1, జనవరి 2015, గురువారం

సమస్యా పూరణం - 1572 (క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు)

కవిమిత్రులారా,
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు!

నూతన క్రైస్తవ సంవత్సర శుభాకాంక్షలు!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు.
రాబోవు రెండు మూడు రోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. 
అన్నిరోజులకు సమస్యలను షెడ్యూల్ చేసి ఉంచాను. 
కవిమిత్రులు నన్ను మన్నించి పరస్పర గుణదోషవిచారణ చేసికొనవలసిందిగా మనవి.

50 కామెంట్‌లు:

  1. గురువర్యులు శంకరయ్య మాస్టారికి కవిమిత్రులకు నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ......
    ----------------

    ఇరువది, యొకటి యు, నైదిది
    నరయంగా మంచి సంఖ్య యన్నిటి కంటెన్
    తిరముగ వత్సర మంతయు
    సిరి రాసుల నిచ్చి, మనల శ్రీ పతి జేయున్

    రిప్లయితొలగించండి
  3. జనులకేమి దుర్ఘటనలు జరుగకుండ
    రక్షక భటులు చలిలోన రాత్రి యంత
    నిద్ర లేకుండ విధులను నెరపు చుండు
    క్రొత్త సంవత్సరము దెచ్చె కోటివెతలు

    రిప్లయితొలగించండి
  4. మంచి గలిగించు గావుత ! మా న్యముగను
    క్రొత్త సంవత్సరము , దెచ్చె కోటి వెతలు
    పాత సంవత్సరము నిల పాడు బుద్ధి
    గలుగు దుర్మార్గులకు నెల్ల ఖ చ్చితముగ

    రిప్లయితొలగించండి
  5. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి, కవిమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. పూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  8. పాత స్వార్థపు కోర్కెలన్ పాతిపెట్టి
    కల్మషముగల్గు మనసుల కడిగివేయ
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు
    సమసి పోయి కాలము సాగు సంతసముగ

    రిప్లయితొలగించండి
  9. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    కొత్త వర్షపు వేడుక కోరు కొనుచు
    మోజు కోసము చేరిన మూఢ మతులు
    నీతి నియమములన్నియు నేల గలిపి
    మూక ముచ్చట్ల గోలలో మోసబోవ
    క్రొత్త సంవత్సరము దెచ్చె కోటివెతలు

    http://www.nbcnews.com/news/world/new-years-tragedy-35-killed-shanghai-stampede-n277736

    రిప్లయితొలగించండి
  10. అందరికీ " ఆంగ్ల " సంవత్సర శుభాకాంక్షలు...

    కందము:
    విష్యూ హ్యాపీ న్యూయ్యర్
    పుష్యూ టూరీచ్ టువర్డ్సు ఫుల్ జాయ్ అండ్ పీస్
    విష్యూ ఆల్ దా బెస్ట్, బ్యాడ్
    ఇష్యూస్ విల్ నాటు రీచ్ యు, ఎవ్వర్ బీ గ్లాడ్.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,కవిమిత్రులకు నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు, బ్లాగు అభిమానులకు నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు.
    శుభాకాంక్షలు తెలిపిన, తెలుపుతున్న మిత్రులకు ధన్యవాదాలు.
    ఈనాటి సమస్యను షెడ్యూల్ చేస్తున్నప్పుడు శీర్షికను ‘క్రొత్తసంవత్సరము దెచ్చె కోటి వెతలు’ అని ఇచ్చి, సమస్యను మాత్రం ‘క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు’ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సవరించాను. మిత్రులు రెండు విధాల పూరించారు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. హ్యాపీ న్యూ యియ రందును
    కాపీ వలె హాయి నీయ కమ్మగ ఫ్రండ్సూ!
    తాపీగా జాలీగా
    సాపీగా సాగు గాక సంవత్సరమున్.

