22, మే 2016, ఆదివారం

సమస్య - 2041 (లవకుశులు మేనమామలు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లవకుశులు మేనమామలు లక్ష్మణునకు.

86 కామెంట్‌లు:

  1. రామ కథనుపా డెనెవరు రమ్యముగను
    రామ కృష్ణులా యభిమన్యు కేమి యగును?
    ఎవనికి మఱపు తెప్పించె నింద్ర జిత్తు?
    లవకుశులు, మేనమామలు, లక్షణునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పాడి రెవరు... కేమి యగుదు| రెవనికి..’ అనండి.

      తొలగించండి
  2. తల్లి దండ్రుల ప్రేమంత తరలు వరకు
    నమ్మి గొలిచెడి సాధ్వియె నిమ్మ ళించు
    నెవరి కెవరును గాబోరు నిలువ నిచట
    లవకుశులు,మేనమామలు,లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ఏదో వేదాంత ధోరణిలో చెప్పారు కాని భావం అవగాహన కాలేదు. సమస్య పరిష్కరింపబడినట్లు అనిపించడం లేదు.

      తొలగించండి
    2. తల్లి దండ్రుల ప్రేమించు తనయు డనగ
      నమ్మి గొలిచెడి సాధ్వియె వమ్ము గాదు
      బంధు మిత్రులె బహుప్రీతి బంధ ములకు
      లవకుశులు,మేనమామలు,లక్ష్మణు నకు

      తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది.
      రెండవ, మూడవ పాదాలలో యతిదోషం. సవరించండి.

      తొలగించండి
    2. క్రమముజూడఁగ రాముని కొమరు లెవరు?
      శీరి,శౌరియు నభిమన్యు కేమి యగును? వరుసకెవ్వారికి సీతమ్మ వదినె యగును?
      లవకుశులు, మేనమామలు,లక్ష్మణునకు

      తొలగించండి
    3. క్రమముజూడఁగ రాముని కొమరు లెవరు?
      శీరి,శౌరియు నభిమన్యు కేమి యగును? వరుసకెవ్వారికి సీతమ్మ వదినె యగును?
      లవకుశులు, మేనమామలు,లక్ష్మణునకు

      తొలగించండి
  4. డా.ఎన్.వి.ఎన.చారి 9866610429
    అశ్వమును బట్టి బంధించి నాపి రెవరు?
    అమ్మ పుట్టిల్లు నెవరికి స్వంత మగును?
    ఊర్మిళా దేవితన ప్రేమ నెవరి కొసగె?
    లవ కుశులు,మేన మామలు,లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ, మూడవ పాదాలలో యతిదోషం. ‘బంధించి యాపి రెవ్వ| రమ్మ పుట్టింట నుండు చుట్టమ్ము లెవ్వ| రూర్మిళ యెవనికి సతియై యెప్పె దాను’ అందామా?

      తొలగించండి
  5. ఎవరు వాల్మీకి చెంత జదువు నరసిరి?
    అమ్మ పుట్టింటి సోదరు లనగ నెవరు?
    రామ చంద్రుపై నెవరికి ప్రేమ మెండు?
    లవకుశులు, మేనమామలు, లక్ష్మణునకు!

    రిప్లయితొలగించండి
  6. రాఘవుని సుతులెవ్వరు రసను జూడ?
    బాలుడభిమన్యు కేమగు బలుడు, వృష్ణి?
    ఎవరికొరకు సంజీవిని దెచ్చె హనుమ?
    లవకుశులు, మేనమామలు, లక్ష్మణునకు!!!

    రిప్లయితొలగించండి
  7. బాలతాపసు లనునట్లు వనము నందు
    పెరిగి హయమును గట్టిన వీరులెవరు
    తల్లితోబుట్టు వేమగు తనయులకిల
    జానకి సహోదరెవరికి జాయ యౌను
    లవకుశులు మేనమామలు లక్ష్మణునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘సహోదరి+ఎవరికి’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘సహోదరి యెవరి జాయ యగును’ అనండి.

      తొలగించండి
  8. కల్లు సేవించినట్టి శకారుఁ డనెను
    “దశరథుఁడు రావణునకు ముత్తాత యగును
    వాలి సుగ్రీవునకు మేనబావ యగును
    లవకుశులు మేనమామలు లక్ష్మణునకు.”

