21, మే 2016, శనివారం

సమస్య - 2040 (ఉత్తరుం డర్జునునకంటె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు.

84 కామెంట్‌లు:

 1. ద్వంద్వ సమరాన నద్భుత పౌరుషమును
  జూప నానంద పడుచును శూలి యంత
  పాశు పతము నొసగె గద పార్థున కత
  డుత్తరుం డర్జునున కంటె నుత్తముండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ‘ఉత్తరుఁడు’ అన్న శివుని పర్యాయశబ్దాన్ని స్వీకరించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 2. ఉత్తరుం డర్జునున కంటె నుత్త ముండు
  ననెడి గర్వంబు నొందుచు నడరు మదిని
  యుద్ధ భూమిని గాంచిన సద్దు జూసి
  భీతి జెందగ మరలిన పిరికి యతడు.

  రిప్లయితొలగించండి

 3. ఫణి కుమార్ తాతా గారి పూరణ....

  బోరి గోగ్రహ ణంబున కౌరవులను
  గోల మందల మరలించు గుర్తెరింగి
  రాజు విరటుడు కీర్తించె రాకుమారు
  డుత్తరుం డర్జునునకంటె యుత్తముండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘పోరి’ని ‘బోరి’ అన్నారు. ‘గోల మందల’ అన్నదాన్ని ‘గోకదంబము’ అనండి.

   తొలగించండి
  2. గురువుగారూ, సవరణకి ధన్యవాదములు.

   పోరి గోగ్రహణంబున కౌరవులను
   గోకదంబము మరలించు గుర్తెరింగి
   రాజు విరటుడు కీర్తించె రాకుమారు
   డుత్తరుం డర్జునునకంటె యుత్తముండు

   తొలగించండి
 4. Laxminarayan Ganduri గారి పూరణ....

  డంబపు పలుకులందు నాడంబరమున
  నుత్తరుం డర్జునున కంటె యుత్తముండు
  కౌరవులతోడ పార్థుని పోరుగాంచి
  యుత్తరుడు నిరుత్తరుడాయె యుద్ధముదు.

  రిప్లయితొలగించండి
 5. ఉత్తరుండర్జునుని కంటె నుత్తముండు
  తేరు చక్కగ నడిపెడు తీరులోన
  చూపె తన చాక చక్యము శుద్ధిగాను
  సూతుడై విజయునకు తా ప్రీతితోడ

  రిప్లయితొలగించండి
 6. ఓయి!కంకుభట్టారక! నోరుమూయు
  నీవు పల్కిన పల్కులు నిజముగాదు
  గోగ్రహణమందు యోధుల గెలువ గాదె
  యుత్తరుండర్జునుని కంటెనుత్తముండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదంలో యతి తప్పింది. ‘మూయు నోరు’ అంటే సరి!

   తొలగించండి
  2. ఓయి!కంకుభట్టారక!మూయు నోరు
   నీవు పల్కిన పల్కులు నిజముగాదు
   గోగ్రహణమందు యోధుల గెలువ గాదె
   యుత్తరుండర్జునుని కంటెనుత్తముండు

   తొలగించండి
 7. గురువు గారికి, కవులందరికీ మనస్సులు.

  శక్తి హీనుడై పలుకు డంభోక్తులందు
  నుత్తరుం డర్జునుని కంటె నుత్తముండు..
  సమరమందున నేర్పున శాత్రువులను
  పారద్రోలిన బలశాలి పార్థుడయ్యె.

  రిప్లయితొలగించండి
 8. కండ బలమును చూపుచు కౌరవులను
  చంపి మరలివచ్చె సుతడు సాధు సాధు
  "నుత్తరుండర్జునుని కంటె నుత్తముండు"
  యనుచు విరటుడు పల్కె తానతిశయాన.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ఉత్తముండు+అనుచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘...నుత్తముం డ|టంచు విరటుడు...’ అనండి.

   తొలగించండి
 9. పరగ విరటుని గొలువున పాండవులకు
  దంభములు బల్కి గోగ్రహణంబు నందు
  భక్తి దోడుత పార్థుని శక్తి నెరుగ
  నుత్తరుండర్జునున కంటె నుత్తముండు!  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో ప్రాసయతి తప్పింది. బ-భ లకు ప్రాస లేదు.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురువు గారూ...
   సవరించిన పద్యం

   పరగ విరటుని గొలువున పాండవులకు
   దంభములు బల్కి రణమున దానెరింగి
   భక్తి దోడుత పార్థుని శక్తి నెరుగ
   నుత్తరుండర్జునున కంటె నుత్తముండు!   తొలగించండి
 10. గోగ్రహణ సమయంబున గోచరించె
  ఉత్తరుండు,భయమున నిరుత్తరుండ
  గుటయె,డంబముల పలుకు గురువునెట్లు
  నుత్తరుండర్జునునకంటె యుత్తముండు?

  రిప్లయితొలగించండి
 11. పుత్ర వ్యామోహి విరటుడు పొగడుచుండె
  "ఉత్తరుండర్జునునకంటె యుత్తముండ"
  నుచు,నెచటజూచెనతని మనోజ్ఞ ప్రజ్ఞ?
  ప్రేమ కననీదు తనకు నప్రియమెయైన.

  రిప్లయితొలగించండి
 12. గోగ్రహణసమయమ్మున కుటిలురైన
  కౌరవులపైన విజయమ్ము కలిగెననెడు
  వార్త తెలిసిన విరటుడు పరిఢవముగ
  బల్కె నిట్టుల భట్టుతో వసుధ నరయ
  నుత్తరుండర్జునునకంటె యుత్తముండు!!!

  రిప్లయితొలగించండి
 13. చేత కాదయ్య యుద్దంబు చేయ లేను
  రధము దోలెద ననిబల్క రణము నందు
  పార్ధు డతనిని కొనియాడ బాగు గాను
  ఉత్తరుం డర్జునున కంటె నుత్త ముండు

  రిప్లయితొలగించండి
 14. ధైర్య సాహస మందునన్ దనయుడైన
  ఉత్తరుండర్జునున కంటె నుత్తముండ
  నుచును పాచికలాడుచు నుడివెనంట
  కంక భట్టుతో విరటుడు గర్వమందు

  రిప్లయితొలగించండి
 15. ఉత్తరుని ప్రగల్భాలు:-

  భయము మీకేల నేనుండ పడతులార
  కౌరవులసేననెదిరించ కదనమందు
  మేటి యైన నాకెవ్వరు సాటి? నిక్క
  ముత్తరుం డర్జునునకంటె నుత్తముండు.

  రిప్లయితొలగించండి
 16. నేనూ విరటుని విషయంగా పూరిద్దామనుకొన్నాను...కాని విరటునికి అప్పటికి బృహన్నల అర్జునుడని తెలియదుకదా... ఉత్తరుం డర్జునున కంటె నుత్తముండు....అని యెలా అంటాడు..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బృహన్నల విషయం తెలియదు నిజమే! కాని అర్జునుడు ప్రఖ్యాతుడే కదా! తన కొడుకు అర్జునుడికంటె ఉత్తముడని ప్రతి తండ్రీ భావించేదే కదా!

   తొలగించండి
 17. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  స్నేహ ధర్మ వ్రతుడు , యుధ్ధనీతి పరుడు

  దాన గుణ శీలి , యా వికర్తన సుతు౦డు

  ధర్మ తనయాగ్రజుడు , సమస్త ఘనగుణ.మ

  హోత్తరు౦ | డర్జునున క౦టె యుత్తము౦డు

  { ఉత్తరుడు = ఉత్తముడు ; ఘనగుణ మహోత్తరుడు = సద్గుణములచే ఉత్తముడు }

  రిప్లయితొలగించండి
 18. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. యతి దోషమని తలచి “సంయుత వినయ సుసంభ్రమములను” గా మార్చితిని. ఇది నేను వ్రాసినదియే. “చందము” లో సరియని చూపిస్తోంది. సంశయ నిర్మూలనకై మిమ్ముల నడిగితిని. “సమ్” తో కూడుకున్నవి కదా యీ రెండు పదములు. అందుకని యట్లు చూపించుచున్నదేమో?