    రిప్లయితొలగించండి
  14. రాజధాని లేనే లేదు రాబడియును
    స్వల్ప మాయె సమస్య లనల్ప మాయె
    యేమి చెప్పుదు సీమాంధ్ర యిడుము లహహ
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారు, మిస్సన్న గారు చెప్పిన హ్యాపీ న్యూ యియర్ పద్యాలు బాగున్నవి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు
    పొందినను భయంబిసుమంత చెందకుండ
    సాగవెలె ముందు నలకను చక్కబెడుతు
    మనషి మనవలె జీవన మార్గ మిదియె .

    రిప్లయితొలగించండి
  17. ప్రాతయందలి చిక్కులు పరుగుతీసె
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు
    కాలమందున నవియెల్ల కరగిపోవ
    మాన్య ముక్కోటి దైవాలె మనకురక్ష!

    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు
    పోవ,శాంతియు నేతేర,పుణ్యమదియ
    కనమె?ముక్కోటి పర్వాన ఘనుని,విష్ణు
    దయను,నందరకాతడె తారణుండు!

    మూడుకోటుల దైవాలు ముచ్చటగను
    క్రొత్తవత్సర వేళను కూడి రాగ
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు
    నూడ్చి,సుఖముల శాంతిని నూరడింప

    క్రొత్త రాష్ట్రాలు నేర్పడ క్రొత్తవౌచు
    వివిధమౌ సమస్యలున్నవి వెలుగు చూడ
    క్రొత్త సంవత్సరమున ముక్కోటివెతలు
    మూడుకోట్లగు దైవాలు ముదము నిడరె?

    ఆశ యొక్కటె బ్రతికించు నవని జనుల
    భావి యందున తామెంతొ బాగుగాను
    బ్రతుక,వైకుంఠుడాతడు పటిమ జేర్చ
    క్రొత్త సంవత్స్రరమున ముక్కోటి వెతలు

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గారికి , ఇతర కవి బృందానికంతటికీ నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

    వేయి శుభములఁ గోనేటి రాయఁడొసఁగ
    హాయిగా జనకోటి భాగ్యములనొందుఁ
    దెలుఁగు తేజమ్ము విలసిల్లుఁ దీరునింకఁ
    గ్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు !

    రిప్లయితొలగించండి
  19. అధిక ధరతోడ నల్లాడు నవనిజనులు
    క్రొత్త పన్నులు బాధించు కొంతసేపు
    ఆశ చిగురించి దీర్చులే నందరకును
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు

    రిప్లయితొలగించండి
  20. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    ****
    డా. విష్ణునందన్ గారూ,
    చక్కని పూరణ నందించి అలరింపజేసారు. అభినందనలు, ధన్యవాదాలు.
    ****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ మిస్సన్న గారూ ! మీ ' స్వల్పమాయె సమస్యలనల్పమాయె ' వాక్యం కర్ణపేయంగా ఉంది. దాని కింది మూడవ పాదములో ' యేమి చెప్పుదు ' బదులుగా ' నేమి చెప్పుదు ' అన్న సవరణ సూచిస్తూన్నాను ! గమనింపగలరు ...

    రిప్లయితొలగించండి
  22. ధన్యవాదాలు విష్ణునందన్ గారూ. పొరబాటుకు చింతిస్తున్నాను. మీ దిద్దుబాటుకు సంతోషిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  23. సాహితీకవిమిత్రులకునూతనవత్సరశుభాశయములు
    ఏడుకొండలకష్టాలు?వేడుకున్న
    వేంకటేశునిదర్సనంవెనుకబడగ|
    తరుగకున్నట్టిభక్తులతలపునందు
    కొత్తసంవత్చరమునముక్కోటివెతలు
    2కొత్తసంవత్చరమునముక్కోటివెతలు
    రావురాబోవునీకు,నిరాశలేక
    తృప్తియన్నదిమనసున్నగుప్తనిధిచె
    కార్యసాధనగావించ?కలిమి,బలిమి

    రిప్లయితొలగించండి
  24. కథలుగావివిజీవనకాన్షలెన్నొ
    వ్యధలచేతనుముడివడిమధనబడక
    కొత్తసంవత్షరమున,ముక్కోటివెతలు
    తొలగజేసిననాడిసంతోషమొసగు
    2ఆశ,నత్యాసగామార్చ?హాయిరాదు
    సాంద్రసంసారమందునసాగునపుడు
    నీతినియమాలవోడలోనేగకున్న?
    కొత్తసంవత్చరమున,ముక్కోటిveతలు

