31, డిసెంబర్ 2014, బుధవారం

దత్తపది - 61 (కలము-చలము-తలము-బలము)

కవిమిత్రులారా!
కలము - చలము - తలము - బలము
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

(కారణాంతరాలవల్ల కొన్నిరోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదని గమనించ మనవి)

36 కామెంట్‌లు:

 1. కలమున సౌగంధిక మును కాంక్షించగ శేషా
  చలము లపైనే రయమున సాధించగ భీమా
  తలములు గంగా జలములు దాటంగ విశ్రాంతన్
  బలముగ కోరంగ సతికి ప్రాణంబని ప్రీతిన్

  కలము = గంధ వృక్షము
  గురువులు క్షమించాలి
  ఇది " ప్రియ కాంతా వృత్తము " నేను శ్రీ చింతా వారి బ్లాగులో చదివిన ఒక ప్రయత్నము .దయచేసి పరిశీలించ గలరు
  గణములు = న - య - న - య - స - గ .11వ అక్షరము యతి
  మీకు తెలియదని కాదు నాలాగ తెలియని వారుంటే తెలుసుకోగలరని మాత్రమే

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలు అలరింప నున్నవి !

  బాలభీముని బరువును తాళ లేక :

  01)
  _______________________________

  పెక్కు శకలము లాయెను ♦ నిక్కువముగ
  నచల మందలి తలమంత ♦ బలము గలుగు
  బాలభీముని బరువును ♦ తాళ లేక !
  చక్కనైనట్టి బాలుండు ♦ జారి పడిన
  కుంతి మాతయె భయపడి ♦ కొడుకు విడువ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 3. భూతలము సకలము తన పొట్టనున్న
  శౌరి పాండవుల బలము పోరిలోన
  చలము గొన్న రిపుల వెస సంహరించ
  ననవరతముతా తోడ్పడె నాజిలోన

  రిప్లయితొలగించండి
 4. స్థాన బలమున దుష్టులు సాహ సించి
  కురు సభాతలమున సతి కొప్పుబట్టి
  చీర యంచలమును విప్పి చెరచ గాను
  సిగ్గుతో పాండు పుత్రుల శిరము లొంగె
  మతులు సకల వికలమాయె మాట రాక

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ విశేషవృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
  మీరు చెప్పకుంటే అది ఏ వృత్తమో తెలిసికొనడానికి ఛందఃపదకోశంలో వెదకాల్సి వచ్చేది. ధన్యవాదాలు.
  ‘భీమాతలములు’ అన్నది అర్థం కాలేదు.
  ****
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  దత్తపదాలన్నీ మొదటి రెండుపాదాల్లోనే ఇమిడిపోయాయి కదా!
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చెరచగాను’ కంటే ‘చెరచబోవ’ అంటే బాగుంటుందేమో?
  ‘శిరసులొంగె’... ‘వంగె’ను ‘ఒంగె’ అనడం గ్రామ్యం. అక్కడ సవరించండి.

  రిప్లయితొలగించండి
 6. దుర్యోధనుని స్వగతం....

  బలమున్నది నాకే భూ
  తలమింతయు పాండవులకు దక్కగ నీయన్
  కలకలము రేగి వారల
  చలముల వనముల దిరుగుచు చావగ వలెగా .

  రిప్లయితొలగించండి
 7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కని పూరణ చేశారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. ధన్యవాదములు గురువర్యా , మీ సూచన మేరకు సరి చేసాను .

  స్థాన బలమున దుష్టులు సాహ సించి
  కురు సభాతలమున సతి కొప్పుబట్టి
  చీర యంచలమును విప్పి చెరచ బోవ
  సిగ్గుతో పాండు పుత్రుల శిరము వంగె
  మతులు సకల వికలమాయె మాట రాక

  రిప్లయితొలగించండి
 9. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  పాండుపుత్రులు బహువచనం... శిరము ఏకవచనం.. కనుక ‘సిగ్గుతో పాండవాగ్రజు శిరము వంగె’ జూదమాడి ఆ అవమానానికి కారకుడైనవాడు ధర్మరాజే కదా..

  రిప్లయితొలగించండి
 10. కలముడు గోపికావిషయకాముడు కృష్ణు డటంచు మూర్ఖుడై
  చలము కొనంగ చైద్యు గని చయ్యన కంఠము నేసె చక్రి భూ-
  తలమున రాలగా శిరము దర్పము మాసి హతుండయెన్ సభన్
  బలమురు పాపరాశి శిశుపాలుడు యాగము సాగె శోభగా.

  రిప్లయితొలగించండి
 11. మయసభనుజూచి రారాజు స్వగతం...

  భూతలమునిది సాధ్యమా నొరుల కైన
  చలము గొనెమామనసు మయసభను గనగ
  సకలమును జూచి మురియడే శత్రువైన
  వాసుదేవుని బలముండె పాండవులకు!!!

