26, జనవరి 2013, శనివారం

పద్య రచన – 233

భారత రాజ్యాంగ నిర్మాతలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. వందల సంవత్సరములు
    పందెముతో నేలి నట్టి పరులే పారన్
    సుందరముగ తీరిచిరే
    వందనములు వారు మిగుల భారత మాతన్.

    రిప్లయితొలగించండి
  2. మా తాతల్ ఆహా అని నేతులు తాగి రచించిరి
    మా పితరుల్ గుటకాయ స్వాహా అని భుజించిరి
    మా 'కరముల్' దేహీం అని టై 'పాడిం'చినవి
    మా వారసుల్ 'జై జై' అనుడు గణతంత్రమునకు


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  3. మనకున్ పూజ్యులు పూర్వ నాయకులు ధీమంతుల్ మహాత్ముల్ సదా
    జన సంక్షేమము గోరి పోరి బళిరా స్వాతంత్ర్యంబునున్ దెచ్చిరా
    ఘన చారిత్రుల సంస్మరించు నెడలన్ గల్గున్ గదా శ్రేయముల్
    మనమారన్ వినుతింతు వారి గుణ సంపత్తిన్ నతుల్ సల్పుచున్

    రిప్లయితొలగించండి
  4. నేమాని గారి రెండవ పాదంలో టైపాటు గా స్వాతంత్ర్యమున్ బదులు స్వాతంత్ర్యంబునున్ అని ఉంది.

    రిప్లయితొలగించండి
  5. వందే! భారత మాతా!
    వందే! గణతంత్ర దేశ పాలకు లారా!
    ముందేమగునో భరతము!
    సందేహము గల్గుచుండె స్వాతంత్ర్యవనిన్!

    రిప్లయితొలగించండి
  6. చిత్ర మల్లదె జూడుడు చిత్ర మందు
    దేశ నాయకు లందఱు నాశిను లయి
    మంచి సూత్రముల్ రచియించి మనకు నిచ్చె
    అదియె భారత రాజ్యాంగ మయ్యె మనకు .

    రిప్లయితొలగించండి
  7. సేకరణ: ఒక సాహిత్యాభిమానిశనివారం, జనవరి 26, 2013 3:38:00 PM

    పాటాగొట్టి" పర ప్రభుత్వమునకున్ బ్రహ్మాండమౌ శాంతి పో
    రాటంబున్ నడిపించినాడు మన "వార్ధాయోగి" ఆంగ్లప్రభుల్
    మూటల్ముల్లెలు నెత్తికెత్తుకొని నిర్మోహాత్ములై సంద్రముల్
    దాటం జొచ్చిరి నవ్వుకొన్నవి స్వతంత్ర స్వర్ణ సోపానముల్.

    లాఠీ పోటులు పూల చెండ్లు చెరసాలల్ పెండ్లి వారిండ్లు ఏ
    కాఠిన్యం బయినన్ సుఖానుభవమే "గాంధీ కళాశాల"లో
    పాఠంబుల్ పఠియించు శిష్యులకు తద్ బ్రహ్మాస్త్ర సంధానమే
    పీఠంబుల్ కదలించి సీమలకు బంపెన్ శ్వేత సమ్రాట్టులన్.

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, జనవరి 26, 2013 3:58:00 PM

    భారత దేశమున్ సకల భాగ్యము లన్ తుల తూగగన్ ప్రజల్
    ధీరతతోడ నెయ్యమున ధీవరులంత విదేశపాలనన్
    పారము దాటగన్ స్వపరి పాలన తెచ్చిరి ముచ్చటన్ సదా
    వారలు నిత్యపూ జ్యులన పాత్రుల నంగగ పాడియే గదా!

    రిప్లయితొలగించండి
  9. స్వాతంత్ర్య పోరాట యోధులను గురించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సహదేవుడు గారికి,
    సుబ్బారావు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    అజ్ఞాత గారూ,
    సాహిత్యాభిమాని గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి





  10. సర్వ సత్తాక గణతంత్ర సరళితో ని
    బద్ధమైన రాజ్యాంగమ్ము వృద్ధ దేశ
    నాయకులు తీర్చిదిద్దిరి నయముమీర
    అట్టివారి చాయాచిత్ర మదియె కనుడు.

    రిప్లయితొలగించండి
  11. డా. ప్రభల రామలక్ష్మిశనివారం, జనవరి 26, 2013 10:43:00 PM

    చక్కని పాలన చేయగ
    చిక్కులులేనట్టి రచన చేసిరి వీరల్
    వెక్కసమయ్యెను నేడది
    బొక్కసమును మింగజూచు భొక్తలకెల్లన్

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, జనవరి 26, 2013 11:05:00 PM

    రామలక్ష్మిగారూ! చక్కని చిక్కని పద్యం.చాల బాగున్నది. ఆశీస్సులు.

    రిప్లయితొలగించండి
  13. డా. ప్రభల రామలక్ష్మిశనివారం, జనవరి 26, 2013 11:51:00 PM

    చక్కని పాలన చేయగ
    చిక్కులులేనట్టి రచన చేసిరి వీరల్
    వెక్కసమయ్యెను నేడది
    బొక్కసమును మింగజూచు భోక్తలకెల్లన్

    రిప్లయితొలగించండి
  14. కమనీయం గారూ,
    చిత్రానికి తగిన పద్యం చెప్పి అలరించారు. అభినందనలు.
    *
    డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి