17, జనవరి 2013, గురువారం

సమస్యాపూరణం - 940 (గయలో పొంగిన భక్తి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.
ఈ సమస్యను పంపిన డా. ప్రభల రామలక్ష్మి గారికి ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

  1. దయతో గావవె రామచంద్ర నను నార్త త్రాణ పారీణ సం
    శయమేలా కరమంద జేయ గను సంసారాబ్ధి దాటించగా
    నియమం బొప్పగ రామ! కీర్తనల నిన్నీరీతి వర్ణించు త్యా-
    గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్

    రిప్లయితొలగించండి
  2. దయతో గావవె రామచంద్ర నను నార్త త్రాణ పారీణ సం
    శయమేలా కరమంద జేయ గను సంసారాబ్ధి దాటించగా
    నియమం బొప్పగ రామ! కీర్తనల నిన్నీరీతి ప్రార్థించు త్యా-
    గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్న గారూ ! త్యా'గయను' బలే పట్టేశారండీ ! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. భయమేలేదిక రాముడుండు వరకున్ భాగ్యంబిదే వీడకన్
    లయమై పోయెడు నంతదాక మహిలో రామున్ భజింపంగ సం
    శయమే వద్దని రామదాసు మరియున్ సత్కీర్తనా చార్య త్యా
    గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.

    రిప్లయితొలగించండి
  5. దయరాదా యని పాడి వేడెనట,సీతారామ! వెన్వెంటనే
    నయగారమ్ముగ బ్రోచినాడవట! వీణానాద మాధుర్యమో,
    లయలోనున్న విచిత్రమో, పలుకులన్ లాలిత్యమో, నాడు త్యా
    గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.

    రిప్లయితొలగించండి
  6. నయగారా' ఝరి నాధమై వినగ కర్ణానంద సమ్మోదమై
    ప్రియ గాణామృత రాగమై నలు దిశల్ పెంపొందిచున్నట్టి ప్ర
    క్షయమున్ లేనటువంటి భక్తులు సదా శ్లాఘించు చున్నట్టి త్యా
    గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.

    రిప్లయితొలగించండి
  7. 'నయగారా' ఝరి నాదమై వినగ కర్ణానంద సమ్మొదమై
    ప్రియ గాణామృత రాగమై నలు దిశల్ పెంపొందిచున్నట్టి ప్ర
    క్షయమున్ లేనటు వంటి భక్తులు సదా శ్లాఘించు చున్నట్టి త్యా
    గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.

    రిప్లయితొలగించండి
  8. నయనానందకరైక విగ్రహములన్ నాశంబు గావించుచున్
    దయనీయస్థితి కల్గజేసిరి తమిందాయాదులున్ భ్రాతలున్
    రయమొప్పారగ చేరరార రఘురాట్ నాస్వామియన్నట్టి త్యా
    గయలో పొంగిన భక్తి యిధ్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్

    (డా. ప్రభల రామలక్ష్మిగారి బావగారైన కే.శే. ఛిఱ్ఱావూరి సూర్యనారాయణ మూర్తి గారి పూరణ ఇది)

    రిప్లయితొలగించండి
  9. డా. ప్రభల రామలక్ష్మిగురువారం, జనవరి 17, 2013 8:56:00 PM

    గౌరవనీయులు మిస్సన్నగారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు, లక్ష్మీదేవి గారు, గండూరి లక్ష్మీనారాయణ గారు మరియు అజ్ఞాత గారికి నాకృతజ్ఞతలు. ఆదరించినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 17, 2013 9:48:00 PM

    జయకారంబున రాగతానముల కౌసల్యాసుతున్ రామునిన్
    జయతంచున్ రచియించె కీర్తనలు హృత్సంప్రీ తినొందన్ సదా
    నియతంబైన విధంబులన్ నుడువుచున్ నీరాజనంబిచ్చె త్యా
    గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.

    రిప్లయితొలగించండి
  11. శ్రీరాముని దయచేతనారూఢిగ సకలజనులనౌరా యనగా, శ్రీ శర్మగారు మీపూరణ బాగున్నది. మూడవ పాదంలొ నీరాజనంబిచ్చె బదులు "నీరాజనంబిచ్చు" అంటే బాగుంటుందేమో చూడండి.

    రిప్లయితొలగించండి



  12. స్వయమౌ నాట్యకళావిశేషము,ననన్యంబైన గానమ్మునన్,
    జయముంగాంచె ననేకచిత్రముల లో జైకొట్టగా భక్తిత
    న్మయభావంబున లీనమైన నటసామ్రాట్టైన చిత్తూరి నా
    గయలో పొంగిన భక్తియిద్ధరణికిన్ గాంధర్వభిక్షంబిడెన్.

    అందరూ త్యాగయ్య గురించి అనుకున్నట్టే రాసారు.కొంచెం భిన్నంగా ఉండాలని నాగయ్య గురించి రాసాను.ఆయన కూడా గొప్ప నటుడేగాక ,గొప్ప గాయకుడూ,సంగీతదర్శకుడూ కదా.

    రిప్లయితొలగించండి
  13. హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.
    డా.ప్రభల రామలక్ష్మి గారూ చక్కని సమస్యను పరిచయం చేశారు. ధన్యవాదాలు.
    కమనీయం గారూ అందరం త్యాగయ్య గారిని పట్టుకొంటే మీరు నాగయ్యగారిని పట్టుకొని అద్భుతమైన పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. రయమున్ పర్వుచు మూగి యాత్రికులపై రాద్ధాంతమున్ జేయుచున్
    భయమున్ గొల్పెడి చౌర్య భూసురలనా పండాలనున్ వీడుచున్
    వయసున్ మీరిన దంపతుల్ చనగ నా వయ్యారమౌ బుద్ధునిన్
    గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్

    రిప్లయితొలగించండి