14, మే 2016, శనివారం

పద్యరచన - 1222

కవిమిత్రులారా,
“పిలువకురా యలుగకురా...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ మీకు నచ్చిన అంశంపై పద్యాన్ని వ్రాయండి.

40 కామెంట్‌లు:

 1. పిలువకురా యలుగకురా
  పలుచన జేయంగ వలదు పదుగురి లోనన్ ?
  కలతలు రేపకు మరిమరి
  సలలిత ముగగావు మంటి సంతస మిడగన్
  ---------------------------
  పిలువ కురాయ లుగకురా ప్రీతి గనను
  పెద్ద లందరి యనుమతి వీడి యిటుల
  ఎటకొ బోవంగ నటునిటు చాటు బ్రతుకు
  నెంచి జూడంగ నెవ్విధి మంచి గాదు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మొదటి పద్యం అన్ని విధాల బాగున్నది. అభినందనలు.
   రెండవపద్యం మొదటిపాదంలో గణదోషం. అది ఆటవెలదిలో అంత సులభంగా ఒదగదు.

   తొలగించండి
 2. పిలువకురా యలుగకురా
  పలుకున దలపున బలుచన వలదిక రారా!
  వలపుల తళుకు నిలుపరా!
  యలుకను మానర! నరవర! యతివను గనరా!

  రిప్లయితొలగించండి

 3. పిలువకు రా యలుగకురా
  వలపుల రాజా జిలేబి వన్నెల కాడా
  తలపుల వచ్చిన తెమ్మర
  కలతల నివ్వక మరిమరి కమ్మగ రమ్మా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. పిలువకురా! యలుగకురా
  నలుగురిలో నున్నవేళ నందకుమారా!
  పలుచన యగునీ రాధకు
  వలికించకుమా మురళిని పరవశమగురా!!!

  రిప్లయితొలగించండి
 5. సరదా పద్యం

  పిలువకురా యలుగకురా
  నలుగురిలో, డాడి చూచి నలుగెడ తార్రా
  పలుగులతో, రాత్రికి నే
  సెలులో చాటింగు కొస్త చిలిపీ పోరా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సరదా పద్యం చిలిపిగా ఉంది. అభినందనలు.
   అన్యదేశ్యాలు,గ్రామ్యాలు లెక్కించే పద్యం కాదు ఇది!

   తొలగించండి
 6. పిలువకురా యలుగకురా
  కులుకకురా చెలగకు వినకుమురా కన్నా
  పలుకకురా తలపకురా
  విలపించకు మనువు గాని వేళల యందున్

  రిప్లయితొలగించండి
 7. పిలువకురా యలుగకురా
  చెలిమిని నేజే తునిపుడు చేష్టలు మానీ
  పిలువుము నీదరికిప్పుడు
  వలపులతో స్రుక్కి యుంటి వంశీ కృష్ణా !

  రిప్లయితొలగించండి
 8. . పిలువకురా|నలుగకురా
  నలుగురిలోగల విలువలు నలుపకురా|నీ
  తలపుల వలపుల తలుపులు
  కలుపకురా|ప్రేమకదియె గౌరవ మగురా|

  రిప్లయితొలగించండి
 9. పిలువకురా! యలుగకురా!
  వలపుల చెలువపు చెలియను పరిణయ వేళన్
  గలగల నగవులు చెలగగ
  నలుగు రెదుటను నగుబాటు నాకేలయిటన్.

  రిప్లయితొలగించండి
 10. పిలువకురా యలుగకురా
  కలవరపరచకుమునన్ను, కాళిక గుడిలో
  సలుపుచునుంటిని సేవలు,
  కలిసెద నేనసుర సంధ్యఁ గాంక్షలు తీర్చన్

  రిప్లయితొలగించండి
 11. పిలువకురా!యలుగకురా!
  కలతలు కలిగిన క్షణముల గంభీరుడవై
  పిలువుమురా!చేరుమురా!
  వలపులు పొంగగ వయారి వథువును ప్రేమన్.

  రిప్లయితొలగించండి
 12. పిలువకురా యలుగకురా
  పలువురు చూచేరు గాద పలుచన చేయన్
  వలదని బ్రతిమాలెద నా
  తలపున నిలిపితినినిన్ను దయచూపుమురా

  రిప్లయితొలగించండి
 13. పిలువకురా యలుగకురా
  చెలికాడానీ సరసన జేరుట నెట్లో
  పలువురు శంకించెదరట
  కలలో కనిపించి యిత్తు కమ్మని ముద్దుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘చూచెదరు గాదె, జేరుట యెటులో’ అనండి.

   తొలగించండి
 14. పిలువకురా యలుగకురా,
  వలపులు చిలుకగ బిడియము వారించంగా
  పలుకులు పెగలని దానను
  తలపున నిన్నే కొలిచిన దానను నేనే!

  రిప్లయితొలగించండి
 15. 1పిలువకురా యలుగకురా
  నలుగురిలో నను సతతము నందకుమారా
  చులకన చేయకు ధరలో
  విలువైనదెయిత్తునీకు వినరా కన్నా.

  2.పిలువకురా యలుగకురా
  ఛలమేల సతతము నిన్ను స్వామిగ తలతున్
  కలతను రేపకు మదిలో
  యిలలో నాపాలి దైవ మీవే గాదా

  3పిలువకురా యలుగకురా
  చులకనగా చూడకుమిటు చోద్యంబనుచున్
  నలుగురు నానా రీతిగ
  పలుకుదురిలలో ననయము భ్రాంతిన్ విడుమా.

  4పిలువకురా యలుగకురా
  కలతలు రేపకు మనమున,కన్నీరింకన్
  కలకాలముండ దనుకొని
  విలపించుట మాని నీవు వేగమె చనుమా.

  5 పిలువకురా యలుగకురా
  కలకల నవ్వుచు గబగబ గనుమా భావిన్
  కలతలు లేనట్టి బతుకు
  కలకాలము గడుపుదమిక కదులుము వడిగాన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఐదు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘మదిలో నిలలో’ అనండి.

   తొలగించండి
 16. పిలువకురా యలుగకురా
  పలుచన జేయకు ననుమరి పదుగురి లోనన్
  లలితా సహస్ర నామము
  లలనా మణులెల్లఁ జదువు ప్రాంగణ మందున్!

  రిప్లయితొలగించండి
 17. పిలువకురా యలుగకురా
  పలుమారులు నన్ను పిలిచి పలుచన చేయకు
  పలుకగ లేదని యలుగకు
  కలలోనైనా మరువను కద ప్రియసఖుడా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   రెండవపాదం చివర తప్పక గురువుండాలి. ‘కలలో నైనను’ అనండి.

   తొలగించండి
 18. పిలువకు,రా,యలుగకు,రా,
  వలపులు పండించు కొనుము వారిజావైరీ!
  కొలనున వికసించిన నీ
  కలువల రాణులము మమ్ము కరుణను గనుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘వారిజ’... ‘వారిజా’ అయింది.

   తొలగించండి
 19. పిలువకురా యలుగకురా
  గలభా జేయంగ మామి గట్టిగ చరచెన్
  కలతను జెందక చూడుము
  కలుగున టీవీని పాత కథలను జెర్రీ!

  మామి = Mammy (housemaid in Tom & Jerry)

  రిప్లయితొలగించండి