2, ఫిబ్రవరి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1590 (సారము లేనివాఁడు ఘనశైలము నెత్తె జనుల్ నుతింపఁగన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సారము లేనివాఁడు ఘనశైలము నెత్తె జనుల్ నుతింపఁగన్.

20 కామెంట్‌లు:

  1. వైరుల బాణముల్ తగలి వాలెను నేలకు లక్ష్మణుండునె
    వ్వారిని పంప తెచ్చునల వందని వేగిరమంచు రాముడా
    వీరుని వాయుసూనుగని వేగముగన్ గొనితెమ్మనంగ సం
    సారము లేనివాఁడు ఘనశైలను నెత్తె జనుల్ను తింపఁగన్
    (వందని=సంజీవని)

    రిప్లయితొలగించండి
  2. బీరము లాడువా రినిల బేరము లేమియు లేకయుం డ నా
    వీరము లన్నియుం దరిమి వేయగ బూ నుకొ నంగనా త డే
    పారము దాటినం తటి య పారగు ణా ద్యు డు నప్పుడా యె సం
    సారము లేనివాడు ఘనశైలము నెత్తె జనుల్ నుతింప గన్

    రిప్లయితొలగించండి
  3. కవిమిత్రులకు నమస్కృతులు.
    జనవరి 28న బయలుదేరిన నేను ప్రొద్దుటూరులో పెళ్ళి చూసుకొని, తిరుపతి కాళహస్తి క్షేత్రాలను దర్శించుకొని ఇప్పుడే ఇల్లు చేరాను. సహదేవుడు గారి కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. రెండురోజులు వారి అతిథిసత్కార్యాలను అందుకున్నాను. ఎంతో సంతోషించాను.
    ఈ ఐదురోజులు సమస్యాపూరణలు, పద్యరచనలు చేసిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. వీలును బట్టి ఆ పద్యాలను సమీక్షిస్తాను. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. పోరున లక్ష్మణుండు పడిపోవగ రావణ సూను ధాటికిన్
    వీరుడు మారుతాత్మజుడు వేచని రాముని యాజ్ఞ తోడ నా
    కారము పెంచి తానచట కన్గొన లేకసజీవ పత్రి సం
    సారము లేని వాడు ఘనశైలము నెత్తె జనుల్ నుతింపగన్

    రిప్లయితొలగించండి
  5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. సారెకు నన్ను వీడి యొక శైలము నర్చన జేయ బూనగా
    పోరుచు యాదవుండొకడు భూరి యహంకృతి మించె నంచు నే
    సారము లేని కుర్ర డని చప్పున జేసితి రాళ్ళవాన నే
    సారము లేనివాఁడు ఘనశైలము నెత్తె జనుల్ నుతింపఁగన్!

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీరఘురామ పాదములు చింతన చేయుచునుండువాఁడు దు
    ర్వార మదాంధ రాక్షసుల పాలిట దండధరుండు సత్య సం
    స్కారగుణాభిరాముఁడవ ఖండన తేజ విరాజుతుండు ని
    స్సరము లేనివాఁడు ఘన శైలమునెత్తె జనుల్ నుతింపగాన్.

    రిప్లయితొలగించండి
  9. శ్రీరఘు రామునగ్రజుని శీఘ్రమె గావగ సాగె మిన్నునన్
    ధీరత జూపిమారుతియె దేహము బెంచుచు దెచ్చెనౌషధిన్
    ధారుణిరామభక్తులకు దక్కని కార్యము లుండవంచు సం
    సారము లేనివాడుఘన శైలనునెత్తె జనుల్ నుతింపగన్!

    రిప్లయితొలగించండి
  10. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    లక్ష్మణుడు రామునకు అనుజుడు.. అగ్రజుడు కాదు.

