3, ఫిబ్రవరి 2015, మంగళవారం

న్యస్తాక్షరి - 25

అంశం- కంచెర్ల గోపన్న
ఛందస్సు- ఆటవెలది.
నాలుగుపాదల మొదటి అక్షరాలు వరుసగా ‘రా - మ - దా - సు’ ఉండాలి

29 కామెంట్‌లు:

  1. రామ భక్తు డైన రామదా సునిగన
    మనసు సంత సించు మమత తోడ
    దాసు లందు నతడు దాసాను దాసుడు
    సుమ్ము చెప్పు చుంటి నమ్మ కముగ

    రిప్లయితొలగించండి
  2. రామభక్తితోడ రామదాసనిపేరు
    మహిని గాంచె రామ మహిమవలన
    దాష్టికముల బొందె తా గుడి కట్టించి
    సురులుమెచ్చు భద్రగిరిని యిచ్చె

    రిప్లయితొలగించండి


  3. రామ నామ గాన రాగాను వర్తియై
    మనసును గుడి జేసి మసలినాడు
    దాస జనుల రామ దాసాను దాసుడు
    సుజన మనవి హారి శుభచరితుడు.



    రిప్లయితొలగించండి
  4. రామ నన్ను బ్రోవ రామాయని వేడి
    మధుర మైన గాన మధువు చిలికి
    దాసు డనుచు భక్త దాసాను దాసుడై
    సురలు మెచ్చి నట్టి సూను డితడు

    సూనుడు = సూర్యుడు

    రిప్లయితొలగించండి
  5. రామ నామ రస మరందము జుర్రియు
    మనల కందరికిని పంచి ఇచ్చె
    దాచి, దోచి సొమ్ము, దశరథ రాముని
    సుస్థిరముగ నిలిపె శృంగి యందు

    రిప్లయితొలగించండి
  6. రామ భక్తి తోడ రాజధనముబుక్కి
    మట్టు జేసి కట్టె మందిరమ్ము
    దాపరికము చేసి దాసుడై కొలవగ
    సుగుణ రాము డతని తగువు దీర్చె!

    రిప్లయితొలగించండి
  7. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రామదసును’ అనండి.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    టి.బి.యస్. శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రామా యని వేడి’ అన్నచోట గణదోషం.. కొన్ని సవరణలతో మీ పద్యం...
    రామ నన్ను బ్రోవ రారా యనుచు వేడి
    మధుర మైన గాన మధువు చిలికి
    దాసుడ నని భక్త దాసాను దాసుడై
    సురలు మెచ్చి నట్టి సుజను డితడు.
    *****
    మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో యతి తప్పింది. ‘మనకు పంచియిడిన మాన్యుడతడు’ అందామా?
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి గారి పద్యంలో మధురమైన గాన సుధను చిలికి అంటే ఇంకా బాగుణ్ణు

    రిప్లయితొలగించండి
  9. రామనామమెంత రసరమ్యభావనో?
    మలచికీర్తనలను-పలికిజెప్పె|
    ధార్మికత్వమెంత దక్షతనొసగునో?
    సుద్దమనసునడుగ?సులభమనెను|

    రిప్లయితొలగించండి
  10. రామభక్తిలోన రమియించినిరతము
    మరల పుట్టనట్టి వరము పొంది
    దారి తెన్ను తనకి దాశరథియనుచు
    సుగతి జేరి నాడు స్పూర్తి నొసగి

    రిప్లయితొలగించండి
  11. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ సూచన బాగుంది. ధన్యవాదాలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘భావన + ఓ = భావనయో’ అవుతుంది. అక్కడ సంధి లేదు. తృతీయపాదాద్యక్షరం ‘దా’. కాని మీరు ‘ధా’ వేసారు. మీ పద్యానికి నా సవరణ.....
    రామనామమెంత రసరమ్యభావమో?
    మలచికీర్తనలను-పలికిజెప్పె|
    దాసభావ మెంత దక్షత నొసగునో?
    సుద్దమైన మనసు సులభమనెను|
    *****
    శ్రీవల్లి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. రామకృపను బొంది రచియించె కృతులెన్నొ
    మనకు తక్కువేమి మననమునకు
    దాశరథిశతకము ధార బోసిచనెను
    సుపథ మరయ మనుచు గోపరాజు

    రిప్లయితొలగించండి
  13. రాఘవునికి గుడిని రమ్యంబు గాగట్టి
    మహిని రామ దాసు రహిని గాంచె
    దాశరధిని గొలిచి ధన్యుడయ్యెనుగద
    సురుచిరమగు భద్రగిరిన మనుచు !!!

