కర్మ చేయుట యొక్కటే కలదు నీకు ఫలిత మాసింప రాదని పలికి నట్టి గీత మాటలు జదివియు నీతి లేక ఫలిత మాసించి వేల్పుకు ప్రణతు లిడెడు గీతను పఠియించి నరుడు కోతి యగును తప్పులుంటే సవరించిన వాట్సప్ లో పెట్టగలను
సకల శుభదాయిని శ్రీ సుందరాకాండ పారాయణ లో అంతర్లీన పరిశుద్ధ తత్త్వాన్ని గ్రహించి చెప్పిన మీ పూరణ చాల సాధారణముగా కనిపించినా ఎంతో గూఢ భావముతో ఆధ్యాత్మికత చెప్పుచున్నది. అన్నా! అభినందనలు.
నీతిగ బ్రతుకుట కొఱకని
రిప్లయితొలగించండిగీతను పఠియించు నరుఁడు, కోఁతిగ మారున్
పాతవి చేష్టలు వీడక
రాతను మార్చెను హరియట లాఘవ మొప్పన్
అక్కయ్యా,
తొలగించండిమన్నించండి. యతిదోషంతో సమస్య ఇచ్చాను. మీరు గమనించకుండా పూరణ చెప్పారు. సవరించిన సమస్యతో పూరణ ఇవ్వండి.
గురువుగారికి నమస్సులు. యతిస్థానమునొకసారి పరిశీలింప మనవి.
రిప్లయితొలగించండిశర్మ గారూ,
తొలగించండిధన్యవాదాలు. సవరించాను.
రామ చరితము దెల్పును రావణుండు
రిప్లయితొలగించండిమనము ననను నిత్యము మహిమాన్విత శివ
గీతను పఠియించు నరుఁడు కోతి యగును
వానికి దహియింపగ లంక ప్రాభవంబు.
( పఠియించున్ + అరుఁడు) ( అరుఁడు= శత్రువు)
విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికర్మ చేయుట యొక్కటే కలదు నీకు
తొలగించండిఫలిత మాసింప రాదని పలికి నట్టి
గీత మాటలు జదివియు నీతి లేక
ఫలిత మాసించి వేల్పుకు ప్రణతు లిడెడు
గీతను పఠియించి నరుడు కోతి యగును
తప్పులుంటే సవరించిన వాట్సప్ లో పెట్టగలను
తమ్ముడూ శివగీత! భేష్!
తొలగించండిఅన్నా!ధన్యవాదములు.
తొలగించండిSri sharma gaaru chala mamchi bhavamuto vrasaaru
తొలగించండిప్రియ మిత్రులు శ్రీ కందుల వర ప్రసాద్ గారూ! బహుకాల దర్శనం. మీరుఇచ్చిన సమస్య పై నాపూరణకు మీ స్పందనకు ధన్యవాదములు.
తొలగించండిగీతను పఠియుంచు, నరుడు కోతి యగును
రిప్లయితొలగించండిచిత్తమున భ్రాంతి వీడక జిగిని గనక,
నెన్ని తీరుల జదివిన నేమి ఫలము
మనసు మార్చక, మనుగడ మార్గ మందు!
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమోక్షమందగ వృద్ధాప్యముననుజూడ
రిప్లయితొలగించండిగీతను పఠియించునరుడు, కోతియగును
యువక రక్తంబు బారుచు నవతనిండ
వయసు ధర్మంబు యోచింప వాస్తవంబు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికృతజ్ఞతలండి.
తొలగించండిమోక్షమందగ వృద్ధాప్యముననుజూడ
రిప్లయితొలగించండిగీతను పఠియించునరుడు, కోతియగును
యువక రక్తంబు బారుచు నవతనిండ
వయసు ధర్మంబు యోచింప వాస్తవంబు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాన ధనముల హరియించు మద్య మెపుడు
రిప్లయితొలగించండిచదువు సంధ్యలున్న ఫలిత మది గన మిల
సత్వ హారి సురా పాన సంజనితము
గీతను పఠియించు నరుఁడు కోతి యగును.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.ఎన్.వి.ఎన్. చారి 9866610429
రిప్లయితొలగించండినరుడు నారాయణుడని వానరము జెప్పె
నట్టి కోతిని కావలె నంచు వేడి
ననవరతమును హనుమకు హారతిచ్చి
గీతను పఠియించు నరుడు కోతి యగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హారతి+ఇచ్చి' అన్నప్పుడు యడాగమం వస్తుంది. 'హారతి నిడి' అనండి.
