23, ఫిబ్రవరి 2015, సోమవారం

న్యస్తాక్షరి - 27

అంశం- ధర్మరాజు. 
ఛందస్సు- ఆటవెలది.
నాలుగుపాదల మొదటి అక్షరాలు వరుసగా ‘ధ - ర్మ - రా - జు’ ఉండాలి.

19 కామెంట్‌లు:

  1. ధర్మ రాజుసకల ధర్మశాస్త్రముల మ
    ర్మమెరిగిసతతమ్ము మసలుకొనెను
    రాజ్యమోడిపోయి రారాజుకిడి యను
    జుల సహితమరణ్యములకు జనెను

    రిప్లయితొలగించండి
  2. ధర్మ నిరతు డైన ధర్మాత్ము డనగ మ
    ర్మమెరు గని వాడు నిర్మ లుండు
    రాజు లందు మిన్న రారాజు యైనట్టి
    జుడుగు పడని యతడు శూరు డనగ

    జుడుగు = భయము , వెనుకంజ వేయు

    రిప్లయితొలగించండి
  3. ధర్మ నిరతు డైన ధర్మాత్ము డనగ మ
    ర్మముతె లియని వాడు నిర్మ లుండు
    రాజు లందు మిన్న రారాజు యైనట్టి
    జుడుగు పడని యతడు శూరు డనగ

    అంటే సరిపోతుందేమొ .గురువులు క్షమించాలి ఈమధ్య అన్నీ తప్పులేతప్పుల్

    రిప్లయితొలగించండి
  4. ధర్మ రాజు ననగ ధర్మము నెరిగి మ
    ర్మములు దెలియ నట్టి మనుజుడు గద
    రాజు లందు మేటి రాజయ్యె ధరణిని
    జుడుగు లేని మిగుల శూరు డతడు

    రిప్లయితొలగించండి
  5. ధర్మ మెరిగి కూడ ధర్మనందనుడు మ
    ర్మచతు రుండు శకుని మాయ గనక
    రాజ్య మోడి తుదకు రాణినే యోడగ
    జుట్టు పట్టి వైరి జులుము జేసె

    రిప్లయితొలగించండి
  6. ధర్మసుతుడె యైన ధరణిలో పుట్ట క
    ర్మఫలమనుట నిజము; మంచి నడత,
    రాజ్యధర్మములును లక్షణమ్ములతడు
    జులువతనముతోడ జూపించె నిక్కమ్ము.

    జులువతనము =సౌకర్యము, వీలు

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ధర్మరా జనంగ’ అనండి.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ‘జులువతనముతోడఁ జూపె నిజము’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. ధర్మసూక్ష్మమెరిగి ధరణిలోన యమధ
    ర్మజుని కొమరు డనుఁగ మాన్యు డయ్యె
    రాజసూయ యాగ రగిలింపు వ్యసన మో
    జు గలిగించ నోడె సుదతిఁ గూడ!

    రిప్లయితొలగించండి
  9. ధర్మమార్గమందు తనరుచు సతము, క
    ర్మ ఫలమునుగురించి మర్మమెఱిగి
    రాజ్యపాలనమ్ము రహితోఁ జలిపిన రా
    జు భువిని మరియొకనిఁ జూడలేము

    రిప్లయితొలగించండి
  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘యమధర్మజు’ డంటేనే యుధిష్ఠిరుడు కదా... మళ్ళీ ఆ ధర్మరాజు కొమరుడు.. అంటే? అక్కడ ‘యమధ|ర్మజుఁ డనంగ నతఁడు మాన్యుఁ డయ్యె’ అందామా?
    ******
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జరిపిన’... టైపాటు వల్ల ‘జలిపిన’ అయింది.

    రిప్లయితొలగించండి
  11. ధర్మరాజు పాండు తనయాగ్రజుండు ధ
    ర్మనిరతుండు శకుని మాయ చేత
    రాజ్య మోడెను జదరంగమాడి కురు రా
    జాత్మజు డధికముగ నలరె నపుడు.

    రిప్లయితొలగించండి
  12. ధర్మమున్న?కర్మదరిజేరునన్నమ
    ర్మమెరిగియును జూదమాడివోడి
    రాటుదేలెధర్మరాజుగా|ధర్మ మో
    జు విడువకనెభువిననిలచె|

    రిప్లయితొలగించండి
  13. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పాచికలు, చదరంగం వేరు వేరు కదా!
    అలాగే చివరి అక్షరం ‘జు’ అయితే మీరు ‘జా’ వేశారు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జూదమాడి యోడి’ అనండి

    రిప్లయితొలగించండి
  14. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    ధర్మసూక్ష్మమెరిగి ధరణిలోన యమధ
    ర్మజుడనంగ నతడు మాన్యుఁడయ్యె
    రాజసూయ యాగ రగిలింపు వ్యసన మో
    జు గలిగించ నోడె సుదతిఁ గూడ!

    రిప్లయితొలగించండి
  15. మల్లెలవారి పద్యములు
    ధర్మమునకు నిరవు తా ధర్ముకొడుకు మ
    ర్మముల నెరుగు శాస్త్రమందు విదుడు
    రాజసూయమునను రాజిలి పాండురా
    జుకొడు కౌచు ఘనుడు సొ౦పు మీర
    2.ధరను నాతడి౦పు దార్మికు౦డౌచు మ
    ర్మములు తెలియు పాండు రాజు కొడుకు
    రాజితుండు నౌచు రంజిల్లె నిలను రా
    జునన తానె ధర్మ సుతుడు వెలిగె

    రిప్లయితొలగించండి
  16. ధరణి లో నెవనికి దాయ లే డతడు ధ
    ర్మ ప్రవర్తనుండు మహిత కీర్తి
    రాజితుండు యదుకుల మణి తోడైనను
    జులు మెరుగని ధర్మజుడు యతండు

    రిప్లయితొలగించండి
  17. ధర్మ పధము విడని తాత్వికుండైన క
    ర్మఫలమునకు జిక్కి రాజ్య మోడె
    రాజరాజు కుటిల రాజనీతెరిగిన
    జులుము జేయలేని జూద ప్రియుడు !!!

    రిప్లయితొలగించండి
  18. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ధర్మరాజు+అతండు= ధర్మరా జతండు” అవుతుంది. యడాగమం రాదు. ‘ధర్మరాజు గద యతఁడు’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నీతి+ఎఱిగిన = నీతి యెఱిగిన’ అవుతుంది. ‘నీతి యెఱిగి’ అనండి.

    రిప్లయితొలగించండి