జిలేబీ గారూ, కారణం తెలియదు కాని మీ పూరణలోని వ్యంగ్యం నాకెందుకో బాధను కలిగించింది. (ఇంకెవరికైనా కోపాన్ని తెప్పించవచ్చు!) ఈ బ్లాగు రాగద్వేషాలకు అతీతం. మీ పూరణ లక్షణంగా ఉన్నా తొలగించినందుకు మన్నించండి.
నేటి శంకరాభరణం వారి సమస్యాపూరణం ( 12-5-16) sk 1 94 సమస్య : కింకరుఁ డే రాజయి ఘన కీర్తినిఁ బొందెన్ నా పూరణ : కం : కొంకణ దేశమునందొక కింకరుడబ్బురపరచుచు కీర్తికి రీటం తోకల తీర్చుకొనెన్ నా కింకరుఁడే రాజయి ఘన కీర్తినిఁబొందెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుశంకరు భక్తుని ప్రాణము
తొలగించుకంకుడు తీయంగ శివుడు కంపించె నటన్
వంకర ధర్మము తెలుపుచు
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్
అక్కయ్యా,
తొలగించుపద్యం బాగుంది. ఈ పూరణకు నేపథ్యం?
గురువులకు నమస్కారములు
తొలగించుమార్కండేయుని ప్రాణములను యముడు తీయ బోగ శివుడు అడ్డుపడి యముని తన్ని కాపాడినప్పుడు ,యమ ధర్మ రాజనబడు యముడు అవమానింపబడి చరిత్రలో మిగిలిపోయాడు కదా అదన్నమాట . నాభావము .సరిగాలేకపోతె ఏముంది మామూలె [మన్నించడమే మరి ]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుశంకర భక్తుడు శూరుడు
రిప్లయితొలగించువంకర లేవియు నులేని వాడును ఇడుముల
జంకని వీరుడు నిల శివ
కింకరుడే రాజయి ఘన కీర్తిని బొందెన్
ఇది ఉజ్జయిని జ్యోతిర్లింగ చరిత్రలో చెప్పబడ్డ మహా రాజు చంద్రసేనుడిని దృష్టిలో ఉంచుకుని రాసిన పద్యం
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది.
తొలగించుకందంలో రెండవపదం చివర తప్పక గురువుండాలి.
‘వాడు నిడుములన్| జంకని వీరుం డిల శివ...’ అనండి.
ధన్య వాదములు గురువుగారు
తొలగించుశంకర భక్తుడు శూరుడు
వంకర లేవియును లేని వాడు నిడుములన్
జంకని వీరుండిల శివ
కింకరుడే రాజయి ఘన కీర్తిని బొందెన్
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించుజిలేబీ గారూ,
తొలగించుకారణం తెలియదు కాని మీ పూరణలోని వ్యంగ్యం నాకెందుకో బాధను కలిగించింది. (ఇంకెవరికైనా కోపాన్ని తెప్పించవచ్చు!) ఈ బ్లాగు రాగద్వేషాలకు అతీతం. మీ పూరణ లక్షణంగా ఉన్నా తొలగించినందుకు మన్నించండి.
కంది వారు
తొలగించుబాధ కలిగించి నంత గా పద్యాన్ని సూటిగా చెప్పానా ! !
అర్థం చేసుకో గలను
బ్లాగు నిర్వాహకుల దే తుది నిర్ణయం !
చీర్స్
జిలేబి
అర్థం చేసికొన్నందుకు ధన్యవాదాలు.
తొలగించుకుంకలు రేగిన తరుణము
రిప్లయితొలగించువంకలు దిద్దగ శ్రమించ ప్రతినను బూనెన్
జంకుట యెరుగని " జనతా "
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్
బింకపు నరేంద్ర భక్తిగ
రిప్లయితొలగించుశంకర పథమాచరించ శపధము బట్టెన్
అంకుశమును బట్టిన శివ
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుడా. N.V.N. చారి గారి పూరణ....
రిప్లయితొలగించుసంకట హరణుని గొల్చుచు
వేంకట పతి దేవళమున వేడుచునుండన్
వంకర లన్నితొలగ త
త్కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచామర్తి అరుణ గారి భావానికి నా పద్యరూపం....
రిప్లయితొలగించుఅంకార దేశమందున
శంకించక రాజు నెన్న సామజకరమం
దంకితమగు మాల పడిన
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్.
శంకరునిదెభూగోళము
రిప్లయితొలగించుశంకేమియులేదురాజు శివకిం కరుడే
నంకితముగ సేవలిడెడి
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్
మీ పూరణ బాగున్నది.
తొలగించు‘శంక+ఏమియు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘కింకరుడే యంకితముగ’ అనాలి.
వంకర బుధ్ధులు లేకయు
రిప్లయితొలగించుబంకున బనిచేయునట్టి భద్రుని ఓనర్
బంకు యజమాని జేయగ
కింకరుడేరాజయి ఘనకీర్తిని బొందెన్
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
అన్యదేశ్యాలున్నా విషయం అటువంటిది కనుక మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించులంకను బరిపాలించుచు
రిప్లయితొలగించులంకేశుడు జంకులేక రాజ్యము నేలెన్
శంకరుని దయవలన శివ
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్!!!
కింకరుడు = సేవకుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅంకిత భావము గలిగియు
రిప్లయితొలగించుకంకణ బద్ధుడయి టీ దుకాణములోనన్
బింకముగ నమ్మి యెదిగిన
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్!
మన ప్రధాని మోదీజీ ఎదిగిన సందర్భం
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుజింకల తోడను సహవా
సం గల బుద్ధుని అశోక సామ్రాట్టు గనెన్
అంకించె జీవితము స
త్కింకరుడే రాజయి ఘన కీర్తిని బొందెన్ !
సావేజిత
జిలేబి
బాగుంది మీ పూరణ.
తొలగించు‘సహవాసం’ అనడం వ్యావహారికం. అందులోను రెండవపాదంలో ప్రాస తప్పింది. ‘సహవా|సాంకిత బుద్ధుని...’ అనండి.
వంకర చేష్టలను విడిచి
రిప్లయితొలగించుపొంకముగా పరమశివుని పూజలు చలుపన్
శంకరుని కరుణ తోడను
కింకరుడే రాజయి ఘన కీర్తినిఁబొందెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుడా.సముద్రాల శ్రీనివాసాచార్య
రిప్లయితొలగించుSk no.2036
కవిత no 7
"కంకుడు" దైవము నిలలో
సంకటముల బాపువాడు సతతంబనుచున్
శంకను వీడుచు గొలువగ
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్
కంకుడు- కిరాతుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుదన్యవాదములు సముద్రాల శ్రీనివాసాచార్య
తొలగించుపంకజ ముఖి ద్రౌపది తో
రిప్లయితొలగించుశంకరు కృప నొందినట్టి సహజన్ములతో
కంకుడుగా విరటుసభను
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపంకజ నాభుని ఘన నా
రిప్లయితొలగించుమాంక తనువు డంబరీషు డనఘుండట ని
శ్సంకాత్ముడు నారాయణ
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుశంక వలదనుచు రాజనె
రిప్లయితొలగించు"నింకెవరు జవాబునిడిన నిత్తును పదవిన్"
జంకక సరిగా చెప్పిన
కింకరుడే రాజయి ఘన కీర్తిని బొందెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుశంకరుని విష్ణు భక్తులు
రిప్లయితొలగించుసంకుచితపు బేధ భావ సంవాదన పా
సంకులము నెదుగ జేసిన
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'పాసంకులము'....?
రిప్లయితొలగించుబొంకక నాపదలందున
గొంకక పగతుల కుతికలు గోసి జయమనే
ఢంకా మ్రోయించే యమ
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్
�� చెన్నకేశవ, రాయచోటి ��
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'మ్రోగించెడు' అనండి.
శంకర సాక్షాత్కారము
రిప్లయితొలగించువంక హరిశ్చంద్రుడంత ప్రార్ధనజేయన్
శంకిత వీరబాహుని
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్.
(వంక=వలన)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమూడవ పాదంలో గణదోషం. 'శంకితుడు వీరబాహుని' అనండి.
శంకరాభరణం’ బ్లాగులో నేటి సమస్య....
రిప్లయితొలగించు“కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్”
నా పూరణ
కం**
సంకెల బడినట్టిహయము,
రంకెలు వేయచు నగుపడె రాజును జూచీ!
సంకటములు బాపె హనుమ,
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్!
(సోమనాద్రి సేవకుడు హనుమప్ప)
కం**
వంకర గుణములు గలిగిన,
బింకము నగుపడు సచివుని భేదము గలిగే,!
నంకిలి బెట్టగ నాతని,
కింకరుడే రాజయి ఘనకీర్తి బొందెన్ !!
(అంకిలి=బాధ,ఆపద,కిటుకు,విఘ్నము)
కం**
లంకాధిపుడే నిలపై,
సంకటము గలిగి,రఘువరు శరమున్ గూలెన్!
నంకిలి దొలగియు నాతని,
కింకరుడే రాజయి ఘనకీర్తి బొందెన్ !!
(రావణుని తమ్ముడు విభీషణుడు రాజగుట)
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు1లో 'రాజును గనగన్'…, 2లో' భేదము గలుగన్'…, 3లో 'శరమున గూలెన్' అనండి.
బొంకులు సెప్పెడు రాజును
రిప్లయితొలగించులెంకలు నిక నమ్మ కుండ లేమిని జేయ
న్శంకను వీడుచు నపుడొక
కింకరుడే రాజయి ఘన కీర్తిని దెచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువంకర బుద్థిగల నృపుడు
రిప్లయితొలగించుసుంకములను వేయ జనులు శోకింపగ నా
సంకటముల బాపగ నో
కింకరుడే రాజయి ఘన కీర్తిని బొందెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుబింకపు విశ్వామిత్రుని
రిప్లయితొలగించుకింకరు డౌ నిత్యసత్య గీతను విడకన్
బొంకెరుగని హరిచంద్రుడు
కింకరుడే రాజయి ఘన కీర్తినిబొందెన్
మీ పూరణ బాగున్నది.
తొలగించు'నిత్య సత్య కృత్యము విడకన్ | బొంకకనె హరిశ్చంద్రుడు... 'అనండి.
సంకల్పబలంబనగఁభ యంకరుడా"హిట్లర"టు నియంతగ నిల్చెన్! శంకింపఁ తగునె శక్తిని? కింకరుడేరాజుయయ్యె కీర్తిని పొందెన్
రిప్లయితొలగించుగాధిరాజు సందీప్ గారూ,
తొలగించుశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంకటపడి శాపమున భ
రిప్లయితొలగించుయంకరుడై లంక నేలె నసురునిగా ; నా
శంకరుని భక్తి గొలిచెను
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఆవె: లో ప్రయోగము
తొలగించురాజకీయమందు రారాజులుండరు
రాజ్యమేలినోడె రాజునేడు
కింకరుండె రాజై ఘనకీర్తి పొందెను
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల
కృష్ణ మోహన్ గారూ - రాజై - రెండూ గురువులే, అది సూర్యగణము కాదు. "కి" కి "ఘ" కు యతిచెల్లదు. ఇనగణ ద్వయంబు, ఇంద్ర త్వయంబును, హంస పంచకమ్ము ఆటవెలది.