సకల సద్గుణ వారాశి ,శాంతి యుతుడు
రిప్లయితొలగించండిగీతను పఠి యించు నరుడు, కోతి యగును
దురితములు జేయు మనుజుడు దుష్టు డయ్యు
వికృత చేష్టల తోడను విర్ర వీగి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేః మోక్షమొందును కరమగు దీక్షతోడ
రిప్లయితొలగించండిగీతను పఠియించు నరుడు, కోతియగును
మనపురాణముల తెగడి మనెడు వాడు
ప్రజల దృష్టిలో సతతము నిజముగాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈతి బాధలు వీడుచు నిత్యు నిగని
రిప్లయితొలగించండినరుడు నారాయణుని జేర వరము నొంద
గీతను పఠియించు; నరుఁడు కోతి యగును
గాదె ! యైహిక ములమున్గ కడవరకును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంబటి భానుప్రకాశ్.
రిప్లయితొలగించండిగద్వాల.
తే**
సత్య నిత్యము దెలియగ సాగు మెపుడు,
మంచి మరువక జేయుము మరువ కెపుడు,
నరుని మూర్ఖత విడిచియు నడువ , కృష్ణ
గీతను పఠియించు నరుడు కోతి యగును !
తే**
తల్లి దండ్రులు జెప్పిన తలపు గొనక,
చదువు సంధ్యలు మానియు చరిత లేక,
యూరు దిరిగెడి తనయుడు పొరుగు నున్న
'గీతను' పఠియించు నరుడు కోతి యగును,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణ రెండవ పాదంలో 'మరువక' శబ్దం పునరుక్తమయింది. 'మంచి పనులను జేయుము మరువ కెపుడు' అనండి.
మానవత్వపు విలువల మర్మమెరగ
రిప్లయితొలగించండిగీతను పఠియించు నరుడు, కోతియగును
తీరలేనట్టి కోర్కెల కోరు కొనుచు
అందలాలకై యారాట మొందువాడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికర్మ చేయుము ఫలితమ్ము కోర వద్దు
రిప్లయితొలగించండికర్త వీవను భావమ్ము కల్ల సుమ్ము
కోతి నిష్కామ కర్మకు గొప్ప గుర్తు
గీతను పఠియించు నరుడు, కోతియగును.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసకల శుభదాయిని శ్రీ సుందరాకాండ పారాయణ లో అంతర్లీన పరిశుద్ధ తత్త్వాన్ని గ్రహించి చెప్పిన మీ పూరణ చాల సాధారణముగా కనిపించినా ఎంతో గూఢ భావముతో ఆధ్యాత్మికత చెప్పుచున్నది. అన్నా! అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు తమ్ముడూ. మొదటి పదంలో యతి దోషం ఉంది. సవరించాను.
తొలగించండికర్మ చేయుము ఫలితమన్ కాంక్ష వలదు
తొలగించండికర్త వీవను భావమ్ము కల్ల సుమ్ము
కోతి నిష్కామ కర్మకు గొప్ప గుర్తు
గీతను పఠియించు నరుడు, కోతియగును.
Sri missanna gaariki namaskaaramulu
తొలగించండిSamsyanu purimchutalo miku more saati
భక్తిభావము పెరుగును పరవశించి
రిప్లయితొలగించండిగీతను పఠియించు నరుడు ;కోతియగును
పాపపు పనులను చేయుచు పతితు డగుచు
కోరి నరకము చేరును కుత్సితుండు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిమూడవ పాదంలో గణదోషం. 'పాపపు పనుల జేయుచు' అనండి.
అంబటి భానుప్రకాశ్.
రిప్లయితొలగించండిగద్వాల.
తే**
సత్య నిత్యము దెలియగ సాగు మెపుడు,
మంచి పనులను జేయుము మరువ కెపుడు,
నరుని మూర్ఖత విడిచియు నడువ , కృష్ణ
గీతను పఠియించు నరుడు కోతి యగును !
***
సవరించిన పద్యము ...
ధన్యవాదాలు సర్.
నిన్న మిమ్మల్ని, జయన్న గారిని కలవడం, మీ సౌహార్దం ఆనందాన్ని కలిగించాయి. స్వస్తి!
తొలగించండికూతలందున శ్రీరంగ నీతులనుచు!
రిప్లయితొలగించండిదొమ్మర గుడిసెలందున దూరెదరట!
నాచ రించెడు బుద్ధియు నవని లేక
గీత పఠియుంచు నరుఁడు కోతి యగును!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అట+ఆచరించెడు' అన్నప్పుడు యడాగమం వస్తుంది.
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
తొలగించండికూతలందున శ్రీరంగ నీతులనుచు!
దొమ్మర గుడిసెలందున దూరెదరట!
యాచ రించెడు బుద్ధియు నవని లేక
గీత పఠియుంచు నరుఁడు కోతి యగును!
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
తొలగించండికూతలందున శ్రీరంగ నీతులనుచు!
దొమ్మర గుడిసెలందున దూరెదరట!
యాచ రించెడు బుద్ధియు నవని లేక
గీత పఠియుంచు నరుఁడు కోతి యగును!
మిత్రులందఱకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిమాతనుఁ బూజింపక; తాఁ
బాతకుఁడై; నిలుకడ విడి, పాపాల్ దొలఁగన్
గీతనుఁ బఠియించు నరుఁడు
కోతి యగును గాదె దూఁకఁ గొమ్మల పైనన్!