    రిప్లయితొలగించండి
  9. అన్న వెంటను నడచిన అనఘుడనుచు
    అతని ఘనతను కొనియాడి హారతిచ్చె
    అన్న, వదినయు, భరతుడు, అమ్మ, జనులు
    లవకుశులు, మేనమామలు, లక్ష్మణునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      ‘హారతి+ఇచ్చె’ అన్నపుడు యడాగమం వస్తుంది లేదా ‘హారతి నిచ్చె’ అవుతుంది. ‘హారతి నిడి| రన్న వదినలు...’ అనండి.

      తొలగించండి
  10. ఐదు పాదాలయ్యాయి.వుండవచ్ఛా దయచేసి తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమపాదాలుండే వృత్తాలు, తేటగీతి, ద్విపద, సీసం ఎన్నిపాదాలైనా ఉండవచ్చు. విషమపాదాలుండే ఆటవెలది, కందపద్యాలకు ఈ అవకాశం లేదు.

      తొలగించండి
    2. శంకరయ్య గారూ...వృత్తాలు మాత్రమే ఎన్నిపాదాలైన రాయొచ్చు. జాతులకు ఆ వీలు లేదని చదివాను

      తొలగించండి
  11. సద్గుణుడులక్ష్మనుని తల్లి సుగుణశీల
    సాధ్వియె సుమిత్ర నటనామె సోదరులను
    కోరి తాతల వరుసను కల్గియుండ
    లవకుశులు,మేనమామలు లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సుమిత్ర యట నామె...’ అనండి.

      తొలగించండి
  12. డా.ఎన్.వి.ఎన.చారి 9866610429
    అశ్వమును బట్టి బంధించి యాపి రెవరు?
    అమ్మ పుట్టిల్లు నెవరికి స్వంత మగును?
    ఊర్మిళా దేవి యెవరికి నొసగె ప్రేమ?
    లవ కుశులు, మేన మామలు ,లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
  13. కాదు కాదె ప్పటి కిని నా కవలు లైన
    లవకుశులు మేనమామలు లక్ష్మ ణునకు
    వార గుదురార్య!యతనికి వరుస కుకొమ
    రులిల నిట్లుగా బంధము దెలియవలయు

    రిప్లయితొలగించండి
  14. లలిత వదనుండు కృష్ణుండు లక్ష్మణుండు
    పల్లె పల్లెల నున్నట్టి బాలు రెల్ల
    నేలఁ గూలిరి కంసాధి నేతల చల
    లవ, కుశులు, మేనమామలు లక్ష్మణునకు.
    [ లక్ష్మణుండు = శ్రీమంతుడు; కుశులు = పాపులు; కంసాధి నేతల, కుశులు, మేనమామలు: రాజస బహువచనము.]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘చలలవ’..?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “చలవ” పొరపాటున నొక “ల” యెక్కువ యయ్యింది. సవరించిన పూరణ తిలకించ గోర్తాను.

      లలిత వదనుండు కృష్ణుండు లక్ష్మణుండు
      పల్లె పల్లెల నున్నట్టి బాలు రెల్ల
      నాశనమయిరి కంసాధి నాయకుల చ
      లవ, కుశులు, మేనమామలు లక్ష్మణునకు.

      తొలగించండి
  15. బాల రామాయణమ్మును భక్తితోడ
    నాటకమ్మును దీర్చిరిమేటిగాను
    ముచ్చటగ నటించిన రాము పుత్రులైన
    లవకుశులు మేనమామలు లక్ష్మణునకు!

    రిప్లయితొలగించండి
  16. రాము నెదిరించిన పసి వారలెవరయ్య?
    ఆమ్మ సోదరులు వరుస కగుదు రేమి?
    ఎవరి కినగు నూర్మిళ పత్ని యెంచిచూడ?
    "లవకుశులు, మేనమామలు, లక్ష్మణునకు"

    రిప్లయితొలగించండి
  17. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    తండ్రి నెదిరించి నిల్చిన తనయు లైరి
    లవ కుశులు,మేన మామలు లక్ష్మణునకు తెచ్చి రెన్నియొ కాన్కలు తేరు లందు
    బాల సారెను జేయగా భాసు రమువ

    రిప్లయితొలగించండి
  18. అశ్వమును బంధించిన యన్నదమ్ము
    లెవరు?కంసుడు కృష్ణున కేవరుసగగు
    మారుతెవరికి మందిచ్చె మహిని చెపుమ?
    లవకుశులు,మేనమామలు లక్ష్మణునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కంసుడు ఏకవచనం, మేనమామలు బహువచనం... ‘మారుతి+ఎవరికి’ అన్నపుడు యడాగమం వస్తుంది.

