4, ఫిబ్రవరి 2015, బుధవారం

పద్యరచన - 811

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

35 కామెంట్‌లు:

  1. పద్యరచనలోన పదుగురనుసరించి
    యేకలవ్యశిష్యులితనికైరి
    ఆశుకవితలందు నవధానములయందు
    గండరీడితండు గరికపాటి

    రిప్లయితొలగించండి
  2. శిష్ట జనముల దూష ణ సేయు వాడు
    గరిక పాటి సేయడు గదా, గరిక పాటి
    వారి యవదాన సరళిని వర్ణ నీ య
    దరమె ? నతు లొ న గూ ర్చుట దప్ప మనకు

    రిప్లయితొలగించండి
  3. పద్య రచన యందు పరమార్ధమును జూపి
    సాటి కవుల లోన మేటి యగుచు
    గరిక పాటి వంశ గారవంబును ధర
    బొగడ జేసితి విగ ,పుణ్య పురుష !

    రిప్లయితొలగించండి
  4. గరిక పాటి వారి కావ్యవనము నందు
    పద్య సుమము లేరి పరవ శించి
    యవధ రించి మదిని హాస్యరసము గ్రోల
    గగన వీధు లంత పగటి వెలుగు

    రిప్లయితొలగించండి
  5. పిడి వాదమును తన శక్తి గా మార్చి
    కఠోర దీక్ష తో తెలుగు తల్లిని సేవింప
    గరిక గడ్డి మోపై బలవంత మైన వైనము
    గరికపాటి జీవనము గట్టి పడిన వైనము !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. కవికి తనను పొగిడే కన్నా తన కావ్యాన్ని ప్రశంసిస్తే ఇష్టం. అందుకే గరికిపాటి వారు రచించిన సాగర ఘోష కావ్యాన్ని ప్రశంసించాలని మొదలుపెట్టి....

    సాగర ఘోష - సత్కవన శారదకున్ రమణీయ భూష - స
    ర్వాగమ శాస్త్ర సంభృత మహా ప్రియ భాష - రసఙ్ఞ పాఠక
    శ్రీగణ హృజ్జిగీష - నరసింహ కవీంద్రు మనీషనెన్నఁగా
    భోగివరుండొ లేక క్రతుభుగ్గురువర్యుఁడొ కావలెన్ భువిన్ !

    భోగివరుఁడంటే ఆది శేషుఁడు , క్రతుభుక్కులు - దేవతలు, వారి గురువర్యుఁడు బృహస్పతి . ఆ సాగరఘోష కావ్యంలోని ఛందశ్శిల్ప శయ్యా సౌభాగ్యేత్యాదులు వర్ణించాలంటే , ఆ ఆదిశేషుఁడో , బృహస్పతో భూమి పైకి దిగి రావలసిందే కాని , సామాన్యుడైన నా తరం కాదని ముగిస్తూన్నాను....

    రిప్లయితొలగించండి
  7. ఆంధ్రభాషలోన అవధాన విద్యలో
    ప్రతిభ చాటినట్టి పద్యధాటి
    కోటికొక్కడనని గొప్పగా జెప్పెడి
    ఘనత గలిగినట్టి గరికపాటి

    (తెలుగు జనాభాకి సహస్రావధానులకీ వున్న నిష్పత్తిని లెక్కిస్తే తాను కోటిమందిలో ఒకడినంటారు గరికపాటివారు ఒక పద్యంలో)

    రిప్లయితొలగించండి
  8. అమ్మ యే దైవమను సహస్రావధాన
    దక్షుడీ ధారణా బ్రహ్మ రాక్షసుండు
    కోటి కొక్కడు సాగర ఘోష నెఱుగు
    సరస పద పేటి మేటి శ్రీ గరికపాటి

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘వర్ణనీయ దరమె’ అనడం పొసగడం లేదు. ‘ప్రస్తుతింప దరమె’ అనండి.
    గతంలో నేను వారి అష్టావధానంలో పృచ్ఛకునిగా పాల్గొన్నరోజున మన బ్లాగులో ఇచ్చిన సమస్య ‘గరికపాటి సేయఁడు గదా గరికిపాటి’. దానికి మీ పద్యం పూరణవలె ఉన్నది. (లేక అప్పటి పూరణమేనా ఇది?)
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    జిలేబీ గారూ,
    మంచి భావాన్ని తెలియజేశారు. మిత్రులెవరైనా ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    అనుప్రాసాలంకారశోభితమైన మీ పద్యం హృద్యంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    శ్రీవల్లి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    ‘కుమార్’ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదాలతో - శ్రీ నరసింహారావు గారింటి పేరు గరికపాటి కాకుండా గరికిపాటిగా గుర్తించవలసిందిగా ఇతరేతర కవి బృందానికి సూచన.