    రిప్లయితొలగించండి

  11. తీరుగ జూడ బాలకుడు, దేవుడు వీడని గొల్చుచుండిరే
    మీరుచు నన్ను దల్పకనె మిన్నకనుండిరి యాదవాధముల్
    దీరుతు వారి గర్వమును దేల్చెదనంఛును రాళ్ళ వర్షమున్
    జోరుగ గుర్యజేయ హరి, చూచుచు నీహరి లౌకికంపు సం
    సారము లేనివాడుఘన శైలనునెత్తె జనుల్ నుతింపగన్

    రిప్లయితొలగించండి
  12. సారములేనివాడనుచు,సర్వులుబల్కగ?మానసంబు,ని
    స్సారముగాగ|నిందలచె-సంపదలుండియులాభమేమి?కాసారము
    నందుదూకుదునుచాలనగా?కలవచ్చెరాత్రికిన్
    సారములేనివాడుఘనశైలమునెత్తిజనుల్నుతింపగన్

    రిప్లయితొలగించండి
  13. పోరున జారెసోదరుడు పోల్చిన రాముడు ఖిన్నుడౌగ సం
    సారము లేనివాడుఘన శైలమునెత్తె జనుల్ నుతింపగన్!
    మారుతి తెచ్చె మందులను మాన్పెను బాధను తానురామసం
    సారము లోనివాడనెడి స్థానము బొందెను నిశ్చయంబుగన్

    రిప్లయితొలగించండి
  14. ఘోరపరాజితుండగుచుకూలెనులక్ష్మణుడాజి| నాతనిన్
    తేరగజేయ?నోషధి నితెమ్మనిబంపిరివాయుజుండు|తా
    నారాయలేకముఖ్యమగునైషదమూలికగుర్తెరుంగు|ధీ
    సారములేనివాడుఘనశైలమునెత్తి|జనుల్నుతింపగన్

    శ్రీ*కే*యస్ గురుమూర్తిగారిపూరణం

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీవల్లి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కోరియు తన్ను కొల్వమిని గోపుల నింద్రుడు శిక్షసేయగా
    వారణ లేని వర్షముల బాగుగ ముంచెను,వారి గావగా
    భారమునైన,గోపకుల బాలుడు,కృష్ణుడు,కర్మబంధనా
    సారము లేనివాడు ఘన శైలమునెత్తె జనుల్ నుతింపగన్

    భారపు కొండ క్రిందకును బాలుడు రమ్మనె గోకులంబునే
    వారణ లేని వర్షముల బాధను నొందెడువేళ గావగా,
    వారము రోజులట్టులనె,భారము నా కడవ్రేలినెత్తి,తా
    త్సారములేనివాడు,ఘన శైలమునెత్తె జనుల్ నుతింపగన్

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులకు నమస్సులు. తప్పులు మన్నించ ప్రార్ధన.

    భోరున వర్షముల్ కురుసి భూతల మెల్లను గంగముంచ నా
    ఘోరమునాపియాదవుల గోవుల రక్షకు సిద్ధమై మహో
    దారుడు భక్త రక్షకుడు ధైర్యము జూపుచు నొక్కడే పరా
    సారము లేనివాఁడు ఘనశైలను నెత్తె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  18. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. 2014:

    కోరిక యొక్కటే తనది క్రుంగిన దేశము నెత్తుటేయనిన్
    ఘోరము భారతీయ గతి కొల్తురె రోమను నారినిన్ననిన్
    పోరుచు సోనియమ్మనహ! బోడిగ కాంగ్రెసు నోడగొట్టి, సం
    సారము లేనివాఁడు ఘనశైలము నెత్తె జనుల్ నుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  20. కూరల నాలులున్ విరివి కొబ్బరి చట్నిని పిండితోనుపా
    హారపు నిడ్లి దోసెలును హాయిని గూర్చెడు చిట్టి గారెలున్
    చారును పుల్సునున్ తినక చప్పటి వెన్నను మన్నునొల్లుచున్
    సారము లేనివాఁడు ఘనశైలము నెత్తె జనుల్ నుతింపఁగన్

    సారము = బలిమి

    రిప్లయితొలగించండి