16, మే 2016, సోమవారం

పద్యరచన - 1223

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

39 కామెంట్‌లు:

  1. చింత చెంతగనుండగ చింత లేదు
    వంట కంబుల పులుపుకై వాడు చుంద్రు
    పచ్చివౌ చింత కాయలు పచ్చడందు
    రసము సాంబారు పులుసుల రసన మిచ్చు

    వాత రోగము బాపగ వాత హారి
    అమిత దాహము నరికట్టి హాయి నిచ్చు
    రక్త హీనత పోగొట్టి రక్షజేయు
    పట్టు వేయగ బెణుకులు పారిపోవు

    చింత పిక్కల పొడినెల్ల సంత సముగ
    వాడు చుంద్రుబి స్కత్తుల ఫ్యాక్టరీల
    కాఫి పొడినందు ననుగూడ కలిపెదరను
    వినికి డికలదు కలియుగ వింత గాదె?

    కొంచ ముగగింజల పొడికి పంచ దార
    చేర్చి వారము దినములు సేవ నంబు
    చేయ వీర్యాభి వృద్ధిని చేయు నంద్రు
    మూల వ్యాధిని తగ్గించు మూలకంబు

    గ్రామ సీమల క్రీడగ కాను పించు
    ఇంటి యరుగులరగదీసి యింతులంత
    పుంజి గచ్చట గుర్రాల పుట్ట బెట్టి
    పట్టు పట్టెద రంతట పడతులంత

    చింత పిక్కల యాటను చేవ చూపి
    పిక్క లరగదీ యుచునొక ప్రక్క నాడు
    కొంద్రు గవ్వల వోలెను కొందరచట
    మంచి యాటలు మనమధ్య మాసిపోయె.

    పప్పు నందుచిం తచిగురు వంట కంబు
    త్రాగ చింతచి గురురసం తగ్గజేయు
    ముదురు కామెర్ల వ్యాధిని ముందుగాను
    చింత ఘనతనె వరికైన చెప్ప తరమె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘రసనము’ అన్నారు. రసనమంటే బంగారము. ఇది అక్కడ అన్వయించడం లేదు. ‘రస మొసంగు/ రసన కిచ్చు’ అనండి.
      రెండవపద్యంలో ‘కాఫిపొడియందు’ అనండి.
      చివరిపద్యంలో ‘చిగురురసం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘చింతచిగురు రసం బాగఁజేయు’ అందామా?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు. "రసనము" అనగా బంగారమే కాకుండగా ఆచార్య జి.ఎన్.రెడ్డి గారి పర్యాయపద నిఘంటువు పేజి 99 నందు " రుచి" అనే అర్థము కూడ వ్రాయబడిఉన్నది. ఆంధ్రభారతి (నిఘంటుశోధన) లో వెదుకగా "రుచి" అన్న అర్థం చూపబడినది. చివరి పద్యంలో నేను చింతచిగురు రసం అనే వ్రాసినాను. మీకు ధన్యవాదములు.

      తొలగించండి
  2. చింతించ వలదు పులుపని
    యంతంతగ కలిపి నంత హాయిగ నుండున్
    వింతగు రుచులను కలిగిన
    చింతకు నెదురేది లేదు సేవించ దగున్

    రిప్లయితొలగించండి
  3. లేత చింతకాయ తొక్కు ప్రీతి కరము
    చింతపండది దోలును వాత గుణము
    చారు,సాంబారు, గూరలు, సాగు లందు
    సతము సంప్రీతి నొసగు సహస్ర వేధి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది.
      చివరిపాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. అవునండి...ధన్యవాదములు... "నమిత సంప్రీతి నొసగు సహస్ర వేధి"

      తొలగించండి
  4. సవరించిన పద్యం

    లేత చింతకాయ తొక్కు ప్రీతి కరము
    చింతపండది దోలును వాత గుణము
    చారు,సాంబారు, గూరలు, సాగు లందు
    నమిత సంప్రీతి నొసగు సహస్ర వేధి!

    రిప్లయితొలగించండి
  5. చింతకాయ గనిన వింతగా నోటిలో
    నీరమూరు చుండు నిశ్చయముగ
    చిన్నతనము నందు చింతకాయల గోయ
    చెట్టులెక్కినాము పట్టు బట్టి

    రిప్లయితొలగించండి


  6. చింత కాయను జూడుము శీర్ష మనగ
    పొడవు గుండెను ! లోన నాపోక గుజ్జు !
    మానవుని మనసును వోలె మహిన నుండు
    తిరిక జీల్చిన నిండగు తీపి గుండు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘పొడవుగ+ఉండెను= పొడవుగ నుండెను’ అవుతుంది. అక్కడ ‘పొడవుగా నుండె’ అనండి. ‘మహిని’ అనాలి. ‘తిరిక’...?

