అంబటి భానుప్రకాశ్. గద్వాల. తే** మూర్ఖ తనమును విడువక మూఢు లయ్యి, తప్పు దారులు విడువక ముప్పు నొందె, మార్పు గోరక నెప్పుడు మంచి వినని, మతము మారని జనులకు హితము లేదు.
శంకరయ్య మాష్టారు గార్కి నమస్కారములు శంకరాభరణం బ్లాగు ద్వారా పద్యములు వ్రాసే అవకాశం కలిగినందుకు ఈవేదిక ద్వారా చాలామంది కవి మిత్రులు పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను .ధన్యవాదములు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మతము+అంటలేదు=మత మంటలేదు’ అవుతుంది. మీరు విసంధిగా వ్రాశారు. ‘యోగుల కేమత మంటలేదు’ అనండి. ‘మతము+ఏదని=మత మేదని’ అవుతుంది. అక్కడ ‘మతము లేవని’ అనండి.
శంకరాభరణం వారి నేటి సమస్య మతము మారని జనులకు హితములేదు నా పూరణ : s.k: 194 తే.గీ ఆత్మ యోగులకేమతమంటలేదు కాలచక్రమున్ మారేటి కాయమునకు మతములేవని చెప్పును మానవత్వ మతముమారని జనులకు హితములేదు
అందరున్ జను మార్గము నరగినపుడు
రిప్లయితొలగించండిమంచిజరుగును మనుజుల కంచితముగ
చెడ్డదారిన బోవుచు స్వీయపునభి
మతము మారనివారికి హితములేదు
స్వీయాభిమతాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎడ్డె మనగ మనము తాము తెడ్డెమనుచుఁ
రిప్లయితొలగించండిదెడ్డె మనగ మనము రెచ్చి యెడ్డెమనుచు
దారి లోనబడక రీతి మీర! రెట్ట
మతము మారని వారికి హితము లేదు.
భళా! రెట్టమతంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండిఎన్ని స్తవములు నుడివిన యున్న దొకటె
రిప్లయితొలగించండివిశ్వ మంతయు పాలించు విభుడొ కండె
మమత నిండిన మనమున సమత లేక
మతము మారని జనులకు హితము లేదు
అక్కయ్యా,
రిప్లయితొలగించండిసమత లేకుండా మారిన మతం హితం కాదన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వెతల గుందెడి వారల బ్రతుకులందు
రిప్లయితొలగించండిస్వాంత మందున గొలదిగ స్వార్థము విడి
యార్తి దొలగను దరినిడి యాదు కొనుట
మతము, మారని జనులకు హితము లేదు!
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
తొలగించండిసకల శాస్త్రంబులందున సార మెరిగి
రిప్లయితొలగించండివెలుగు నొందుచు నుండెడి వెజ్జు పలుకు
ప్రీతితోడవినియుగూడ ప్రేమతోన
మతము మారని జనులకు హితము లేదు
....శ్రీను, దువ్వూరు, కడప జిల్లా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘ప్రేమతోను’ అనండి.
సిరులు వెచ్చించి గెలిచెడు వరుస పెరుగ
రిప్లయితొలగించండినీతి మృగ్యమయ్యెను రాజనీతి లోన
ధనము రాజకీయమున ప్రధాన మనెడు
మతము మారని జనులకు హితము లేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమారవలెను మండూకపు మది తలంపు
రిప్లయితొలగించండిమారు సాంకేతికపు గొప్ప మార్పు గాంచి
నేటి యాధునికంబున నాటి యహిత
మతము మారని జనులకు హితము లేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమడియు ఆచారమనుచును మసలుచుండు
రిప్లయితొలగించండిమాన్యులెల్లరుయిలలోన మనుషులకును
దూరమయ్యెడి కాలమ్ము చేరువయ్యె
మతము మారని జనులకు హితములేదు
తనదు మతమింక యిలలోన తగినదనుచు
పలుకుచుందురు మూర్ఖులు ముల్కులట్లు
అట్టివారల వాదన అనవరతము
మతము మారని జనులకు హితములేదు
డా. సముద్రాల శ్రీనివాసాచార్యులు గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘ఎల్లరు+ఇలలోన’ అన్నపుడు యడాగమం రాదు. ‘మాన్యు లెల్లరీ యిలలోన మానవులకు’ అనండి.
రెండవపూరణ రెండవపాదంలో ప్రాసయతి తప్పింది. ‘ములుకులట్లు’ అంటే సరి.
ధన్యవాదములు
తొలగించండితనకు మాలిన పనులలో తలనుదూర్చి
రిప్లయితొలగించండిక్షణము తీరిక లేకుండ గడపుచుండి
ముఖ్యమైన పనులనవబోకుడు సత
మతము - మారని జనులకు హితము లేదు.
సతమతముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమతములేవైన జనులకు హితముకొఱకె
రిప్లయితొలగించండిహితవిహీనపు మతమది హేయమగును
మానవత్త్వము లేనట్టి మరొక దుష్ట
మతము, మారని జనులకు హితము లేదు.