    రిప్లయితొలగించండి
  25. తెలుగువెలుగనిదీ పమైదీప్తిదగ్గ
    ఆదరించనిఅక్షరాల్నలిగిపొగ
    ఆంగ్లమంతటనిండగ?ఆంధ్రభాష
    కొత్తసంవత్చరమునముక్కోటివెతలు

    రిప్లయితొలగించండి
  26. గురువులు శ్రీకంది శంకరయ్య గారికి మరియునితర కవిమిత్రులకు "వైకుంఠ ఏకాదశి" శుభాకాంక్షలు.

    శ్రీకళ్యాణగుణోత్తమప్రకటతన్ జెల్వొంది లక్ష్మీకళా
    సాకల్యంబున భక్తసంతతులఁ గాంచన్ ధర్మసంస్థాపనా
    వైకల్యంబుల ద్రుంపివేయఁగల దీవ్యద్భాసితప్రాభవున్
    వైకుంఠున్ నుతియింతు భక్తిమెయి విశ్వశ్రేయమున్ గోరుచున్.

    రిప్లయితొలగించండి
  27. క్రొత్తరాష్ట్రమ్మునందున కొఱత-నిధులు
    నీటికష్టాలతోటి కన్నీటిగాథ
    మరి యుపాధులులేనట్టి మనదు యువత
    క్రొత్తసంవత్సరమున ముక్కోటి వెతలు.

    రిప్లయితొలగించండి
  28. డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీరు వ్రాసిన శార్దూలం చాలా బాగుంది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  30. గురుదేవులకు కవిమిత్రులకు 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు
    కొత్త పాతనగనులేవు కూటి కొరకు
    వెతలు తప్పవు జీవన విధులు నడుప
    పాత బాకీలు ని౦క వడ్డీ యు కలిసి
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు
    2.నిదురలేవంగ శ్రీహరి నిలిచి రెదుట
    దిక్కులందున్న ముక్కోటి దివిజులెల్ల
    ఒక్క కష్టమ్ము చొప్పున నొకరు జెప్ప
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు

    రిప్లయితొలగించండి

  31. గురుదేవులకు కవిమిత్రులకు 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు
    కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    నాకు గలడు ముక్కోటి యనబడు నేస్త
    గాడు,పొ౦దవలె శుభ సౌఖ్యముల నతడు
    కొత్త సంవత్సరమున.ముక్కోటి వెతలు
    బడసె గద నిరుడె౦తయు పాప మయ్యొ

    రిప్లయితొలగించండి
  32. శ్రీకరమ్ముగ వచ్చెను సిరులు గురియ
    కొత్త సంవత్సరము, దెచ్చె కోటి వెతలు
    సుందరనగరము విశాఖ సొగసు గూల్చి
    మూడు జిల్లాల జనులకు ముప్పు తెచ్చి
    పాత వత్సర మెంతయో కోత బెట్టె !!!

    ఏడు కొండల రాయుని వేడుకొనగ
    కీడు పీడలు రాకుండ చూడు నతడె
    కొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు
    దీర్చి సకల సౌఖ్యములిడు ధిషణి యందు!!!

    రిప్లయితొలగించండి
  33. మీ అందిరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు
    సమిసి, సమకూరు విశ్వాన శాంతి సుఖము.
    మొదటి రోజునే ముక్కోటి మొదలు గాగ
    ముందు కాలముండగలదు ముచ్చటగను.

    రిప్లయితొలగించండి
  34. తేగీ. ఏటి ఏటికి క్రొత్తగ ఏడు వచ్చు .
    పాత పాటులు ఇసుమంత బాయకుండ .
    కలసి కొత్తవెతలుజతకట్టి నిలుచు
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు.

