20, జనవరి 2015, మంగళవారం

పద్యరచన - 796

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. కాకి పిల్ల ముద్దు కాకికి యటులనె
    నుడుత పిల్ల ముద్దు నుడుత కహహ
    చూడ చిత్ర మచట చోద్యము గానుండె
    నెంత జాగ రూక తెంత ముద్దు ?

    రిప్లయితొలగించండి
  2. గట్టిగ గుండెకునప్పుడె
    పుట్టిన తనబిడ్డనునదుముకొనెనుడుత తా
    చుట్టూ యున్న ప్రపంచము
    నిట్టే మరచేను తల్లులింతే భువిలో

    రిప్లయితొలగించండి
  3. గారాబు పట్టి నీవని
    భారము గాదనుచు పెంచ భాగ్య మటన్నన్
    చోరులు వలవేసి బట్టగ
    నేరీతిగ నీకు రక్ష నేమని జెప్పన్

    రిప్లయితొలగించండి
  4. మమకారంబగుఅమ్మనాదరణసామాన్యంబె?నూహించగా?
    యముడేవచ్చినరక్షజేయగలసాయంబుంచుధైర్యంబుగా|
    శ్రమలెక్కించకబిడ్డఫైనుడుత|విశ్వాసంపుచిత్రంబిటన్
    కమనీయంబగుకన్నబిడ్డమమతాకావ్యంబుసూచించుగా|

    రిప్లయితొలగించండి
  5. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    చివరి రెండు పాదాల్లో వ్యావహారిక పదాలను ఉపయోగించారు. నా సవరణ....
    చుట్టును వెలయు ప్రపంచము
    నిట్టులె మరచినది తల్లు లింతే భువిలో...
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. నా సవరణ...
    చోరులు వలలం బట్టగ
    నేరీతిగ నీకు రక్ష నిప్పుడు సేతున్.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గర్భ యాతన నుభవించి గడువు తీర
    పిల్ల పుట్టగ మొదలవు తల్లి భయము
    క్రూర మృగములు నక్కుచు చేరు నిపుడు
    తల్ల డిల్లిచు పిల్లను దాచ వలయు !!

    రిప్లయితొలగించండి
  7. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    చాలా మంచి భావంతో పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    ‘యాతన + అనుభవించి = యాతన యనుభవించి/ యాతన ననుభవించి’ అవుతుంది. అంతేకాని అక్కడ సంధి లేదు. ‘యాతననే పొంది’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. మూగ జీవి తా బిడ్డను పొదివి పట్టి
    ముద్దులాడుచు నుండెను ముదముతోడ
    నాడు మగబిడ్డలని యెంచి వీడ కుండ
    సాకు నుడుతలు బిడ్డలన్ సాదు మతిని

    రిప్లయితొలగించండి
  9. ఉడుతయె కూనను బట్టుకు
    నొడిలో లాలించుచుండె నోదారుచుచున్
    బుడమిన యేతల్లైనను
    కడుసంతోషమునుబొందు గాంచగ పట్టిన్ !!!

    రిప్లయితొలగించండి
  10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు మనవి...
    నే నిప్పుడు మా అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాను. రేపు ఉదయం తిరిగి వస్తాను. అక్కడ నెట్ సౌకర్యం ఉండదు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    రేపటి పద్యరదన షెఢ్యూల్ చేశాను.

    రిప్లయితొలగించండి
  13. కె యెస్ గురుమూర్తి ఆచారిగారి పద్యము
    గారములకాంతు లీను బ౦గార మీవె
    ముద్దు లొలికెడు మమతల ముద్దవీవె
    హత్తు కొనియెద ప్రేమ మహత్తు జూపి
    నిదుర పోవె దురముగ నే బెదరు లేక

    రిప్లయితొలగించండి
  14. అనూరాధ, డి.ఆర్ డి.ఎ., కాకినాడ.
    మిత్రులందరికి నమస్సులతో ప్రథమ ప్రయత్నంగా
    జగతి యందున జీవుల కరుణ జూపు
    జంతు జాలమొకింతైన కనగ నేడు
    కలియుగంబున మానవ కరుణ లేదు
    కలుగ చిత్రము జూడగ కరుణ గలుగ.

    రిప్లయితొలగించండి
  15. తల్లిబిడ్డల-ప్రేమజాబిల్లివోలె|
    మనసుకాహ్లాదమందించిమమతబెంచి
    ఉడుతయూహలుఉయ్యాలలూపుచుండ?
    సర్వసౌఖ్యాలెబిడ్డకుసహజముగనె|

    రిప్లయితొలగించండి
  16. కడుపున బుట్టిన వెంటనె
    బుడతను తన చేతనెత్తి ముద్దిడు చుండెన్
    దడవకుమా తండ్రీ యని
    ఉడుతయె తన తల్లి మనసు నొప్పుగ చూపెన్.

    రిప్లయితొలగించండి
  17. తల్లటపడు వేళైనన్
    గల్లోలమ్మందుఁ జిక్కి గాయమ్మైనన్
    పిల్లలఁ దటాలున తనై
    తల్లి యెదకుఁ బొదవు కొనిన తన్మయమేగా!

    రిప్లయితొలగించండి
  18. అనూరాధ గారూ..చక్కని ప్రయత్నం...మొదటిరెండు పాదములలో యతి సరిచేయండి..
    నా సవరణ...

    కనగ సంతును జగతిని కరుణ జూపు
    జంతు జాలము లన్నియు జగతిలోన
    కలియుగంబున నరులకు కరుణ లేదు
    కనుడు చిత్రము జూడగ కరుణ గలుగ.

    రిప్లయితొలగించండి
  19. అనూరాధ గారూ-మీరు ఛందస్సు సాఫ్టు వేరులో మీరు వ్రాసిన పద్యమును పరీక్షించుకుని తరువాత బ్లాగు లో పెట్టవచ్చు. మన బ్లాగు కుడివైపున, పై సాఫ్టు వేరు కలదు. అనూరాధ గారి పూరణను సవరించిన గోలి హనుమ చ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
    గోలి హనుమ చ్ఛాస్త్రి గారూ- గురువుగారు అందు బాటులో లేని సమయంలో మిగిలిన పూరణలనుగూడా సమీక్షించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  20. కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    తురింగి అనురాధ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ మొదటి ప్రయత్నంగా వ్రాసిన పద్యం బాగున్నది. అభినందనలు.
    గోలి వారి సవరణలను గమనించండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మనసుకు’ అనకుండా ‘మనసునకు’ అనాలి. అక్కడ ‘మనసునకు మోద మందించి’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    అనురాధ గారి పద్యాన్ని సవరించినందుకు ధన్యవాదాలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి