11, జనవరి 2013, శుక్రవారం

పద్య రచన - 218

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. ఏడు పద్మాలు భూమిక లేడు మరియు
    నేడు గిరు లూర్ధ్వ లోకమ్ము లేడు నైన
    యోగ సాధనలోన చేయూత మిచ్చి
    వేగ నడిపింపుమా మమ్ము వేంకటేశ!

    రిప్లయితొలగించండి
  2. మెట్టుల నెక్కెద మట మే
    మెట్టులొ నిను జూడ గోరి యెంకట సామీ
    కొట్టించెద గుండును మా
    కట్టములను దీర్చవయ్య కాళ్ళకు మ్రొక్కన్.

    రిప్లయితొలగించండి
  3. మెట్టుల నెక్కెద మట మే
    మెట్టులొ నిను జూడ గోరి యెంకట సామీ
    కొట్టించగ గుండును మా
    కట్టములను దీర్చు వడ్డి కాసుల వాడా !

    రిప్లయితొలగించండి
  4. అడుగడుగు దండ మెట్టుచు
    వడివడి నిను జేర నడువ పంకజ నయనా!
    తడబడ జేయకుమా మము
    విడువక భజియింతు మయ్య వేంకట రమణా!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సుబ్బా రావు గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యములో 1వ పాదములో "ఏకి" -- "వేకి" యతి మైత్రి కుదరదు. పాదమును ఇలాగ మార్చండి:
    ఏడు కొండల శ్రీ వేంకటేశ! శ్రీశ!
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  6. ఏడు కొండల శ్రీ వేంక టేశ ! శ్రీ శ !
    మమ్ము గాపాడ దిగిర మ్ము మంగతోడ
    ముసలి పండుల మైతిమి ముదిమి వలన
    మేము రాలేక గోరితి మిమ్ము సామి !

    రిప్లయితొలగించండి
  7. ఆకసంబున మేఘంబు లావ రించె
    నెటుల వత్తును మెట్లెక్కి యీ శ ! రమణ !
    ఇప్పు డిక్కడె యీ యవ ? యొప్పు గాను
    నీ దు దర్శన భాగ్యంబు నెమ్మ నమున .

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 11, 2013 4:06:00 PM

    సప్తగిరులన్ వెలసె సర్వజన పాల శుక
    శౌనక మునీశ్వరలకత్యం
    తాప్తజన బాంధవుదయా హృదయ సాగరుడు
    యజ్ఞ పురుషుండు సతి పద్మన్
    సప్తపదిగా గిరుల సాగె కయిపట్టి భృగు
    శాపమున నీ జగతి బ్రోవన్
    తృప్తిగను పల్కెదభి ధేయమును నేనునిన
    దింప పదమార్గమున జేరన్.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ తోపెల్ల శర్మ గారి మంగళమహాశ్రీ వృత్తము బాగున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  10. నాడు మెట్టులెక్కి వచ్చినాము నీ నామస్మరణ తో
    ఏడు కొండల వాడా ఆకసాన అనుక్షణం కనిపించావు
    నేడు కారులెక్కి వస్తున్నాము జమా ఖర్చుల లెక్కతో
    ఏడు కొండల వాడా,ఒక్క క్షణం కూడా కరువై పోతోందయ్యా

    (బాలా)జిలేబి!

    రిప్లయితొలగించండి
  11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 11, 2013 6:29:00 PM

    శ్రీ పండిత నేమాని వారికి నమస్సులు. మీదృష్ఠిలో పడుట నాయదృష్ఠము. సర్వదా కృతజ్ఞుడను౤ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. ఎక్కి శేష నీలాద్రుల నెక్కుచు గరు
    డాద్రి నంజనాద్రిని వృషభాద్రి దాటి
    చేరి నారాయణాద్రిని చేరి వేంక
    టాద్రిని గొలువ స్వామిని భద్రము లిడు

    రిప్లయితొలగించండి
  13. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 11, 2013 8:25:00 PM

    రవీందర్ గారూ! సప్త గిరి నామంబుల నందముగా తేట తెల్లముగ నొక్క తేట గీతిని తెల్పిరి.చాలబాగున్నది.అభినందనలు.
    గొలువ కన్న "గొలుతు" బాగుండునేమో చూడండి. అన్యథా భావింప వలదు.

    రిప్లయితొలగించండి
  14. ముడుపుల మూటలు విప్పుచు
    కడు ప్రీతిగ కులుకుచున్న కఠి నాత్ముడవై !
    నిడుముల మూటలు బిగించి
    పడి పడి వేడిన కరగవు బాధలు తొలగన్ !

    రిప్లయితొలగించండి
  15. శర్మ గారూ ! ధన్యవాదములు. మీ సూచన సరియైనదే.
    .... గొలుతు.. బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ తోపెల్ల శర్మ గారి మంగళమహాశ్రీ వృత్తమునకు కొన్ని చిన్న చిన్న సవరణలు చేసేను:

    సప్తగిరులన్ వెలసె సర్వజన నేత శుక
    శౌనక ముఖర్షులకు నత్యం
    తాప్తుడగు వేలుపు దయాహృదయ సాగరుడు
    యజ్ఞ పురుషుండు సతి పద్మన్
    సప్తపదిగా గిరుల సాగె కయిపట్టి భృగు
    శాపమున నీ జగతి బ్రోవన్
    దృప్తిమెయి పల్కెదభిధేయమును నేను నిన
    దించి పరమార్థమును బొందన్

    స్వస్తి

    రిప్లయితొలగించండి




  17. ఓర్వ నగునె యీ మోకాటి పర్వతమ్ము
    నెక్కుటెట్లని చింతింపనేల ,వాడె
    యేడుకొండలనెక్కంగ దోడవచ్చు
    స్మరణ జేయ గోవిందనామమ్ము నెపుడు.

    రిప్లయితొలగించండి