12, మే 2016, గురువారం

పద్యరచన - 1221

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి. 

52 కామెంట్‌లు:

  1. చదువుల బండి యిదే మా
    కు దరువులను నేర్పెనోయి కుదురుగ జూడన్
    బెదురులు బోయెన్ పద్యపు
    సుధలను తెలిపెను జిలేబి సూక్ష్మము గనుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బండి కాస్త దారిన బడింది, బాగుంది!

      తొలగించండి
    2. శ్యామలీయం వారు :)

      శ్రీ గురుభ్యో నమః !


      బండి నడకల తెలియు పథ
      భండన భేదము జిలేబి బంగరు బొమ్మా !
      కొండన రాళ్ళును పగులును
      నిండగు కష్టే ఫలముగ నీరజ శ్యామా !

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  2. పల్లెను ప్రియమగు బండది
    నుల్లము రంజిల్లు రీతి నుత్సా హముగన్
    చల్లని సాయం సమయము
    పిల్లలు పరవశ మునొంద వేసవి యందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పద్యం బాగుంది.
      ‘బండి+అది’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘అది+ఉల్లము’ అన్నపుడు నుగాగమం ఎలా వచ్చింది? ‘పల్లెకు బండి ప్రియంబగు| నుల్లము...’ అనండి. ‘పరవశులు గారె’ అంటే అన్వయం బాగుంటుంది.

      తొలగించండి
    2. పల్లెకు బండి ప్రియంబగు
      నుల్లము రంజిల్లు రీతి నుత్సాహము గన్
      చల్లని సాయం సమయము
      పిల్లలు పరవశులు గారె వేసవి యందున్

      తొలగించండి
  3. ఎడ్ల బండి ప్రక్క యెద్దును దోడ్కొని
    యూరు జనెడు వారి తీరు గనుమ!
    పిల్లకాయ లచట జల్లలో గూర్చుండి
    యుల్ల మలర వారి యూరు జేరు!

    రిప్లయితొలగించండి
  4. పద్య మొక్కటైన భావమొప్పునటుల
    నగరి రాతమన్న నలవి గాదు
    పల్లెటూరి నడుమ పాడిపంటల మధ్య
    కవన మల్లి చూడు కవివరేణ్య

    రిప్లయితొలగించండి
  5. చల్లని నీడనిచ్చు తరు సంపద మొత్తము నాశనంబయెన్
    జల్లని వర్ష మింక నిల జారెడి మార్గము కానరాదయెన్
    పల్లెలు పాడి పంటలను బాగుగ నుండుట కేమి చేయుటో
    తెల్లము చేయవయ్య మరి దిక్కులు తోచవు మాకు శంకరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఉత్పలమాల బాగున్నది. వృత్తరచనలోనూ మీరు సమర్థులే అని తెలిసి సంతోషం కలిగింది. అభినందనలు.

      తొలగించండి
    2. మీ వంటి పెద్దల శిక్షణలో నేర్చుకుంటున్న నిరంతర విద్యార్ధిని. గురువుల పాదపద్మములకు నమస్సుమాంజలి.

      తొలగించండి
  6. చిత్ర మందున జూడుము చిన్న చిన్న
    పిల్ల లాబండి మీదన నుల్ల మలర
    పోవు చుండిరి బడి కి కా బోలు చూడ
    ముచ్చట గనుండె ను బయన ముగద బాల !

    రిప్లయితొలగించండి
  7. శుద్ధిగల చిఱు గాలులు సుడియు చుండ
    పచ్చనగు పైర్ల మధ్యన బండిపైన
    పోవుచుండిరి పిల్లలు ముదముతోడ
    చేర నమ్మమ్మ యింటికి సెలవులందు

    రిప్లయితొలగించండి
  8. వికటము లాచక్రమ్ములు
    శకటము జూడ బహులార్థ సాధక మయ్యెన్
    ప్రకటిత దరహా సాస్యులు
    సుకుమారుల సహచరులకు శుభ యాత్ర గదా

    రిప్లయితొలగించండి
  9. చల్లని సంధ్యవేళ వ్యవసాయము చేసెడు రైతు బండిలో
    పిల్లలు కూరుచుండి మురిపెమ్ముగ జూచుచు పైరుపచ్చలన్
    మెల్లగ సాగిపోవుచును మిక్కిలి సంతస మొందుచుండి రా
    పిల్లలు తల్లిచెంతకిక వెళ్ళెద మంచును హాయి హయిగా!

    రిప్లయితొలగించండి
  10. పాద తాడిత చలితమౌ వాహనమ్ము
    నడపి నడపి యలసిన చిన్నారు లంత
    వృషభ శకటము గాంచగ వేగిరమున
    ఉల్లముల్లసిల్లగనంత నుత్సహించి
    ఎక్కె నందరు తొందర నిండ్లు చేర

    రిప్లయితొలగించండి
  11. పాద తాడిత చలితమౌ వాహనమ్ము
    నడపి నడపి యలసిన చిన్నారు లంత
    వృషభ శకటము గాంచగ వేగిరమున
    ఉల్లముల్లసిల్లగనంత నుత్సహించి
    ఎక్కె నందరు తొందర నిండ్లు చేర

    రిప్లయితొలగించండి
  12. తే . గీ. బళ్ళు యోడలు , యోడలు బళ్ళు గాను
    మార వలయును జగతిని మరల మరల
    చదువు నేర్చిన బిడ్డలు సైకు లెక్కి
    నవ్వు నవ్వుతు బ్రతుకరే ! రివ్వు నెగిరి !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'బళ్ళు+ఓడలు+ఓడలు' అన్నప్పుడు యడాగమం రాదు. 'బళ్ళు నోడలు నోడలు...' అనండి. 'రివ్వున నెగిరి' అనడం సాధువు. 'రివ్వున చని' అనండి.