    రిప్లయితొలగించండి
  35. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మిస్సన్న గారూ ! ధన్యవాదములు.మంచి కాఫీ లాంటి పద్యం మీరూ అందించారు బాగుంది

    రిప్లయితొలగించండి
  36. గురుదేవులకు మరియు కవిమిత్రులకు బ్లాగు వీక్షకులకు ఆంగ్ల సంవత్సరరాది మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
    భక్త జనులెల్ల గుళ్ళకు బారు దీర

    వారి నాశీర్వ దించగ శౌరి చూడ
    కోరి యేకాదశి దినమ్ము చేర సురలు
    కొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు!

    రిప్లయితొలగించండి
  37. కవిమిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు! రాబోయేది మన్మధనామ సంవత్సరము. అంతటా ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పటినుంచే నేలకొనవలెనని ఆశిస్తూ...
    భవదీయుడు,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  38. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘పాత + అనగ’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘క్రొత్త పాత యనగలేవు కూటికొఱకు’ అనండి. మూడవ పాదంలో యతి తప్పింది. ‘పాతబాకీలతో నింక వడ్డి కలిసి’ అనండి.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    పి.యస్.ఆర్. మూర్తి గారూ (ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి అని జ్ఞాపకం!)
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. అవసరమైన యడాగమ, నుగాగమాలను ప్రయోగించండి. మీ మొదటి పాదాన్ని ‘ఏటి కేటికి క్రొత్తగ నేడు వచ్చు’ అనండి. ‘పాటులు + ఇసుమంత’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘పాత కష్టము లిసుమంత...’ అనండి.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  39. గురువుగారు తెలియక అడుగుతున్నాను . పాద మద్యం లో అచ్చులు రాకూడని నిబంధన ఏమైనా వున్నదా లేక అలా రావడం వలన పద్యం అందం పోతున్దనా తెలుపగలరు. రెండవది మొదటి పాదం లో ఏ తొ మొదలైనప్పుడు దానికి నే యతి కుదురుతుందా వివరణ ఇవ్వవలసినదిగా కోరుతున్నాను. లేదా నే అనడం లో ఏ అనే శబ్దం వచ్చినందుకు చెల్లుబాటు అవున్తుండా .? దయచేసి చెప్పండి .

    రిప్లయితొలగించండి
  40. Q: పాద మద్యం లో అచ్చులు రాకూడని నిబంధన ఏమైనా వున్నదా?

    తెలుగులో సంప్రదాయం ప్రకారం,

    1. ఏ పదం మధ్యలోనూ ఒక అచ్చు విడిగా ఉండదు.

    2. ఏదైనా ఒక వాక్యంలో మొదటి పదం ఒక అచ్చుతో ప్రారంభం కావచ్చును. మిగిలిన పదాలలో యేదైనా ఒక పదం అచ్చుతో ప్రారంభం అవుతున్న సంధర్భంలో ఆ పదాదిని ఉన్న అచ్చుకు దానికి పూర్వపదంగా ఉన్నదాని చివరి అచ్చుతో సంధిని పొందుతుంది. అలా సంధిరాని సంధర్భంలో ఆ అచ్చు యకారంయొక్క గుణింతం అవుతుంది. (ఉదాహరణకు, చెప్పాలంటే 'ఇది' అనటం బదులు 'యిది' అన్నట్లుగా)

    3. వ్యవహారభాషలో కావాలని విసంధిగా వ్రాయటం పరిపాటి.

    Q: రెండవది మొదటి పాదం లో ఏ తొ మొదలైనప్పుడు దానికి నే యతి కుదురుతుందా?

    మొదటి అక్షరం ఒక అచ్చు ఐనప్పుడు, యతిస్థానంలో ఆ అచ్చుతో మైత్రికల అచ్చు రావలసినదే. సహజంగా సంధి అన్నది ఒకటి అక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి, సంధి చెఅయకముందు ఆ పదం తగిన యతిమైత్రి కల అక్షరంతో ప్రారంభం కావాలి. యతిస్థానంలో ఒక పదం అంతం అవుతున్నప్పుడు సంబోధనార్థకంగా, ప్రశ్నార్థకంగా. ఆశ్యర్యార్థకంగా వచ్చే అచ్చులు వాడవచ్చును ( ఉదాహరణకు, అగునా?, అగునే?, తెలుపుమా వంటి మాటల చివరి అచ్చుల్నిచెల్లించితే తప్పులేదు)