      తొలగించండి
  19. తండ్రితో పోరు సల్పిన తనయు లెవరు ?

    తల్లి సోదరులేమగు తనయులకును ?

    ఊర్మిళెవరికి భార్యగా కూర్మి మెలగె ?

    లవకుశులు ; మేనమామలు ; లక్ష్మ్మణునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఊర్మిళ+ఎవరి’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘ఊర్మిళ యెవరి భార్యగా...’ అనండి.

      తొలగించండి
    2. సవరించిన పద్యము.

      తండ్రితో పోరు సల్పిన తనయు లెవరు?

      తల్లి సోదరులేమగు తనయులకును ?

      ఊర్మిళ యెవరి భార్యగా కూర్మి మెలగె ?

      లవకుశులు ; మేనమామలు ; లక్ష్మ్మణునకు

      తొలగించండి
  20. క్రమముజూడఁగ రాముని కొమరు లెవరు?
    కృష్ణ,బలరాము లభిమన్యు కేమి యగును? వరుసకెవ్వారికి సీతమ్మ వదినె యగును?
    లవకుశులు, మేనమామలు,లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘..కే మగుదురు| వరుస నెవరికి సీతమ్మ...’ అనండి.

      తొలగించండి
  21. లవకుశులు మేనమామలు లక్ష్మణునకు
    పల్లెటూర్లకు గర్వంబు బంచు కొరకు
    నాటకంబు ముగియగనె చాటిరచట
    తగిన బహుమతు లొసగగ తరలివచ్చి {చిన్నిపిల్లలనాటకము.లవకుశులులక్ష్మణునకుమేనమామలే}

    రిప్లయితొలగించండి
  22. మొదటి పూరణ లో దోషమున్నది. మన్నించవలెను.🙏
    ...........
    క్రమముజూడఁగ రాముని కొమరు లెవరు?
    కృష్ణ,బలరాము లభిమన్యు కేమి యగును? వరుసకెవరికి సీతమ్మ వదినె యగును?
    లవకుశులు, మేనమామలు,లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
  23. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { లక్ష్మణపాత్రధారిని లవకుశ వేష ధారులు మరియు నతని మేనమామలు , రావణపాత్ర ధారిని రామభరత వేషధారులు మరియు అతని
    సోదరులు సన్మాని౦చిరి }
    ……………………………………………......


    బాల బాలిక లెల్ల మా పల్లె లోన

    రామ కథ బ్రదర్శి౦చిరి రమ్యముగను ;

    సత్కరి౦ప దలచిరి వేషకుల నెల్ల

    పాత్రధారులు మరి వారి బ౦ధు జనులు ;

    లవ కుశులు - మేనమామలు లక్ష్మణునకు

    రామభరతులు - సోదరుల్ రావణునకు

    రిప్లయితొలగించండి
  24. తే.గీ:సంయముండైన వాల్మీకు ఛాత్రు లెవరు
    మాద్రి సుతులకు నేమగు మద్రరాజు
    ధర్మపత్నియెవరి కయ్యె నూర్మిళమ్మ
    లవకుశులు మేనమామలు
    లక్ష్మణునకు.

    రిప్లయితొలగించండి
  25. జానకీ మాత కెవ్వారు జనన మొందె?
    తల్లియన్నల నేమని తలతు రెపుడు
    ఊర్మిళెవ్వరి భార్యయై ఉండెనకట
    లవకుశులు--మేనమామలు---లక్ష్మణునకు
    రాసిన వారు విద్వాన్ తంగిరాల తిరుపతి శర్మ, నెల్లూరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఊర్మిళ+ఎవరి’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘తలతు రెప్పు| డూర్మిళ యెవరి భార్యయై...’ అనండి.

      తొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రయత్నం ప్రశంసనీయం. కొన్ని సంధిగత దోషాలు. రెండవపాదానికి అన్వయం కుదరదు. మరో ప్రయత్నం చేయండి.

      తొలగించండి
    2. క్షమించండి మరల ప్రయత్నించెద

      తొలగించండి
    3. క్షమించండి మరల ప్రయత్నించెద

      తొలగించండి
  27. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    తండ్రి నెదిరించి నిల్చిన తనయు లైరి
    లవ కుశులు,మేన మామలు లక్ష్మణునకు తెచ్చి రెన్నియొ కాన్కలు తేరు లందు
    బాల సారెను జేయగా భాసు రమువ

    రిప్లయితొలగించండి
  28. సవరించిన పద్యమోసారి చూడండి.


    అశ్వమును బంధించిన యన్నదమ్ము
    లెవరు? అమ్మ తమ్ము లిలను నేవరుసగు
    ఊర్మిళా దేవి యెవరికి యువిద యయ్యె
    లవకుశులు,మేనమామలు లక్ష్మణునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపాదంలో గణదోషం. ‘అశ్వమును పట్టుకున్నట్టి యన్నదమ్ము..’ అనండి.

      తొలగించండి
  29. సవరించిన పద్యమోసారి చూడండి.


    అశ్వమును బంధించిన యన్నదమ్ము
    లెవరు? అమ్మ తమ్ము లిలను నేవరుసగు
    ఊర్మిళా దేవి యెవరికి యువిద యయ్యె
    లవకుశులు,మేనమామలు లక్ష్మణునకు.

    రిప్లయితొలగించండి

  30. కౌన్ బనేగా కరోడ్ పతి లో జిలేబి తెలివి :)

    కోటి రూపాయలకొరకు కొచ్చెను వినె
    లక్ష్మణుడునేమి యగును ఆ లవకు శలకు ?
    లవకుశులు మేనమామలు లక్ష్మణునకు,
    తడుము కొనక జిలేబి సత్యముగ జెప్పె !


    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదాన్ని ‘లక్ష్మణుని చుట్టరిక మేమి లవకుశులకు’ అనండి.

      తొలగించండి
  31. రామచంద్రుల వారి వారసు లెవరగు?
    తల్లి తోడ పుట్టిన యన్న దమ్ములెవరు?
    తమ్ముడన నెవ్వనికి చెల్లు ధరణి యందు?
    లవకుశులు! మేనమామలు! లక్ష్మణునకు!

    రిప్లయితొలగించండి
  32. కలికి జానకి కన్నట్టి కవలలెవరు?
    మాతులపద బహువచన మనగనేది?
    ఊర్మిళాదేవి యెవరికి నుండెసతిగ?
    లవకుశులు,మేనమామలు,లక్ష్మణునకు.

    రిప్లయితొలగించండి
  33. తండ్రి నెదురించ జూచిన తనయు లెవరు ?
    తల్లి సోదరు లెవ్వరు తనయునకగు ?
    తల్లిగా సీత తనరెను తానెవనికి ?
    లవకుశులు , మేనమామలు , లక్ష్మణునకు.

    రిప్లయితొలగించండి
  34. టేకుమల్ల వెంకటప్పయ్య గారికి శతసహస్రనమస్సుమాంజలి
    మీ పూరణ చాలా అద్బుతం ఆనందదాయకం మీకు అనంతాభినందనలు
    డా సముద్రాల శ్రీనివాసాచార్య

    రిప్లయితొలగించండి
  35. గురువు గారికి కవి మిత్రులకు నమస్కారములు

    రాముని సుతులెవ్వరు? బల రామ కృష్ణు
    లేవరుసయభి మన్యున, కెవ్వరికిని
    ఊర్మిళసతియయ్యె ననుచు పేర్మితోడ
    నడగగ నొకబాలుడు చెప్పె నద్భుతముగ
    లవకుశులు మేనమామలు లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
  36. జంగిలమ్మునఁబుట్టిన జంట యెవరు?
    చెల్లి బిడ్డగా మీసేవ జేయునెవరు?
    అడవి కేగ రాము డెవరి కనుమతిచ్చె?
    లవకుశులు , మేనమామలు, లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
  37. క్షమించాలి, కామేశ్వరరావు గారు. మీ పద్యం నుండి మరికొంత అన్వయము కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారు నమస్కారములు. మొదటి పాదములో కృష్ణున్ని లక్ష్మణుడంటే శ్రీమంతుఁడని ( శ్రీ రమా నాధుడు కూడా) నిర్వచించాను కదా. ఆశ్రీమంతుడికి, బాలల మరణానికి కారకుడూ, పాపాత్ముడు నైన కంసుడు, మేనమామ యని నా భావము.

