19, జూన్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1087 (సీతమ్మను పెండ్లియాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సీతమ్మను పెండ్లియాడె శివుఁడు ముదమునన్.

21 కామెంట్‌లు:

  1. చేతమలర శ్రీరాముడు
    సీతమ్మను బెండ్లియాడె, శివుడు ముదమునన్
    శీతాద్రిజతో జని కని
    యా తరుణమునందు గవకు నాశిషములిడెన్

    రిప్లయితొలగించండి
  2. గురుతుల్యులు పండిత నేమానివారి మార్గదర్శనమునకుఁ గృతజ్ఞతలు తెలుపుకొనుచు...

    ప్రీతుండై శ్రీరాముఁడు
    సీతమ్మను బెండ్లియాడె; శివుఁడు ముదమునన్
    మాతంగి యుతుఁడునై చని,
    సీతారాములకు "స్వస్తి" చెప్పియుఁ దరలెన్. ౧

    క్రమాలంకారమునఁ బూరణము:

    ప్రీతిన్ రాముం డేమయె?
    శీతాద్రిజ పతి యెవండు? చిరకాలమ్మున్
    జేత మ్మెటులుండవలెన్?
    సీతమ్మను బెండ్లియాడె; శివుఁడు; ముదమునన్.

    రిప్లయితొలగించండి
  3. శ్వేతాబ్జ యంచు రాముడు
    సీతమ్మనుఁ బెండ్లియాడె, శివుడు ముదమునన్
    శీతాద్రిజతో దీవన
    లా తరుణమునందొసగగ రంజిలె జగముల్

    రిప్లయితొలగించండి
  4. అన్నయ్యగారి బాటే నా బాట కూడా ,

    ఖ్యాతి యలర శ్రీరాముడు
    సీతమ్మను బెండ్లియాడె, శివుడు ముదమునన్
    భూతగణము, పార్వతితో
    నూతన దంపతులను గని నుతులను నుడివెన్!

    రిప్లయితొలగించండి
  5. ప్రీతిగ శివు డను వాడికి
    సీత యను యువతికి బెండ్లి జేసిరి పెద్దల్
    జాతకములు కలిసె నటుల ;
    సీతమ్మను బెండ్లి యాడె శివుడు ముదమునన్

    ( తరువాత వారు తమ పేర్లను మార్చుకొన్నా రనుకోండి ! )

    రిప్లయితొలగించండి
  6. ప్రేతిన్ శ్రీ రఘురాముడు
    సీతమ్మను పెండ్లియాడె, శివుడు ముదమునన్
    శీతలగిరి రా సుత నగ
    జాతను చేకొనియె సురులు చల్లిరి విరులన్.

    రిప్లయితొలగించండి
  7. ప్రేతిన్ శ్రీ రఘురాముడు
    సీతమ్మను పెండ్లియాడె శివుడు ముదమునన్
    శీతలగిరిరా సుత నగ
    జాతను చేకొనియె సురులు చల్లిరి విరులన్

    రిప్లయితొలగించండి
  8. ప్రీతిగ విల్లును విఱచగ
    సీతమ్మను పెండ్లి యాడె , శివుడు ముదమునన్ !
    శీతాద్రి నుండి సతిగొని
    భూతలమున కనుల విందు భోగము గాంచన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీ తారక రాముడపుడు
    సీతమ్మను పెండ్లి యాడె: శివుడు ముదమునన్
    శీతాద్రిజకు తెలిపెనట
    సీతా రాముల కధలను శివ మగు వినినన్

    రిప్లయితొలగించండి
  10. శ్రీ తారక రాముడపుడు
    సీతమ్మను పెండ్లి యాడె: శివుడు ముదమునన్
    శీతాద్రిజకు తెలిపెనట
    సీతా రాముల కధలను శివ మగు వినినన్

    రిప్లయితొలగించండి
  11. ప్రీతిన్ శ్రీ రఘురాముడు
    సీతమ్మను బెండ్లి యాడె, శివుడు ముదమునన్
    శీతల గిరి రా సుత నగ
    జాతను చేకొనియె సురులు చల్లిరి విరులన్ .

    రిప్లయితొలగించండి
  12. మాతను, తాపస లోక పు
    నీతను, దివిజాంగనలకు నేతను, పరమా
    ద్వైతను, గిరిజాతను, మది
    సీతమ్మను పెండ్లియాడె శివుఁడు ముదమునన్!!

    సీతు = చల్లనైన
    మది సీతు + అమ్మ = మది సీతమ్మ = చల్లనైన మనసు కలిగినది

    రిప్లయితొలగించండి
  13. శ్రీ జిగురు సత్యనారయణ గారికి శుభాశీస్సులు.
    సమస్య పరిష్కారమునకు చక్కని మార్గమును ఎన్నుకొనినారు. సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. గుండు మధుసూదన్ gaari pUraNa....
    సీత పొరుగింటి శివుఁడటఁ
    జేతము లొక్కటిగఁ గాఁగ స్థిర జీవికకై
    మాతాపిత సమ్మతితో
    సీతమ్మను బెండ్లియాడె శివుఁడు ముదమునన్. ౩

    రిప్లయితొలగించండి
  15. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

    త్రేతా యుగమున రాముడు
    సీతమ్మను పెండ్లియాడె, శివుఁడు ముదమునన్
    త్రాతగ నొప్పారు వారిని
    ప్రీతిన్ దీవించెనంత భీమాయుతుడై.

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రుకు నమస్కృతులు.
    నిన్న మా బావమరది ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరాను. అలసట కారణంగా రాత్రి మీ పూరణలపై, పద్యాలపై స్పందించలేకపోయాను. మన్నించండి.
    *
    పండిత నేమాని వారూ,
    సమస్య పాదాన్ని విరిచి చక్కని పూరణను చెప్పి మిగిలిన కవిమిత్రులకు మార్గదర్శకులయ్యారు. దాదాపుగా అందరూ మా మార్గాన్నే (భావంతో సహా) అనుసరించారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "శీతలగిరిరా సుత" అన్నా, "నగజాత" అన్నా ఒకటే కదా.. ఇక్కడ పునరుక్తి దోషం ఉంది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    వైవిధ్యంగా ఆలోచించి పూరణలు చేయడంలో మీకు మీరే సాటి. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి, పండిత నేమాని గురువులకు
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  18. సీతమ్మను సుందరినిన్
    రీతిగ నాగేశ్వరుండు ప్రేమించంగా
    భూతల వైకుంఠములో
    సీతమ్మను పెండ్లియాడె శివుఁడు ముదమునన్

    రిప్లయితొలగించండి
  19. నీతో నుండెద నెపుడని
    ప్రీతిగ ననుచును వదలక వెంటన్ బడుచున్
    యాతన లిడుటను సమమౌ
    సీతమ్మను పెండ్లియాడె శివుఁడు ముదమునన్

    రిప్లయితొలగించండి