22, జనవరి 2013, మంగళవారం

పద్య రచన - 229

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. దను నాముండగు నొక్క సుందరుడు గంధర్వుండు గర్వాంధుడై
    మును శాపమ్మును బొందె వాసవునిచే బొందెన్ విరూపాకృతిన్
    వని నాతండు కబంధ రాక్షసునిగా వర్తిల్లుచుండెన్ కటా
    ఘన బాహుద్వయితోడ బట్టి తినుచున్ గానన్ మృగశ్రేణులన్

    వాని కొక పెద్ద నోరుండు వక్షమందు
    నక్షులే లేవు భుజము లత్యంత దీర్ఘ
    ములయి యోజన విస్తారముగ జెలంగు
    గరమునన్ బట్టె రామలక్ష్మణుల నతడు

    అంత ముప్పును గమనించి యతని భుజము
    లను వడిగ దెగవ్రేసిరి రామ లక్ష్మ
    ణులు కృపాణములన్ బూని బలమెసంగ
    నటుల నా ముప్పు తప్పిన యట్టి పిదప

    త్రవ్వి యొక పెద్ద గోతిని లక్ష్మణుండు
    కట్టెలను జేర్చి యాతని కాయమందు
    జేర్చి యగ్ని రగల్చగా శీఘ్రమతడు
    కాలి పొందె వేరొక దివ్య గాత్ర మంత

    సుమశరు గెల్వజాలు నతి సుందర గాత్రముతో ననేక ర
    త్నమయ విభూషణాన్వితుడునై వెలుగొందు నతండు రామ పా
    దములకు మ్రొక్కి చేయుచు ప్రదక్షిణ భక్తి చెలంగ మెండు హ
    ర్షమున నుతించె నివ్విధి స్వరమ్మొక యించుక గద్గదమ్ముగా

    శరణు రామ రామ సద్గుణ గణధామ
    శరణు దేవ దేవ సాధు భావ
    శరణు లోకపూజ్య సద్భక్తి సామ్రాజ్య
    శరణు విమల చరణ శరణు శరణు

    రిప్లయితొలగించండి
  2. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 22, 2013 10:47:00 AM

    సీత జాడకై వెదకుచు చిక్కె రామ
    లక్ష్మణులు కబంధ కరముల వనినంత
    ఖడ్గ ధాటిని ఖండించి కాటి జేర్చి
    పూర్వ రూపమంద దనుని బ్రోచె ప్రభువు.

    రిప్లయితొలగించండి
  3. రామ లక్ష్మణు లిరు వైపు రహిని నొప్పి
    దనున ననగనా రక్కసు దండ దోయి
    నొక్క వేటున దెగ ద్రుంచి యొప్పు గాను
    పాతి పెట్టిరి భువి లోన పతితు వాని .

    రిప్లయితొలగించండి
  4. రామ లక్ష్మణులమిత ధీరవరులపర
    ధర్మ నిష్ఠను గల యన్న దమ్ములంట.
    కవన విద్యలనెడు గొప్ప కల్మి లేక
    వారి కథలను బలుకగ నేరి తరము?

    రిప్లయితొలగించండి




  5. వృక్ష శాఖ బోలెడి దీర్ఘ బాహువులను
    సోదరులను బంధింపగా శూరవరులు
    నా కబంధుని బాహుల నరకివేసి
    చిత్రరూపమ్ము వాపి రక్షించిరంత
    దొల్లి గంధర్వ దేహమ్ము తోచె నాహ !

    రిప్లయితొలగించండి




  6. వృక్ష శాఖ బోలెడి దీర్ఘ బాహువులను
    సోదరులను బంధింపగా శూరవరులు
    నా కబంధుని బాహుల నరకివేసి
    చిత్రరూపమ్ము వాపి రక్షించిరంత
    దొల్లి గంధర్వ దేహమ్ము తోచె నాహ !

    రిప్లయితొలగించండి
  7. పాప మెంతటి వికృతంపు రూప మొసగ
    రామ లక్ష్మణ కరస్పర్శ వ్రాత మార్చు
    పతిత పావన మూర్తులఁ భక్తి గొల్వ
    జన్మ జన్మల పాపాలు జంకి తొలగు

    రిప్లయితొలగించండి
  8. అతి విచిత్రదేహు డత్యంత దీర్ఘమౌ
    బాహుయుగముతోడ పట్టి యపుడు
    రాక్షసుండు తమను భక్షింప బూనగ
    పంక్తిరథుని సుతులు భవ్యగుణులు.

    ఆకబంధు భుజము లతిసమర్థతతోడ
    ద్రెంచివేసి పిదప దివ్యగతుల
    నందజేసినార లారాక్షసుండంత
    ప్రణతులొసగె పరమభక్తుడగుచు.

    రిప్లయితొలగించండి
  9. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, జనవరి 22, 2013 11:21:00 PM

    కైక నాథుపైని ఆగ్రహమొందగా
    రాజు మాటమీద రాముడరిగె
    కైక రక్కసంటు కసరెను భరతుండు
    తత్ఫలాన ధనువు ధన్యుడాయె

    రిప్లయితొలగించండి
  10. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, జనవరి 22, 2013 11:24:00 PM

    కైక నాథుపైని ఆగ్రహమొందగా
    రాజు మాటమీద రాముడరిగె
    కైక రక్కసంటు కసరెను భరతుండు
    తత్ఫలాన దనువు ధన్యుడాయె

    రిప్లయితొలగించండి
  11. కబంధునిపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    కమనీయం గారికి,
    సహదేవుడు గారికి,
    వియెస్సెన్నెమ్ హరి గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి