24, జనవరి 2015, శనివారం

పద్యరచన - 800

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. యేలీలసు మరువ గలను
    గోలీ సోడాను నేను గొంతెండినచో
    కోలానుమించి యెండా
    కాలపు దాహార్తి దీర్చగల పానీయంబున్

    రిప్లయితొలగించండి
  2. అన్న మర గుట కొఱ కునా యాలినన్ను
    కోర సోడాను ,దేవగ కువల యాక్షి !
    యేగ బడ్డిద రికినట యీయ బడ్డి
    సామి సోడాను జేరితి సరగు గృహము

    రిప్లయితొలగించండి
  3. గోలీ సోడా ద్రాగగ
    తేలికగా నరుగు ననుచు దేహమ్మునకున్
    మేలని గ్రోలుదు రిల నే
    కాలంబైన జనులంత గటగటమనుచున్!!!

    రిప్లయితొలగించండి
  4. గొంది గొందిన కనుపించు గోలి సోడ
    యెండ వేళల కొండంత యండ మనకు
    కూలగొట్ట దారోగ్యమున్ కోలవోలె
    చిన్న పిల్లల కిచ్చును మిన్న ముదము

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. బ్రాందివిస్కీలజతచేతభంగపడక
    మోసకారులచింతకుమోజునింపు
    వట్టిశోడానునెంచరే?పట్నవరులు
    పల్లెవాసులుశోడానువల్లెయనరు|

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  8. గోలిసోడ గొట్ట గొప్పశబ్దము సేయు
    గ్రోలనీరులేదు గుక్కె డైన
    ఆననమ్ము జూడ అందమ్ముగా నుండు
    జ్ఞానమొకటి యించు కైనలేదు

    రిప్లయితొలగించండి
  9. ఆదినుండి పేరున్నదీ యాంధ్ర సొడయె
    ఎండ కాలములోనను గుండె తడికి
    బడుగు బలహీన వర్గాల బంధు విదియె
    గోలిసొడ 'సుయ్యి'మని పిల్చు గోల జేసి.

    రిప్లయితొలగించండి
  10. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. తిన్న దరుగ లేదన్నను
    సన్నని యుదరంపు నొప్పి సలుపుచు నున్నన్
    చిన్న తనంబున నమ్మా
    నాన్నలు సోడాను త్రాప నయమగు చుండెన్!

    రిప్లయితొలగించండి