23, ఫిబ్రవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1332 (హారతి గైకొనిన లక్ష్మి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హారతి గైకొనిన లక్ష్మి యమపురి కేగెన్.  
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవదాలు.

11 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మారణ హోమము లందున
శారద నవరాత్రు లనుచు శాంభవి గుడికిన్
భారముగ వెడలె భక్తిని
హారతి గైకొనిన లక్ష్మి యమపురి కేగెన్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

తీరుగ ముదుసలికిచ్చుచు
మారని పెద్దలు మనువును మాకిష్టమనన్
చేరెద నిపుడేయని చని
హారతి గైకొనిన లక్ష్మి యమపురి కేగెన్.

Unknown చెప్పారు...

చేరెను భూలోకమునకు
దూరెను పలు గర్భగుడులు దొరకని హరికై
చేరగ హరి యముని సభకు
హారతి గైకొనిన లక్ష్మి యమపురి కేగెన్.

A.Satyanarayana Reddy చెప్పారు...

కారణ మేమై యుండును?
హారతి గై కొనిన లక్ష్మి యమపురి కేగెన్
తీరగను పాపపు ఫలము
చేరెను యమపురికి, తదుపరి చేరును దివికిన్

A.Satyanarayana Reddy చెప్పారు...

కారణ మేమై యుండును?
హారతి గై కొనిన లక్ష్మి యమపురి కేగెన్
తీరగను పాపపు ఫలము
చేరెను యమపురికి, తదుపరి చేరును దివికిన్

A.Satyanarayana Reddy చెప్పారు...

చిన్న సవరణ " చేరెను యమపురి"

A.Satyanarayana Reddy చెప్పారు...

చిన్న సవరణ " చేరెను యమపురి"

Unknown చెప్పారు...

పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
భూరిగ విభూతి నిచ్చెను
హారతి గైకొనిన లక్ష్మి. యమపురి కేగెన్
తీరుగ సౌభాగ్యమ్మిడ
సౌరి సతికి వ్రతమొనర్చి సన్నుతి సేయన్

మిస్సన్న చెప్పారు...

చేరెను శ్రీహరి సన్నిధి
హారతి గైకొనిన లక్ష్మి, యమపురి కేగెన్
నేరక హరి పూజనముల
ఘోర దురితములను జేసి క్రూరుడు ధరలో.

కంది శంకరయ్య చెప్పారు...

మంచి పూరణలను రచించిన కవిమిత్రులు...
రాజేశ్వరి అక్కయ్యకు,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
భాగవతుల కృష్ణారావు గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
మిస్సన్న గారికి
అభినందనలు, ధన్యవాదాలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

భారత నారుల కొఱకై
పోరుచు దినముల తరబడి పొందుగ నిద్రా
హారములు మాని మంగళ
హారతి గైకొనిన లక్ష్మి యమపురి కేగెన్