31, జనవరి 2013, గురువారం

పద్య రచన – 238

కవిమిత్రులారా, 
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. వచ్చిన వారికి దానము
    నిచ్చిన మనకున్ననాడు నిరు పేదలకున్
    మెచ్చును భగవంతుడు మన
    కిచ్చును గా పుణ్య సిరిని పురుషోత్తముడే.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యమును సవరించ వలసి యున్నది. పుణ్యసిరి అనే సమాసము సాధువు కాదు. అలాగే 4వ పాదములో యతి తప్పినది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. దాన మొనరించు చుండి పాత్రతను గనుచు
    ప్రతిఫలమ్మును దలపరు ప్రజ్ఞ మెరయ
    గుప్తదాన మొనర్చుచు గోరికలను
    దరికి రానీయ రవని సాధకులు లెస్స

    రిప్లయితొలగించండి
  4. చాకలి మంగలి వడ్డెర
    లేకను సంపదలులేవు లెస్సగఁ జెప్పన్
    శ్రీకర వృత్తుల వారికి
    ఆకొన నీయక నొసగుము ఆహారంబున్!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.తొందరపాటు లో జరిగిన పొరపాట్లను సవరించుచున్నాను...

    వచ్చిన సిరిలో దానం
    బిచ్చిన నిరు పేదవారి కిడుములు దీరున్
    మెచ్చును ఈశుడు పుణ్యం
    బిచ్చును నిరు పేద మనము నెన్నగ దానన్.

    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్

    రిప్లయితొలగించండి
  6. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.తొందరపాటు లో జరిగిన పొరపాట్లను సవరించుచున్నాను...

    వచ్చిన సిరిలో దానం
    బిచ్చిన నిరు పేదవారి కింతో యంతో
    మెచ్చును దేవుడు పుణ్యం
    బిచ్చును నిరు పేద మనము నెన్నగ దానన్.

    రిప్లయితొలగించండి
  7. దాతకు కల్గును మోదము
    చేత గొను నభాగ్యుడిముఖ చిరునగవు గనన్
    దాతలవె పంచ భూతము
    లీతలముఁ నిస్వార్థగుణములీశుడు నొసగన్

    రిప్లయితొలగించండి
  8. దాతృత్వ ప్రాశస్త్యాన్ని మనోహర పద్యాల్లో తెల్పిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    చంద్రశేఖర్ గారికి,
    సహదేవుడు గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    సహదేవుడు గారూ,
    'ముఖ చిరునగవు' అని సమాసం చేయరాదు కదా.
    'అభాగ్యజనుల చిరునగవు' అందాం.

    రిప్లయితొలగించండి
  9. డా. ప్రభల రామలక్ష్మిగురువారం, జనవరి 31, 2013 9:14:00 PM

    సిరిగలిగిన ఘనుడొక్కం
    డరుదుగ కలిసొచ్చునిట్టి యవకాశంబున్,
    కరుగునె సంపదలిచ్చిన
    పెరుగననుచుచెప్పినారు పెద్దలు నాడున్.

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 31, 2013 9:24:00 PM

    ఊట బావి నున్న నీరు నూరుచుండు తోడినన్
    కైటభారి భార్య నిన్ను చల్లగుండ బ్రోవగన్,
    మూట గట్టకుండ సొమ్ము ముక్తి మార్గమెంచుచున్
    తోటి పేదవార్కి కొంత తూగు దాన మిచ్చుచున్.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గురుభ్యో నమః
    గురువు గారికి ధన్యవాదములు: తమరి సవరణ ప్రకారం పద్యం:

    దాతకు కల్గును మోదము
    చేత గొను యభాగ్య జనుల చిరునగవు గనన్
    దాతలవె పంచ భూతము
    లీతలముఁ నిస్వార్థ గుణము లీశుడు నొసగన్

    స్వస్తి .

    రిప్లయితొలగించండి
  12. దానము జేసిన పుణ్యము
    మానవ జన్మమ్ము ఘనము మాయని యశమౌ !
    నేనూ నాదను భావము
    మానస మునవీడి మనిన మాన్యుడ వౌగా !

    రిప్లయితొలగించండి
  13. శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు. మీ పద్యమును పరిశీలించండి. యతి దోషమును సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    'కలిసొచ్చిన...' ఒచ్చిన ... సాధురూపం కాదు..
    పెరుగననుచు... అని + అనుచు = అనియనుచు అని యడాగమం వస్తుంది. అక్కడ ... పెరుగు ననుచు... అందాం.
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, ఫిబ్రవరి 01, 2013 11:20:00 PM

    పండితుల వారికి నమస్సులు,
    మీరు సూచించిన పిదప సరిజూచి జేసిన సవరణ:

    ఊట బావి నున్న నీరు నూరుచుండు తోడినన్
    కైటభారి భార్య నిన్ను కాంచనాదులిచ్చి బ్రోవగన్,
    మూట గట్టకుండ సొమ్ము ముక్తి మార్గమెంచుచున్
    తోటి పేదవార్కి కొంత తూగు దాన మిచ్చుచున్.

    దీనిపై మీ వ్యాఖ్యను ప్రచురించగలరు.

    రిప్లయితొలగించండి
  16. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    రెండవపాదంలో గణదోషాన్ని ఇలా సవరిద్దాం....
    "కైటభారి భార్య నిన్ను కల్ములిచ్చి బ్రోవగన్"

    రిప్లయితొలగించండి
  17. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, ఫిబ్రవరి 02, 2013 2:04:00 PM


    గురువులకు నమస్సులతో మీ సూచన ప్రకారము

    ఊట బావి నున్న నీరు నూరుచుండు తోడినన్
    కైటభారి భార్య నిన్ను కల్ములిచ్చి బ్రోవగన్",
    మూట గట్టకుండ సొమ్ము ముక్తి మార్గమెంచుచున్
    తోటి పేదవార్కి కొంత తూగు దాన మిచ్చుచున్.

    రిప్లయితొలగించండి