    రిప్లయితొలగించండి
  11. గరిక ముఖ్యమగును గణపతికెప్పుడు
    గరికిపాటికిపుడు?కవితలట్లు|
    పద్య,గద్యమందు?"ప్రథముడు|నవధాన
    నారసింహ"|రావువేరొకరికి|

    రిప్లయితొలగించండి
  12. డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    పైన నా వ్యాఖ్యలో నేను ప్రస్తావించిన సమస్యలో ‘గరికిపాటి’ అనే ఇచ్చాను.
    *****
    కె.ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వేరొకరికి’ అన్నదానికి అన్వయం? మీరు అనవసరమైన చోట్ల విరామచిహ్నాలు పెడుతున్నారు.

    రిప్లయితొలగించండి
  13. పద్య ధాటి తోటి వాగ్ధాటి మెండైన
    ఘనుడ టంచు బొగడ, గరికి పాటి
    మెరికె వలె సుకవీంద్రుల సరస నిలచె
    వాణి వాగ్ధార గ్రోలిన వాడ తండె!



    రిప్లయితొలగించండి
  14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గారూ ! మీ ఉచ్చారణ సరైనదే , కానీ నా సూచన 'ఇతరేతర ' కవి బృందము కొరకే !

    అవధానికి అత్యావశ్యకమైన లక్షణాలు నాలుగు . ధార , ధోరణి, ధారణ , ధైర్యము . ధ చతుష్టయం. నాలుగింటిలోనూ మేటి గరికిపాటి. కనుకనే -

    శ్రవణానందముఁ గూర్చు ధార ధిషణా సంపృక్త వాగ్ధోరణిన్
    స్తవనీయంబగునట్టి ధారణ మహా ధైర్యాధిపత్యంబులీ
    భువి నెవ్వారికి సొంతమై చెలఁగు నా పుంభావ వాణిన్ సహ
    స్ర వధానిన్ నరసింహ రావు కవిరాజ స్వామి శ్లాఘించెదన్ !

    రిప్లయితొలగించండి
  16. కవనమందు పురాణపు ప్రవచనమున
    మేటి నిజముగాను గరికిపాటి, ధార
    ణందున మరియు నవధాన మందు,నతని
    కతనె చాటి విశాలమౌ యవనియందు

    రిప్లయితొలగించండి
  17. అవధాన విద్యాప్రహసనమందున నూత్న
    .......... వొరవడి సృష్టించెనరసి చూడ
    సాగరఘోషాది సత్కావ్యరచనచే
    .......... సూరిజనాళి సంస్తుత్యుఁడయ్యె
    నాంధ్రభారతమునత్యంత వైభవముగా
    .......... వివరించసాగెనుద్వేగముగను
    మధురమౌ తెలుఁగు చమత్కృతులను దెల్పి
    .......... భాషావిభవమెల్లఁ బరగఁ జేసె

    మాతృమూర్తిని మరువని మాన్యవరుఁడు
    నీతినియమంబులను జెప్పు నిర్భయుండు
    కవికులశ్రేష్ఠపుంగవుఁడవని యందు
    గరిమచే నొప్పు వారు శ్రీ గరికి పాటి.

    ధారాశుద్ధియు ధారణాపటిమ మోదంబిచ్చు నవ్యార్థముల్
    ధీరత్వంబును సద్వివేకరచనా దృష్టాంతసంఘంబులున్
    కారుణ్యంబును మాతృభక్తివరమున్ గ్రంథార్థ సద్వ్యాఖ్యచే
    నౌరా యంచనిపించువారు నరసింహశ్రేష్ఠ ధీరోత్తముల్.

