1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

పద్య రచన – 239

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. ఒక నాడు బాగ బ్రతికియు
    నిక బేడాదమ్మిడణలు నేగిన రీతిన్
    సకుటుంబముగా పైసలు
    సకలంబుగ సాగిపోయె శ్రద్ధాంజలిదే!

    రిప్లయితొలగించండి
  2. ఒక నాడు బాగ బ్రతికియు
    నిక బేడాదమ్మిడణలు నేగిన రీతిన్
    సకుటుంబముగా పైసలు
    సకలంబుగ సాగిపోయె శ్రద్ధాంజలిదే!

    రిప్లయితొలగించండి
  3. చిల్లరయె మహాలక్ష్మిగ
    నెల్లర మన్ననల నందె నేనాడో నా
    చిల్లరకు విలువ శూన్యము
    చెల్లని నాణెములు నేడు శివ శివ శంభో!

    రిప్లయితొలగించండి
  4. చిల్లరపుడికాసు లెటైన చెల్లవికను
    రూప్యమొకటె పనికిరాదు రోతపుట్టు
    వందలటుపైన వేలైన యందుకనుము
    లక్ష కావలె హీనము రక్ష జేయ!

    రిప్లయితొలగించండి
  5. వెండి రూపాయ లేనాడొ సడలి పోయె
    గుండె మండెడి లోహమ్ము దండు గవగ
    యెల్ల లెరుగని మార్పులు వెల్లు వాయె
    చిల్ల రన్నను శ్రీలక్ష్మి చేరి కొలుతు !

    రిప్లయితొలగించండి
  6. చిల్లర పద్యాలు... క్షమించాలి ... చిల్లర మీద అమూల్యమైన పద్యాలు రచించిన కవిమిత్రులు...
    అజ్ఞాత గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికిట
    పండిత నేమాని వారికి,
    చంద్రశేఖర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! ధన్యవాదములు.

    చిల్లరకు విలువ లేదని
    చెల్లని వని మదిని నేను ఛీకొట్టితినే
    చెల్లెనమూల్యపు పద్యము
    లల్లగనే వాటి విలువ లాహా పెరిగెన్.

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, ఫిబ్రవరి 01, 2013 10:29:00 PM

    పైసకు దొరకె తినుటకు పాపకపుడు
    అర్థణాకు మిఠాయియె హాయినిచ్చె
    ఐదుపైసల్ పకోడిమయంపుటుల్లి
    సంత కూరలు పావల సంచినిండ
    అర్థరూపాయి లోపున వ్యర్థమిపుడు.

    రిప్లయితొలగించండి
  9. డా. ప్రభల రామలక్ష్మిశనివారం, ఫిబ్రవరి 02, 2013 12:51:00 AM

    చిల్లరకు చెల్లె కాలం
    బెల్లరకును బరువయ్యెగ ఏమని చెప్పన్,
    చిల్లర సిరిమాలచ్చిమి
    చెల్లదనుచు చెప్పు మాట చిత్రము కాదే.

    రిప్లయితొలగించండి
  10. కనిపించే మెజారిటీ చిల్లర జనాభా
    కనిపించని నోట్లు కోట్లు డబ్బు
    మా రాజుల భోగ విలాస కేళీ
    ఇక మిగిలింది చెల్లని చిల్లర దేవుళ్లే .


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ!
    శుభాశీస్సులు.
    మీరు నిన్న సవరించిన "ఊట బావి...." పద్యము 2వ పాదములో యతి సవరించేరు. బాగున్నది. కానీ మరొక తప్పు చేసేరు. తొందరలో 2వ పాదములో 2 అక్షరములు ఎక్కువ వేసేరు. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. చిల్లర వారలనుచు నీ
    యుల్లంబందునఁదలవకు యూడిగమందున్
    జెల్లిన వారిని, మహిలో
    చెల్లని వారుండ బోరు జీవన బడిలో

    రిప్లయితొలగించండి