మతములేవైన జనులకు హితముకొఱకె
రిప్లయితొలగించండిహితవిహీనపు మతమది హేయమగును
మానవత్త్వము లేనట్టి మరొక దుష్ట
మతము, మారని జనులకు హితము లేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅభిమతముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమంచితనము జూప మమత పెరుగు చుండు
మానవతయు పెరుగు మంచి జరుగు
తాము నమ్మినదియె ధరఁనిజ యభి
మతము మారని జనులకు హితము లేదు.
2.నాదు మతమె గొప్ప నావాదమేసత్య
మనెడి జనుల మనము యనవరతము
చింతల మయమగును చెరుపు కలుగ జేయు
మతము మారని జనులకు హితము లేదు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పూరణలో ‘మనము+అనవరతము’ అన్నపుడు యడాగమం రాదు. ‘హృదయ మనవరతము’ అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్య మతముల నెల్లసమాదరించు
రిప్లయితొలగించండిభారతమ్మకె కరువయ్యె భాగ్యమిలను
సొంత యింటిలోన సవతి సంతువోలె
నెట్టి సాయమ్ము నందని వెట్టి బతుకు
గడుపుచుండెను నేడహో! గనగ హిందు
మతము మారని జనులకు హితము లేదు!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంబటి భానుప్రకాశ్.
రిప్లయితొలగించండిగద్వాల.
తే**
మూర్ఖ తనమును విడువక మూఢు లయ్యి,
తప్పు దారులు విడువక ముప్పు నొందె,
మార్పు గోరక నెప్పుడు మంచి వినని,
మతము మారని జనులకు హితము లేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేలు గలుగును నిరతము బాల !వినుము
రిప్లయితొలగించండిమతము మారని జనులకు, హితము లేదు
మతము మార్పుల మూలాన మతపు విలువ
తెలియ కుండగ బోవుచు దీటు గాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఊషర క్షేత్రమునఁ బంట లుత్కటముగ
రిప్లయితొలగించండినెట్లు పండింతు రనెడి యన్వీక్ష లేక,
యందె వ్యవసాయమునుఁ జేతు; రట్టి భూక
మతము మారని జనులకు, హితము లేదు!
భూకమతాన్ని తీసుకొని వైవిధ్యంగా చక్కని పూరణ నందించారు. అభినందనలు.
తొలగించండిధనము నధికారబలము గల్గిన వటంచు
రిప్లయితొలగించండివెట్టి చాకిరీచే హింస పెట్టు వెడగు
మతము - మారని జనులకు హితము లేదు
ఇహపరమ్ముల శిక్షలు ఇది నిజమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘శిక్షలు+ఇది’ అన్నపుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాశారు.
కాల ధర్మంబిది జనుల కేల చింత
రిప్లయితొలగించండిరైతునకు నైన క్షేత్రంపు దాత కైన
చాలు నంచును నిర్దిష్ట కాలమున క
మతము మారని జనులకు హితము లేదు.
కమతముతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండినమస్కారం....
రిప్లయితొలగించండినాపేరు ముడుంబ ప్రవీణ్ కుమార్
నేటి సమస్యకు నా పూరణం...తప్పులుంటే సవరించ గలరు....
రోజు రోజుకు జరిగెడి రొచ్చు లన్ని
చూసి చూసి విసుగుజెంది చూపు దిప్పి
మరలి పోయెడి వారల మనమున అభి
మతము మారని జనులకు హితము లేదు
ముడుంబ ప్రవీణ్ కుమార్ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మనమున నభి|మతము...’ అనవచ్చు కదా! సాధారణంగా పద్యాలలో అచ్చులు రాకూడదు.
ధన్యవాదములు గురువుగారు...
తొలగించండి🌺🌻🌺
రిప్లయితొలగించండితే**
పెళ్ళి చూపుల యందును ప్రియము బల్కి,
కట్న కానుక తోడుగ కలిమి గోరి !
వధువు తలిదండ్రు విసిగించు వరుస "దప్పు
మతము "మారని జనులకు హితము లేదు. !!
🌸అంబటి భానుప్రకాశ్.🌸
మీ పద్యం బాగుంది. అభినందనలు.
తొలగించండి‘తలిదండ్రు’ అని ప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘వధువు తండ్రిని విసిగించు..’ అనండి.
కలియుగమ్మున కాంతయు కనకమున్న
రిప్లయితొలగించండిచాలునంచును తలచెడు చపల బుద్ధి
కలిగినట్టి వారెల్లరికను తమయభి
మతము మారని జనులకు హితము లేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలవు కుందేటి కెపుడును కాళ్ళుమూడె
రిప్లయితొలగించండియనుచు బలికెడి మూర్ఖుల నాపగలమె ?
హేతువాదన కాదన జూతు , రట్టి
మతము మారని జనులకు హితము లేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమానవత్వము నిలుపగ మంచి సలుపు
రిప్లయితొలగించండిమతము|”మారనిజనులకు హితములేదు
చదువు,సంస్కారమేదగ్గ?ముదము కరవే|
విలువ లంచెడి విద్యయే నిలుపు మతము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘విలువ లంచెడి’...?