  రిప్లయితొలగించండి
 19. 🌺🙏 🌺

  తే**
  సమర మన్నను వెనుకకు సాగునెపుడు,
  నంతిపురమందు పలుకు నందలములు,
  నుత్తరుండర్జునుని కంటె యుత్తముండు,
  నగుట యెట్లది ?చిత్రంబు,నగుటగాదె !!  🙏 🌺🙏

  అంబటి భానుప్రకాశ్,

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో గణదోషం. ‘పలికెక్కు నందలముల’ అనండి.

   తొలగించండి
  2. తే**
   సమర మన్నను వెనుకకు సాగునెపుడు,
   నంతిపురమందు పలికెక్కు నందలముల,
   నుత్తరుండర్జునుని కంటె యుత్తముండు,
   నగుట యెట్లది ?చిత్రంబు,నగుటగాదె !!

   తొలగించండి
  3. తే**
   సమర మన్నను వెనుకకు సాగునెపుడు,
   నంతిపురమందు పలికెక్కు నందలముల,
   నుత్తరుండర్జునుని కంటె యుత్తముండు,
   నగుట యెట్లది ?చిత్రంబు,నగుటగాదె !!

   తొలగించండి
 20. ధర్మ మార్గమ్ము నేటికి దలపవన ని
  రుత్తరుం డర్జునునకంటె నుత్తముండు
  కర్ణు డని నమ్మి పోరికి కాలుదువ్వు
  కొడుకు పక్షమ్ము వాడె సూ గ్రుడ్డిరాజు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధృతరాష్ట్రుణ్ణి నిరుత్తరుణ్ణి చేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 21. తన్ను మించిన ధన్విని కన్ను చెదరి
  కొల్లగొట్టించె కవ్వడి వల్ల మాలి
  నట్టి విడు పేకలవ్యుడు నిట్టె నొసగె
  ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తరువాతివాఁడైన ఏకలవ్యుని గురించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు."నిట్టె యొసగె" గా సవరించుచున్నాను. సాధువేనా తెలుపగోర్తాను.

   తొలగించండి
  3. ఆ దోషం నా దృష్టికి రాలేదు. మీ సవరణ బాగున్నది.

   తొలగించండి

 22. నా రెండవ పూరణము
  మొదటి భయపడి తదుపరి మోదమంది
  ఫల్గుణుని గని సారథి బగిది నొప్పి
  భీరువగుచును నొకపరి ధీరుడవగ
  నుత్తరుండర్జునున కంటె నుత్తముండు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదట... టైపాటువల్ల మొదటి.. అయింది.

   తొలగించండి
 23. కండ బలమును చూపుచు కౌరవులను
  చంపి మరలివచ్చె సుతడు సాధు సాధు
  "నుత్తరుండర్జునుని కంటె నుత్తముండు"
  యనుచు విరటుడు పల్కె తానతిశయాన.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సాధు భళిర| యుత్తరుం... నుత్తముం డ|టంచు విరటుడు...’ అనండి.

   తొలగించండి
 24. వరము లిచ్చెడు దైవమే వసుధ ప్రజకు
  ను త్తరుండ,ర్జునునకంటెనుత్త ముండు
  లేడు భువిలోన నెందును లేమ ! యరయ
  యాతనికి సాటి యాతడే యవని యందు

  రిప్లయితొలగించండి


 25. పేడి రూపును దాల్చియు బేలవలెను
  నృత్య మాడె బృహన్నల నామకమున
  బీర పలుకులు బల్కిన బిరికి వాడు
  నుత్తరుం డర్జునున కంటె నుత్తముండు

  🙏 చెన్నకేశవ‌, రాయచోటి 🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘...కంటె నుత్తముండె’ అనండి. సమస్యలోని పదాన్ని మార్చినట్లు కాదు. ‘ఉత్తముండు’కు ‘ఎ’ కలిపి ప్రశ్నార్థకంగా చేశాము. అంతే!