      తొలగించండి
  38. "మేనమామలు" అని బహువచనం సమస్యలో ఉండటం వలన అన్వయం కుదరక అడిగాను.విమర్శకాదు.అన్యధాభవింపవలదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. [ లక్ష్మణుండు = శ్రీమంతుడు; కుశులు = పాపులు; కంసాధినాయకుల, కుశులు, మేనమామలు: రాజస బహువచనము.]

      తొలగించండి
  39. sir savarinchaanu chudandi
    తల్లి సీతమ్మరాముల తనయులెవరు ?
    వధువు తట్టెత్తి పెండ్లందు వచ్చెదెవరు ?
    శూర్ప ణక రూపు మార్చిన శూరుడెవరు ?
    లవకుశులు,మేనమామలు,లక్ష్మణునకు
    2
    రామ కథలకు కూర్చిరి రాగములను
    అమ్మ సోదరుల్ మ రినేను అనెదనుఇల
    (హనుమ తెచ్చెసం జీవిని హస్తముంచి)
    అన్నయున్నను చా లాలి అక్కర్లేదు
    లవకుశులు,మేనమామలు లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పూరణ బాగుంది. ‘తట్టనెత్తి, పెండ్లియందు’ అనాలి. అలా అంటే గణదోషం అవుతుంది.
      రెండవపూరణలో ‘అమ్మ తోబుట్టువులను నే నందు నిట్టు| లన్న యున్నను చాలని యాలిని విడె’ అనండి.

      తొలగించండి
    2. దన్యవాదములు శంకరయ్యగారు
      తట్ట నెత్తి పెండ్లియందు అన్నప్పుడు గణాలు చూడండి
      మరొక్కమారు పరిశీలన చేయవలసినదిగా మనవి

      తొలగించండి
    3. దన్యవాదములు శంకరయ్యగారు
      తట్ట నెత్తి పెండ్లియందు అన్నప్పుడు గణాలు చూడండి
      మరొక్కమారు పరిశీలన చేయవలసినదిగా మనవి

      తొలగించండి



  40. నారి సీతమ్మ పుత్రుల నామములెవి?
    తల్లి యన్నయు తమ్ములు తనయకెవరు?
    హనుమ యెవ్వరికైదెచ్చె నౌషదములు?
    లవకుశులు, మేనమామలు, లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి
  41. తను పెండ్లాడినభర్తను
    తనపిల్లల నత్తమామ తండ్రుల నిలలో
    కవయకతిరిగిన కించిత్
    కనికరముంజూపదగదుకాంతలపైనన్

    రిప్లయితొలగించండి
  42. వినదగు పెద్దల మాటల
    ననుభవమున జెప్ఫుచుందు రందరి యెదుటన్
    సునయన సుందరి జవ్వని
    గని కరమును జూప దగదు కాంతల పైనన్.

    శ్రీ కంది శంకరయ్య గురువుగారికి వందనములు

    మీరు సూచించాన పొరపాట్లు టైపింగు చేయడములో జరిగినవి
    టైపింగ్ పొరపాట్లను కూడా కాకుండా చూచుకోవడములో పొరపాటు జరిగింది మీ సూచనకు ధన్యవాదములు

    పదిమందిలో అందమైన స్త్రీల వైపు చేయి చూపించుట మంచిది కాదని ఉహించి వ్రాశాను
    భావము కుదరలేదేమో.

    రిప్లయితొలగించండి
  43. పుట్టి పెరుగుచు వనముల పులుల నడుమ
    వినుటయే గాని కాంచని వీరులౌచు
    పరవశించి రామ కథను పాడుటందు
    లవకుశులు మేనమామలు లక్ష్మణునకు

    రిప్లయితొలగించండి