8, జూన్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1076 (రాముఁడు శూర్పణఖను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్.
(‘శతావధాన ప్రబంధము’ నుండి)

16 కామెంట్‌లు:

  1. ప్రేమగ నఖముల బెంచెను
    ప్రేమయె తా గోళ్ళరంగు ప్రీతిగ వేసెన్
    ప్రేమించి మేన బావగు
    రాముఁడు 'శూర్పణఖ' నపుడు రహిఁ బెండ్లాడెన్.

    రిప్లయితొలగించండి
  2. ప్రేమన్ విద్యుజ్జిహ్వుఁడు,
    భీమాకృతి సహిత శత్రు భీకరుఁ, డతి సం
    క్షేమాప్త దనుజ హృద్వి
    శ్రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్.

    రిప్లయితొలగించండి
  3. కాముడి శరముల వాడికి
    ధీమతు లెందరు వశమయి దిమ్మరె నంచున్
    కాముకి కలగాంచె నిటుల
    రాముఁడు 'శూర్పణఖ' నపుడు రహిఁ బెండ్లాడెన్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గుండు మధుసూదన్ గారి పూరణ చాల బాగుగ నున్నది. శుభాభినందనలు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  5. ప్రేమగ పేరిడి రందరు
    చేమంతి ముఖము గలిగిన చేడియ కౌరా !
    హేమంత ఋతువు నందున
    రాముఁ డు శూర్పణఖ నపుడు రహిఁ పెండ్లాడెన్

    రిప్లయితొలగించండి
  6. రామునిపై పెరుగగ కడు
    బ్రేముడి, తన మాయ చేత వేరొక రామున్
    భామిని సృజింప, మాయా
    రాముడు శూర్పణఖ నపుడు రహి బెండ్లాడెన్

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాత కవి పూరణ (శతావధాన ప్రబంధము నుండి)

    కామించి చూడఁబోఁ డే
    భామను, శ్రీరాముఁ డేకపత్నీవ్రతుఁ డో
    స్వామీ! యిటు లందువె? యే
    రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్?

    రిప్లయితొలగించండి
  8. గురుతుల్యులు పండిత నేమానివారికి నమస్సులు. నా పూరణ వారి మెప్పులనందినందులకు నాకు సంతోషముగనున్నది. ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    నేమాని వారి ప్రశంస లందుకున్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    సీతారామ కళ్యాణం చిత్రంలో మాయా రాముడు, మాయా శూర్పణఖల ప్రస్తావన ఉన్నది. మీ పూరణ చూడగానే ఆ సన్నివేశం గుర్తుకు వచ్చింది. చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అవును మధుసూదన్ గారి పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  11. మోమైన జూడ డాయెను
    రాముఁడు శూర్పణఖ నపుడు, రహిఁ బెండ్లాడెన్
    భూమిజ, నొకటే సతియౌ
    రామునకని తెలియబోక రక్కసి రగిలెన్.

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పొమ్మని గట్టిగ జెప్పెను
    రాముడు శూ ర్పణ ఖ నపుడు, రహి బెండ్లాడెన్
    అమ్మగు నాయిల జాతను
    ఇమ్ముగ సంతోష మొప్ప నీశుడు రామున్

    రిప్లయితొలగించండి
  14. రామాయణమ్ము కెదురుగ
    కీమాయణమును ద్రవిడులు క్రీడింపంగా
    కామాతురుడై కొండొక
    రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్

    కీమాయణము = రామసామి
    నాయికరు వారి నాటకము

    http://nptel.ac.in/courses/109104050/lecture34/34_4.htm

    రిప్లయితొలగించండి
  15. ధీమంతుండను నేనని
    శ్రీమతిని విడిచి నగవుచు శృంగారమునన్
    వామపు పక్షము జేరిన
    రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్

    రిప్లయితొలగించండి


  16. ఏమంటిరి కందివరా!
    రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్?
    స్వామి! యిటుల రాయుట నా
    కేమో సరియనుచు తోచకే సూచనయౌ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి