2, జూన్ 2013, ఆదివారం

పద్య రచన - 360 (కొల్లేటి కాపురము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“కొల్లేటి కాపురము”

8 కామెంట్‌లు:

  1. మిత్రులారా! శుభాశీస్సులు.
    కొల్లేరును గూర్చి నేను చిన్ననాట వినిన యొక కథ ఆథారముగ వ్రాయుచున్నాను:

    కొల్లేరనెడు నొక్క పల్లె యుండెను చాల
    ....సంస్కారహితులైన జనులతోడ
    నందొక్క నాడొక్క యతివకు విపరీత
    ....మైన ఆలోచన మంకురించె
    కడిగె బియ్యమ్ము నా కాంత మూత్రమ్ముతో
    ....నంత కన్పడె నొక్క యద్భుతమ్ము
    ఆ బియ్యమంతయు నపరంజిగా మారె
    ....స్వర్ణ మయమ్మయ్యె వారి గృహము
    యిరుగు పొరుగులు చేసి రదే విధముగ
    నటుల నా పల్లె భోగ భాగ్యములు గనుచు
    సకల సంపన్నిధానమై చాల తనరె
    కాని యుడిగెను జనుల సంస్కారమెల్ల

    అందరు విలాసవంతులై యలరుచుండి
    దైవ చింతన మానిరి, తగవు లెన్నొ
    పెరుగు చుండెను శాంతియే కరవుగాగ
    కక్ష లెక్కువ యగుచుండె గ్రామమందు

    ఎవ్వ రేరీతి నుండిననేని, పల్లె
    లోన నొక విప్రవరుడు విజ్ఞానధనుడు
    సంప్రదాయ బద్ధుండయి జాయతోడ
    విమల మార్గమ్మునందె జీవించుచుండె

    వారి యిలవేల్పు కరుణతో వారి కడకు
    నరిగి యొకనాడు బోధించి త్వరిత గతిని
    వారి నింకొక పల్లెకు పంపివేసి
    సకల సంపదల నొసంగి చనెను పిదప

    పిల్లలు పెద్దలతో నా
    కొల్లేరే భస్మమయ్యె గోడలు దిబ్బల్
    కొల్లలుగ మిగిలె నక్కట
    చెల్లునె దుర్బుద్ధులెల్ల చిరకాలమిలన్?

    రిప్లయితొలగించండి
  2. కొల్లేటి కాపురంబును
    గల్లీలో చెడుగుడాట గర్హింప దగున్
    పిల్లా పాపల తోడను
    చల్లంగా నుండవలయు శంభుని గృ పనన్

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    పండితుల వారు కొల్లేరును గురించి వివరించిన కధ అద్భుతం గా ఉంది ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  4. Pandita Nemani వారూ
    కొల్లేరు మీద మీ ఓ పద్య కధ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. శ్రీమతి రాజేశ్వరి గారికి మరియు శ్రీ లక్కరాజు వారికి శుభాభినందనలు మరియు ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. ఇల్లాలు నేర్పు గలిగిన
    నిల్లే యొక స్వర్గ మనుచు నీప్సిత ములకున్ !
    కొల్లేటి కాపురం బనకను
    పిల్లలు భర్తయు సుఖముగ ప్రీతిగ నుండున్ ! !

    రిప్లయితొలగించండి
  7. నేమాని పండితార్యా! కొల్లేటి కాపురాన్ని గురించిన క్రొత్త కథను వినిపించారు. బాగుంది.
    నేను విన్నది:

    కొల్లేటి కాపురంబన
    కొల్లేటికి యొడ్డు పైన గుడిసెల, నేమో
    కొల్లే రెప్పుడు పొంగునొ
    గొల్లన, కాపురము లట్లు కూలెడు ననగా.

    రిప్లయితొలగించండి
  8. కొల్లేటి కొంగ లందురు
    కొల్లేరు నందు చేపలుండు కొంగల కెఱవై
    కొల్లేటి దరిని గుడిసెల
    కొల్లేరే యలిగి మ్రింగు కోకొల్లలుగా ! !

    రిప్లయితొలగించండి