13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1596 (కందములను వ్రాయు కవులు గాడిదలు గదా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కందములను వ్రాయు కవులు గాడిదలు గదా.
ఈ సమస్యను సూచించిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

48 కామెంట్‌లు:

  1. కొందరు ఛందము తెలియక
    కందములను వ్రాయు కవులు గాడిదలు గదా
    యందురు ముందర వారొక
    కందమ్మును వ్రాసి జూప కైమోడ్చెదనే

    రిప్లయితొలగించండి
  2. చందురుని బోలు చందము
    మందము గామనసు తాకి మాధుర్యము గన్
    మందార సుమము వంటిది
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా ?

    కాదు = చిన్నప్పుడు తెలుగు మేస్టారు " ఔనా ? " అంటే ఒకోసారి ఔను , ఒకోసారి సందర్బాన్ని బట్టి కాదు అని చెప్పినట్టు గుర్తు .

    రిప్లయితొలగించండి
  3. అందము నిచ్చును సాంబయ !
    కందములే మం చినడక కలుగుచునెపుడు
    న్నందరు నొవ్వగ నంటిరి
    కందములను వ్రాయు కవులు గాడిదలు గదా

    రిప్లయితొలగించండి
  4. ఎందులకే రాసభ! యిట
    తిందవు గాదము? సభకును తిన్నగ చనుమా!
    గంధర్వమన దొర వినున్
    కందములను వ్రాయు కవులు గాడిదలు గదా!

    సంస్కృతం తరగతిలో నేర్చుకున్న అన్యోక్తి ఆధారంగా వ్రాసాను. అన్యోక్తి కోసం ఇక్కడ చూడండి.
    https://www.youtube.com/watch?v=G5pk2mg1uas

    రిప్లయితొలగించండి
  5. ఛందస్సున పరిపూర్ణులు
    కందములను వ్రాయుకవులు,గాడిదలుకదా-
    యందలి స్వారస్యంబును,
    మందపు బుద్ధిని తెలియని మనుజులు మహిలో!

    రిప్లయితొలగించండి
  6. అందముగ పేర్చి పదములు
    కందములను వ్రాయుకవులు గాడిదలుకదా
    అందరి నారాట పరచు
    చిందర పద్యములు వ్రాసి చింతకు నెట్టన్

    రిప్లయితొలగించండి
  7. గురువులకు, మిత్రులకు, అక్కయ్య గారికి నమస్సులు !

    కుందనమే ధ్యేయమ్ముగ
    మందులఁ దెగ నాశ్రయించి మానము చెడగాఁ
    బందుల నందులు సేయుచు
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా !

    కుందనము = మేలిమి బంగారం , మందుఁడు = అల్పుఁడు ; మానము = ఆత్మాభిమానము


    రిప్లయితొలగించండి
  8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    బహుకాల దర్శనం... సంతోషం!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. అందరి మెప్పును గొందురు
    కందములను వ్రాయు కవులు, గాడిదలుగదా!
    ఛందస్సును దూఱుచు దు
    ర్బందముగా తలచుచున్న పామర జనముల్

    రిప్లయితొలగించండి
  10. ఛందశ్శృంఖల వలదని
    కొంద ఱనుచు వచనకవిత కొల్లలుగా వ్రా
    యం దగు నిపు డని పలికిరి
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా!
    *
    కందమ్మును వ్రాయనిచో
    పందియె కవి గాదటంచు పలికెను మిత్రుం
    డందముగ వ్రాయ నతఁ డనె
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా!

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. వి.ఆర్. గణపతి గారి పూరణ (‘ఛందస్సు’ గ్రూపునుండి)

    కందము వ్రాయుట తేలిక!
    యందమ్మౌ నడక నలరు హరిణము భంగిన్ !
    ఛందస్సు తప్పి కుప్పలు
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా?

    రిప్లయితొలగించండి
  13. వి.ఆర్. గణపతి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీరు ‘ఛందస్సు’ గ్రూపులో పెట్టిన పూరణను మీ అనుమతి లేకుండా బ్లాగులో పెట్టాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  14. ఛందము కందపు టందము
    పొందక డెందమ్మునందు పొందిక లేనీ
    నిందలు వేతురు కొందరు
    కందములను వ్రాయుకవులు గాడిదలు కదా

    రిప్లయితొలగించండి
  15. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కె యెస్ గురు మూర్తి ఆచారి గారి పూరణ
    అందించిరి శతకములన్
    కందములను వ్రాయు కవులు.గాడిదలు కదా
    అందలి నీతిని వదలుచు
    చిందర వందరగ నడచు శీల రహితులే

    రిప్లయితొలగించండి
  17. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మల్లెల వారిపూరణలు
    1.కందము సమస్య లిడియును
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా
    అందురు. తగునే యనగను
    కందము వ్రాసినను మమ్ము గాడిదలనగన్
    2.కందము నెగుడును దిగుడయి
    చిందును పాదాల కనుక చెప్పగ పద్యాల్
    వి౦దగు నా చందమనుచు
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా
    3.కందము నియమము లెక్కువ
    అ౦దముగా వ్రాయబూని నంతనె తప్పుల్
    కందము నావిధి తప్పుల
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా
    4.ఛందము కైతకు నందము
    వి౦దగు శృంగార రసము వేడుక ననుచున్
    అందము నంగాల బొగడు
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా



    రిప్లయితొలగించండి
  19. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  20. పూరణ:కందము వ్రాయగ కవి యన
    కందములను వ్రాయు కవులు. గాడిదలు గదా
    యందము నాస్వాదింపక
    నందున తినుటకు లేదని నావల పోవున్

    రిప్లయితొలగించండి
  21. సుందర వసంతమున పిక
    బృందములను మరచి ఘూక భేరుండ తతుల్
    విందని వనములలో మా-
    కందములను వ్రాయు కవులు గాడిదలు గదా

    రిప్లయితొలగించండి
  22. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. ఛందోగుణములనెంచక
    సందర్భోచిత విషయము చర్చింపకనే
    చిందులు వేయుచు నొప్పని
    కందములను వ్రాయు కవులు గాడిదలు కదా!

    రిప్లయితొలగించండి
  24. ఏకవియైనా కందములో ఖచ్చితంగా పద్యము వ్రాసి ఉంటాడనే ఉద్దేశముతో ఈ చిరు సాహసము........

    అందరికి జెప్పె నిట్టుల
    కందము వ్రాయని సుకవులు గాడిదలు కదా
    తొందరలో వ్రాసెను మరి
    కందములో వ్రాయు కవులు గాడిదలు కదా

    రిప్లయితొలగించండి
  25. కందములనువ్రాయు కవులు గాడిదలుగ
    దాన శీలురనిల దైత్యులుగను
    మంచివారినెల్ల వంచనపరులుగా
    దలచువాడు పంది ధరణియందు !!!

    రిప్లయితొలగించండి
  26. నాకు కోరని వరముల నొసగిన శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో....
    ==============*================
    పొందిరి పలుబహుమతులను పొంక మలరగను భువిన్
    కందములను వ్రాయు కవులు,గాడిదలు గదా యనన్
    కొందరికి కడు సులభమగు,కోరని వరములు నిడన్
    చందురుని వలె సతతమ్ము సద్గురువులు గదరా!

    రిప్లయితొలగించండి
  27. కందముసుకవులకందము
    కందములనువ్రాయుకవులు"గాడిదలుగదా
    యందుర?తెలియనిసుంఠలు
    సుందరిబంధంబునందుసుకుమారమదే|
    2కందమువ్రాయుటకందము
    కందములాలోతుగున్న?కందపునియమాల్
    కందగ?విసుగుననొకడనె
    కందములనువ్రాయుకవులుగాడిదలుగదా?

    రిప్లయితొలగించండి
  28. మధ్యాక్కర
    -------
    కందములనువ్రాయుకవులుగాడిదలుగదాయనుటకు
    అందునసారాంశములనునందక|నర్థముగాక|
    అందపురంభయు రాగ?అస్కలితుండేమిజేయు?
    కుందికనేతిండిదినుచు-కునుకుంచితిట్టెడివిధము

    రిప్లయితొలగించండి
  29. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా, ఔత్సాహికులకు మార్గదర్శకంగా ఉంది. కంద పాదాన్ని ఆటవెలదిగా మార్చడం, గదా శబ్దాన్ని విరిచిన నైపుణ్యం బహుధా ప్రశంసనీయం. అభినందనలు.
    *****
    కందుల వరప్రసాద్ గారూ,
    మీ ప్రయోగం చాలా బాగుంది. పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు (మధ్యాక్కరతో) మూడూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. గురువులు శ్రీ కందిశంకరయ్య గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  31. ఎందరినో మురిపించిన
    సుందర నటి మాతృ ప్రేమఁ జూపెడు వేళన్
    సందర్భము కాదని 'రవి
    కందములను' వ్రాయు కవులు గాడిదలు గదా!
    (వెధవలుగదా అంటే ఇంకా బాగుండేది. కానీ...)

    రిప్లయితొలగించండి
  32. అందముగ నడవిలోపల
    పందికి పెండ్లాయె, నపుడు పాటలు వ్రాయన్
    ముందుకు వచ్చెను పొగడుట
    కందములను, వ్రాయు కవులు గాడిదలు కదా

    రిప్లయితొలగించండి
  33. మిత్రులు గోలివారికి ధన్యవాదములు.
    సమస్యా పూరణకే కొత్త నడకల నేర్పే మీ చాతుర్యము భలే!

    రిప్లయితొలగించండి
  34. కందము పాదము గదయిది
    కందములను వ్రాయు కవులు గాడిదలు గదా
    కందము వ్రాయుట యొక కళ
    కందమ్మును వ్రాయునతడు కవియ గు ధరణిన్

    రిప్లయితొలగించండి
  35. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    గోలివా రన్నట్లు మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    ******
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పంది పెండ్లికి గాడిద పాటలు.. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  37. నిన్నటి దత్తపదికి నా పూరణ...

    దుర్యోదనుని స్వగతం..

    నేనేల పాలు నిచ్చెద
    నీనేల పాలు సలుపగ నిటు కసి పెరిగెన్
    నేనే యిచ్చెద వారికి
    నానా వెతలను కననిక నవ్వెన్నటికిన్.

    రిప్లయితొలగించండి

  38. జనము రాముతోడ జానకినే జూచి
    ' రంభ ' యనుచు మెచ్చె, రామ! రామ !
    దిష్టి దగిలి నాడు కష్టమ్ములే రాగ
    రాముఁ డడవి కేఁగె ' రంభ ' తోడ.

    రిప్లయితొలగించండి
  39. ఛందపు టందముఁ దెలియని
    మందమతులు జన్మమెత్తి మహిషాధములై
    యందురు వారే యిటులను
    "కందములను వ్రాయు కవులు గాడిదలు కదా?"

    రిప్లయితొలగించండి
  40. పంతుల గోపాలకృష్ణారావు గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  41. "కందిపొడి కంది పులుసుకు
    కందులు లేవిండ్లలోన గమ్మున తెండోయ్"
    పొందుగనిటు సతులడిగిన
    కందములను వ్రాయు కవులు గాడిదలు గదా!

    రిప్లయితొలగించండి


  42. అందము దేశమునకహో
    కందములను వ్రాయు కవులు; గాడిదలు గదా
    కొందళపడుయజ్ఞాతలు
    ఛందము మేధస్సునకు పసందు జిలేబీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  43. అందమ్మౌ "సుమతి" చదివి
    తొందరగా శతకమూను దుష్టపు చింతన్
    ఛందస్సెరుగక నావలె
    కందములను వ్రాయు కవులు గాడిదలు గదా

    రిప్లయితొలగించండి