24, జనవరి 2013, గురువారం

సమస్యాపూరణం – 947




                                  కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్.

13 కామెంట్‌లు:

  1. మేలు మిఠాయీ లయ్యవి
    బోలెడు రూపములనున్న భోజ్యములగుటన్
    కేలం గైకొని యందొక
    తేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  2. పాలు కలుప ఖర్జూరము
    మేలగు నారోగ్యమునకు మితముగ తినగన్
    *తేలన యిష్ట మొకర్తెకు
    తేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్

    * ఖర్జూరము

    రిప్లయితొలగించండి
  3. పోలిక తనదై పుట్టిన
    బాలుని గని యెత్తుకొనుచు పరవశ యగుచున్
    మేలగు నానందంబున
    తేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  4. ఎందుకో తెలియదు గానీ, పచ్చబొట్టు (tatto)ను ఇక్కడ చాలామంది తేలుబొమ్మగానే పొడిపించుకొంటారు. ఇక్కడి టిప్ అనేవాడి పేరును తెలుగులో ముద్దుగా తిప్పడు అని పెట్టుకొని పూరించాను:
    హేలగ పచ్చను మెడపై
    తేలుగ పొడిపించు కొన్న తిప్పని మెడపై
    వాలుచు ప్రీతిగ నపుడా
    తేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్!

    రిప్లయితొలగించండి
  5. పాలొసగి యమ్మ మురుయుచు
    కేలను గైకొన బుడుతడు కేరింత లిడున్
    బాలుని గన పరవశమున
    దేలును ; ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్

    రిప్లయితొలగించండి
  6. తేలును కరమునఁ బట్టెను
    బాలుని నాడించఁ దల్లి , భయమున నేడ్వన్
    లాలించె బొమ్మని తెల్పగఁ
    దేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్!

    రిప్లయితొలగించండి
  7. ఈ రోజుల్లో కొందరు రికార్డులు సృష్టించడానికి పాములు తేళ్ళ మధ్య గంటలు రోజులు గడుపుతారని మనం దినపత్రికలలో చూస్తుంటాం -


    కాలము గడిపె నొక యువతి
    నాలుగు దినములును త్రేళ్ళు నాగుల నడుమన్
    క్రాలెడు జనులను జూచుచు
    తేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  8. నాలుగు వత్సరముల సుతు
    డీ లీలగ బొమ్మ గీచె నెంతో నేర్పున్
    చాలా బాగుందనుచును
    తేలును ముద్దాడి వనిత తీయగ నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 24, 2013 10:35:00 PM

    స్కూలున నాటల గెల్చిన
    హేలగ ప్రథమ బహుమతిగ హేమపు పతకం
    బాలుడు చూపగ ముదమున
    దేలును ; ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులకు నమస్కృతులు.
    కొన్ని ముఖ్యమైన పనుల్లో వ్యస్తుడనై పూరణలను, పద్యాలను సమీక్షించే సమయం చిక్కలైదు. మన్నించండి.
    నిన్నటి సమస్యకు చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు....
    హరి వేంకటి సత్యనారాయణ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    చింతా రామ కృష్ణారావు గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    మూడవ పాదంలో గణదోషం...
    "లాలించె బొమ్మ యనుచును" అందాం.

    రిప్లయితొలగించండి
  11. డా. ప్రభల రామలక్ష్మిశుక్రవారం, జనవరి 25, 2013 9:43:00 AM

    కాలము ఈ వారములో
    కీలకవిషయాలలోన కీర్తిని దెచ్చున్
    చేలము ప్రాప్తంబగునన
    తేలును ముద్దాడి మగువ తియ్యగనవ్వెన్
    (తేలును = వృశ్చిక రాశి యని ఉద్దేశ్యం)

    రిప్లయితొలగించండి
  12. "కాలే నూనెన పూరీ
    తేలును"; ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్
    బాలుని; "మగడా రారా!
    చాలిక టీవీని నాపి చంకన గొనరా!!!"

    రిప్లయితొలగించండి