తొలగించుసమస్యా పూరణలో ఒక్క అక్షరముకూడా మార్చకూడదండీ
తొలగించుశంకరయ్య మాస్టారు గాతికి నమస్సులు
రిప్లయితొలగించునెను చిన్న మార్పు చేసి ఆటవెలదిలో పపూరించాను. అన్యదా భావించకండి. నమస్సులతో మీ గోగులపాటి కృష్ణమోహన్
మీ ప్రయత్నం ప్రశంసింప దగినదే. కానీ మూడవ పాదంలో గణదోషం. 'ఏలినోడె' అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అన్నపరెడ్డి గారన్నట్లు సమస్యలోని అక్షరాలను మార్చరాదు.
తొలగించుకుంకై కుర్రై తిరిగిన
రిప్లయితొలగించుకింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్
బొంకక పేదల ముదమున
నంకము, పాంకముల నొదిలి ననువర తమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'పొంకముల వదలి యనవరతమ్మున్' అనండి.
భారత బుర్రకథ లో సుయోధనుని జన్మవృత్తాంతము చెపుతూ..
రిప్లయితొలగించుసంకట (గాంధారి)గర్భచ్యుతిఁగని
జంకకుమని ముని (వ్యాసుఁడు) శత కలశములనిడన్, తా
లాంకు తరికిట తకిట తధ
కిం, కరుఁడే రాజయి ఘన కీర్తినిఁ బొందెన్!
కరుఁడు = a lump, mass, clot; గట్టిపడిన ముద్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించు
రిప్లయితొలగించు1జంకక పోరును సలుపుచు
బింకముతో పోరి తనదు వీరము జూపన్
సంకటమెల్లను బాయగ
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్.
2.సంకటములు బాపుమనుచు
శంకరుని పదమన వ్రాలి సదమల హృదితో
జంకక వేడగ నాశివ
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్.
3.బొంకులు పలికెడి ప్రభువును
శంకించక జనులు వాని చంపన్ చూడన్
శృంకలములు తెగ నాహరి
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్.
4.వంకర గుణములు కలిగిన
సంకట పడియెడి నతండు సతతము జగతిన్
శంకలేక గొలువ నాశివ
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్.
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు'శృంఖలము'ను శృంకల మన్నారు. నాలుగవ పూరణ మూడవ పాదంలో గణదోషం. "శంకించక గొలువగ శివ..." అనండి.
శంకపడక రాఘవుడా
రిప్లయితొలగించులంకకు ప్రభువుగ తలచెను రావణు తమ్మున్
వంకలు లేనట్టి యాతడు
కింకరుడే, రాజయి ఘనకీర్తిని బొందెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమూడవ పాదంలో గణదోషం. "లేనట్టి యతడు" అనండి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించుఱంకెలిడు ఢిల్లి రాజుకు
శంక నిడఁ బ్రతాపరుద్రు ౘాఁకలి, పేరం,
డంకిత సరూపుఁ డగు నా
కింకరుఁడే, రాౙయి, ఘనకీర్తినిఁ బొందెన్!
వైవిధ్యంగా చక్కని పూరణ నందించారు. బాగున్నది. అభినందనలు.
తొలగించునేటి శంకరాభరణం వారి సమస్యాపూరణం ( 12-5-16)
రిప్లయితొలగించుsk 1 94
సమస్య : కింకరుఁ డే రాజయి ఘన కీర్తినిఁ బొందెన్
నా పూరణ : కం :
కొంకణ దేశమునందొక
కింకరుడబ్బురపరచుచు కీర్తికి రీటం
తోకల తీర్చుకొనెన్ నా
కింకరుఁడే రాజయి ఘన కీర్తినిఁబొందెన్
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
తొలగించు'కిరీటం'అని ముప్రత్యయం లేకుండా వ్రాయరాదు.
బింకముతో గుజరాతున
రిప్లయితొలగించుజంకక రాణికి, భటులకు, జంగము దొరకున్,
కుంకలకున్ తేనీరిడు
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్!