* గు రు మూ ర్తి ఆ చా రి **
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఏసు మత ప్రచారకు డిట్లు కూసె " మైకు "
న౦దు :-- నేసు మాత్రమె ప్రభు డ౦దరికిని |
ి
ియేసు రక్తమె పాపాల నెల్ల గడుగు |
యేసు మతములో నే చేరు మి౦క. | మీ కు
మతము మారని జనులకు హితము లేదు ! !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేపూరిశ్రీరామారావు గారి పూరణ....
రిప్లయితొలగించండికష్ట సుఖములు జోడెడ్లుకదులుకలిసి
ఇష్టపడుతునెసాగించు పయనములను
మనము సందర్భమునుబట్టి మారుటనభి
మతము,మారని జనులకు హితములేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసార్ మీ వ్యాఖ్యానం?
రిప్లయితొలగించండిమాదు మతము గొప్పదనుచు మభ్యపెడుతు
రిప్లయితొలగించండిమతము మారగ పలు బహుమతులనిస్తు
ముందు మతమును మార్చెడు మూర్ఖపుయభి
మతము మారని జనులకు హితములేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘మభ్యపెట్టి... బహుమతుల నిచ్చి... మూర్ఖపు టభి...’ అనండి.
NVN చారి గారి పూరణము:
రిప్లయితొలగించండిదారి గాచి దోచెడి బోయ దారి మారి
పుట్టలోనుండి వెల్వడ్డ పుణ్య వ్రతుడు
వ్రాసె వాల్మీకి తానౌచు రామ చరిత!
మతము మారని జనులకు హితము లేదు!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిNVN చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేద ధర్మాన బుట్టియు, విహిత కర్మ
రిప్లయితొలగించండిములకు దూరమై, పాపము పుణ్యమనగ
శ్రద్ధలే కెండమావుల జనెడు, దురభి
మతము మారని జనులకు హితము లేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిVidhya leni paamara sabha Madhya nilachi
రిప్లయితొలగించండిPamdituni vole nokkamdu balike nitula
Matamu maarani janulaku hitamu ledu;
Gtamu gatamanu variki gatulu levu
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితక్కువెక్కువ కులముల తగవు వీడి
రిప్లయితొలగించండితగ్గు హెచ్చుల యధికారతాత్వ ముడిగి
లేమి కలుముల తేడాలు లేక సతము
సర్వ సమభావమున బ్రజల్ చనుట సుఖము
మతము మారనివారికి హితములేదు
మతుల భేదముననె మత భేదము గల్గె
ఎన్ని మతములున్న నీశుడొకడె
దారులేన్ని యున్న చేరునదొక యూరె
యీ నిజంబెరుంగ నెసగు సుఖము
వద్దూ(డ్డూ)రి రామకృష్ణ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శంకరయ్య మాష్టారు గార్కి నమస్కారములు శంకరాభరణం బ్లాగు ద్వారా పద్యములు వ్రాసే అవకాశం కలిగినందుకు ఈవేదిక ద్వారా చాలామంది కవి మిత్రులు పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను .ధన్యవాదములు
తొలగించండిలలితా ప్రవల్లిక ఘాలి గారి పూరణ....
రిప్లయితొలగించండిఆత్మ యోగులకుమతము అంటలేదు
కాల చక్రమున్ మారేటి కాయమునకు
మతము ఏదని చెప్పును మానవత్వ
మతముమారని జనులకు హితములేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘మతము+అంటలేదు=మత మంటలేదు’ అవుతుంది. మీరు విసంధిగా వ్రాశారు. ‘యోగుల కేమత మంటలేదు’ అనండి. ‘మతము+ఏదని=మత మేదని’ అవుతుంది. అక్కడ ‘మతము లేవని’ అనండి.
ధన్యవాదములు శంకరయ్య మాస్టారు గారు
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి నేటి సమస్య
రిప్లయితొలగించండిమతము మారని జనులకు హితములేదు
నా పూరణ :
s.k: 194
తే.గీ
ఆత్మ యోగులకేమతమంటలేదు
కాలచక్రమున్ మారేటి కాయమునకు
మతములేవని చెప్పును మానవత్వ
మతముమారని జనులకు హితములేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమారేటి -> మారెడు, మతము లేవని -> మతము లేదని.... అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమతము లెంచియు చూడగా మమత యొకటె
రిప్లయితొలగించండిమనసు యొక్కటె చేర్చును మనిషి నెపుడు
ఫలము యున్న చోట కలుగు ప్రతి ఫలము
మతము మారని జనులకు హితము లేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికల్ల బొల్లిమాటలుతోటి కథలు జెప్పి,
రిప్లయితొలగించండిధర్మ లక్షణదశకము దారితప్ప,
గద్దె నెక్కిన నేతలు గతము మరచు
మతము మారని వారికి హితము లేదు.
అచ్చు తప్పున్నదిచటను ముచ్చటైన:
రిప్లయితొలగించండి"మతము మారని జనులకు హితము లేదు"
"అసలు హైదరబాదు"న సిసలు గాను:👇
మతము మారిన జనులకు హితము లేదు!