చల్లని మజ్జిగ వేసవి నుల్లము రంజిల్లు రీతి నూరట గలుగున్ తల్లిని మించిన మేలట పిల్లల కైనను మిగుల ప్రీతి నొసంగున్
అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు.మూడవపాదంలో గణదోషం. ‘పిల్లలు పెద్దలకు నైన ప్రీతి...’ అనండి.
చల్లని మజ్జిగ వేసవి నుల్లము రంజిల్లు రీతి నూరట గలుగున్ తల్లిని మించిన మేలట పిల్లలు పెద్దలకు నైన ప్రీతి నొసంగున్
ఎండాకాలము నందున దండిగ నెండలు మనుజుల దహియించంగన్ కుండల లోనిడు మజ్జిగపండుగ మరిపించు సతము పథముల లోనన్
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఎండలు మండెడి వేళలకుండల నిండుగను నింపు కొందురు యింటన్మెండుగ చల్లను ద్రావగరండహొ! యిది దొరకు నిపుడు రహదారులలో!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘నింపుకొందురు+ఇంటన్=నింపుకొందు రింటన్’ అవుతుంది. యడాగమం రాదు. ‘నింపుకొని గృహములలో’ అనండి.
అల్లము కొతిమెరయు నందముగాకల్పిత్రాగ చలువ కల్గుతాప ముడుగుయెండ వేడినణచు నిలనుమజ్జిగ సరిసాటి యైనదేది చల్ల దప్ప.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.సరి, సాటి అని పునరుక్తి అయింది. ‘మజ్జిగకును|సాటి...’ అనండి.
వాము, కొతిమీర, యుప్పును వలయగనిడినిమ్మ రస మల్లమును గల్ప, కమ్మదనమునెగయు చుండెడి మజ్జిగ నిచ్చగించిపానమందగ నెండల, ఫలము మెండు!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘...యుప్పును వలయునంత...’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
2.కుండను మజ్జిగ చూడగమెండుగ త్రాగంగ తమియు ముందుగ కలిగెన్దండిగ చలువను కూర్చుచునిండుగ తృప్తియు నొసగును నిజమిది దలపన్.3.మండుటెండ లోన మజ్జిగ కుండను గాంచగానె రసన కాశ కల్గుత్రాగవలయు ననెడి తమియు హెచ్చుచు నుండు పొగడ శక్య మౌనె పుడమి యందు.
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యం రెండవ పాదంలో యతిభంగ మయినది. సరిచేయగలరు.
‘తమియు మిక్కుట మాయెన్’ అంటే ఎలా ఉంటుంది?
మండుటెండలోన మధ్యాహ్న సమయానగొంతు పిడచగట్టి కోరునేమి?మణులు వజ్రములను మందు విందులు కాదుమట్టికుండలోన మజ్జిగేను॥
సర్వారిష్ట విముక్త మఖర్వ పిపాసా వినాశ కారిష్ట మటన్పర్వది నాగంతక జనపర్వానందాతిశయ సుఫల దాయకమున్[అరిష్టము = కీడు, మజ్జిగ; పర్వము = పండుగ, సమూహము]
మండు వేసవిలో చల్లని మజ్జిగవంటి అమోఘమైన పద్యం. అభినందనలు.
"వినాశ కమరిష్ట మటన్" అని సవరణ
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అఖండయతిని సవరించితిని.
అఖండయతి విషయంలో నాకు పట్టింపులు లేవు. కాకపోతే నేను నా పద్యాలలో ఎప్పుడూ ప్రయోగించను. (అయినా ఈ మధ్య నేను వ్రాసిన పద్యంలో అఖండయతి పడింది.). అసంకల్పితంగా జరుగుతూ ఉంటాయి.. ఎవరైనా ప్రయోగిస్తే అభ్యంతరం చెప్పను.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీవివరణకు కృతజ్ఞత లండి.
