిన్ కేసరిఁ జేరుచుఁ
    గోతిని బెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణలో ‘...బడసె| న్నాతనయుడు..’ అనండి.
      రెండవ పూరణలో సీత ప్రస్తావన ఎందుకో అర్థం కాలేదు.

      తొలగించండి
  12. మాతా పితరులు గోరగ
    ప్రీతిగనే బావ మెచ్చ, వేడుచు మదిలో
    రీతిగ నంజని సుతుడౌ
    కోతిని,బెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కడ అంజనిసుతుడైన ఆంజనేయుడు అనుకుంటే అతడు బ్రహ్మచారి కదా! అతణ్ణి పెండ్లాడడం కుదరదు.
      లౌకికంగా అర్థం తీసుకుంటే అంజని అనే ఆవిడ కొడకును ‘కోతిబావా’ అని ఎగతాళి చేసే మరదలు పెళ్ళాడిందని భావం.
      రెండవదే మీ భావం అయి ఉంటుంది.

      తొలగించండి
    2. మాస్టరుగారూ! .వేడుచు మదిలో
      రీతిగ నంజని సుతుడౌ
      కోతిని,...బావను పెండ్లాడిందని నాభావమండీ..ఆ అర్థం రావట్లేదేమో?

      తొలగించండి
    3. మీ వివరణల వల్లకూడా భావం స్పష్టంగా అవగాహన కావడం లేదు.

      తొలగించండి
    4. ఓహ్! ట్యూబ్‍లైట్ వెలిగిందండోయ్... ఇప్పుడు అవగాహనకు వచ్చింది. బాగుంది. నేను చెప్పిన రెండు భావాలూ కావు. ముచ్చటగా మూడోది! అపార్థం చేసుకున్నందుకు మన్నించండి.

      తొలగించండి
  13. కోతివెధవటంచుచుమా
    చేతులచీవాట్లు తినెడు చంటి యల్లరికిన్
    చేతలకుతెరపడగమా
    కోతిని పెండ్లాడినాతికొమరునిబడసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      రెండవపాదంలో ‘యల్లరికిన్’ అన్నచోట గణదోషం. మీ పద్యానికి నా సవరణ....
      కోతివెధవా యనుచు మా
      చేతన్ జీవాట్లు తినెడు చంటి గొడవకున్
      చేతలకు తెర పడగ మా
      కోతిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

      తొలగించండి
    2. రెండవ పాదంలో యతిభంగం....అవుతుందేమో...సవరణలో....

      పరిశీలించండి.

      తొలగించండి
    3. మధుసూదన్ గారూ,
      ధన్యవాదాలు. ‘చేతన్ జీవాట్లు తినెడు శ్రీను గొడవకున్’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    4. చేతన్ జీవాట్లుతినెడి చిన్ని గొొడవకున్

      చిన్ని=చిన్నవాడు
      సరిపోతుందా సార్

      తొలగించండి
  14. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    ప్రీతికి గర్భము నందున
    వాతపు రోగంబు లుండ వానిని మాన్పవ్
    ప్రీతిగ తను మందునొ మా
    కో,తిని,పెండ్లాడి నాతి కొమరుని బడెసెన్

    రిప్లయితొలగించండి
  15. నా రెండవ పూరణము:

    "చేతుము మను"వన, "వ"ద్దని,
    రాతిరి యుపవాసముండె; బ్రతిమాలంగన్;
    నేతి మిఠాయిఁ గనియొ, కన

    కో, తిని, పెండ్లాడి, నాతి కొమరునిఁ బడసెన్!

    రిప్లయితొలగించండి
  16. శ్రీనివాస్ చారి గారి పూరణ....

    నీతుల నేన్నియొ జెప్పును
    గూతురు గనినసుతునకును గూరిమితోడన్
    తాతయ జెప్పిన "కథ"లో
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడిసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాత చెప్పిన కథలో అద్భుతాలకు లోటేమిటి? మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శంకరయ్య గారికి శతసహస్ర ధన్యవాదములు

      తొలగించండి
  17. జీతము మిగిల్చ లేడని
    చేతలు బరువైన బావ చిత్తము మార్చన్
    భీతిలి, మార్చగ లోపలి
    కోతిని, పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంతరవానరాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. మధురకవి శ్రీ మధుసూదన్ గారికి నమస్సులు... మీ పూరణ చాలా బాగుందండి

    రిప్లయితొలగించండి
  19. గురువులకు వందనములు !

    ప్రయత్నం,

    జాతీ,మతముల నెంచక
    ప్రీతిగ నొక చిలిపివాన్ని ప్రేమయటంచున్
    భీతిల్లక నెవరికి, యా
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడసెన్ !

    ,
    నాకైతే " కందములో పూరణమ్ము కష్టము సుమ్మీ ?!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందంలో పూరణం కష్టమంటూనే చక్కని పూరణ నందించారు. కొన్ని లోపాలు. ‘జాతీ, చిలిపివాన్ని’ అనడం గ్రామ్యం. ‘జాతియు మతముల... చిలిపివాని... భీతిల్లక యెవరికి నా కోతిని...’ అనండి.

