5, మే 2016, గురువారం

సమస్య - 2024 (అక్కను ప్రేమించి పెండ్లి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

73 కామెంట్‌లు:

  1. చుక్కల వారింటి పేరట
    మిక్కిలిగా నచ్చె నంచు మీరిన ప్రేమ
    న్నెక్కువ కట్నము వలదని
    యక్కను ప్రేమించి పెండ్లి యాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      బాగుంది. ఇంతకూ ఎవరి అక్కను?
      మొదటిపాదంలో గణదోషం. ‘చుక్కలవారింటి పడుచు’ అందామా?

      తొలగించండి
    2. ‘...కట్న ముడిగి రా|మక్కను...’ అందామా?

      తొలగించండి
  2. చక్కని చిన్నది వనమున
    మక్కువ కల్గించి వేణు మనసును దోచన్
    చిక్కిన మనోహర సుశీ
    లక్కను ప్రేమించి పెండ్లి యాడె ముదమునన్

    రిప్లయితొలగించండి

  3. నిక్కముగ మాయదృష్టమె
    దక్కుట మా బావ మాకు తనకే కట్న
    మ్మక్కరలేదనుచున్ మా
    యక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

    రిప్లయితొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    మక్కువ మీఱఁగ నొక్కఁడు
    ప్రక్కనఁ గల యింట నున్న పడుచుం, గనఁగన్
    జక్కని చుక్కయు నగు స

    మ్మక్కనుఁ బ్రేమించి, పెండ్లియాడె ముదమునన్!

    రిప్లయితొలగించండి
  5. చక్కని రూపంబలరుచు
    మక్కువతో వారిరువురి మనసులు గలువం
    దక్కొని యాతడు జని రా
    మక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!

    తక్కొను-పూనుకొను

    రిప్లయితొలగించండి
  6. చక్కని రూపంబలరుచు
    మక్కువతో వారిరువురి మనసులు గలువం
    దక్కొని యాతడు జని రా
    మక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!

    తక్కొను-పూనుకొను

    రిప్లయితొలగించండి
  7. మక్కువ తోడను బావయు
    పక్కింట నివాస మున్న పడతిని కనగన్
    టక్కున మోహించి యాసీ
    తక్కను ప్రేమించి పెండ్లి యాడె ముదమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతక్కతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘టక్కున వలచియు యా సీ...’ అనండి.

      తొలగించండి
  8. చక్కని మోమును గల్గియు
    చిక్కని నవ్వులు విసరగ చిన్నది ఇంపై
    మిక్కుట వలపుచె యాదే
    వక్కనుఁబ్రేమించి పెండ్లి యాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేవక్కతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మిక్కుటమగు వలపున దే...’ అనండి.

      తొలగించండి
    2. ‘మిక్కుట వలపు’ అనరాదు. ‘మిక్కుటపు వలపు/ మిక్కుటమగు వలపు’ అనాలి.

      తొలగించండి
  9. తిక్కన బక్కన మిత్రులు
    బక్కన కొక యక్క గలదు బంగరు బొమ్మే
    తిక్కన మనమున బక్కన
    యక్కను బ్రేమించి పెండ్లియాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
  10. చక్కని తనక్క లక్ష్మిని
    నక్కగ తప్పించుకొంటు చిత్రము చూపెన్
    చిక్కిన తనభావేతన
    అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

    నమస్సులతో
    గోగులపాటి కృష్ణమోహన్

    రిప్లయితొలగించండి
  11. చక్కని తనక్క లక్ష్మిని
    నక్కగ తప్పించుకొంటు చిత్రము చూపెన్
    చిక్కిన తనభావేతన
    అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

    నమస్సులతో
    గోగులపాటి కృష్ణమోహన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తన+అక్క’ అన్నపుడు సంధి లేదు. తన యక్క... అని యడాగమం వస్తుంది. రెండవపాదంలో యతి తప్పింది. బావను భావ.. అన్నారు.

      తొలగించండి
  12. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    చక్కని మాధవి పెద్దది .

    ప్రక్కన రఘు చిన్నవాడు. ప్రణయపుజాఢ్య౦

    బెక్కగ. " అక్కా " యనుచునె

    అక్కను ప్రేమి౦చి పె౦డ్లి యాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
  13. 🌺🙏🙏🌺

    అంబటి భానుప్రకాశ్.
    🌹🙏🌹

    కం**
    మక్కువ మీరగ నాహరి,
    యక్కజ మగునట్టిపద్మ హాసిని గనియే,
    చక్కని చుక్కయె,చంద్రుని
    అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదంబునన్ !!


    🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అవునూ... ఒక సందేహం చంద్రునికి అక్ష్మి అక్క అవుతుందా? చెల్లెలా?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పాలసముద్రము నుండి ముందు చంద్రుడే పుట్టాడు.ఆ తర్వాత లక్ష్మీదేవి. అందుచేత లక్స్మీ దేవికి అన్నయ్యే.
      నా "నవగ్రహస్తోత్రము"లో తదనుగుణముగా "గమలాగ్రజున్" అని సవరణ చేయుచున్నాను.

      తొలగించండి
  14. రిప్లయిలు

    1. ప్రక్కింటి సుందరిం గని
      చిక్కి మరుని తాపమునకు క్షేమ మరసి తా
      జక్క ననిపి యత్తింటికి
      నక్కను, ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ అత్తింటికి పంపింది సుందరి అక్కనా? తన అక్కనా?

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “తా జక్క ననిపి యత్తింటికి
      నక్కను,” తనయక్కనే నండి.

      తొలగించండి
  15. "ఎక్కిడి శివ ధనువు విరిచి,
    అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్
    చక్కని మా బావ" యనుచు
    ఉక్కిరి బిక్కిరి యగుచును నూర్మిళ బలికెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
      నమస్కారం! బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ వైవిద్యంగా ఉండి ఆనందాన్ని కలుగజేసింది. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
  16. అక్కరకు వచ్చె చుట్టము
    మొక్కిన వరమిచ్చె నేమొ మురహరి, తానే
    గక్కున వచ్చె మాబా
    వక్కను ప్రేమించి పెండ్లి యాడెముదమునన్

    రిప్లయితొలగించండి
  17. అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.
    మిక్కిలి సంపద గలవా
    డొక్కడు సద్గుణుడు మిగుల నున్నత మదితో
    నిక్కము కట్నము లేక పే
    దక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఉన్నత మది’ అని సమాసం చేయరాదు. ‘మిగుల నొప్పెడి మదితో’ అనండి. మూడవపాదంలో గణదోషం. ‘నిక్కము కట్న మిడని పే...’ అనండి.

      తొలగించండి
  18. అక్కట! పెండిలి జూపుల
    నొక్కడు చెల్లియను జూచునో యని చనగా
    అక్కజముగ విధవనయిన
    అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మజ్జారి చెన్నకేశవులు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘విధవ యయిన’ అనండి.

      తొలగించండి
  19. చిక్కని జడలను దాల్చెను
    అక్కను.ప్రేమింఛి ప్ండ్లియాడె ముదమునన్
    చక్కని చుక్కగు గిరిజను
    ముక్కంటి ఘనుడగు ముగురు మూర్తుల లోనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది. కాని పూరణలో ‘ఎవరి అక్కను’? ‘దాలిచి యక్కను’ అనండి. విసంధిగా వ్రాయరాదు కదా!

      తొలగించండి
    2. `గురుదేవులకు నమస్కారములు "అక్క"అనిన పదమును "స్త్రీ"యన్న అర్ధములో నుపయోగించితిని.పరమశివుడు తనజడలలో స్త్రీని దాల్చి, ప్రేమించి గిరిజను పెండ్లాడి
      బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఘనత సాధించి నాడని నాభావన విసంధి దోషమును
      నీవిధముగా సవరించెదను సవరించిన పద్యము
      చిక్కని జడలను దాల్చెను,
      యక్కను.ప్రేమింఛి ప్ండ్లియాడె ముదమునన్
      చక్కని చుక్కగు గిరిజను
      ముక్కంటి ఘనుడగు ముగురు మూర్తుల లోనన్

      తొలగించండి
  20. . చక్కటి మక్కువచెక్కిలి
    అక్కసునన్ ముద్దులుంచి-ననురాగంబున్
    దిక్కనినమ్మిన రామున్
    డక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘రామున్ డక్కను’? రాముడు అక్కను ప్రేమించాడా? ఎవరి అక్కను? ‘ముద్దులుంచి యనురాగమునన్’ అనండి.

      తొలగించండి
  21. ఒక్కనికిద్దరు భార్యలు
    ఒక్కరికి సుతయెగాగ మరొకరికి సుతుడౌ
    చక్కగ పెద్దమ్మ సుతను
    యక్కను బ్రేమించి పెండ్లియాడె ముదమునన్
    (మహమ్మదీయ మతంలో ఈ పద్ధతి ఉంది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిజమే... ఆ సంప్రదాయం వారిలో ఉందని విన్నాను. మీ పద్యానికి నా సవరణ...

      ఒక్కని కిద్దరు సతు లం
      దొక్కరికి సుతయె గలుగ మరొకరికి సుతుడౌ
      చక్కగ పెద్దమ సుత యా
      యక్కను బ్రేమించి పెండ్లియాడె ముదమునన్

      తొలగించండి
  22. చక్కని రూపసి యొక్కడు
    మక్కువతో మనసు గెలిచి మహవేడుకతో
    నొక్కుల జుట్టున్న సుశీ
    లక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుశీలక్కతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మహవేడుక’ అనడం సాధువు కాదు.

      తొలగించండి
  23. చక్కనిదని విక్టరొకడు
    పిక్కల నూపుచు వణకుచు బిగివలువల కై
    పెక్కిన డిస్కో జేమ్స్పె
    దక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవసరానికి అన్యదేశ్యాలను వాడినా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఇలా అనండి...బాగుంటుంది...

      "...డిస్కో జేమ్స్ పె
      ద్దక్కను...."

      తొలగించండి
  24. మక్కువ తోజూ తును మా
    య క్కను, బ్రేమించి పెండ్లి యాడె ముదమున
    న్జక్కని వాడగు సోముని
    చ క్కందన మునకు మెచ్చి సరసపు రీతిన్

    రిప్లయితొలగించండి
  25. గుమ్మా నాగమంజరి గారి పూరణ....

    పెక్కురు పిల్లలు చావఁగ
    దక్కిన యా సుతకు అక్కదయ పేరిడినన్
    మక్కువ మీర నొక వరుం
    డక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

    రిప్లయితొలగించండి
  26. చేపూరి శ్రీరామారావు గారి పూరణ...

    అక్క తన తమ్మునొకనిని
    చక్కగజదివించిసాదిచూపుచు ప్రేమన్
    చక్కనితనకూతురునిడ
    అక్కను ప్రేమించి, పెండ్లియాడెముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సాది’ అన్నదానిని ‘పెంచి’ అనండి.

      తొలగించండి
  27. చెన్నకేశవ, రాయచోటి గారి పూరణ....

    అక్కట! పెండిలి జూపుల
    నొక్కడు చెల్లియను జూచునో యని చనగా
    అక్కజముగ విధవ యయిన
    అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
  28. అమరవాది రాజశేఖర శర్మ గారి పూరణ...

    ఇక్కడ తన చెల్లెలితో
    చక్కగ ప్రేమాయణంబు సలిపితి గనివా
    డక్కడ మక్కువ తో నా
    అక్కను ప్రేమించి పెండ్లి యాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
  29. చక్కనిదౌ తమ జంటను
    నొక్కటి జేయఁ దపియించి యూతము నీయన్
    దక్కిన చెలికానిన్ గని
    యక్కను ప్రేమించి, పెండ్లియాడె ముదమునన్!

    రిప్లయితొలగించండి
  30. చక్కని చుక్కట నోరగ
    మక్కువతోడను వలపును మంచిగ చూపన్
    నిక్కంబనుకొని యాసు
    మ్మక్కను ప్రేమించి పెండ్లయాడె ముదమునన్.

    రిప్లయితొలగించండి
  31. రొక్కము కోరుచు నాతడు
    చక్కగ నేర్పెను గురువుగ చదువుల నెన్నో!
    మిక్కిలి ప్రియమగు శిష్యుని
    అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!

    రిప్లయితొలగించండి
  32. చిన్న మార్పుతో మరొక పద్యం,

    రొక్కము కోరుచు నొక్కడు
    చక్కగ నేర్పెను గురువుగ చదువుల నెన్నో!
    మిక్కిలి ప్రియమగు శిష్యుని
    అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!

    రిప్లయితొలగించండి
  33. మరొక పద్యం,
    మక్కువ తోడ గిరీశము
    చక్కగ నాంగ్లము నుడివెడు చందమునన్ తా
    గ్రక్కున ప్రియతమ శిష్యుని
    అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!

    రిప్లయితొలగించండి
  34. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    చక్కని మాధవి పెద్దది .

    ప్రక్కన రఘు చిన్నవాడు. ప్రణయపుజాఢ్య౦

    బెక్కగ. " అక్కా " యనుచునె

    అక్కను ప్రేమి౦చి పె౦డ్లి యాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
  35. అక్కట నొకటే కన్నని
    మిక్కిలి బాధను బడు నొక మీనాక్షిని తా
    మక్కువమీరగ నొకటగు
    న "క్కను" బ్రేమి౦చి పె౦డ్లి యాడె ముదమునన్.

    రిప్లయితొలగించండి
  36. మిక్కుటముగ రోదించెడు
    చుక్కను గనియా యువకుడు సులలిత ధ్వనితో
    మక్కువ జూపుచు తాభా
    నక్కను బ్రేమించి పెండ్లయాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
  37. హైదరబాదీయం: 👇

    చక్కగ నూరుము కత్తిని
    చిక్కెనుగా నేడు మనకు చెప్పిన వినకే
    ధిక్కరిలుచు మనలను నీ
    యక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!

    రిప్లయితొలగించండి