భోజరాజు వింత కోరిక
రచన : కంది శంకరయ్య
భోజరాజున కొకనాఁడు పొడమె నొక్క
వింత కోరిక, “నే మరణింతు నేని
యెట్లు స్పందింతు?” వనుచు ప్రశ్నించెఁ గాళి
దాసు; నది విని వెఱగంది “తప్పు గాదె
యిట్లు మాటాడ, నే నిప్పు డిట్టి శ్లోక
మొక్కటైనను విన్పించ నొప్ప” ననెను;
కనలి యారాజు “నామాట గౌరవింప
కిట్లు రాజాజ్ఞధిక్కార మెంతొ చేసి
నాఁడ, విపుడె నా రాజ్యము వీడు” మనఁగ,
వెడలె తనయిచ్చ వచ్చిన కడకుఁ గవియు;
కొంతకాలము గడచిన యంత కాళి
దాసు లోపమ్ము గుర్తించి ధరణిపతియు
మారువేషమ్ముతోడ నూరూరు దిరిగి
వెదకుచుండఁగ నొకచోఁ గవిం గనుఁగొని
వందనము సేయ “నెవఁడ? వేపట్టణమ్ము
నీ?” దనుచు పృచ్ఛ సేయఁగా “నే నొకప్పు
డుంటి ధారానగరమునఁ, గంటికివెలుఁ
గైన భోజుఁడు మరణింప నది విడిచితి”
ననఁగ, నామాటలు విని యత్యధిక దుఃఖ
వివశుఁడై శ్లోక మొక్కటి వినిచె నిట్లు
“అద్య ధారా నిరాధారా
నిరాలంబా సరస్వతీ |
పండితాః ఖండితా స్సర్వే
భోజరాజే దివంగతే ||”
కొర్కె తీరిన భోజుఁడు గూలి మడిసెఁ;
బడిన భూపతిఁ గని గుర్తుపట్టి ఖేద
మంది యుమఁ గొల్చి శ్లోకము నచ్చటచట
స్వల్పభేదముల్ గల్పించి పలికె నిట్లు
“అద్య ధారా సదాధారా
సదాలంబా సరస్వతీ |
పండితాః మండితా స్సర్వే
భోజరాజే భువం గతే ||”
అమ్మహాకవివాక్ప్రభావమ్ముచేత
బ్రతికె భోజుఁడు, కవి కిడె వందనమ్ము,
లిరువు రానందమున పయనించి నెలవు
చేరి గడిపిరి బ్రతుకు సస్నేహముగను.
(ఇది గతంలో మన బ్లాగులోనే ‘చమత్కార పద్యాలు’ శీర్షికలో ఇచ్చినదే!)
నమస్కారములు
రిప్లయితొలగించండిఅవును ఆ రోజుల్లో కాళిదాసు పద్యములకు [భక్తికి]అంతటి మహత్తు ఉండేదట .చాలా చక్కని విషయాన్ని వివరించారు. గురువులకు ధన్య వాదములు
అక్కయ్యా,
తొలగించండిధన్యవాదాలు.
కవి వాక్కుకు గల శక్తి గురించి తెలియ జేసిన గురువర్యుల ఖండ కావ్యం అద్భుతం. గురువర్యులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీరు స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసి మహదానందం చెందాను. మీ విదేశయానం (మీరు ఫేసుబుక్కులో పెట్టిన చిత్రాల ఆధారంగా) సుఖంగా, మనోరంజకంగా సాగిందని భావిస్తున్నాను.
ఇది ఏ చందస్సులో ఉంది???
రిప్లయితొలగించండిఇది తేటగీతి. కేవలం నాలుగు పాదాలుంటే తేటగీతి. అంతకు ఎక్కువ పాదాలుంటే తేటగీతిక లేద గీతమాలిక అనవచ్చు. అన్ని పాదాలూ సమాన లక్షణం కలిగిన పద్యాలకే అవకాశం. ఆటవెలది, కందం వంటి పద్యాలకు ఈ అవకాశం లేదు.
తొలగించండివింత కోరిక కోరిన విభుని కధను
రిప్లయితొలగించండికాళి దాసుమ హాకవి కదన విధము
నద్భు తంబుగ వ్రాసిన నార్య !శంక
రయ్య !వందన శతముల నందు కొనుము
ధన్యవాదాలు సుబ్బారావు గారూ!
తొలగించండిమిత్రులు శంకరయ్యగారికి నమస్సులు! భోజ కాళిదాసుల ప్రస్తావనతో నద్భుతమైన కవితా ఖండికను వెలయించినారు. కథను లలితమైన పదాలతో, ధారాళతతో, ధారాధీశుని యుదారతను కాళిదాసుని మహత్త్వ కవిత్వ ధారాలంబతను బ్రత్యక్షపఱచినారు. శుభాభినందనలతో....
రిప్లయితొలగించండిభవదీయుడు
గుండు మధుసూదన్
మధురకవి మధుసూదన్ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. తియ్యటి తేటతెలుగులో తేటగీత మాలికలో భోజరాజు కాళిదాసుల మైత్రీ బంధమద్దము పట్టి జూపించారు. మహాకవి వాక్శుద్ధి తేటతెల్లమయినది. అభినందనలు.
రిప్లయితొలగించండికామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
పూజనీయులు, శంకరయ్యగారికి వందన శతములు. భోజ.కళిదాసు లిరువురును బ్రహ్మ సరస్వతులు కదా! వారిని గురించి ఎన్ని కథలువిన్నా తనివిదీరదు.వారు వాగర్థముల వంటివారు.మనోహర కవితను వెలయించిన మీకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపూజనీయులు, శంకరయ్యగారికి వందన శతములు. భోజ.కళిదాసు లిరువురును బ్రహ్మ సరస్వతులు కదా! వారిని గురించి ఎన్ని కథలువిన్నా తనివిదీరదు.వారు వాగర్థముల వంటివారు.మనోహర కవితను వెలయించిన మీకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీకంది శంకరయ్య గురువర్యులకు మీరచన ఖండకావ్యము నీతిదాయకముచాలాసంతోషము
రిప్లయితొలగించండి7.5.16. మమతలు వీడిన తీగే
సమతల మాశించి నట్లు శంకర కావ్యం
బమరిక దెలుపగ?తెలివిగ
గమనించిన కాళిదాసు కల్పిత కథయే|
గురుదేవుల ఖండకావ్యము భేషుగా నున్నది.
రిప్లయితొలగించండిపొన్నెకంటి వారికి, ఈశ్వరప్ప గారికి, గుండా వారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచాలా మధురంగా లలితంగా వ్రాసారు గురువుగారు..తెలియని మంచి కధను ఖండకావ్యంగా మాకందించారు..ధన్యవాదములు..
రిప్లయితొలగించండిమాయింట్లో భోజకాళిదాసు కథలు అనే పుస్తకం ఉండేది. దాన్లో ఈకథ చదివాను. అదభుతంగా మలచారు ఖండకృతిగా గురువుగారు.
రిప్లయితొలగించండిశైలజ గారూ,
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
ధన్యవాదాలు.
గురువు గారికి నమస్సులు.... మహాకవి కాళిదాసు జీవితంలో నొక మహత్తర ఘట్టాన్ని కమనీయంగా అందంచారు....ధన్యవాదములు
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్సులు.... మహాకవి కాళిదాసు జీవితంలో నొక మహత్తర ఘట్టాన్ని కమనీయంగా అందంచారు....ధన్యవాదములు
రిప్లయితొలగించండిగురువు గారూ నమస్కారములు మీరు వ్రాసిన తేటగీతి మాలిక చాలా బాగుంది ధన్యవాదములు
రిప్లయితొలగించండిసులభమైన శైలలో వివరించినారు. మీకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండిసార్ నమస్కారాలు ....
రిప్లయితొలగించండిఈ కథను ఇటీవలనెే చదివాను. మీ పద్యంలో కథను చాలా చక్కగా వర్ణించారు.
చాలా బాగుంది సర్ ఖండిక.
ధన్యవాదములు....
అద్భుతం సర్
రిప్లయితొలగించండితేటతేట పదాలు తేటగీతి మాలికలు
అద్భుతం సర్
రిప్లయితొలగించండితేటతేట పదాలు తేటగీతి మాలికలు