      తొలగించండి
  7. చింత పండు మనకు నెంతయో నుపకృతి
    జేయు ,రుచిని గలుగ జేయు రసము
    నందు ,పులుసు కూర లందును వేయగ
    దాని విలువ జెప్ప దరము గాదు

    రిప్లయితొలగించండి
  8. చింత లవి దీరు జూలా
    లింత దినిన యంత చింత నెవ్విధ మైనన్
    వింతగ నాడుదు రబలలు
    సుంతైనను జాలు పాక శుద్దికి వింతన్

    రిప్లయితొలగించండి
  9. చింతచెట్టునెక్కి చిగురాకుగోయంగ
    వింత యనుభవంబు వెలుగుజూచె
    పంతమూనియొక్క పవమానబంధువే
    చెంతజేరినిలువ చిన్నబోతి.

    రిప్లయితొలగించండి
  10. సవరణ....3వ పాదంలో....
    పంతమూని యొక్క పవమాన సుతుడదే.

    రిప్లయితొలగించండి
  11. * గు రు మూ ర్తి ఆ చా రి *

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    చి౦త పులుసు లేని రసము చెడును | మరియు

    చి౦త సరిగ లేని బ్రతుకు చెదరు | దైవ

    చి౦తనము వీడ జన్మ నశి౦చు | కడకు

    చి౦త లే నిను కాల్చును ఛితి ¢ బరు౦డ

    { చి౦త సరిగలేని = ఆలోచన. చక్కగలేని ;

    దైవ చి౦తనము = దైవ ధ్యానము ;

    చి౦తలే కాల్చు = చి౦త కట్టెలే నిన్ను ఛితి పై
    కాల్చు

    రిప్లయితొలగించండి
  12. చింతకాయ జూడ చిన్నదేయైనను
    కాంచినంత నోట పెంచు నూట
    పులుపు రుచిని గలిగి బులపాటమే దీర్చు
    తెలుగు రుచుల మేటి తెలుసు కొనుము

    చింతకాయదెచ్చి చిప్పలోనను వేసి
    నీటిలోన కొన్ని నిముషములను
    నాన్పి పిదప పిండ నాణ్యమైన పులుసు
    బెల్ల ముప్పు కలుప భేషు భేషు

    భూరి రుచుల నిచ్చు పుళిహోర నేజేయ
    పులుపు తీపి రుచుల పులుసు గాను
    బాల లతిగ మెచ్చు పచ్చిపులుసుగాను
    చింత చింతదీర్చు సంతసమ్ము

    రిప్లయితొలగించండి
  13. చింత తీరె గాదె చింత చెట్టును చూడ
    అన్నదాత కెంతొ హాయి కలిగె
    కాయలమ్మవచ్చు కాసులు గనవచ్చు
    సొంత చెట్టు యున్న చింత తీరు.

    2.పనికి రానిదనెడి వస్తువేదియులేదు
    చింత చెట్టులోన వింత గనుడు
    కాయలున్న నదియు కమ్మని పచ్చడౌ
    పాతబడినకొలది 'పవరు'హెచ్చు.

    3.పాని పూరిలందు పక్కాగ రసముండు
    తిన్న పిదప నడిగి దీని గ్రోలి
    యాహ యనని వారు నవనిలో లేరయా
    చిటికె లోన మహిమ చెప్పవచ్చు.

    4.చింతపండు గుజ్జు చిక్కగా తీయుచు
    ఉప్పు కార మేసి ఊరబెట్టి
    అన్నమందు కలుప నావురావురనుచు
    తినని వారు గలరె దేశమందు.

    5.కందికట్టువేసి కమ్మగా వండుచు
    చింతపండు రసము చిక్కగాను
    యందుకలప త్రాగి త్రేన్చని ప్రజ
    లెచట కాన రారు వెదకి చూడ.





