గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చిన్నదైనా సొంతిల్లు సుఖాన్నిస్తుందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. అది లేక బాధలు పడుతున్నవాణ్ణి నేను! * పండిత నేమాని వారూ, ‘నిగమ శీర్ష వనములో సౌఖ్య జీవన’మన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ ‘ప్రాశాంత జీవన’ పూరణ బాగుంది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది.. కాకుంటే కొద్దిగా తొందరపడ్డట్టున్నారు. మొదటి పాదం తేటగీతి, రెండవ పాదం ఆటవెలది. మూడవ పాదం ఎదీ కాదు. మీ పద్యానికి నా సవరణ.... అంతులేని యాశ లధిక చింతను పెంచి దుఃఖ సాగరమున ద్రోయు మనల కోర్కె లుడిగి రాము గొలుచు ప్రశాంత జీ వనము సుఖము నొసగు జనుల కెపుడు. * “అవధాన సుధాకర” రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ, బహుకాలానికి మా పట్ల దయ చూపారు. సంతోషం, ధన్యవాదాలు. ముందుగా విజయవంతంగా అవధానాలను చేస్తూ “అవధాన సుధాకర” బిరుదు నందినందుకు నా పక్షాన, బ్లాగు కవిమిత్రుల పక్షాన శుభాభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, అనుప్రాసతో శోభిస్తున్న మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ ‘హవన’ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
అద్దె కొంప లోన నగచాట్లు పడలేక
రిప్లయితొలగించుచేరెడంత భూమి చేరి కట్ట
పిట్ట గూడు బోలు పిసరంత దైన భ
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.
శాశ్వతమగు సుఖము జగతిలోని విషయ
రిప్లయితొలగించుసుఖము లొసగ లేవు సుమతులార!
తనరు నిగమ శీర్ష వనములో సౌఖ్య జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడు
కరవు కాటకాలు కష్టాలు కన్నీళ్లు
రిప్లయితొలగించుపేదరికము లేక భీతి లేక
దైవభక్తి గల్గి తనరు ప్రశాంత జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడు
అంతు లేనియాశలు పెంచి నధిక చింత ,
రిప్లయితొలగించుదుఃఖ సాగరమున ద్రోయు మనల
కోర్కెలనువీడి శ్రీరాము గొలువ ప్రశాంత జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడు
మనమునందు హరిని స్మరణమ్ము జేయుచు
రిప్లయితొలగించుధనవిమోహబుద్ధిఁ దనర కుండ
తనువునందు నాత్మతత్త్వమ్ము కనెడె భా
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించుచిన్నదైనా సొంతిల్లు సుఖాన్నిస్తుందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
అది లేక బాధలు పడుతున్నవాణ్ణి నేను!
*
పండిత నేమాని వారూ,
‘నిగమ శీర్ష వనములో సౌఖ్య జీవన’మన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ ‘ప్రాశాంత జీవన’ పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది.. కాకుంటే కొద్దిగా తొందరపడ్డట్టున్నారు.
మొదటి పాదం తేటగీతి, రెండవ పాదం ఆటవెలది. మూడవ పాదం ఎదీ కాదు. మీ పద్యానికి నా సవరణ....
అంతులేని యాశ లధిక చింతను పెంచి
దుఃఖ సాగరమున ద్రోయు మనల
కోర్కె లుడిగి రాము గొలుచు ప్రశాంత జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడు.
*
“అవధాన సుధాకర” రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
బహుకాలానికి మా పట్ల దయ చూపారు. సంతోషం, ధన్యవాదాలు.
ముందుగా విజయవంతంగా అవధానాలను చేస్తూ “అవధాన సుధాకర” బిరుదు నందినందుకు నా పక్షాన, బ్లాగు కవిమిత్రుల పక్షాన శుభాభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఇరుగు పొరుగు వారికిష్టంబుగా నుండి
రిప్లయితొలగించుధరఁ బరోప కార ధర్మమెఱిఁగి
భక్తి భావ ముండి పరమాత్మఁ దలచు జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడు
దైవచింతనంబు జీవకారుణ్యంబు
రిప్లయితొలగించుధర్మ నిరతి గలుగు దార్శనికుల
అడుగు జాడలందు నడిచెడు వారిజీ
వనము సుఖము నొసగు జనులకెపుడు !!!
చెట్టు చేమ పురుగు పుట్టల కలయికే
రిప్లయితొలగించువనము , సుఖము నొసగు జనుల కెపుడు
శివుని పూజ సేయ శివునిం దలచినను
భుక్తి నిచ్చు మఱియు ముక్తి నిచ్చు .
రిప్లయితొలగించుపార్వ తీ శ్వర శర్మ !
పార్వ తీ శ్వర !యవధాన పటిమ గరిమ !
తెలుగు తేజమ ! నీ కివె దెలుపు చుంటి
సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిడును .
వనము స్వేచ్ఛ నొసఁగు పక్షి జాతులకు క
రిప్లయితొలగించువనము ప్రీతి నొసఁగు పాండితికి స
వనము ముదము నొసఁగు ఘన సురలకును జీ
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు!!
వనము జీవనంబు వారిజ తతికి ప
రిప్లయితొలగించువనము జీవనంబు ప్రాణులకు చ్య
వనము తినగఁ గలుగు బలములు దంత ధా
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు!!
రిప్లయితొలగించుధర్మవర్తనమ్ము, దాతృత్వమును, సంప్ర
దాయ పాలనమ్ము, తల్లిదండ్రు
లందు భక్తి మరియు హరిహర పాదసే
వనము సుఖము నొసఁగు జనుల కొపుడు.
కేసరి గిరి(కీసరగుట్ట) లో జరుగు అతిరాత్ర హోమసందర్శనభాగ్యము కలిగినది.
రిప్లయితొలగించుదేవతలనుఁ బిలిచి దివ్యహోమములను
జరుపుచుంద్రు పుణ్యజనులు భువిని;
దేవఋణము నెల్ల దీర్చు గొప్ప దగు హ
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.
యశము ధనము నిచ్చు, వ్యవహారవిదు జేయు
రిప్లయితొలగించుశుభము లందజేయు, సుందరివలె
బోధచేయుచుండు పుడమిని కాన క
వనము సుఖము నొసగు జనుల కెపుడు.
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
అనుప్రాసతో శోభిస్తున్న మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ ‘హవన’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రాజ కీయ హింస రాత్రి బవలనక
రిప్లయితొలగించుభీతి చెంది మదిని బెగడు బడుచు
ప్రాణ హాని లేని పాలితులు గలజీ
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు !