మంచి భావంతో పూరణ చెప్పారు. బాగుంది. ‘పిలువనంపెను... భరతుని’ అని ద్వితీయాంతం కావాలి కదా! కాని అక్కడ ఉన్నది ప్రథమ. కనుక ‘పిలువ నంపెను కైక భూవిభు డగునని| భరతు, డంపె...’ అంటే బాగుంటుందేమో అని నా సూచన.
రామునకు పట్టమనుచును ప్రజలు మురిసి వేడ్కలన్ జేయు చుండెడి వేళ యందు మాతుల గృహమందుండెను మాండవిపతి భరతు, డంపె రాముని వన వాసము నకు సవతి తల్లి కైకేయియె స్వార్థ ముగను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభరత మాతయు కోరిన వరము చేత
తొలగించండిరాముడేఁగెను వనముల రాజుమాట
నిజముయెఱుగని జనులును నిందజేసె
భరతుఁ డంపె రాముని వనవాసమునకు
తాతా వారూ! బాగుంది మీపూరణ.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘నిజము+ఎఱుగని’ అన్నపుడు యడాగమం రాదు. ‘నిజ మెఱుంగని/ నిజము నెఱుగని’ అనండి. అలాగే ‘జనులు’ బహువచనం కనుక ‘నిందనిడిరి’ అనండి.
గురువుగారూ, సవరణకి ధన్యవాదములు.
తొలగించండిభరత మాతయు కోరిన వరము చేత
రాముడేఁగెను వనముల రాజుమాట
నిజమునెఱుగని జనులును నిందనిడిరి
భరతుఁ డంపె రాముని వనవాసమునకు
బాలసుబ్రహ్మణ్యశర్మ గారూ మీకు కూడా ధన్యవాదములు.
గురువుగారూ! సత్వరమే మీ ఆరోగ్యం కుదుటపడవలెనని కోరుచూ
రిప్లయితొలగించండిఅన్న మాటను జవదాట నన్న వాడు
భరతు; డంపె రాముని వనవాసమునకు
కైక మంథర మాటల గఱగి పోయి
దశరథునికోరి వరములు తామసమున.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితండ్రి వరమీయ కోరిన తమక మందు
రిప్లయితొలగించండితల్లి యాజ్ఞను తలదాల్చు తనయు డతడు
లోక నిందను భరియించి శోక మంది
భరతుఁ డంపె రాముని వనవాస మునకు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణలో అన్వయలోపం ఉన్నట్టుగా అనుమానం. భరతుడే వనవాసానికి రాముణ్ణి పంపినట్లుగా ఉంది.
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండిదాశరథి పాదసేవయె తనకు మిన్న
యనుచు దలచిన సౌమిత్రి వనము కేగు
తరుణమందున భావించె దనకు దాను
భరతుడంపె రాముని వనవాసమునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికైక గోరిన వరముల కతన నేమొ
రిప్లయితొలగించండిరాము డేతెంచె నడవుల రాజ్య మొదలి
అన్న పాదుక లందుచు మన్ననమున
భరతుడంపె రాముని వనవాసమునకు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగరువు గారు...కొద్దిగా సవరించాను
తొలగించండికైక గోరిన వరముల కతన నేమొ
రాము డేతెంచె నడవుల రాజ్యము విడి
అన్న పాదుక లందుచు మన్ననమున
భరతుడంపె రాముని వనవాసమునకు!
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితండ్రి మాటను నిలుపుట తనయుల విధి
రిప్లయితొలగించండియనుచు రాఘవుండు దెలుప మనికితపడి
పాలనము సేయ గైకొని పాదుకలను
భరతుఁడంపె రాముని వనవాసమునకు!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాళ్ళు కన్నీళ్ళ కడిగినా కరుగ లేదు
రిప్లయితొలగించండితండ్రి మాటను పాటించ తధ్య మనగ
పాదుకలమోసి తలమీద పరమ భక్తి
భరతుఁ డంపెరాముని వనవాస మునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘కడిగినా’ అనడం వ్యావహారికం. ‘కడిగినన్’ అనండి.
దశరథుని కుమారుడతడు ధర్మపరుడు
రిప్లయితొలగించండిభరతు,డంపె రాముని వన వాసమునకు
సవతి తల్లియౌ కైకేయి స్వార్థ మూని
భరతునకు పట్టమును గట్ట పడతి కోరె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎంతపనిని జేసితివమ్మ యెరుకలేక
రిప్లయితొలగించండితల్లితోగూడి జేసెను తనయుడనుచు
జనము జగమున నిట్లనుకొనును గాద
భరతుడంపె రాముని వన వాసమునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివరముగా గోరి తా కనికరము లేక
రిప్లయితొలగించండికైక రాముని యడవుల కంప జూచి
జనులు దలచిరి పొరపడి . స్వార్ధ పరుడు
భరతుఁ డంపె రాముని వనవాసమునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘రాముని నడవులకు’ అనండి.