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘చెట్టు+ఉన్న=చెట్టున్న’ అవుతుంది, యడాగమం రాదు. ‘చింతచెట్టు గలుగ’ అనండి.
      మూడవపద్యంలో ‘వారు+అవనిలో=వారవనిలో’ అవుతుంది, నుగాగమం రాదు. ‘వార లవనిలో’ అనండి.
      ఐదవపద్యంలో ‘చిక్కగాను+అందు’ అన్నపుడు యడాగమం రాదు. ‘చిక్కగాను | కలుప త్రాగి త్రేన్చగా లేని వారలు | కానరారు వెదుకగా జగమున’ అనండి. (మీ చివరిపాదంలో యతి తప్పింది).

      తొలగించండి
  14. చింత బోటు నొలచి చింతపండును దీసి
    వేసి జీలకర్ర, బెల్లమందు
    నుప్పుఁ గొంత జేర్చి యొక్కింత దంచియు
    నోట బెట్ట రుచియె మేటి! మేటి!!


    రిప్లయితొలగించండి
  15. తిరుగు లేని రుచులతోడ తెలుగు వారి
    చింత కాయల పచ్చళ్ళు వింత గొలుప,
    చింత పండుతో పులిహోర చేయుచుంద్రు!
    చింత వీడి చవిగొనుడు చింత పులుపు!

    రిప్లయితొలగించండి
  16. చింతగలట్టిభీజముల చిక్కులు దీర్చగ పండు నాశతో
    పంతమునందు దీసి మన పప్పున నుప్పుగ వేయునట్లుగా
    కొంతయుజేర్చిపిచ్చలను కోవిదు లైనను పారవేయగా
    అంతట జాతివృద్దితనకందగనే?చిగురించుచింతతో|

    రిప్లయితొలగించండి
  17. కవచమును ధరించె డవని నాథునివోలె
    గట్టి చిప్పయుండు కాయపైన
    పక్వమునకు వచ్చు వరకది రక్షించు
    గట్టి రక్షణున్న కాయయదియె.

    ధనము లేని యిండ్లు ధరణినుండగవచ్చు
    పిల్లలుండనిండ్లు వేలకొలది
    చింత లేనియిండ్ల నెంతగా వెదకినన్
    కానరావు తెలుగు కల్పమందు

    రోటిలోన వేసి రోకటితో దంచి
    విత్తులన్ని తీసి వేయవలయు
    కారముప్పు పసుపు కలిపినూ రిననుచా
    లరుచినివది లించు నద్భుతముగ

    పాతచింతకాయ పచ్చడి యంచును
    నానుడులను వినని నరుడు లేడు
    పాతచింతకెంత ప్రాముఖ్యమో జూడ
    తెలుసు కొనర ఘనుడ తెలుగు వాడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘ధరించు నవనినాథుని వోలె’, ‘రక్షణ గల కాయ...’ అనండి.

      తొలగించండి
  18. చింత తీరె గాదె చింత చెట్టును చూడ
    అన్నదాత కెంతొ హాయి కలిగె
    కాయలమ్మవచ్చు కాసులు గనవచ్చు
    సొంత చెట్టు యున్న చింత తీరు.

    2.పనికి రానిదనెడి వస్తువేదియులేదు
    చింత చెట్టులోన వింత గనుడు
    కాయలున్న నదియు కమ్మని పచ్చడౌ
    పాతబడినకొలది 'పవరు'హెచ్చు.

    3.పాని పూరిలందు పక్కాగ రసముండు
    తిన్న పిదప నడిగి దీని గ్రోలి
    యాహ యనని వారు నవనిలో లేరయా
    చిటికె లోన మహిమ చెప్పవచ్చు.

    4.చింతపండు గుజ్జు చిక్కగా తీయుచు
    ఉప్పు కార మేసి ఊరబెట్టి
    అన్నమందు కలుప నావురావురనుచు
    తినని వారు గలరె దేశమందు.

    5.కందికట్టువేసి కమ్మగా వండుచు
    చింతపండు రసము చిక్కగాను
    యందుకలప త్రాగి త్రేన్చని ప్రజ
    లెచట కాన రారు వెదకి చూడ.





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘చింతచెట్టు+ఉండ’ అన్నపుడు యడాగమం రాదు.‘చింతచెట్టు గలుగ’ అనండి.
      మూడవపద్యంలో ‘పిదప యడిగి’ అనండి.
      ఐదవపద్యం మూడవపాదంలో గణ, యతి దోషాలు. సవరించండి.

      తొలగించండి
  19. చింత చెట్టు లేని సీమయు సీమయె?
    చింత పండు నచ్చు జిహ్వ జిహ్వ!
    చింత నిడని కాంత చిత్రమై యుండదె?
    చింత లేని నరుడు వింత పశువు!

    రిప్లయితొలగించండి