15, జనవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం - 938 (కనుమ యనుచు బావ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కనుమ యనుచు బావగారి కనులను మూసెన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. కనుమ నాడు ప్రయాణం చెయవద్దు .. నీతో గొడవెందుకు ఉంటాలే అని చెప్పమని ఒక మరదలు బావగారిని ఆట పట్టించిన సందర్భం...

    కనుమను వెడలెదవని నా
    కనుమానము వచ్చి సంచి గదిలో దాస్తిన్
    కను మరదల గొడవెందుల
    కనుమ, యనుచు బావగారి కనులను మూసెన్.

    రిప్లయితొలగించండి
  2. కనువిందుగ ముస్తాబయి
    కనుమ దినపు ముచ్చటలుగ కవిగారూ! మీ
    కని తెచ్చితి కానుక నిదె
    కనుమ యనుచు బావగారి కనులను మూసెన్

    రిప్లయితొలగించండి
  3. వినుడొక మరదలు "దోబూ
    చ"నుచుం దాగుచు బిలుచుచు హాస్యంబుననీ
    మనిషెవ్వరు చెప్పగవలె
    కనుమ! యనుచు బావగారి కనులను మూసెన్.

    రిప్లయితొలగించండి
  4. తినుమనుచు మరద లిదిగో
    కొని తెచ్చితి బావ ! యనుచు గుప్పిట తెరచెన్
    వినియది మరియొక మరదలు
    కనుమ ! యనుచు బావగారి కనులను మూసెన్

    రిప్లయితొలగించండి
  5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 15, 2013 9:27:00 AM

    కనులకనుల కలయికతోడ
    కనువిందుగ పెండ్లియాడ ఘనచిత్రంబున్
    గొని పాతికేండ్ల దినినున్
    కనుమ యనుచు బావగారి కనులను మూసెన్

    రిప్లయితొలగించండి
  6. కనులకు గంతలు గట్టియు
    కనులకు గనబడని చోట కమలను దాచీ
    అనుపమ బావను కలిసియు
    కనుమ యనుచు బావ గారి కనులను మూసెన్

    రిప్లయితొలగించండి
  7. "మనసైన పిండివంటలు
    గొని తెచ్చితి బావ నీకు కూరిమితోడన్
    కనివిని యెరుగని 'అరిసెలు'
    కనుమ" యనుచు బావగారి కనులన్ మూసెన్.

    రిప్లయితొలగించండి
  8. కనుమూసిగంత లాడుచు
    కనులను మూయుదురు చెలులు కనుగొన మనుచున్
    వనజయె“ బావా ! యక్కను
    గనుమ !" యనుచు బావగారి కనులను మూసెన్

    రిప్లయితొలగించండి
  9. డా. ప్రభల రామలక్ష్మి.మంగళవారం, జనవరి 15, 2013 7:39:00 PM

    శ్రీయుతులు శంకరయ్య గారికి, నమస్కారములు. మీరు శ్రీ శర్మ గారికి ఇచ్చిన సూచనను అనుసరించి నేను కూడా ఒక సమస్యను పంపుతున్నాను. దయచేసి ప్రచురించగలరు. సమస్య: "గయలో పొంగిన భక్తి ఇద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్"
    డా. ప్రభల రామలక్ష్మి. ఎం. ఏ. (త్రయ), పి.హెచ్.డి.

    రిప్లయితొలగించండి
  10. కనుమీ పండుగ సందడి
    విను వీధుల వెలయు చున్న వేడుక లన్నీ !
    కను విందగు నినరధములు
    కనుమ యనుచు బావ గారి కనులను మూసెన్ !

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్య పరిస్థితి ఇంకా బాగుపడలేదు... బ్లాగు నిర్వహణలో మీ సహకారాన్ని కొనసాగించవలసిందిగా మనవి.
    నిన్నటి సమస్యకు చక్కని పూరణ లందించిన...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    సుబ్బారావు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంతో స్వాగతం పలుకుతున్నది.
    మీరిచ్చిన సమస్యను ఆలస్యంగా చూసాను. ముందే చూసి ఉంటే ఈరోజే బ్లాగులో ప్రకటించేవాణ్ణి. రేపు తప్పక ప్రకటిస్తాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. బావను పెళ్లాడిన మరదలి ముచ్చట:

    కనబోయెడు సంతానపు
    కను,ముక్కుల రూపు తీరు కలలో గంటిన్!
    వినిపింప సిగ్గు! యూహల
    కనుమ! యనుచు బావ గారి కనులను మూసెన్!

    రిప్లయితొలగించండి
  13. ఘనముగ జేసితి వడలను
    తినుమిక చూడకయె వాటి తీవ్రపు నలుపున్...
    మనమున పచ్చటి గారెలు
    కనుమ! యనుచు బావగారి కనులను మూసెన్

    రిప్లయితొలగించండి