ముజ్జగముల యందు మజ్జిగ మేలనుచెల్ల జనసమూహ మిలను చక్కగ కొతిమెరజిలకరయు కూర్మితో కలిపినద్రవము లేదటంచు త్రాగు చుంద్రు
మీ మూడవ పద్యం బాగుంది కాని కొన్ని లోపాలు. ‘మేలనుచు నెల్ల’ అనడం సాధువు. ‘మేలని యెల్ల’ అనండి. రెండవపాదం చివర గణదోషం. ‘...మిలను జక్కఁ| గొతిమెర...’ అనండి.
అంబటి భానుప్రకాశ్.గద్వాల.చిత్రానికి తగిన పద్యం.కడుపు చల్ల గుండ కలిగించు సౌఖ్యంబు,తనువు హాయి గుండ త్రాగు మెపుడు !నెండ వేడి నుండి నిక్కము గాపాడు,నింట నుండె చల్ల నిచ్చు సుఖము. !!***
ఎండ కాలము లోనను గుండె లదురు మండు టెండల బాధను మాన్పుటకును చల్లగా కుండలోనున్న చల్ల గొనిన చల్లబడు నాత్మ దేహము చల్ల బడును
మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘చల్లబడు’ పునరుక్త మయింది కదా! ‘సౌఖ్యపడు నాత్మ దేహము చల్లబడును’ అంటే ఎలా ఉంటుంది.
. పాలను బుట్టిన మజ్జిగపాలకులకు వేసవందు పనిగల్పించెన్తేలికగా జీర్ణంబైజాలిగ నుష్ణమును గూల్చి చలువను జేర్చున్.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘వేసవి+అందు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘పాలకులకు నెండలందు’ అందామా?
మండుటెండ వలన ఎండెను నాలుకకుండ లోని చల్ల కొంచమైనత్రాగ పోయినట్టి త్రాణ మరలి వచ్చుచల్ల కుండలెపుడు చల్లగుండ
కొత్తి మీరియు కరివేప కూడి యుండి యల్లమును జేర్చి యచ్చట యుల్ల మలర తేట మజ్జిగ గనబడె ,దెరువరులకు దప్పి దీ ర్చను బెట్టిరి దాత లార్య !
మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘...యచ్చట నుల్ల మలర...’ అనండి.
తరగిన కరివేపయు కొతిమిర జేరిచి జీలకర్ర మెత్తటి పొడుమున్సరి తిరగమాత పెట్టగహరి హరులా మజ్జిగన్న నావురుమనరే!
కుండల నిండిన మజ్జిగయెండలఁ బని జేయు వారి కిచ్చును హాయిన్గుండెల నిండును ధైర్యమునుండక వడదెబ్బ బాధ నూపిరి నిలువన్!
కూలుడ్రింకు కన్న కూలుగా నుండునుజీలకర్ర వలన జీర్ణమగునుపోపు నిడుచు తాగ పులకింత కలిగేనుహానికరము కాదు హాయి నొసగు.
పోపు వేసిన మజ్జిగ మీకెంతో ఇష్టమనుకుంటాను. (నాకు కూడా!). పద్యం బాగుంది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,శీతల య౦త్రాన శీతల మైనట్టి . . యుదకమున్ ద్రావిన నుష్ణ మగునురకరకములయిన. ర౦గు పానీయముల్. . ద్రోహ మొనర్చు నారోగ్యమునకుమృత్పాత్ర య౦దున మీగడ దేలిన. . నా తక్ర సార మత్య౦త హితమునిమ్మరసమ్మును కమ్మని కొతిమీర. . యొనగూర్చు మనకు దేహోపకృతినిపూర్వకాలపు టలవాట్లు పుష్టి కరమునేటి య౦త్రపు టలవాట్లు నీరసదముమోస మగు ప్రకటనల లో మునిగి పోయిహాని కలిగి౦చు కొనకు దేహమున కీవు { మృత్ + పాత్ర = మట్టి కు౦డ ; తక్రము = మజ్జిగ ; }
‘తక్రము’ శబ్దాన్ని ఎవరు ప్రయోగిస్తారా అని చూస్తున్నా... మీరు ఉపయోగించారు. మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
చల్లగ దాహము దీర్చుచుయుల్లము రంజింప జేయు నూష్మకమందున్యెల్లరకును మేలొసగెడు చల్లను సేవించ వలయు సజ్జనులారా!!!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘...దీర్చుచు|నుల్లము... నూష్మకమున మీ|కెల్లరకును...’ అనండి.