  రిప్లయితొలగించండి
 12. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  దత్తపదాలను వృత్తపాదారంభంలో పెట్టి ఎవరు పూరిస్తారా అని చూస్తున్నా. నా కోరిక మీరు తీర్చారు. ధన్యవాదాలు.
  ****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. శైలజ గారి మొదటి పాదంలో యతి తప్పింది.

  రిప్లయితొలగించండి

 14. పద్యము:ధరణీ తలముర్రూడగ,
  కురుబలములు ముట్టడి౦చి గోవుల గొనియెన్
  మరలింపుము చలమున యో
  విరటాత్మజ సకలముర్వి వినుతి౦ప౦గన్

  రిప్లయితొలగించండి
 15. అన్నపరెడ్డి వారూ,
  నిజమే! నేను గమనించలేదు... ధన్యవాదాలు.
  ****
  శైలజ గారూ,
  మొదటిపాదాన్ని సవరించండి.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. కం. దుర్విధి నోడిరి సకలము
  ఉర్విజ నులచలములైరి ఓటమి చెందన్
  దుర్మతు లుబలము మీరిన
  ధర్మము కుంతీ సుతలముదముహరి యుంపన్.

  రిప్లయితొలగించండి
 17. పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సకలము ఉర్విజను’లని విసంధిగా వ్రాయరాదు కదా... ‘సకల| మ్ముర్విజను’ లనండి. ‘కుంతీసుతులు’ టైపాటు వల్ల ‘కుంతీసుత’లయింది.

  రిప్లయితొలగించండి
 18. కెయెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
  బలము గలట్టి యైదుగురు భర్తలుకూర్చునియున్నవారుని
  శ్చలముగ,దుస్ససేను డొలుచన్ దొడగెన్ గద కట్టుకున్నకో
  కల మురవైరి శౌరి శ్రిత కంజ వికర్తన యింక కాదు నా
  తలము నివర్తిలంగ దయ దాల్చుము బ్రోవుము స్వామి పాహి మాం.

  రిప్లయితొలగించండి
 19. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  మీరు కూడా దత్తపదాలను మిస్సన్నగారి వలె పాదాది నుంచి సంతోషింపజేశారు. ‘కలము’ను ప్రయోగించిన తీరు ప్రశంసనీయం.

  రిప్లయితొలగించండి
 20. భీముని బలము తోడుత విజయు శక్తి
  చలమునొంద భూతలమప్డు శౌరికతన
  కలకలమురేగె భారత కదనమందు
  గుడ్డిరాజు గుండెల కడు గుబులు వుట్టె

  రిప్లయితొలగించండి
 21. ప్రణామములు గురువుగారు, యతి సరిగా చూసుకొోలేకపోయాను , సవరించాను ,తప్పయిన సరిదిద్ద ప్రార్ధన..
  తాత = బ్రహ్మ

  భూతలమునిది సాధ్యమా తాత కైన
  చలము గొనెమామనసు మయసభను గనగ
  సకలమును జూచి మురియడే శత్రువైన
  వాసుదేవుని బలముండె పాండవులకు!!!

  రిప్లయితొలగించండి
 22. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  శైలజ గారూ,
  మీ సవరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. బలము న్నది మమ్ముల భూ
  తలమున నోడించవారి తరమౌనా! సం
  చలనము జరుగనిలో కల
  కలము జనించు మడిసెదరు కౌంతేయాదుల్

  రిప్లయితొలగించండి
 24. ధన్య వాదములు
  " భీమా " సాధించితివి భీమా " అని ఆ పాదం అక్కడితో ఐపోయింది ఇక " తలములు " రెండవ పాదం అన్నమాట . అది నాఉద్దేశ్యము

  రిప్లయితొలగించండి
 25. బలమునీయండకృష్ణ,చంచలమురాదు
  భూతలమునందురక్షింపుభుద్దిమంత
  కలముడట్లుగదాగున్న?విలువలేదు
  ననుచునర్జనుడనె,యుద్ధఘనతయున్న
  2కల,మునుగాంచితర్జునసకాలమునందుననీవురావ?చం
  చలముజనించు,నామదివిచారమునొందకెవేగరమ్ము,భూ
  తలముననేనునీకుననుతత్వమువీడకచేరుకున్న?నా
  బలమునుపెంచినట్లగు,సుభద్రకుభద్రతనీవెనిద్రకున్|

  రిప్లయితొలగించండి
 26. బలమునీయండకృష్ణ,చంచలమురాదు
  భూతలమునందురక్షింపుభుద్దిమంత
  కలముడట్లుగదాగున్న?విలువలేదు
  ననుచునర్జనుడనె,యుద్ధఘనతయున్న
  2కల,మునుగాంచితర్జునసకాలమునందుననీవురావ?చం
  చలముజనించు,నామదివిచారమునొందకెవేగరమ్ము,భూ
  తలముననేనునీకుననుతత్వమువీడకచేరుకున్న?నా
  బలమునుపెంచినట్లగు,సుభద్రకుభద్రతనీవెనిద్రకున్|