తల్లి మాటను కాదను తెగువ లేక
రిప్లయితొలగించండిమనసునున్న బాధ మాన్పలేక
రామ పాదుకలు తనశిరమ్మునుంచి
భరతుడంపె రాముని వనవాసమునకు
మీ పూరణ బాగున్నది.
తొలగించండిమొదటిపాదంలో యతి తప్పింది. రెండవపాదం ఆటవెలది అయింది. ‘తల్లి మాటను కాదను తలపు లేక| మనసులో నున్న బాధను మాన్పలేక...’ అనండి.
వనము నందుండు కాలమ్ము వసుదముగియ
రిప్లయితొలగించండితనదు బారమ్ముతగ్గింప తప్ప కుండ
వేగ రావలె ననుచును వేడుకొనుచు
భరతు డంపెను రాముని వనవాసమునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాతృ ధిక్కారమున్ సేయ మనసు రాక
రిప్లయితొలగించండిఅన్న కష్టాలుపొందుట నరయలేక
వెంటనంటగ లక్ష్మణున్ వేడుకొంటు
భరతుడంపె రాముని వనవాసమునకు
అమరవాది రాజశేఖర శర్మ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘వేడుకొనుచు’ అనండి.
వరము లిచ్చెను పెనిమిటి, వడి వడి యని
రిప్లయితొలగించండిబిలువ నంపెను కైకేయి బిరబిర తన
భరతుఁ, డంపె రాముని వనవాసమునకు
రావణునికి దుర్దినముల రాశి బెట్టె !
మంచి భావంతో పూరణ చెప్పారు. బాగుంది.
తొలగించండి‘పిలువనంపెను... భరతుని’ అని ద్వితీయాంతం కావాలి కదా! కాని అక్కడ ఉన్నది ప్రథమ. కనుక ‘పిలువ నంపెను కైక భూవిభు డగునని| భరతు, డంపె...’ అంటే బాగుంటుందేమో అని నా సూచన.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి"పాలకుం డౌఁటకై తల్లిఁ బంపి, తండ్రిఁ
గీలుబొమ్మగ మార్చఁగఁ గీలుకొలిపి,
భరతుఁ డంపె రాముని వనవాసమున!" క
టంచుఁ బ్రజలందఱును నసహ్యమునఁ గనిరి!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివరము లిచ్చెడు పతిఁగూర్చి గురుతుఁ జేసి
రిప్లయితొలగించండిస్వార్థ చింతన మంథర సంతరించ
కైక యూహలఁ బట్టమ్ము స్వీకరించు
భరతుఁ డంపె రాముని వనవాసమునకు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాజ్యపాలనగావించెరాముబదులు
రిప్లయితొలగించండిభరతుడం,పెరామునివనవాసమునకు
కైకకోరినవరములకారణమున
తనయుడనియునుజూడకతండ్రియపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబ్లాగునందునమీయొక్కపనినిజూడ
సంతసమ్మునుగలిగెనుశంకరార్య!
కోలుకొనినందులకుగానుగృష్ణుదయను
పూర్తియారోగ్యమీయుత!మృడుడుమీకు
ఆర్యా, ధన్యవాదాలు.
తొలగించండితల్లి మాటను కాదను తనువు కాదు
రిప్లయితొలగించండిముదము నన్నను పంపించ మదియు లేదు
పాలుపోకశిరముమోసి పాదుకలను
భ రతుడంపెరాముని వనవాసమునకు
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివరముల నెపం బిడుచుఁ గలవరపడఁ బతి
రిప్లయితొలగించండికైక,కుత్సిత చిత్త యేకైక దృష్టిఁ
బుత్రు డుద్దండ సార్వభౌముం డగునని
భరతుఁ ,డంపె రాముని వనవాసమునకు
"యేకైక లక్ష్యి" అంటే బాగుంటుందెమో! అనుకుంటున్నాను.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘...యేకైక లక్ష్య’ అనవలసి ఉంటుందేమో?
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నేను యదేయనుకున్నాను. “కలకంఠి” పదమును చూసి “లక్ష్యి” అనాలేమోనన్నయనుమాన నివృత్తికే మీ సలహా యడిగితిని.
తొలగించండిమా అన్నయ్య చంద్రమౌళి రామారావుగారి పూరణ:-
రిప్లయితొలగించండిఎంత పనిఁ జేసినావమ్మ యీ కొడుకుకు
పట్టమున్ గట్ట? నిన్ననఁ బనియెలేదు
స్వార్ధ కామ రూప జననీ జనకజాత
భరతుఁ డంపె రాముని వనవాసమునకు
చంద్రమౌళి రామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామ కథనడుగ గురువు,రామకృష్ణ
రిప్లయితొలగించండిభరతుడంపె రాముని వనవాసమునక
నంగ,రెట్టించి ప్రశ్నించె "ననఘు రాము
భరతుడంపెరా ? ముని వాసమునకు".
