11, మే 2016, బుధవారం

ఖండకావ్యము - 21

నవవిధ భక్తి నివేదనము
రచన : శిష్ట్లా. వి. ఎల్. ఎన్. శర్మ

సీ.         శ్రవణంబు నందుచు చరణాబ్జములఁ గొల్తు
కీర్తనామృతధార గేయ మిత్తు
స్మరణ జేయుదు నీదు మహిమావిశేషంబు
పాదసేవనమందు ప్రాపు గొందు
అర్చనంబును జేతు నహరహమ్ము మదిలో
వందనంబులు జేతు వాసుదేవ!
దాస్యమ్ము జేయుదు దగ నీకు ధరలోన
సఖ్యమ్ముఁ బాటింతు ప్రాఖ్య! వినుమ!
తే.         పరగనాత్మ నివేదన పథము నెరిగి
నిన్ను జేర గోరెద నాపన్నహస్త
అన్ని జీవులం దలరారు నాత్మవీవు
నన్ను దరిజేర్చి నిలుపు నీ కన్నులందు!

చ.        నవవిధ భక్తి మార్గముల నమ్మి నుతించెదనో మహాత్మ! నా
భవము ప్రదీప్తమౌనటుల భావ ప్రభావ విభా పథంబులన్
తవపద చింతనాద్భుత విధానము జేగొని లోకపాల! మా

ధవ! నిను మానసమ్ముననె ధ్యానము జేసెద నూర్జితమ్ముగన్!

22 కామెంట్‌లు:

 1. శర్మ విరచిత పద్యాలు చ దువ మదిని
  సంత సమ్మును గలిగెను సరళ కృతికి
  భక్తి పద్యాల రచనలో రక్తి యుండె
  నిజము ముమ్మాటి కీ మాట ప్రజల లార!

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. శర్మ గారు మీ నవవిధ భక్తి నివేదనము భక్తిపారవశ్యమును చాటుచున్నది. అభినందనలు.
   “శ్రవణ” భక్తిని మొదటి పాదము యుక్తముగ నావిష్కరించి నట్లులేదు. “శ్రవణంబు నందుచు” “అందుచు” పదమిక్కడ సరిపోయినట్లు లేదు. “కొలుతును” వందనార్చనలను తిరిగి తెలుపు చున్నది.
   “శ్రవణంబు సేతు మీ చారిత్రములు భక్తిఁ గీర్తనామృత.....” అనిన నెట్లుండును?

   తొలగించండి
 3. గురు తుల్యులు శ్రీ కామేశ్వర రావు గారికి నమస్సులు... నేను నిఘంటువు నుండి స్వీకరించిన నవవిధభక్తులను అదే క్రమంలో పద్యంలో పొందుపరచటం జరిగినది...యితరములు మీరు సూచించినవిధముగా సవరించుకొందును....ధన్యవాదములు.. మీలాంటి విజ్ఞల అభిప్రాయములు నాలాంటి వారికి మార్గదర్శకములు.

  రిప్లయితొలగించండి
 4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 5. మీలాంటి విజ్ఞుల....అని చదువగలరు.

  రిప్లయితొలగించండి
 6. మీలాంటి విజ్ఞుల....అని చదువగలరు.

  రిప్లయితొలగించండి
 7. సీసపు మూసనవేసిన
  దాసుల కివి ధర్మ మార్గ దారియు యగులే|
  వ్రాసిన నవ విధ భక్తియె
  ఆసక్తిగ ముక్తి కొరకు నందించెగురూ|

  రిప్లయితొలగించండి
 8. సుకవి మిత్రులకు నమస్సులు... నా యీ ఖండికను చదివి, మీ రందించిన ప్రశంసలకు,సూచనలకు కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 9. సుకవి మిత్రులకు నమస్సులు... నా యీ ఖండికను చదివి, మీ రందించిన ప్రశంసలకు,సూచనలకు కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 10. సుకవి మిత్రులకు నమస్సులు... నా యీ ఖండికను చదివి, మీ రందించిన ప్రశంసలకు,సూచనలకు కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 11. గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి నమస్సులు... ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 12. గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి నమస్సులు... ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 13. "నిన్ను జేర గోరెద నాపన్నహస్త"
  ఈ పాదములో గణభంగమైనదేమొ అని అనుమానమండీ.. నేనే ఏదైనా తప్పుగా చూస్తున్నానేమో..

  రిప్లయితొలగించండి
 14. అవును...గణభంగమైనదండి...గమనించలేదు...మీ సూచనకు ధన్యవాదములు... ఆ పాదాన్ని సవరిస్తాను

  రిప్లయితొలగించండి
 15. అవును...గణభంగమైనదండి...గమనించలేదు...మీ సూచనకు ధన్యవాదములు... ఆ పాదాన్ని సవరిస్తాను

  రిప్లయితొలగించండి
 16. "నిన్ను దరిగొన వత్తు నాపన్న హస్త"

  రిప్లయితొలగించండి
 17. "నిన్ను దరిగొన వత్తు నాపన్న హస్త"

  రిప్లయితొలగించండి