   తొలగించండి
 26. కోటలనుదాటు మాటల మేటి సుమ్మ
  యుత్తరుండర్జునుని కంటె నుత్తముండు
  యేకలవ్యుడు నిజముగ వీక లోన
  దుష్ట బుద్ధితో ద్రోణుండు తొలగద్రోచె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ఉత్తముండు + ఏకలవ్యుడు’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘కంటె నుత్తముండె| యేకలవ్యుడు’ అనండి. ఇక్కడ ‘ఎ’ నిశ్చయార్థం.

   తొలగించండి
 27. ఉత్తరుండర్జునున కంటె నుత్తముండు
  యనుట సరిగాదు మాటలు వినుట వరకె
  చెల్లి, చెలికత్తెలందున చెల్లుమాట
  యుద్దమందున జూపెనా?యూహకైనా?


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ఉత్తముండు+అనుట’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘కంటె నుత్తముం డ|టంచు పలుకుట సరిపోల దెంచి చూడ’ అందామా?

   తొలగించండి
 28. శుభోదయం
  సమస్యాపూరణము
  21-05-2016
  నాటకమ్మును ముగించి నటులు దిరిగి
  యింటి కేగగ నొకకుక్క వెంట బడగ
  నర్జునుండు బార,నెదిర్చి నచటనున్న
  నుత్తరుండర్జు నునకంటె యుత్తముండు
  గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదంలో గణదోషం. ‘నాటకమ్ము ముగించిన నటులు...’ అనండి. అలాగే ‘బార నెదిర్చె నచట నున్న..’ అనండి.

   తొలగించండి
 29. భక్త సులభుడైనట్టి యా పరమ శివుడు
  పార్థుని పరాక్రమము మెచ్చి
  పాశుపతమొ
  సంగె నాగభూషణుడైన చంద్రమౌళి
  యుత్తరుండర్జునుని కంటె నుత్తముండు

  రిప్లయితొలగించండి
 30. చిన్న మార్పుతో మరొక పద్యం,

  బలమగు విరోధులను గాంచి భయము నొందె
  నుత్తరుండర్జనునకంటె! నుత్తముండు
  పార్ధు డితడే యని తెలియ పరవశాన
  యురకలేసె సారధిగ నా యుత్తరుండు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘పరవశమున| నురకలేసె..’ అనండి.

   తొలగించండి
 31. భరతయుద్ధమ్ములోఁ బాలు పంచుకొనుచు
  నుత్తరుం “డర్జునునకంటె నుత్తముండు
  కర్ణుఁ డని భ్రాంతిపడుదు రీ కౌరవేయు
  లెంత మూఢు” లనుచుఁ బల్కె హేళనముగ.

  రిప్లయితొలగించండి
 32. డంబముల్ పల్కి రణభూమి డాసి పారె
  నెవడు ?;గురువు ప్రతిమను తా నిల్పి విద్య
  లందు నిష్ణాతుడవ్వగా నడుగ గురువు
  ఏకలవ్యుండు వ్రేలిడె నెట్టి వాడు ?
  ఉత్తరుండ ; ర్జునున కంటె నుత్తముండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘గురువు+ఏకలవ్యుండు’ అని విసంధిగా వ్రాయరాదు కదా! ‘...నడుగగ గురు| వేకలవ్యుండు...’ అందామా?

   తొలగించండి
  2. సవరించిన పద్యము.

   డంబముల్ పల్కి రణభూమి డాసి పారె

   నెవడు ?;గురువు ప్రతిమను తా నిల్పి విద్య

   లందు నిష్ణాతుడవ్వగా డవ్వగా నడుగగ గురు

   వేకలవ్యుండు వ్రేలిడె నెట్టి వాడు ?

   ఉత్తరుండ ; ర్జునున కంటె నుత్తముండు.

   తొలగించండి
  3. సవరించిన పద్యము.

   డంబముల్ పల్కి రణభూమి డాసి పారె

   నెవడు ?;గురువు ప్రతిమను తా నిల్పి విద్య

   లందు నిష్ణాతుడవ్వగా డవ్వగా నడుగగ గురు

   వేకలవ్యుండు వ్రేలిడె నెట్టి వాడు ?

   ఉత్తరుండ ; ర్జునున కంటె నుత్తముండు.

   తొలగించండి
 33. రణమున బృహన్నల దురంధరతను జూసి
  యుత్తరుండర్జునుని కంటె నుత్తముండు
  నితడు గదరా యని తలచె ; నిజము పార్థు
  కొలువు జేసె; నితని జూసి కోచ విడుతు !

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణలో కొంత అన్వయలోపం ఉంది. యుద్ధం చేసే సమయానికి బృహన్నలయే అర్జునుడని తెలుసుకున్నాడు కదా! మళ్ళీ అర్జునుని కంటే బృహన్నల ఉత్తముడని ఎలా అనుకుంటాడు? ‘కోచ విడుతు’...?

   తొలగించండి
  2. ఒ ఓ !

   ఔనండోయ్ !

   వదిలేసా !

   కోచ = పిరికితనము భీతి అని ఉంటేను : కోచ విడుతు అని వ్రాసా !

   అయినా మొత్తం అన్వయ లోపయ మయ్యె ! 'కోట' విడిచితి :)


   జిలేబి

   తొలగించండి
 34. ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు
  కాడు కాడని భారత గాధ దెలిపె ;
  పశుల గొనివత్తుననిబల్కి భండనమున
  పరుగులిడ, గొనివచ్చెను ఫల్గుణుండె

  ఫల్లుణుడె బృహన్నలయన బలికెనొకడు
  సేనమూర్ఛిల్లగ కిరీటి జేసెగాని
  పట్టి కోసెనె తలపాగ లెట్టులైన ?
  సుత్తరుం డర్జునునకంటె నుత్తముండు.

  రిప్లయితొలగించండి
 35. మిత్రులందఱకు నమస్సులు!

  [ఏకలవ్యుం డర్జునుని మించిపోవుచుండఁగా, నతని నంతటితోనే యాపఁదలఁచి, ద్రోణుఁ డతని బొటనవ్రేలిని గురుదక్షిణగా గొనిన సందర్భము]

  ఆ పరోక్ష శిష్యుండు, ప్రత్యక్ష శిష్యుఁ
  ని వలె నీ ధనుర్విద్యలో నేకలవ్యుఁ

  డుత్తరుం; డర్జునుని కంటె నుత్తముండు
  నగుడు; ద్రోణుండు, బొటవ్రేలి నడిగి, కొనెను!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విస్తృతమైన భావాన్ని చిన్న పద్యంలో ఇమిడ్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 36. నరుని తోడుండి నడిపెను నాటకమ్ము
  యుద్ధ మది తథ్యమనియెడు యూహఁ జేసి
  శ్రోతఁ జేయుచు ప్రోత్సాహ గీతఁ బలికె
  నుత్తరుండ! ర్జునునకంటె నుత్తముండు.
  (ఉత్తరుఁడు = విష్ణువు)

  రిప్లయితొలగించండి
 37. విరటు పుత్రుడెవడు?పెద్ద భీమసేను
  డెవని కంటెను వయసున?నెట్టివాడు,
  దాత లందున కర్ణుడు ధరణిలోన?
  ఉత్తరుం.,డర్జునునికంటె, నుత్తముండు.

  రిప్లయితొలగించండి


 38. విరటుడు కంకుభట్టుతో...
  ఉత్తరమ్మున చెరనున్న మొత్తమాల
  నుత్త చేతుల పోరాడి యొసగు మనకు
  ఉత్తరించును శత్రుల మత్తనయుడె
  ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు.

  రిప్లయితొలగించండి
 39. ఇద్దరు జడిసిరి మొదట యుద్ధ మందు
  గంట బట్టె నర్జునునకు నొంట బట్ట
  వెంటనే తేరుకొని నట్టి వీరుడైన
  నుత్తరుం డర్జునునకంటె నుత్తముండు :)

  రిప్లయితొలగించండి