25, జనవరి 2013, శుక్రవారం

పద్య రచన - 232

కవిమిత్రులారా, 
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. శ్రీరామచంద్రుడు వనవాసమునకు పోవలెనని విల విల లాడుచున్న దశరథుడు:

    ప్రణయరూపిణి కైక ప్రళయ రూపిణియయి
    ప్రాణాంతకంబట్లు పరిణమించ
    నండదండగ నిల్చి యారవ ప్రాణమౌ
    నట్టి పుత్రుడు వని కరుగుచుండ
    సర్వంబు గోల్పోయి స్వాస్థ్యంబు గోల్పోయి
    యభిమాన మెంతయు నంతరించ
    నలుగురిలో చాల నగుబాటు నొందుచు
    జీవించు టెట్లను చింత రగుల
    నాసలన్నియు నడియాస లగుచునుండ
    వ్యథలను భరింప జాలక పంక్తిరథుడు
    దీనుడై, దుఃఖితుండయి దిక్కెరుగక
    యక్కటా సోలి పడియుండె నార్తి గొనుచు

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    శ్రీరాముని వనవాస నిర్ణయ సమయములో భరతుడు అయోధ్యలో లేడు కదా. దశరథుడు మరణించిన తరువాతనే అతడు అయోధ్యకు వచ్చెను. అంతవరకు మేనమామ ఇంట నుండెను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. లేక లేక కలిగినయా లోక నాథుఁ
    కైక స్వార్థాన కానల కంపుమనగ
    మాట కొరకై దశరథుని మనసు వగచె
    ప్రాణ సములను వీడుట బాధ కాదె?

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా ! క్షమించాలి. చిత్రమును తప్పుగా అర్థము చేసుకొన్నాను. రాముడు దశరథునితో మాటాడు నప్పుడు కైక మాత్రమే ఉన్నది కదా.. అందరూ ఉండే సరికి భరతుడని పొరబడ్డాను. ధన్యవాదములు.

    జనకా బాధను పడకుము
    మన వంశం బోపదయ్య మాటను దప్పన్
    వనముల కేగెద నిపుడే
    పిన తల్లిది దోసమనను ప్రేమను జూతున్

    రిప్లయితొలగించండి
  5. రామ భద్రుని వనవాసమా ? మ హర్షి !
    యెటు ల జీ వింతు పదునాలు గేండ్లు భువిని
    అనుచు విలవిల యేడుచు న్నా దశ ర ధు
    నూ ర డిం చెను రామయ్య యొప్పి దముగ .

    రిప్లయితొలగించండి
  6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 25, 2013 12:46:00 PM

    తండ్రి యానతిమీద తనయుండు రాముండు
    సెలవుగైకొననట జేర జూచె
    మహరాజు దీనుడై మతిమాలి యుండగ
    తల్లులు బాధను తల్ల డిల్ల
    వారల వారించి ప్రార్థించె పలికెను
    దీపించు రఘుకుల దీపకుండు
    “వాగ్దాన భంగమ్ము ప్రభవింప మీతోడ,
    కారణమ్ముగ నేను, గతము విడచి

    నడచి రనెడిచ రిత యేల?ననుపు మాని
    అఘము బాపగ నియ్యెడ నాజ్ఞనిమ్ము
    సూర్య వంశఘనచరిత నార్య !నిలుప”
    వెడల తప్పదు లేదిట వేరె దారి.

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    దశరథుని దీనావస్థను కరుణరసాత్మకంగా వర్ణించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    "ఏడుచు న్నా దశరధు" అన్నదానిని "ఏడ్చెడి యా దశరథు" అందాం.
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    "మహరాజు" అనకూడ దనుకొంటాను. అక్కడ మన్నీడు అందామా?

    రిప్లయితొలగించండి




  8. దుఃఖ భరితుడైన దశరథునికి వంద్
    నమ్ము జేసి సెలవుగొన నరిగె వడిగ
    రాఘవుడు నోట మాటలే రాకయుండె
    జనకుడంతకు మించి యేమనగలండు?

    రిప్లయితొలగించండి




  9. నా పద్యంలో వందనమ్ము అండానికి బదులు టైపు పొరబాటు వలన వంద్ నమ్ము అని పడింది.గమనించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  10. సేకరణ : ఒక సాహిత్యాభిమానిశుక్రవారం, జనవరి 25, 2013 11:31:00 PM

    అనిలో మున్ను నృపాలు చిత్తము కేనహ్లాదముం గూర్చి, నా
    తనయుం బట్టము గట్టి, రాఘవుని బద్నాలుగేండ్లు కాంతారమం
    దును వర్తిల్లఁగఁబంపఁగొన్న వరమున్ ద్రోయంగరా దెంతయున్
    వనసీమన్ ముని వృత్తి నుండు మనుఁడీ వైళంబ యా రామునిన్|

    అని పలుకు కైక పలుకులు
    విని వేగము మరల వచ్చి విన్నఁదనంబున్
    దనుక వశిష్ఠునితోడన్
    వినుపించె సుమంత్రుఁ డట్టి విధ మేప్రడఁగన్

    రిప్లయితొలగించండి
  11. కమనీయం గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    సాహిత్యాభిమాని గారూ,
    ధన్యవాదాలు.
    టైపాట్లు ఉన్నాయి...
    చిత్తము కేనహ్లాదముం గూర్చి - చిత్తమున కేనాహ్లాదముం గూర్చి
    రాఘవుని బద్నాలుగేండ్లు - రాఘవుని బద్నాల్గేండ్లు

    రిప్లయితొలగించండి