ధన్యవాదములు గురువుగారు...చల్లగ దాహము దీర్చుచునుల్లము రంజింప జేయు నూష్మకమున మీకెల్లరకును మేలొసగెడు చల్లను సేవించ వలయు సజ్జనులారా!!!
తెల్లటి మజ్జిగ ద్రాగినఉల్లమునుత్చాహ బరచుయూహల రీతిన్అల్లము,కొతిమిర జేరినకల్లోలపు వేడి మాన్పు కలలో నైనన్.3.పలుచటి మజ్జిగే “బ్రతుకు బాటకుదారిగ జూపు బీదకున్కలుపగ కొత్తిమీర మనకంటికి వొంటికిమంచి జేర్చుచున్విలువగు పోషకాలునిడి వేడిమి మాన్పెడి నౌషదంబుగాదలతురులోకు లెల్లరును” ధర్మము జేతురుమజ్జి గున్నచో|
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యంలో ‘కంటికి నొంటికి...పోషకాల నిడి..’ అనండి.
కొత్తిమిరయు నుప్పు క్రొత్త రుచుల నిడనీరు మజ్జిగగును నిమ్మ కూడి,ఓగిరమ్మె కాదు ఓషధమ్మగుచుండు చల్ల బరచు చుండు చల్ల యెపుడు!
గురువు గారికి నమస్కారములు. ‘చుండు’ పునర్యుక్తి అయినందునమూడవ పాదంలొ చిన్న సవరణతో వ్రాసిన ఈ పూరణను చూడ గోరుతాను.ధన్యవాదములు. శ్రీధర రావు.కొత్తిమిరయు నుప్పు క్రొత్త రుచుల నిడనీరు మజ్జిగగును నిమ్మ కూడి,ఓగిరమ్మె కాదు ఓషధమ్ము వలెను చల్ల బరచు చుండు చల్ల యెపుడు!
తెల్లని మజ్జిగ లోనన్ చల్లగ కరివేప మిర్చి సరికొతిమేరన్ చల్లని చల్లగ మారును చల్లగ నీకడుపునుంచు "సన్ స్ట్రోక్" బడకన్.
గురువుగారు దోష సూచనకు ధన్యవాదాలు సవరిస్తాను
తిండి జీర్ణ మవక తేన్పులధిక మయ్యె మంచిమందు యన్న మజ్జిగేనువామును పొడిచేసి వైనముగా కల్పిచల్లతాగు చున్న సర్దు కొనును.
అన్నా! భాగ్యనగరమున:👇చస్తూ బ్రతుకుతు నీవిక కుస్తీ పట్టంగ నేల కుండల తోడన్రస్తా లన్నిట దొరకుచు సుస్తీ లన్నిటిని బాపి సుఖమిడు మస్తీ!
చల్లని మజ్జిగ వేసవి
రిప్లయితొలగించండినుల్లము రంజిల్లు రీతి నూరట గలుగున్
తల్లిని మించిన మేలట
పిల్లల కైనను మిగుల ప్రీతి నొసంగున్
అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘పిల్లలు పెద్దలకు నైన ప్రీతి...’ అనండి.
చల్లని మజ్జిగ వేసవి
తొలగించండినుల్లము రంజిల్లు రీతి నూరట గలుగున్
తల్లిని మించిన మేలట
పిల్లలు పెద్దలకు నైన ప్రీతి నొసంగున్
ఎండాకాలము నందున
రిప్లయితొలగించండిదండిగ నెండలు మనుజుల దహియించంగన్
కుండల లోనిడు మజ్జిగ
పండుగ మరిపించు సతము పథముల లోనన్
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎండలు మండెడి వేళల
రిప్లయితొలగించండికుండల నిండుగను నింపు కొందురు యింటన్
మెండుగ చల్లను ద్రావగ
రండహొ! యిది దొరకు నిపుడు రహదారులలో!