  రిప్లయితొలగించండి
 27. \తరళం
  కలముదించనిభారతమ్మునకల్పితాలతొసాగ?చం
  చలముచేతనుకౌరవుల్నిడుచాకచక్యములన్ని,భూ
  తలముమెచ్చరుపాండవుల్తమధర్మచింతననిల్ప?యే
  బలమునిల్వదుదుష్టతత్వముభంగపాటునుగూర్చులే|

  రిప్లయితొలగించండి
 28. కలకలమున జడఁ బట్టుకు
  బలమున దుశ్శ్యాసనుండు పాంచాలి సతి
  న్నిలబెట్ట సభా తలము న
  చలమయ్యె! హరియె వలువల సమకూర్చెనటన్!

  రిప్లయితొలగించండి
 29. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  అక్కయ్యా,
  క్షమించండి! అవగాహనాలోపం వల్ల అలా వ్యాఖ్యానించాను.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీ ఆహ్వానం అందింది. శుభాకాంక్షలు, ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 30. "బలము"గల్గిన వాడని,వాయుకలము
  విసము బెట్టియు నీటను వేయ,"తలము"
  జేరి,నాగబలుడునయ్యె,చెంది"చలము"
  జంప జూడంగ బలమది చక్కనొందె
  (కలము=రేతస్సు,తలము=పాతాళము)

  "కలము"లు నౌచు లాక్షగృహము,కౌరవులటు
  పాండవాళిని పంపిరి వారి"చలము"
  జంప,"తలము" జేరిరి గద,చటుల గతిని
  "బలము" చేతను భీముండు వారిమ్రోయ
  (కలములు=దొంగలు;తలము=అరణ్యము)

  "కలము"డగు సైంధవుండును,కామమునను
  "తలము"నందున్నద్రోవది తాకగాను
  "బలము"గల పాండవులు నల వాని నొంచ
  "చలము"నను వరమునందె శంభు వలన
  (కలముడు=దొంగ;తలము=అరణ్యము)

  రిప్లయితొలగించండి
 31. కలమున్ బట్టితి వ్రాసితీవిటుల, సంగ్రామంబుగా జన్మ, ని
  శ్చలమున్ మానసమందు పొందదగనే? సౌఖ్యంబు లేదో ధరా
  తలమున్? నీ దయ గల్గె ధైర్యము మనోస్థైర్యంబు! స్వామీ! మహా
  బలమున్ గెల్చితి వైరి వర్గములనున్, భవ్యంబుగా !శ్రీహరీ!

  రిప్లయితొలగించండి
 32. శంకరయ్య గారు మీరు చెప్పిన తరువాత మార్చినాను చిత్తగించండి. ఒక చిన్నమాట నిఘతువులో సుత అంటే కొడుకు,కూతురు అని రెండు అర్ధాలు ఇచ్చారు. ఉదా.అంబా సుత అని వినాయకుని అన్నట్టు.

  దుర్విధి నోడిరి సకల
  మ్ముర్విజ నులచలములైరి ఓటమి చెందన్
  దుర్మతు లుబలము మీరి,న
  ధర్మము కుంతీ సుతులముదముహరి యుంపన్

  రిప్లయితొలగించండి
 33. పిరాట్లవారూ,
  సుతః అంటే కుమారుడు అని అర్థం, అకారాంత పుల్లింగంగా. సుతా అని ఆకారంతం స్త్రీలింగంగా పుత్రిక అని అర్థం. అంబాసుతః అంటే అమ్మవారికుమారుడు వినాయకుడు అన్నార్థంలో మీరు చెప్పిన కీర్తనలో అన్వయం. మరొక కీర్తనలో గిరిరాజసుతాతనయ అని వినాయకుడిని చెప్పిన సందర్భంలో గిరిరాజసుతా అంటే అక్కడ గిరిరాజు ఐన హిమవంతుడి పుత్రిక పార్వతీ అమ్మవారు అన్న అర్థం. శబ్ధం మూలస్వరూపంతో పాటు వివిధలింగవచనవిభక్తుల సంధర్బాలలో ఎలా ప్రయోగించేదీ శబ్దమంజరీ ఇత్యాదుల సహాయంతో తెలిసికోవాలి. కొంతవరకు వినికిడి వల్ల తెలుసుకొన వచ్చును.

  రిప్లయితొలగించండి
 34. పిరాట్లవారూ,
  ఈ మాటలకు తత్సమాలు సుతుఁడు = కుమారుడు; సుత = కుమార్తె అని.

  రిప్లయితొలగించండి