    రిప్లయితొలగించండి
  14. రామ నామ స్మరణతోడ రంజిలగను
    మనసు నిర్మించె గోపన్న, మందిరమును
    దాన వారి శ్రీరాముని తపన దీర్చ
    సుందరమ్ముగను ప్రభుత్వ సొమ్ము తోడ

    రిప్లయితొలగించండి
  15. శ్రీవల్లి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ ‘తేటగీతి’ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని.. అడిగింది ఆటవెలది కదా! మీరు గమనించలేదేమో! మీ పద్యానికి ఆటవెలదిగా నా రూపాంతరం...
    రామనామ మెపుడు రంజిల్ల గోపన్న
    మనసు గట్టె రామమందిరమును
    దానవారి రాము తపన దీర్చ ధనరా
    సుల ప్రభుత్వమునకు దెలియకుండ.

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులకు నమస్సులు. వాకింగుకు వెళుతూ రామదాసుని స్మరించు కుంటూ వెళ్ళాను. ఆటవెలది అని చూడ లేదు. ఆటవెలదిగా మార్చిన గురువు గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. రామ దాసు మించు రామభక్తుడిలను
    మరల పుట్ట డనుట కరము నిజము
    దానవకులవైరి దర్శనీయపు గుడి
    సుంకముగొని కట్టె సుందరముగ

    రిప్లయితొలగించండి
  18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని ‘సుం’ అనడం న్యస్తాక్షరి నియమానికి వ్యతిరేకమే.

    రిప్లయితొలగించండి
  19. రాచకార్యమొదలి రామునిగుడిగట్టి
    మర్మకీర్తన లిడుమహిమచేత|
    దాసకాడు?రామదాసుడుగామారె|
    సుజన సంస్కృతందు సుప్రి యుండు

    రిప్లయితొలగించండి
  20. పూజ్య గురుదేవులకు నమస్సులు. నాలుగవ పాదం మార్చి నా పూరణ.
    రామ దాసు మించు రామభక్తుడిలను
    మరల పుట్ట డనుట కరము నిజము
    దానవకులవైరి దర్శనీయపు గుడి
    సుద్ది మదిని గట్టె సుందరముగ

    రిప్లయితొలగించండి
  21. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒదిలి’ అనడం గ్రామ్యం. ‘రాచకార్యము విడి...’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. "రా"ము గుడిని గట్టి రాజ్యంపు సొమ్ముతో
    "మ"గ్గి యుండె తాను మహిత చెరను
    "దా"శరధికి,శతక,తాదాత్మ్య కీర్తనల్
    "సు"ష్టు గోపరాజు సొగసు నిడడె?

    "రా"జ్య ధనము వాడి రాముని గుడికినై
    "మ"ణులతోడ నగలు మహితు కిచ్చి,
    "దా"రుణంపు శిక్ష తానంది గోపన్న
    "సు"స్వరాల,శతక సూక్తి గూర్చె

    రిప్లయితొలగించండి
  23. శ్రీతిమ్మాజీరావుగారిపూరణం[కేంబాయి]
    రామనామమహిమయేమనివసియింతు
    మరలమరలపలుకమధురముగద
    దాసుడయ్యురామదాసుకేతెలియును
    సుగమమగునుముక్తిసుజనులార|

    రిప్లయితొలగించండి
  24. రామకీర్తనములు రస రమ్యముగఁ బాడి
    మధుర భక్తిఁజూపె మహితముగను
    దానవాంతకుఁడగు దాశరథిని గొల్చి
    సుగతినందినాడు సుస్థిరముగ

    రిప్లయితొలగించండి
  25. నమస్కారములు
    శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి సూచనకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  26. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వచియింతు’ టైపాటు వల్ల ‘వసియింతు’ అయింది.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. రామభక్తి మహిమ రాముని చూపించి
    మహ్మదీయ రాజు మదిని దోచె
    దాశరధి శతకము తానెన్నొ కీర్తనల
    సుజనులంత మెచ్చ ప్రజకునిచ్చె.



    రిప్లయితొలగించండి
  28. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. ధన్యవాదములు గురువు గారు. సవరించన పద్యం:
    రామ నామ రస మరందము జుర్రియు
    మనకు పంచియిడిన మాన్యుడతడె
    దాచి, దోచె సొమ్ము, దశరథ రాముని
    సుస్థిరముగ నిలుప శృంగి యందు

    రిప్లయితొలగించండి