    రిప్లయితొలగించండి
  18. ధారగ నూరు పద్యములు తావది వాణికి నెన్న జిహ్వ, వా-
    గ్ధోరణి యల్పెరుంగనిది కోరిన యంశ మదెట్టి దైన బో,
    ధారణలో బృహస్పతికి తమ్ముడు, చెడ్డను జీల్చి చెండుచో
    ధీరుడు, సత్కవీశ్వరుడు, ధీనిధి సాగరఘోష కర్తయే.

    రిప్లయితొలగించండి
  19. డా. విష్ణునందన్ గారూ,
    గరికిపాటివారి ఘనతను చాటెడి
    ధచతుష్టయమ్ము నిచటఁ జేర్చి
    హృద్యమైన మేటి పద్యమ్ము నొసఁగిన
    విష్ణునందనున కివియె ప్రణుతులు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయన రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ధారణ + అందు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. సంధి లేదు. ‘సాటి’ని ‘చాటి’ అన్నారు.
    నా సవరణ.....
    ‘...ధార
    ణమున మరియును నవధానమున,నతని
    కతనె సాటి...’
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని పద్యాలు వ్రాశారు. అభినందనలు.
    ‘నూత్న వొరవడి’ అన్నారు. ‘క్రొత్త యొరవడి’ అనండి.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.



    రిప్లయితొలగించండి
  20. గురుదేవుల వారి (విష్ణునందన్ గారికి ప్రణతులిడిన) పద్య రెండవపాదంలో టైపాటు వలన జరిగిన గణభంగమా?

    రిప్లయితొలగించండి
  21. వదలకుజూడగాగరికపాటవధానపువేషమురీతినున్నదే
    పదములకూర్పునేర్పులిడుపద్యమునల్లగదిట్టజూడగా
    కదనమునందుసైనికుడికల్పనలట్లవధానవిద్యలో
    చదువరులెందరున్ననుచక్కటిశైలినిపంచిపెట్టుగా

    రిప్లయితొలగించండి
  22. శ్రీకె*యస్గురుమూర్తిగారిపూరణం
    శివజటాజాటమందుండిసితనగము
    ఫైకిదుమికేడిగంగాప్రవాహమనగ
    గరికపాటివారికవిత్వపరుగులుండు
    సాహితీక్షెత్రమునొనర్చెసఫలముగను

    రిప్లయితొలగించండి
  23. సహదేవుడు గారూ,
    నిజమే. అది నా పొరపాటే. టైపాటు కాదు. సవరిస్తాను. ధన్యవాదాలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది.అభినందనలు.
    మొదటి, చివరి పాదాలలో గణదోషం. ‘గరికిపాటి + అవధానము’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. నా సవరణలు...
    ‘వదలక జూడగా గరికపాటి వధానపువేష మౌనులే’
    ‘చదువరు లెందఱున్న మఱి చక్కని...’
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    టైపు దోషాలు ఎక్కువగా ఉన్నవి. కవిత్వపరుగులు అని సమాసం చేయరాదు. నా సవరణ...
    శివజటాజూటమందుండి సితనగమ్ము
    ఫైకి దుమికెడి గంగాప్రవాహ మనగ
    గరికిపాటి కవిత్వపు పరుగులుండు
    సాహితీక్షేత్రము నొనర్చె సఫలముగను

    రిప్లయితొలగించండి
  24. పూజ్య గురుదేవులకు నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. మాస్టారూ ! డా. విష్ణునందన్ గారి ఉత్పలమాలని మీరు ఆటవెలదితో సమీక్షించడం చాలా బాగుంది

    రిప్లయితొలగించండి
  26. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    కాని ఏం లాభం? రెండవ పాదంలోని గణదోషాన్ని ఎలా సవరించుకోవాలా అని తల బ్రద్దలయ్యేలా ఆలోచిస్తున్నా... పద్యానికి ప్రాణం ‘ధచతుష్టయం’ దానిని మార్చకుండా సవరించలేకపోతున్నాను. “అందరికి శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిం” దన్న సామెత నా విషయంలో నిజమయింది.