      తొలగించండి
    2. డా.సముద్రాల శ్రీనివాసాచార్య
      Skno2036
      కవిత సంఖ్య6
      నీతుల నెన్నియొ జెప్పును
      కూతురు గనినసుతునకును గూరిమి తోడన్
      తాతయ జెప్పిన "కథ"లో
      కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడిసెన్

      తొలగించండి
  20. జాతకరీత్యా దోషము
    కూతురు కుందనుచు పెండ్లికొడుకుకు ముందే
    కోతిని పెండ్లాడమనిన
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడసెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జాతకదోష నివారణ కోసం కోతిని పెండ్లాడినట్లు చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. త్రేతను వరమిడే రాముడు
    "కోతులు నరులుగ జనింప క్షోణిని,కలి,నా
    రీతిని నరుడై పుట్టిన
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బదసేన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలియుగంలో నరుడై పుట్టిన వానరాన్ని పెండ్లాడిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. సీతకు పెండ్లికి ముందర
    వాతపు పులకరమువచ్చి వైద్యుని గోర
    న్నాతడొసగు మందో మా
    కో తిని బెండ్లాడి నాతి కొమరుని బడసెన్!!!

    రిప్లయితొలగించండి
  23. నాతి యొకతి మిక్కిలి సం
    ప్రీతిని తా వలచి నట్టి ప్రియవరు కుమతిన్
    భీతలు చేష్టలుగల యొక
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడిసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      భర్తలు...?

      తొలగించండి
    2. టాబ్‍లో టైప్ చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటు... భర్తలు కాదు... భీతలు...?

      తొలగించండి
  24. ఈ తరము వారి చేష్టలు
    తాతల కాలంబు నాడు తలచిరె యిటుల
    న్జేతలు దిగువవి జూడుము
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడసెన్

    రిప్లయితొలగించండి
  25. సుకవిమిత్రులకు....నమస్సులు.

    ఈరోజు శంకరజయంతి.....శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరమహాస్వామి వారి చరణకమలములకు నమస్కరిస్తూ......

    నడిచెడి దైవమై బరగి నాల్గు జెఱంగుల బాదచారియై
    నడిచెను భారతావనిని, నవ్యత నిండిన భావవీధిలో
    బొడిచిన సర్వ శాస్త్ర మత పూర్ణ వికాస
    పరిజ్ఞతన్ సదా
    గడిపెను పూర్ణజీవిత సుగంధము బంచి
    యనంత దీప్తితో!

    రిప్లయితొలగించండి
  26. పాతివ్రత్య గరిమమది
    వీతము గాక ననిలాంశ వీరుని హనుమన్
    ధాతృవర ప్రసాదమునం
    గోతిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమంతుడనే కొమరుని గన్న వృత్తాంతంతో మీ పూరణ ప్రసస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  27. అంబటి భానుప్రకాశ్,
    గద్వాల.
    కం**
    కోతల వంశపు వరుడిని,
    చేతల రాయుని కొమరిత చేరగ దెలిసెన్ !
    జాతకము జూచి వధువే,
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడెసెన్ !!

    రిప్లయితొలగించండి
  28. పిన్నక నాగేశ్వరరావు. తెనాలి.

    కోతిగ చేష్టలు చేయుచు
    ప్రీతిగ మాట్లాడు బావ ప్రేమను పొందెన్
    మాతను కాదని తుదకా
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోతి చేష్టల బావను పెళ్ళాడిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. రాతలు కోతల తోనే
    యీతని చేబట్ట దలచి తేనని యనుచున్
    చూత ఫలమ్ముల నెందుల
    కో తిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

    రిప్లయితొలగించండి
  30. శ్రీ శంకరయ్య గురువరులకు నమస్కారములు
    భర్తలు ....?అన్నారు అర్థము కాలేదు

    రిప్లయితొలగించండి
  31. నేను కూడా గమనించ లేదు భీతిలు టైపింగులో భీతలు అయినది ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  32. అది టైపాటు... భర్తలు కాదు... ‘భీతలు’...?

    రిప్లయితొలగించండి
  33. .దాతైన నేతకొడుకే
    కోతను బిరుదాంకితుండు కోతల పలుకే
    చేతలు గనుపించని దా
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడసెన్|
    2.రాతిరి సినిమానుజూడ?రాక్షసుడొకడట మారి
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడసేన్ విచిత్ర
    రీతిగ మాయలెరుగుచు రివ్వున మారి బోవుచును
    నీతి నియమము లొదలుచు నేతలట్లుగజూచు టాయె|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘దాత+ఐన, కోతి+అను’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
      రెండవ పూరణలో ‘వదలుచు’ను ‘ఒదలుచు’ అన్నారు.

      తొలగించండి
  34. చేతలు గాంచిన వానర
    రీతిన యల్లరిని చేయు రేవంతనువా
    డేతన ప్రియుండనుచు నా
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రీతిని నల్లరిని...’ అనండి.