    రిప్లయితొలగించండి
  41. మార్చిన పిదప


    ఏటి యేటికి క్రొత్తగ నేడు వచ్చు .
    పాత కష్టము లిసుమంత కలసి కొత్తవెతలుజతకట్టి నిలుచు
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు

    రిప్లయితొలగించండి
  42. శ్యామలీయం గారూ,
    ధన్యవాదాలు.
    ****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ సందేహాలకు సమాధానం టైప్ చేసి పోస్ట్ చెయ్యబోతుండగా ఇంటర్‍నెట్ సంబంధం తెగిపోయి ఇప్పుడే వచ్చింది. నోట్‍పాడ్‍లో సేవ్ చేసి ఉంచిన ఆ వ్యాఖ్యను ఇక్కడ ఇస్తున్నాను.....
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    పద్యపాదం మధ్యలోనే గ్రాంధికభాషలో వ్రాసిన మామూలు వాక్యం మధ్యలోనూ అచ్చు రాకూడదనేది నియమం. ఉదాహరణకు భాగవతంలోని ఈ వచనం చూడండి...
    “ఇట్లు ‘సత్యం పరం ధీమహి’ యను గాయత్రీ ప్రారంభంబున గాయత్రీనామబ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి
    యీ పురాణంబు శ్రీ మహాభాగవతంబన నొప్పుచుండు.”
    దీనిని అచ్చులతో వ్రాస్తే ఇలా ఉంటుంది...
    “ఇట్లు ‘సత్యం పరం ధీమహి’ అను గాయత్రీ ప్రారంభంబున గాయత్రీనామబ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రిని అధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును ఎందుఁ జెప్పంబడును అదియ భాగవతంబు అని పలుకుటం జేసి ఈ పురాణంబు శ్రీ మహాభాగవతంబు అన ఒప్పుచుండు.”
    ఇక యతి విషయం...
    పాదం ‘ఏ’తో మొదలైనప్పుడు సంధిగతమైన ‘ఏ’తోనే యతి చెల్లుతుంది. ఉదా..
    ఏమి చెప్పెద నిపుడు నే ‘నే’మి సేతు.
    ఏమి సేయఁగ వచ్చెద ‘నే’ నిచటకు. (వచ్చెదన్ + ఏను + ఇచటకు)
    అంతేకాని...
    ఏమి చెప్పెద నిపుడు నా నేర్పుతోడ
    ఏమి సేయఁగ వచ్చెద నే డిచటకు... అనరాదు. యతి చెల్లదు.
    నేను మీకు సూచించిన సవరణలో ‘క్రొత్తగన్ + ఏడు వచ్చు’ అని...

    రిప్లయితొలగించండి
  43. సీటు దొరుకక హరిభక్తకోటి వెతలు
    గూడు దొరుకక హరిభక్తకోటి వెతలు
    క్యూలు కదలక హరిభక్తకోటి వెతలు
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు

    రిప్లయితొలగించండి
  44. శ్యామలీయం గారూ,
    ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణ్వాలయాలలో భక్తుల వెతలను చక్కగా వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  45. తెలుగు లోగిలి రెండుగ నలిగి పోయె
    మనసులో గిలి గలుగగ మధనమందె
    క్రొత్త ప్రాతల సర్దుటన్ గొడవ రగుల
    క్రొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు.

    రిప్లయితొలగించండి
  46. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  47. ధన్యవాదాలు శంకరయ్యగారు ఏంతొ శ్రమకోర్చుకొని నాకు సమందానమిచ్చినండులకు.ఇకముందు జాగర్త వహించి మీతో భేష్ అనిపించుకునే ప్రయత్నం చేస్తాను.

    రిప్లయితొలగించండి
  48. శ్యామ లీయం గారింకి నా ధన్యవాదాలు నా సందేహానికి సమాధాన మిచ్చినండులాకు

    రిప్లయితొలగించండి