ఎండలు మండెడి వేళల
రిప్లయితొలగించండికుండల నిండుగను నింపు కొందురు యింటన్
మెండుగ చల్లను ద్రావగ
రండహొ! యిది దొరకు నిపుడు రహదారులలో!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘నింపుకొందురు+ఇంటన్=నింపుకొందు రింటన్’ అవుతుంది. యడాగమం రాదు. ‘నింపుకొని గృహములలో’ అనండి.
అల్లము కొతిమెరయు నందముగాకల్పి
రిప్లయితొలగించండిత్రాగ చలువ కల్గుతాప ముడుగు
యెండ వేడినణచు నిలనుమజ్జిగ సరి
సాటి యైనదేది చల్ల దప్ప.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరి, సాటి అని పునరుక్తి అయింది. ‘మజ్జిగకును|సాటి...’ అనండి.
వాము, కొతిమీర, యుప్పును వలయగనిడి
రిప్లయితొలగించండినిమ్మ రస మల్లమును గల్ప, కమ్మదనము
నెగయు చుండెడి మజ్జిగ నిచ్చగించి
పానమందగ నెండల, ఫలము మెండు!
వాము, కొతిమీర, యుప్పును వలయగనిడి
రిప్లయితొలగించండినిమ్మ రస మల్లమును గల్ప, కమ్మదనము
నెగయు చుండెడి మజ్జిగ నిచ్చగించి
పానమందగ నెండల, ఫలము మెండు!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘...యుప్పును వలయునంత...’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి2.కుండను మజ్జిగ చూడగ
మెండుగ త్రాగంగ తమియు ముందుగ కలిగెన్
దండిగ చలువను కూర్చుచు
నిండుగ తృప్తియు నొసగును నిజమిది దలపన్.
3.మండుటెండ లోన మజ్జిగ కుండను
గాంచగానె రసన కాశ కల్గు
త్రాగవలయు ననెడి తమియు హెచ్చుచు నుండు
పొగడ శక్య మౌనె పుడమి యందు.
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పద్యం రెండవ పాదంలో యతిభంగ మయినది. సరిచేయగలరు.
తొలగించండి‘తమియు మిక్కుట మాయెన్’ అంటే ఎలా ఉంటుంది?
తొలగించండిమండుటెండలోన మధ్యాహ్న సమయాన
రిప్లయితొలగించండిగొంతు పిడచగట్టి కోరునేమి?
మణులు వజ్రములను మందు విందులు కాదు
మట్టికుండలోన మజ్జిగేను॥
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిసర్వారిష్ట విముక్త మ
రిప్లయితొలగించండిఖర్వ పిపాసా వినాశ కారిష్ట మటన్
పర్వది నాగంతక జన
పర్వానందాతిశయ సుఫల దాయకమున్
[అరిష్టము = కీడు, మజ్జిగ; పర్వము = పండుగ, సమూహము]
మండు వేసవిలో చల్లని మజ్జిగవంటి అమోఘమైన పద్యం. అభినందనలు.
తొలగించండి"వినాశ కమరిష్ట మటన్" అని సవరణ
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అఖండయతిని సవరించితిని.
తొలగించండిఅఖండయతి విషయంలో నాకు పట్టింపులు లేవు. కాకపోతే నేను నా పద్యాలలో ఎప్పుడూ ప్రయోగించను. (అయినా ఈ మధ్య నేను వ్రాసిన పద్యంలో అఖండయతి పడింది.). అసంకల్పితంగా జరుగుతూ ఉంటాయి.. ఎవరైనా ప్రయోగిస్తే అభ్యంతరం చెప్పను.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీవివరణకు కృతజ్ఞత లండి.