      తొలగించండి
  35. త్రేతను వరమిడే రాముడు
    "కోతులు నరులుగ జనింప క్షోణిని,కలి,నా
    రీతిని నరుడై పుట్టిన
    కోతిని పెండ్లాడి నాతి కొమరుని బదసేన్

    రిప్లయితొలగించండి
  36. ప్రాత:కాలమునందున
    భూతిర్మయలేపనమును పొందుగనిడగాన్
    ప్రీతిగ తను మందో మా
    కో తిని బెండ్లాడి నాతి కొమరుని బడసెన్.

    గురుదేవులకు శ్రీ శంకరజయంతి పర్వదిన శుభాకాంక్షలు.

    అద్వైతామృత ధార బంచెను జగద్వ్యాప్తంబుగా ధీరుఁడై
    విద్వత్ప్రౌఢిమఁ జూపుచున్ జనుల సద్విజ్ఞానమున్ బెంచుచున్
    సద్వైరాగ్య విచారభావనల తేజ:పూర్ణుఁడై దివ్య మో
    క్ష ద్వారంబును జూపు "శంకరుల"కున్ కైమోడ్పులర్పించెదన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది.
      దుష్కరప్రాసతో శంకరులపై మీరు వ్రాసిన శార్దూలం అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. సంపత్ కుమార్ శాస్త్రి గారు శంకర భగవత్పాదుల జ్ఞానాంబుధితరంగజలార్ద్రమానసమ్ము తో జేసిన మీ శంకరాచార్యస్తుతి అద్వితీయము. అద్భుతము. మీకు నా అభినందనలు.

      తొలగించండి
    3. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      శ్రీ శంకరజయంతి నాడు మంచి పద్యమందించారు - ధన్యవాదములు.

      తొలగించండి
    4. గురుదేవులకు నమస్కారములు. ధన్యోస్మి.

      శ్రీకామేశ్వర రావుగారికి మరియు ఊకదంపుడు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ధన్యుడను.

      తొలగించండి
  37. పాత నుడువె గద "వందల
    కోతుల సరి బ్రహ్మచారి కువలయము" ననన్
    బ్రీతిఁ జపలతఁ దగ నణచి
    కోతిని బెండ్లాడి నాతి కొమరుని బడసెన్.

    రిప్లయితొలగించండి

  38. నమస్తే అన్నయ్యగారూ మొదటిపాదం సవరించాను.సరిపోతుందేమో చూడండి.
    3.వాతుని పొందును కోరుచు
    నాతుర పడుచును మనమున నంజనియును తా
    ప్రీతిన్ కేసరిఁ జేరుచుఁ
    గోతిని బెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.

    రిప్లయితొలగించండి
  39. Sk 2030 . 17
    ప్రీతియె బిస్కెట్టు తనకు
    చేతిన దానిని బట్టుక చెలువము మీరన్ఠ
    ఖ్యాతింబొందిన ,"మొనా
    కో" తిని పెండ్లాడి నాతి కొమరుని బడసెన్.
    గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది మీ పూరణ.
      ‘చెలువము మీరన్’ అన్నచోట టైపాటు... మూడవపాదంలో గణదోషం. ‘ఖ్యాతిం గనినట్టి మొనా...’ అనండి.

      తొలగించండి
  40. కోతీ బావ యటంచును
    సీతాపతి తోడ నాడి చిన్నతనమునన్
    ఖ్యాతినిబొంద పిదప నా
    కోతిని పెండ్లాడి నాతి కొడుకును బడసెన్

    రిప్లయితొలగించండి
  41. అయుతకవిసమ్మేళనః��sk2020��సందిత��క!సంఖ్య:47��కం!!సీతకు ఋతుదోషంబనఁ భీతిలి సంతతినిబొంద వేగిర పడి తాన్ తాతనడిగిమందో మా కోతిని బెండ్లాడి నాతి కొమరుని బడసెన్ !!��సందిత బెంగుళూరు��

    రిప్లయితొలగించండి
  42. అయుతకవిసమ్మేళనః��sk2020��సందిత��క!సంఖ్య:47��కం!!సీతకు ఋతుదోషంబనఁ భీతిలి సంతతినిబొంద వేగిర పడి తాన్ తాతనడిగిమందో మా కోతిని బెండ్లాడి నాతి కొమరుని బడసెన్ !!��సందిత బెంగుళూరు��

    రిప్లయితొలగించండి
  43. అయుతకవిసమ్మేళనః��sk2020��సందిత��క!సంఖ్య:47��కం!!సీతకు ఋతుదోషంబనఁ భీతిలి సంతతినిబొంద వేగిర పడి తాన్ తాతనడిగిమందో మా కోతిని బెండ్లాడి నాతి కొమరుని బడసెన్ !!��సందిత బెంగుళూరు��

    రిప్లయితొలగించండి
  44. రాజకీయ తతంగములు: 👇

    తాతల కాలము నుండియు
    కోతుల నాతుల కొమరులు కోతులె కాగా
    రీతిని వీడక తానొక
    కోతిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్

    రిప్లయితొలగించండి