స్వర్ణ భూమి
రచన : శిష్ట్లా వి.ఎల్.ఎన్. శర్మ
రంగతితో గమింప జనులన్ దనియించెడి విశ్వభావనల్
సంగమమై వసింపగను శాశ్వత కీర్తి సమున్నతిన్ సదా
బంగరు దేశమై బరగు భారతభూమి కివే నమస్కృతుల్!
భాస్వంతంబయి యుద్యమించి కలలన్ బండించి ప్రేమామృతం
బాస్వాదంచెడి జిత్తముల్వొలయు నాహ్లాదంపు హేలాగతుల్
నీ స్వాంతంబున నిల్పుచున్నిరతము న్నెయ్యంబుతో, శాంతితో
నీ స్వాతంత్ర్య మహాద్యుతిన్ వెలుగ నిమ్మీ ధాత్రిపై నెప్పుడున్!
పాటవమందినట్టి పలు భాషల కోమల రాగమాలికల్,
బాటలయందు జీవనము భాసిలజేసెడి సంస్కృతుల్, మదిన్
మేటి సుధీవిధేయత సమీరణ జేసెడి సౌమ్య శక్తి, ము
ప్పేటల దివ్యభావనల, బేనియొసంగుమ! మానవాళికై!
ఇంత విశాల భావఝరు లిచ్చట నిల్పిన దివ్య ధాత్రి, యా
సాంతము ధర్మ సూత్ర పథసారము, సర్వ మతాల సంగమం
బంతర శక్తిగా బరగ, నాదరభావ విశిష్ట యోచనల్
స్వాంతము నందు గూడినవి, భారత దేశ విభాత రాగమై!
నిద్దుర రాని రేయినిట నీదు ధరిత్రి వికాసయోజనల్
పెద్దగజేయ బూనుమిక వేరువిధంబులనేల యోచనల్
హద్దులు దాటుచున్ పెనగు హైన్యమునిండిన స్వార్ధచింతనల్
వద్దిక ప్రొద్దుబుచ్చకుమ వర్ధిలజేయుము భారతావనిన్!
స్వర్ణ భూమి కృతిని జదువగా ముదమయ్యె
రిప్లయితొలగించండిశర్మ గారి రచన జక్క నగుట
వ్రాయ నింక నుబహు వ్రాతలు గృతులుగ
కోరు దునత నినిట కూర్మి తోడ
సుకవి మిత్రులు శిష్ట్లా వారికి నమస్సులు! దేశభక్తిభావ సంయుత మహోత్కృష్ట పద్య రచన గావించితిరి. మీ స్వర్ణభూమి పద్య ధార అమోఘము. పదముల కూర్పు సుందర తమము. చక్కని ఖండిక. చదువుతుంటే ఆహ్లాదాన్ని కలిగించింది. చదివినంత సేపూ విశ్రమింపనీయని రచన మీది. మీ శైలి సుందరతరమైనది. మీరు నాకు మిత్రులైనందులకు ఆనందముగ, గర్వముగ కూడ నున్నది. శుభాభినందనలు.
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ ర్మ గా రూ ! స్వర్ణ భూమి ఖ౦డిక లోని
మీ పద్యములు చక్కగా నున్నవి
అ భి న౦ ద న లు
శిష్ట్లా శర్మ గారూ మన భారతమాతకు అపూర్వమైన కవితానీరాజనాన్ని సమర్పించారు.
రిప్లయితొలగించండిఅభినందనలు.
శర్మ గారు నమస్కారములు. మాతృ భూమియందలి మమకారముతో మీ పద్యాలు చాలా మనోహరముగనున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండి“జనులన్ దనియించెడి”: “జనులం దనియించెడి” అనండి. అలాగే మిగిలిన చోట్ల.
“జిత్తముల్వొలయు నాహ్లాదంపు హేలాగతుల్”: చిత్తముల్ – “వొలయు” ననా లేక “వలయు” ననా మీ భావన? “వొలయు” అయితే “ఒలయు” సాధువు. “చిత్తముల్తనరు” యననెట్లుండును?
“వెలుగ నిమ్మీ ధాత్రిపై నెప్పుడున్!” “నిత్యమున్” అంటే మనోహరముగా నుండునేమో?
“వద్దిక ప్రొద్దుబుచ్చకు”: వద్దిక బ్రొద్దుబుచ్చకు” అనండి.
సుకవి మిత్రులు శ్రీ కామేశ్వర రావు గారికి నమస్సులు. మీ సూచనాత్మక సవరణలకు కృతజ్ఞుడను.'ఒలయు' అనియే నా యభిప్రాయము....ఎప్పుడున్...కూడా...నిత్యము లాంటిదే గదా...గతి కోసమని వాడటం జరిగినది...మీ సూచనలకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిసుకవి మిత్రులు శ్రీ కామేశ్వర రావు గారికి నమస్సులు. మీ సూచనాత్మక సవరణలకు కృతజ్ఞుడను.'ఒలయు' అనియే నా యభిప్రాయము....ఎప్పుడున్...కూడా...నిత్యము లాంటిదే గదా...గతి కోసమని వాడటం జరిగినది...మీ సూచనలకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిఆటవెలది:-
రిప్లయితొలగించండిఆలుబిడ్డ కలిసి ఆహారముయుమాని
పసిడి పంట కొఱకు పాటు పడగ
వానగాలిజేత వరదలో పారిన
ధాన్యముగని రైతు తల్లడిల్లె
......శ్రీను.....
ఆటవెలది:-
రిప్లయితొలగించండిఆలుబిడ్డ కలిసి ఆహారముయుమాని
పసిడి పంట కొఱకు పాటు పడగ
వానగాలిజేత వరదలో పారిన
ధాన్యముగని రైతు తల్లడిల్లె
......శ్రీను.....
ఆటవెలది:-
రిప్లయితొలగించండిఆలుబిడ్డ కలిసి ఆహారముయుమాని
పసిడి పంట కొఱకు పాటు పడగ
వానగాలిజేత వరదలో పారిన
ధాన్యముగని రైతు తల్లడిల్లె
......శ్రీను.....
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి. స్వర్ణ భూమియందు సాగినపద్దతుల్
రిప్లయితొలగించండివర్షాధార వోలె వరలు టాయె|
శర్మగారి పద్యపద గుంబనంబున
పుష్టి,నిష్టగలదు పూర్తిగాను|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాదు కృతినిట బ్రియముగ నాదరించి
రిప్లయితొలగించండితెలియ జేసిన భావాల తీరు నరసి
మరల వచ్చెద ననుకొందు, మధురమైన
కవిత నొక్కటి జేకొని కాలమందు!
నాదు కృతినిట బ్రియముగ నాదరించి
రిప్లయితొలగించండితెలియ జేసిన భావాల తీరు నరసి
మరల వచ్చెద ననుకొందు, మధురమైన
కవిత నొక్కటి జేకొని కాలమందు!
దేశ భక్తిని రగిలించి ధిషణజూపి
రిప్లయితొలగించండికవనపాండితి పదముల కదనుద్రొక్కి
విమల సద్భావరీతులు వెల్లివిరియ
భరత మాతనుబొగడుట బాగుబాగు.
,,,,,,,
శర్మగారు..మీ సువర్ణ భూమి సుమనోహరము.