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివరిపాదంలో ‘వన’ తప్పిపోయింది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభద్రరాముని ప్రేమను భరతుడెపుడు
రిప్లయితొలగించండినిద్రయందైన మరువడు నీతిదప్పి
కైక పన్నాగమియ్యది. కరుణగల్గు
భరతుడంపెరా? మునివాసమునకు?
మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇందులోను ‘వన’ తప్పిపోయింది.
మునులుండే వనంలో నివసించడానికి.. అనే అర్థంలో ‘వన’ శబ్దం ఉండవచ్చు.
తొలగించండిపొరబాటు గమనించాను.కృతజ్ఞతలు.
తొలగించండిమందరనుడివిన చెడుగు మాటలువిని
రిప్లయితొలగించండిరాజ్యమునకు భర్తపిదప రాజు గాగ
భరతుడంపె రాముని వనవాసమునకు
కైక తాను పెంచిన మమకారమువిడి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపితరులానతి తలదాల్చి విపినవాస
రిప్లయితొలగించండిమునకు జనియెను లక్ష్మణ జనకసుతల
గూడి రాముడు గనుక బాసాడ దగదు
"భరతుడంపె రాముని వనవాసమునకు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅన్నయాజ్ఞకుబద్దుడై నంజలిడుచు
రిప్లయితొలగించండిరామపాదుకలను గొని,రాజ్యమేల
వంశ కీర్తిని నిలిపెడి సంశయాన
భరతు డంపె రాముని వనవాసమునకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిజము తెలిసి భరతుడు వనికి జని " తమ
రిప్లయితొలగించండిపాదుకల గద్దె పైనుంచి పాలనమ్ము
చేయుదున " నుచు పాదుకల్ జేత బట్టి
భరతుడంపె రాముని వన వాసమునకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భరతు డంపె రాముని వనవాసమునకు"
రిప్లయితొలగించండినంచు కుమతులు నిందింతు రతని కాని
పుత్ర వాత్సల్యమునను దుర్బుద్ధి చేత
కైకయే పంపె రాముని కాననముకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసంగరసమయ మందు దశరథ రాజు
వరములనుప్రేమతోడను పడతికొసగెె
పట్టమును కట్టమనుచును వాంఛ చేసె
భరతు,డంపె రాముని వనవాసమునక
మీ పూరణ బాగున్నది. కాని ‘భరతుడు’ అన్న ప్రథమాంతపదం అక్కడ అన్వయించదు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"భరతు డంపె రాముని వనవాసమునకు"
రిప్లయితొలగించండినంచు కుమతులు నిందింతు రతని కాని
పుత్ర వాత్సల్యమునను దుర్బుద్ధి చేత
కైకయే పంపె రాముని కాననముకు.
ప్రాణములను త్యజింతు నో పరమపురుష
రిప్లయితొలగించండిమరలి రాకున్న నేనింక మరల ననుచు
పట్టుబట్ట ననునయము తో పాదుకొసగ
భరతు డంపె రాముని వనవాసమునకు.
మీ రెండవపూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరామునకు పట్టమనుచును ప్రజలు మురిసి
రిప్లయితొలగించండివేడ్కలన్ జేయు చుండెడి వేళ యందు
మాతుల గృహమందుండెను మాండవిపతి
భరతు, డంపె రాముని వన వాసము నకు
సవతి తల్లి కైకేయియె స్వార్థ ముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాముని వలదటంచు తా రాజ్యమేల
రిప్లయితొలగించండిగోరినట్టి కైక సుతుడే కారణమ్ని
"భరతుడంపె రాముని వనవాసమునకు"
ననుచు నిజము నెరుగరైరి యచటి ప్రజలు!
టైపింగ్ లో దొర్లిన పొరపాటు కారణమ్ని కాదు, "కారణమని"
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి"రాజ్యభారమ్ము వహియింప ర"మ్మటన్న,
భ్రాత రాకున్కి, దా భ్రాతృ పాదుకలనుఁ
గొనియుఁ, దలనిడికొని, దుఃఖమునను మునిఁగి,
భరతుఁ డంపె రాముని, వనవాసమునకు!
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితనయుడను గద్దెపై చూడదగు తరుణము
రిప్లయితొలగించండిపాదుకలె ప్రభువను వార్త భరతు డంపె,
రాముని వనవాసమునకు లాఘవముగ
అనుపి కైక గైకొనె యాగ్రహంబు భువిని॥
🙏🌹🙏
రిప్లయితొలగించండి🙏 🌺🙏
తే**
జనని కోరిక మన్నించి జనత వదలి,
వనము కేగెను దశరథ ప్రథమ సుతుడు,!
నీదు పాదుక లేలును నిలను,ననుచు
భరతుడంపె రాముని వనవాసమునకు ,!!
..........అంబటి.
🙏🌹🙏
రిప్లయితొలగించండి🙏 🌺🙏
తే**
జనని కోరిక మన్నించి జనత వదలి,
వనము కేగెను దశరథ ప్రథమ సుతుడు,!
నీదు పాదుక లేలును నిలను,ననుచు
భరతుడంపె రాముని వనవాసమునకు ,!!
..........అంబటి.