తొలగించండిముజ్జగముల యందు మజ్జిగ మేలను
రిప్లయితొలగించండిచెల్ల జనసమూహ మిలను చక్కగ
కొతిమెరజిలకరయు కూర్మితో కలిపిన
ద్రవము లేదటంచు త్రాగు చుంద్రు
మీ మూడవ పద్యం బాగుంది కాని కొన్ని లోపాలు.
తొలగించండి‘మేలనుచు నెల్ల’ అనడం సాధువు. ‘మేలని యెల్ల’ అనండి. రెండవపాదం చివర గణదోషం. ‘...మిలను జక్కఁ| గొతిమెర...’ అనండి.
అంబటి భానుప్రకాశ్.
రిప్లయితొలగించండిగద్వాల.
చిత్రానికి తగిన పద్యం.
కడుపు చల్ల గుండ కలిగించు సౌఖ్యంబు,
తనువు హాయి గుండ త్రాగు మెపుడు !
నెండ వేడి నుండి నిక్కము గాపాడు,
నింట నుండె చల్ల నిచ్చు సుఖము. !!
***
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎండ కాలము లోనను గుండె లదురు
రిప్లయితొలగించండిమండు టెండల బాధను మాన్పుటకును
చల్లగా కుండలోనున్న చల్ల గొనిన
చల్లబడు నాత్మ దేహము చల్ల బడును
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘చల్లబడు’ పునరుక్త మయింది కదా! ‘సౌఖ్యపడు నాత్మ దేహము చల్లబడును’ అంటే ఎలా ఉంటుంది.
. పాలను బుట్టిన మజ్జిగ
రిప్లయితొలగించండిపాలకులకు వేసవందు పనిగల్పించెన్
తేలికగా జీర్ణంబై
జాలిగ నుష్ణమును గూల్చి చలువను జేర్చున్.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘వేసవి+అందు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘పాలకులకు నెండలందు’ అందామా?
మండుటెండ వలన ఎండెను నాలుక
రిప్లయితొలగించండికుండ లోని చల్ల కొంచమైన
త్రాగ పోయినట్టి త్రాణ మరలి వచ్చు
చల్ల కుండలెపుడు చల్లగుండ
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొత్తి మీరియు కరివేప కూడి యుండి
రిప్లయితొలగించండియల్లమును జేర్చి యచ్చట యుల్ల మలర
తేట మజ్జిగ గనబడె ,దెరువరులకు
దప్పి దీ ర్చను బెట్టిరి దాత లార్య !
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘...యచ్చట నుల్ల మలర...’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితరగిన కరివేపయు కొతి
తొలగించండిమిర జేరిచి జీలకర్ర మెత్తటి పొడుమున్
సరి తిరగమాత పెట్టగ
హరి హరులా మజ్జిగన్న నావురుమనరే!
కుండల నిండిన మజ్జిగ
తొలగించండియెండలఁ బని జేయు వారి కిచ్చును హాయిన్
గుండెల నిండును ధైర్యము
నుండక వడదెబ్బ బాధ నూపిరి నిలువన్!
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూలుడ్రింకు కన్న కూలుగా నుండును
రిప్లయితొలగించండిజీలకర్ర వలన జీర్ణమగును
పోపు నిడుచు తాగ పులకింత కలిగేను
హానికరము కాదు హాయి నొసగు.
పోపు వేసిన మజ్జిగ మీకెంతో ఇష్టమనుకుంటాను. (నాకు కూడా!). పద్యం బాగుంది. అభినందనలు.
తొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శీతల య౦త్రాన శీతల మైనట్టి
. . యుదకమున్ ద్రావిన నుష్ణ మగును
రకరకములయిన. ర౦గు పానీయముల్
. . ద్రోహ మొనర్చు నారోగ్యమునకు
మృత్పాత్ర య౦దున మీగడ దేలిన
. . నా తక్ర సార మత్య౦త హితము
నిమ్మరసమ్మును కమ్మని కొతిమీర
. . యొనగూర్చు మనకు దేహోపకృతిని
పూర్వకాలపు టలవాట్లు పుష్టి కరము
నేటి య౦త్రపు టలవాట్లు నీరసదము
మోస మగు ప్రకటనల లో మునిగి పోయి
హాని కలిగి౦చు కొనకు దేహమున కీవు
{ మృత్ + పాత్ర = మట్టి కు౦డ ;
తక్రము = మజ్జిగ ; }
‘తక్రము’ శబ్దాన్ని ఎవరు ప్రయోగిస్తారా అని చూస్తున్నా... మీరు ఉపయోగించారు. మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
తొలగించండిచల్లగ దాహము దీర్చుచు
రిప్లయితొలగించండియుల్లము రంజింప జేయు నూష్మకమందున్
యెల్లరకును మేలొసగెడు
చల్లను సేవించ వలయు సజ్జనులారా!!!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘...దీర్చుచు|నుల్లము... నూష్మకమున మీ|కెల్లరకును...’ అనండి.
ధన్యవాదములు గురువుగారు...
తొలగించండిచల్లగ దాహము దీర్చుచు
నుల్లము రంజింప జేయు నూష్మకమున మీ
కెల్లరకును మేలొసగెడు
చల్లను సేవించ వలయు సజ్జనులారా!!!
తెల్లటి మజ్జిగ ద్రాగిన
రిప్లయితొలగించండిఉల్లమునుత్చాహ బరచుయూహల రీతిన్
అల్లము,కొతిమిర జేరిన
కల్లోలపు వేడి మాన్పు కలలో నైనన్.
3.పలుచటి మజ్జిగే “బ్రతుకు బాటకుదారిగ జూపు బీదకున్
కలుపగ కొత్తిమీర మనకంటికి వొంటికిమంచి జేర్చుచున్
విలువగు పోషకాలునిడి వేడిమి మాన్పెడి నౌషదంబుగా
దలతురులోకు లెల్లరును” ధర్మము జేతురుమజ్జి గున్నచో|
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పద్యంలో ‘కంటికి నొంటికి...పోషకాల నిడి..’ అనండి.
కొత్తిమిరయు నుప్పు క్రొత్త రుచుల నిడ
రిప్లయితొలగించండినీరు మజ్జిగగును నిమ్మ కూడి,
ఓగిరమ్మె కాదు ఓషధమ్మగుచుండు
చల్ల బరచు చుండు చల్ల యెపుడు!
గురువు గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండి‘చుండు’ పునర్యుక్తి అయినందునమూడవ పాదంలొ చిన్న సవరణతో వ్రాసిన ఈ పూరణను చూడ గోరుతాను.
ధన్యవాదములు. శ్రీధర రావు.
కొత్తిమిరయు నుప్పు క్రొత్త రుచుల నిడ
నీరు మజ్జిగగును నిమ్మ కూడి,
ఓగిరమ్మె కాదు ఓషధమ్ము వలెను
చల్ల బరచు చుండు చల్ల యెపుడు!
తెల్లని మజ్జిగ లోనన్
రిప్లయితొలగించండిచల్లగ కరివేప మిర్చి సరికొతిమేరన్
చల్లని చల్లగ మారును
చల్లగ నీకడుపునుంచు "సన్ స్ట్రోక్" బడకన్.
గురువుగారు దోష సూచనకు ధన్యవాదాలు సవరిస్తాను
రిప్లయితొలగించండిగురువుగారు దోష సూచనకు ధన్యవాదాలు సవరిస్తాను
రిప్లయితొలగించండితిండి జీర్ణ మవక తేన్పులధిక మయ్యె
రిప్లయితొలగించండిమంచిమందు యన్న మజ్జిగేను
వామును పొడిచేసి వైనముగా కల్పి
చల్లతాగు చున్న సర్దు కొనును.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నా! భాగ్యనగరమున:👇
రిప్లయితొలగించండిచస్తూ బ్రతుకుతు నీవిక
కుస్తీ పట్టంగ నేల కుండల తోడన్
రస్తా లన్నిట దొరకుచు
సుస్తీ లన్నిటిని బాపి సుఖమిడు మస్తీ!