      తొలగించండి
  13. హద్దులు లేనప్పుడు మే
    మెద్దుల బండెక్కి పోదు మెక్కడి కైనన్
    ముద్దుగ పచ్చడి గలిపిన
    సద్దుల మూటుంటె చాలు సమ్మోదంబౌ.

    రిప్లయితొలగించండి
  14. హద్దులు లేవప్పుడు మే
    మెద్దుల బండెక్కి పోదు మెక్కడి కైనన్
    ముద్దుగ పచ్చడి మెతుకుల
    సద్దుల మూటుంటె చాలు సమ్మోదంబౌ

    రిప్లయితొలగించండి
  15. పల్లె సీమలందు పయనించు శకటము
    మందగమనమున ప్రమాదమనక
    కదలి పోవు చుండు గమ్యమ్ము చేరగన్
    ఎడ్ల బండి యాన మింపు గాదె

    గతుకు దారు లెంట కదలిఫోయెడు బండి
    ఇంధనముయె గూడ దిందు నిజము
    ఎడ్లు రెండుజాలు ఎంత దూరమ్మైన
    సాగు చుండు నదియు వేగ మనక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      టైపు దోషాలున్నవి. 'వెంట' ను 'ఎంట' అన్నారు. 'దారి వెంట, ఇంధనమ్మె' అనండి.

      తొలగించండి
  16. ఎద్దుల బండిహాయి| యగు నెక్కినగమ్యము జేర్చునేర్పునన్
    సద్దియు మూట,సైకిలును సాలును బాసేడిగుంట కుంచగా
    ఒద్దిక నందె ఎద్దులట నోర్పున నేర్పున రైతు మిత్రు లై
    ప్రొద్దును వెంబ డించుగద|పోకడరైతుకు బండి గుండెయే|

    రిప్లయితొలగించండి
  17. బండి ఎక్కిన వారి కిబ్బంది లేక
    బాల బాలిక లైన సవాలులాగ
    పొలముగట్టున వెళ్ళగ విలువ లెన్నొ
    పైరు పచ్చనిగాలిని పట్టియిచ్చు|

    రిప్లయితొలగించండి
  18. పచ్చని పల్లె సీమలును పామర మానవలాడు భాషణల్
    ఎచ్చటికైన పోవుటకు నెద్దుల బండుల హాయి యానమున్
    నచ్చిన గ్రామ జీవనము నచ్చిన పెద్దల ముద్దు సుద్దులున్
    మచ్చుకు జూడ లేవిపుడు మారెను పూర్తిగ పల్లెటూరులున్

    రిప్లయితొలగించండి
  19. పచ్చటి పైరుల్లచ్చట,
    ముచ్చటలాడు పసివారి ముద్దుల మోము
    ల్లిచ్చట సందడి సేయ మ
    రెచ్చట నుందోయి హాయి లేగలు సాక్షుల్॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      పైరుల్, మోముల్ శబ్దాలకు అచ్చు పరమైనపుడు లకార ద్విత్వం రాదు. ఆ సౌకర్యం నకారానికే. మీ పద్యానికి నా సవరణ....
      పచ్చటి పైరులు గల వట
      ముచ్చటలాడు పసివారి ముద్దుల మోముల్
      హెచ్చుగ సందడి సేయ మ
      రెచ్చట.....

      తొలగించండి
    2. గురువుగారూ, చాలా థాంక్స్! మీరన్నట్టు లకార ద్విత్వం గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నాను. మీ సవరణ చాలా బావుంది, ధన్యాలు.

      తొలగించండి
    3. గురువుగారూ, చాలా థాంక్స్! మీరన్నట్టు లకార ద్విత్వం గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నాను. మీ సవరణ చాలా బావుంది, ధన్యాలు.

      తొలగించండి

  20. 1.ఎడ్ల బండినెక్కియెదఅదుల నదల్చుచు
    సంబరమ్ముతోడ సాగుచున్న
    చిన్న పిల్లల గన చిత్తము రంజిల్లు
    పసిడి దినములన్న బాల్యమేగ.

    2.పల్లెటూళ్ళయందు బాలలెల్లరు చేరి
    సందె వేళలందు చక్కగాను
    యెడ్లబండి నెక్కి యేటివరకు సాగ
    హర్షచిత్తులైరి యాడి పాడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యం మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  21. పల్లెటూరి యెడ్లబండి పరుగు దీయు చున్నదీ
    ఘల్లు ఘల్లు ఘల్లు మంటు గంటల సడి జేయుచున్
    చల్లనైన పైరగాలి చక్కిలిగిలి బెట్టగన్
    పిల్లలంత బండి లోన వెళ్ళుచుండి రిండ్లకున్!!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు
      'పరుగుదీయుచుండెరా'అనండి.

      తొలగించండి
  22. బండిని లోనొక బండియు
    బండికి ప్రక్కన పశువులు పరుగులు తీయన్
    బండిని నూగుచు బాలలు
    పండుగ జేయుచు తలరిరె పాఠము లరయన్

    రిప్లయితొలగించండి