Sri madhusudhan gaaru namaskaaram
తొలగించండిKamdamlo Purana super sir
మధుసూదన్ గారు "పాపాల్" మాటయెందుకోనచ్చలేదండి. మీకు శబ్దసంపదకు కొదవేమిటి.
తొలగించండిమిత్రులు వరప్రసాద్ గారికి నమస్సులు...ధన్యవాదములు
తొలగించండిమిత్రులు పోచిరాజు గారికి నమస్సులు...! నాకు అప్పుడు మనస్సున మెదలినదానిని రాశాను. పైగా నెట్ ప్రాబ్లమ్. కరెంట్ ప్రాబ్లమ్...అందుకే అలా...
తొలగించండిమధుసూదన్ గారు నమస్కారములు. పరవలేదులెండి. "పాపచ్యుతికిన్" అంటే బాగుంటుందని నా ఉద్దేశ్యము.
తొలగించండిమధుసూదన్ గారూ,
తొలగించండికందంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాయ కష్ఠము జేయక కడుపు నిండ
రిప్లయితొలగించండికూడు నాశించు సోమరి కువలయమున
నమ్మి ప్రారాబ్ద కర్మము నమ్మి నుదుటి
గీతను పఠియించు నరుడు కోతి యగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రారబ్ధము' టైపాటు వల్ల ప్రారాబ్ధము.... అయింది.
కాయ కష్ఠము జేయక కడుపు నిండ
రిప్లయితొలగించండికూడు నాశించు సోమరి కువలయమున
నమ్మి ప్రారాబ్ద కర్మము నమ్మి నుదుటి
గీతను పఠియించు నరుడు కోతి యగును
Super sir
తొలగించండినీతిమాలినగర్వి-దుర్నీతిచేత
రిప్లయితొలగించండిగీతను పఠియించు నరుడు కోతి యగును
తెలిసి తెలియని మూర్ఖుడై విలువలేక
కలసి మెలసియు జీవించ?కలతలుంచు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికర్మ బంధము లేకనే కర్మనెవరు
రిప్లయితొలగించండిచేయుచుందురు నిలలోన జెప్పు కృష్ణ?
మద్యమును దాగ మనిషి తా మారునెట్లు?
గీతను పఠీయించు నరుడు, కోతి యగును.
Krishna gaaru mi padyam bhagunnadi
తొలగించండిDragu narudu gaa cheyamdi
కాంతికృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'... చుందురు+ఇలలోన=... చుందు రిలలోన' అవుతుంది. 'చేయుచుండెద రిలలోన' అనండి.
Gurudevulaku pranaamamulu
రిప్లయితొలగించండిGita Loni gitalu gani khyati noda
Gitanu patiyimchu narudu,koti yagunu
Korikalaku jikkina naadu,kurmi noda
Vaada vaadala vraalunu pakshi valenu
Kurmi nomda
తొలగించండిSorry sir I typed using Mobile
కందుల వర ప్రసాద్ గారి పూరణము:
తొలగించండిగీతలోని గీతలు గాని ఖ్యాతి నొంద
గీతను పఠియించు నరుడు, కోతి యగును
కోరికలకు జిక్కిన నాడు, కూర్మి నొంద
వాడ వాడల వ్రాలును పక్షి వలెను
సక్తి తోడనే గీతను చదువ వలెను
రిప్లయితొలగించండిగీత చదివిన బ్రతుకులో గెలుపు కలుగు
శాస్త్ర విషయాన సుంతయు శ్రద్ధ లేక
గీతను పఠియించు నరుడు కోతి యగును
వ్యాధునికి పక్షులను జంపవలదటంచు,
రిప్లయితొలగించండిరక్కసీడుల మూకకు మక్కువలను,
ధ్వంస మొనరించు వారిని హంసజేయ
గీతను పఠియించు నరుడు కోతి యగును
తల్లి దండ్రుల యాకటి తీర్చబోడు
రిప్లయితొలగించండిఆన్నదానము చేయును ఆలయాన
పేరు కోసమై,పుణ్యంపు ఫలముకొరకు
గీతనుఁ బఠియించు నరుఁడు కోతి గాదె
అంబటి భానుప్రకాశ్.
రిప్లయితొలగించండిగద్వాల.
తే**
సత్య నిత్యము దెలియగ సాగు మెపుడు,
మంచి పనులను జేయుము మరువ కెపుడు,
నరుని మూర్ఖత విడిచియు నడువ , కృష్ణ
గీతను పఠియించు నరుడు కోతి యగును !
***
సవరించిన పద్యము ...
ధన్యవాదాలు సర్.
సంస్కృతముకొంత నేర్చిన చాలు ననుచు
రిప్లయితొలగించండినొంటరి తనము తాళక నొళ్ళు మరచి
కల్లు త్రాగుచు రాత్రిని కామ సూత్ర
గీతను పఠియించు నరుఁడు కోతి యగును :)