    రిప్లయితొలగించండి
  27. శ్రీ శంకరయ్య గారికి , సాదరాభివాదములతో , మీ పద్యరూప ప్రశంసకు సాంజలినై - ప్రణుతులిడుతూ -
    "గరికిపాటి వారి ఘనతను వెల్వరిం
    చు ' ధ చతుష్టయమ్ము ' సులభ శైలి
    హృద్యమైన మేటి పద్యమ్ములో దెల్పు.... " అని సవరణ చేస్తే సరిపోతుందంటారా ? ( పద్య సవరణలో పద్యములోని ముఖ్యమైన చట్రాన్ని ' సాధ్యమైనంత ' వరకూ మార్చకూడదనే నియమం ప్రకారం)

    రిప్లయితొలగించండి
  28. శ్రీ సహదేవుడు గారి పద్యములో పూర్వోత్తరార్ధ భాగముల మధ్య ఛందో రూపాంతరం జరిగింది... వీలును బట్టి దానిని కూడా సరి చేయగలరు.
    ఇక్కడే ఇతర కవి బృందానికంతకూ మరొక్క ముఖ్యమైన విషయము...గతంలో చెప్పిందే , చర్విత చర్వణం... "సహా" అనే అర్థంలో ' తోడి ' అనే పద ప్రయోగం ఉచితమైనది. తోడి కోడలు , తోడి వాండ్రు , తోడి బాలికలు ఇత్యాది. ఆయా సందర్భాల్లో ' తోటి ' పద ప్రయోగం అనిష్టార్థ ద్యోతకము .

    రిప్లయితొలగించండి
  29. డా. విష్ణునందన్ గారూ,
    నన్ను గట్టెక్కించారు. ధన్యవాదాలు. మీ సవరణ అన్నివిధాలా ప్రశస్తంగా ఉంది.
    *****
    సహదేవుడు గారూ,
    మీ పద్యంలో మొదటి రెండు పాదాలు ఆటవెలఁది, మిగిలిన రెండు పాదాలు తేటగీతి. తేటగీతిగా నా సవరణ...
    ‘పద్య ధాటి తో వాగ్ధాటి పరుగుదీయు
    ఘనుడ టంచును బొగడఁగ, గరికి పాటి...’

    రిప్లయితొలగించండి
  30. కనగ ధారణ నతనికి ' గరిక పాటి '
    మరి సహస్రావధానమ్ము ' గరిక పాటి '
    గరిమ చాతుర్య భాషణ ' గరిక పాటి '
    ఘనుడు చూడగ నవధాని " గరికిపాటి "

    రిప్లయితొలగించండి
  31. డా.విష్ణునందన్ గారికి ధన్యవాదములు.
    సవరించిన పద్యం :
    పద్య ధాటి తోటి వాగ్ధాటి మెండైన
    ఘనుడ టంచు బొగడ, గరికి పాటి
    మెరికె వలె సుకవుల సరసన నిలువగ
    వాణి వర సుతుడను వాడ తండె!

    రిప్లయితొలగించండి
  32. గురుదేవులకు ధన్యవాదములు.తమరి సవరణతో
    తే.గీ.
    పద్య ధాటి తో వాగ్ధాటి పరుగుదీయు
    ఘనుడ టంచును బొగడఁగ, గరికి పాటి
    మెరికె వలె సుకవీంద్రుల సరస నిలచె
    వాణి వాగ్ధార గ్రోలిన వాడ తండె!

    రిప్లయితొలగించండి
  33. మ.
    మనసారన్ బహుకావ్యశాస్త్రములలో మాన్యుండునై నేర్చుచున్
    ఘనవాగ్ధారల పద్యరాజములతో ,గంభీరతాసింహమై
    మనముల్ ,నిండగ సత్యధర్మములకున్ ,మర్యాదనేగూర్చగా
    తనవిన్యాసరసాగ్రలాస్యమునపద్మశ్రీయెవచ్చెన్ గదా.

    రిప్లయితొలగించండి
  34. శా.
    ఆనందామృతధారలొల్కనగవుల్ ,హాస్యోక్తితోమాటలున్
    జ్ఞానానందముఖారవిందుడగుచున్ ,సద్బోధనావాగ్మియై
    తానా ,ధీరతసత్యమార్గగమియై ,తాదాత్మ్యతాసిద్ధితో
    నానాఖ్యానవచోవిధానఘనుడీనర్సింహరాయాఖ్యుడే.

    రిప్లయితొలగించండి