19, మే 2016, గురువారం

సమస్య - 2038 (దొంగ పదసేవఁ జేయ...)

కవిమిత్రులారా, 

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు.

81 కామెంట్‌లు:

 1. కొంగ జపమును జేయగ కోటి దక్కు
  నెండన బడి జిలేబియు నెంత చల్ల
  గుండు, జూడను నిక్కము గురువు మాట
  దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 2. పంచ వన్నెల చిలుకకు పలుకు నేర్పి
  మాయ స్వాముల వెంబడి మాట గలిపి
  ధనము నార్జించు చుండును ధరణి యందు
  దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 3. దొంగ స్వాముల దరిజేరి, దొరల వోలె
  రంగడిని గొల్చి బైపైన డబ్బు దోచి
  వంగి దండాల నిడుచును బాగు యనుచు
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మ గారూ, రెండవ పాదంలో యతిదోషం. ‘బాగు+అనుచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘బాగటంచు’ అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి నమస్సులు. ర,డ,ల కు యతి మైత్రి చెల్లును కదా! దయచేసి వివరించండి.

   తొలగించండి
  3. అవునా...ధన్యవాదములండి...మారుస్తాను

   తొలగించండి
  4. సవరించిన పద్యం......

   దొంగ స్వాముల దరిజేరి, దొరల వోలె
   రంగడిని గొల్చి బైపైన లాభ మంది
   వంగి దండాల బెట్టుచు వాటమెరిగి
   దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

   తొలగించండి
 4. చిన్ని కృష్ణుని జంపగ చేరఁ దీసి
  చన్గుడుప నాడు పూతన స్వర్గమందె
  నీవె దిక్కంచు మదినమ్మి నీవు వెన్న
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 5. కొండవీటను దోపిడి దొంగ యొకడు
  ధర్మ మార్గంబు వీడిన ధనికు లిండ్లు
  కొల్ల గొట్టుచు పేదల కొసగు కతన
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 6. భక్త మానస చోరుడు పరమ శివుడు
  దొంగ వోలెను జొచ్చును తౌలచి మదివి
  పట్టి గట్టిగా కట్టేసి భక్తి నట్టి
  దొంగ పదపూజ జేయ 'నిధుల్' లభించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటిపూరణ మొదటిపాదంలో యతి తప్పింది. సవరించండి. ‘బెంగులూరులో దోపిడి దొంగ యొకడు’ అంటే ఎలా ఉంటుంది?
   రెండవపూరణలో ‘కట్టేసి’ అనడం వ్యావహారికం. ‘బంధించి’ అనండి.

   తొలగించండి
 7. ఆత్మ బంధువై జగతిని యాదు కొనును
  ఎల్ల వేళ నడిగినది యిచ్చు నతడు
  మ్రొక్కు కొనుచును మదిని , ఆ ముద్దు వెన్న
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధనము, సుఖముల నాశించి తలపకెపుడు
   దొంగ పద సేవ చేయ! నిధుల్ లభించు
   ననుచు నీతి నియమముల నమ్ము కొనకు!
   పుడమి పులకించ, యువతకు స్ఫూర్తి నొసగు!

   తొలగించండి
  3. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. వేణుగానము వీనుల విందు గాగ
  నీలమేఘుడు చూపించు లీల లెన్నొ
  వన్నెగోపిక లిండ్లను వెన్నదోచు
  దొంద పద పూజజేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘దొంగ’.. ‘దొంద’ అయింది.. టైపాటు...

   తొలగించండి
 9. మాయ సాధువుల నునమ్మి మనుట కంటె
  యాది మధ్యాంత రహితుడు నైన వెన్న
  దొంగ పదసేవ జేయని ధుల్ ల భించు
  బ్రదుకు పుడమిని జక్కగ బ డయు కొఱకు

  రిప్లయితొలగించండి
 10. వేద గణితమ్ము, లెక్కలు వేగ జేయ
  ట్రిక్కు నిధులను చూపించు టీచరతడు
  రమ్మనంటిని బుజ్జాయి ! రావదేల
  దొంగ 1 పద, సేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 11. చిన్ని కృష్ణుని జంపగ చేరఁ దీసి
  చన్గుడుప నాడు పూతన స్వర్గమందె
  నీవె దిక్కంచు మదినమ్మి నీవు వెన్న
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 12. మిత్రులందఱకు నమస్సులు!

  పట్టమహిషి రుక్మిణియె సంపదల తల్లి;
  ముద్దుభార్య సత్యయె మణి ముగ్ధ వల్లి;
  వడ్డి కాసులవాఁడైన వగల వెన్న

  దొంగ పదసేవఁ జేయ, నిధులు లభించు!

  రిప్లయితొలగించండి
 13. వనజనాభ సేవ యొసగు స్వర్గ నిధులు
  నిత్య మిద్ధర జరిగెడు సత్య మిదియ
  యర్చనల పేర దేవాలయమ్ము లందు
  దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు.

  రిప్లయితొలగించండి
 14. వేణువూదుచు నందరి వెతలుదీర్చి
  గొల్లబామల మనసులు కొల్లగొట్టి
  యిలను వేడగ మోక్షమ్మునిచ్చు నట్టి
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 15. కలుగు చెఱసాల లో శిక్ష ఖచ్చితముగ
  దొంగ పదసేవఁజేయ, నిధుల్ లభించు
  మంచి మార్గపు వ్యాపార మెంచుకొనిన
  తెలిసి మనుజులవ్విధి సదా మెలగ వలయు

  రిప్లయితొలగించండి
 16. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  అరయగ ప్రజా నిధుల నెల్ల నక్రమముగ

  దొ౦గిలెడు రాజ కీయపు " దొ౦గ ¢ బట్టి

  చేయి కలుపగ లభ్యమౌ సిరుల నిధులు

  " దొ౦గ పదసేవ జేయ నిధుల్ లభి౦చు "

  రిప్లయితొలగించండి
 17. కొండవీటను దోపిడి దొంగ యొకడు
  ధర్మ మార్గంబు వీడిన ధనికు లిండ్లు
  కొల్ల గొట్టుచు పేదల కొసగు కతన
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   వాట్సప్ లో సవరణ సూచించాను. మీరు చూడలేదేమో?
   మొదటిపాదంలో యతి తప్పింది. ‘బెంగుళూరులో దోపిడి దొంగ యొకడు’ అనండి.

   తొలగించండి
 18. పరుల సొమ్ము నపహరించువాఁ డెవండు?
  పెద్దలకు నేమి చేసిన పేర్మి గలుగు?
  ముఖ్యమంత్రి ప్రధానికి మ్రొక్కు టేల?
  దొంగ; పదసేవఁ జేయ; నిధుల్ లభించు.

  రిప్లయితొలగించండి
 19. రంగ నాధుని గుడిలోన దొంగ జేరి
  రంగు రాళ్ళను మెండుగ దొంగిలించ
  రంగ నాధుని భక్తుడు రాము తలచె
  దొంగ పద సేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 20. 1.
  కటకటాలను లెక్కించు ఖచ్చితముగ
  దొంగ పదసేవ జేయ; నిధుల్ లభించు
  నాత్మ స్థైర్యమ్ము విడకుండ నాత్మ శుద్ధి
  గలిగి, పూని జేయగ పుణ్య కార్యములను.

  గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ.
  2.
  మోహ మధికమై గతమున మునులు గోర
  గోపికలుగ బుట్టించియు కోర్కె దీర్చి
  మోహ వస్త్రాలు దొంగిలి ముదముగూర్చు
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు.

  రిప్లయితొలగించండి
 21. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. దొంగపదసేవ జేయ నిధులు లభించు
  ననెడి వెఱ్ఱీలో పడిపోయి నష్టపోకు
  సతము గొలువు సద్భక్తితో సవ్యసాచి
  సఖుని యతడొసగుచునుండు సకల నిధులు.
  2.పొట్టకూటికై సతతము పుడమియందు
  పాటుపడగ దొరకదేమి ఫలమటంచు
  వేగ కొలుచుచు భక్తితో వేడి వెన్న
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ‘సఖుని నత డొసగు...’ అనండి.

   తొలగించండి
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 24. భూరి ధనవంతు డైనను బుద్ధి లేక
  మాయ మాటలు నమ్ముచు సాయ పడెడి
  స్నేహమని ధనము తరుగ జేసెడి "పని
  దొంగ"పదసేవ జేయ నిధుల్ లభించు
  .

  రిప్లయితొలగించండి
 25. దొంగ యనినను సర్వులు దూఱుచుంద్రు
  పరుల సొమ్మును కాజేసి పాఱుకతన
  జీవి పాపాల హరియింపజేయు, వెన్న
  దొంగ పదసేవజేయనిధుల్ లభించు.

  రిప్లయితొలగించండి
 26. 1.
  ధర్మ రక్షణ కొరకంచు ధరణి యందు
  నవతరించిన కృష్ణయ్య ననవరతము
  కొలచినంత నుండగబోదు కొదువ వెన్న
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

  2.
  కుంభ కోణాల పేరుతో కువలయమున
  ప్రజల సొమ్ముము దిగమ్రింగు ప్రభువు లెల్ల
  యస్మదీయుల బోషించు నట్టి ప్రభుత
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

  3.
  జనుల వంచించి భూరిగా ధనము వొంద
  నాశ్రమాలను స్థాపించి యందులోన
  సకల భోగాలనుభవించు స్వామి యనెడు
  దొంగ పదసేవజేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘ఎల్ల నస్మదీయుల...’ అనండి.

   తొలగించండి
 27. దొంగగురువులై నేతలు దోచు కొనగ
  శిష్యు లాషాఢభూతులై జేరుచుంద్రు
  దొంగ పదసేవజేయనిధుల్ లభించు
  ననగ జైలుపాలయిరి భజన నొనర్చ

  రిప్లయితొలగించండి
 28. బుధుల సేవించ మిగులును బూడిదొకటె ;
  కోట్ల ధనమును గుట్టుగా కూడబెట్టి ,
  దేశ సౌభాగ్యమును దోచి తిరిగెడి గజ
  దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు.

  రిప్లయితొలగించండి
 29. వక్ర మార్గాన సంపద బడయు వార
  లన్ని విధముల నవినీతి నాశ్ర యింత్రు
  పురమునందు మిగుల పేరు పొందిన గజ
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు .

  మిగుల పేరు

  రిప్లయితొలగించండి
 30. అటుకు లిచ్చికుచేలుడు ఆప్తుడాయె
  తులసి ధళముతోరుక్మిణి తూగెనతని
  భక్తితోడకొలుచ కృష్ణయ్య దయను వెన్న
  దొంగ పదసేవ జేయనిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘కుచేలుడు+ఆప్తుడు’ అని విసంధిగా వ్రాశారు. ‘అటుకు లిచ్చినట్టి కుచేలు డాప్తుడాయె’ అనండి. ‘కొలుచ’ కాదు, ‘కొలువ’ అనండి.

   తొలగించండి
 31. [5/19, 11:53 AM] NVNChary: డా ఎన్.వి.ఎన్.చారి 9866610429
  SK2031అకస
  1.బెందుళూరులో దోపిడి దొంగ యొకడు
  ధర్మ మార్గంబు వీడిన ధనికులిండ్లు
  కొల్ల గొట్టుచు పేదల తొసగు కతన
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు
  2.భక్త మానస చోరుడా పరమ శివుడు
  దొంగ వోలెను జొచ్చునుతొలచి మదిని
  పట్టి గట్టిగా కట్టేసి భక్తి నట్టి
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు
  [5/19, 1:11 PM] NVNChary: డా ఎన్.వి.ఎన్.చారి 9866610429
  గుడిని దోచగ వచ్చిన గురుని గాంచి
  యర్చ కుండిట్లు బోధించె నార్తి తోడ
  స్వామి పూజయే పరమార్థ స్వాంతనమ్ము
  దొంగ? పద! సేవ జేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా మూడవది వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 32. స్త్రీల చిత్తము లనుదోచు చిలిపి వాడు
  మునుల మానస మందున ముదముతోడ
  సంచరించువాని దయను వేడి వెన్న
  దొంగ పదసేవ జేయు నిధుల్ లభించు.

  రిప్లయితొలగించండి
 33. అంబటిభానుప్రకాశ్ 🙏🌺🙏

  తే**
  గోప కాంతల వలువలు దాపు జేసి,
  ముసిగ నవ్వులు నవ్వెడి ముద్దు బాల !
  మరచి పోవగ జాలరు మహిని, వెన్న
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు !!


