6, జూన్ 2013, గురువారం

పద్య రచన - 364 (పిడుగుపాటు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“పిడుగుపాటు”

10 కామెంట్‌లు:

  1. ఓరీ పిడుగా నూ ప్రతి
    సారీ కూలీల మీద సరిగా పడెదవ్
    ఘోరంబులు జేసెడి ఘన
    చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !

    రిప్లయితొలగించండి
  2. పిడుగు పాటగు వార్తగ పెద్దవారి
    మనము కలచెడిదట నాడు మతము మారు
    పెండ్లి; నేడు సామాన్యము; పెద్ద వింత
    కాదు, జరుపు చుండిరి వారె ఘనము గాను.

    రిప్లయితొలగించండి
  3. పిడుగు పడిననైన నెదను భీతి చెందరెంతయున్
    పిడుగు వంటి వార్తకేని విధిగ వచ్చెనంచహో
    విడువరు మది ధైర్యమున్ వివేకవంతు లొప్పుగా
    కడిదినేని కలిమినేని క్షమను వీడ రెన్నడున్

    రిప్లయితొలగించండి
  4. పిడుగు పాటు వార్త పెద్దన్న వినగను
    గుండె కొట్టు కొనెను గుప్పు గుప్పు
    అనుచు వేగ ముగను నతని జూడ భయము
    కలిగి మాకు మేను గగురు పొడిచె

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘నూ... పడెదవ్’...?
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది పద్యం. అభినందనలు..
    ఇప్పటికైనా అది పిడిగుపాటు వంటి వార్తే.. నేను కళ్ళారా చూసాను అటువంటి సంఘటనలు.
    *
    పండిత నేమాని వారూ,
    వివేకవంతుల లక్షణాలను చక్కగా వివరించారు. మంచి పద్యం. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. బడి నుంచి నింటి కేగెడు
    గుడి కేగిన తల్లి దండ్రి గూటికి చేరన్
    నడి రోడ్డు పిడుగు పాటుకు
    కడు భీతిని మనుజు లంత కలకల మొందన్ !

    రిప్లయితొలగించండి
  7. పదవి యూడి పోవ నెదపైన మంత్రికి
    పడును పిడుగుపాటు! పదవి నున్న
    ముఖ్య మంత్రి కేమొ ముప్పగు నిత్యము
    పడుట జేసి మీద పిడుగుపాట్లు!

    రిప్లయితొలగించండి
  8. ఆర్యా ! ధన్యవాదములు. నువు .. నూ గా మారింది. సవరణతో...

    ఓరీ పిడుగా!నువు ప్రతి
    సారీ కూలీల పైనె సరిగా పడెదవ్
    ఘోరంబులు జేసెడి ఘన
    చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నీవును నువు అనడమూ దోషమే.. తిలధాన్యమైన ‘నువ్వు’కు నువు రూపాంతరం.
    అలాగే ‘పడెదవ్’ అనేదీ దోషమే... అక్కడ ‘సరిగ పడెదవే’ అందాం..

    రిప్లయితొలగించండి
  10. మాస్టరు గారూ ! ధన్యవాదములు...దోష సవరణ చేయుచున్నాను...

    ఓరీ పిడుగా!పడెదవె
    ఈరీతిగ కూలివార లెటునిలబడినా
    ఘోరంబులు జేసెడి ఘన
    చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !

    రిప్లయితొలగించండి