  🌸🙏🌸
  అంబటి భానుప్రకాశ్.

  తే**

  కృష్ణు ఘనతను దెలిసిన కమల నేత్రి,
  తనను దీసుక పోవగ తలచు కొనియె.,!
  యెదిరి శిశుపాలు నోడించి మదిని,కన్నె
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు. !!

  🌺🌻🌺

  అంబటి భానుప్రకాశ్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘తలచుకొనియె| నెదిరి...’ అనండి.

   తొలగించండి
 34. సమస్యా పూరణము 3

  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు
  ననుచు యోచించి, చేరియు నతని వద్ద
  దొంగిలించుట యెటులొ యబ్భంగి దెలిసి
  పనిని జేయబోవ నతడు పట్టువడియె!
  గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ

  రిప్లయితొలగించండి
 35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘అతివినయపు ధూర్తుండు దా నచట జేరి’ అనండి.

   తొలగించండి
 36. ప్రయుత:sk2020🙏కవితసంఖ్య:72🙏శంకరాభరణం వారి సమస్య పరులసొమ్ము కాశపడుటపాపమంచు తెలిసికొనియంత వేగమ్మెదీక్షబూని గొప్పయోగిని చేరి తాఁ కొలిచె నొక్క దొంగ! పదము కొలువనిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 37. గాధి తనయుని కనుసైగ గాంచి పరమ
  శివుని ధనువును చేపట్టి చేవజూపి
  లలన భూసుత హృత్కమల మకరంద
  దొంగ పదసేవ సేయ నిధుల్ లభించు

  అమరవాది రాజశేఖర శర్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మకరంద దొంగ’ అని సమాసం చేయరాదు. ‘హృత్కమలమును గొన్న| దొంగ...’ అనండి.

   తొలగించండి
  2. ధన్యోస్మి మీ సూచన శిరోధార్యం

   గాధి తనయుని కనుసైగ గాంచి పరమ
   శివుని ధనువును చేపట్టి చేవజూపి
   లలన భూసుత హృత్కమల మును గొన్న
   దొంగ పదసేవ సేయ నిధుల్ లభించు

   అమరవాది రాజశేఖర శర్మ

   తొలగించండి


 38. చిత్త శుద్ధిగ మానవ సేవ జేయు
  ధర్మనిరతుల కివ్వగ ధనములేదు
  కుల మతాల పేరున కోట్లు కొల్లగొట్ట
  దొంగ పదసేవఁజేయ నిధుల్ లభించు

  రిప్లయితొలగించండి
 39. శ్రిగురువర్యులకు వందనాలతో సవరించినపద్యము
  ----------------------------------------
  వెన్నదొంగ|గోపికలను వెదకు దొంగ|
  భక్తి పరులకు జిక్కెడి యుక్తిదొంగ|
  మునుల తపసుకు దొరికెడిముద్దు కృష్ణ
  దొంగ|పదసేవ జేయ నిధుల్ లభించు|
  2.దొరలమాటున దొరలిన దొంగ పనులె
  కలిమి బలిమికిమార్గమై నిలువ లుండ?
  అతివినయపు ధూర్తుండు దా నచటజేరి
  దొంగ పదసేవ జేయ?నిధుల్ లభించు|
  3.”మనసు దోచిన దొంగయే మరులు గొలుపు
  మగడు”| గట్టగ తాళి శ్రీమతియు గాగ|
  పతియె దైవంబనియెడి సపత్నికెపుడు
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు {మనసు దోచినదొంగ}

  రిప్లయితొలగించండి
 40. జైలు గోడల మధ్యలో జననమంది
  పెరుగుచు యశోద గారాబు బిడ్డ గాను
  అల్లరి పనులెన్నో చేసినట్టి వెన్న
  దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు.

  రిప్లయితొలగించండి
 41. సత్య యుగమున విష్ణుని శరణు జొచ్చి
  త్రేత యందున రాముని ప్రీతి బడసి
  ద్వాపరమ్మున కృష్ణుని దయను వేడి
  కలి యుగమున నేతల కళ్ళు గప్పి...
  దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు :)

  రిప్లయితొలగించండి