12, ఫిబ్రవరి 2015, గురువారం

పద్యరచన - 819

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. పరమ సాధ్వి! సీతను విడి పవలు రేయి
    పరితపించుచు నుంటిని పరమ భక్త
    సీత జాడను కనుగొన చిహ్నమిదియె
    అంగుళీయకము హనుమ అందు కొనుమ.

    రిప్లయితొలగించండి
  2. హనుమా!యీ యుంగరమును
    గొనుమా! నాసీత కొరకు కువలయమంతన్
    వెనకి తనను కనుగొనుమా!
    తనకీ యుంగరమునిడుమ త్వరితము రమ్మా!

    రిప్లయితొలగించండి
  3. అంగు ళీ యక మయ్యది హనుమ కిచ్చు
    చుండె నచ్చట రాముడు చూడు డా ర్య !
    తనదు గుర్తుగా సీతమ్మ దలచు ననుచు
    నద్భు తంబుగ నుండెనా చిత్ర మచట

    రిప్లయితొలగించండి
  4. భద్రము మార్గము లందును
    పద్రవము లుగల్పించు బ్రమ్మ రాక్షసి మూకల్
    ముద్రిక సీతను కనుగొని
    భద్రము గానిచ్చి రమ్ము భవ్యము హనుమా

    రిప్లయితొలగించండి
  5. మారుతి దీని జేగొనుము మైథిలి కీయగ నంగుళీయకం
    బారసి వేగమే తనకు బాపగ శోకము భద్రమయ్య మా
    భారము నీదె యింక పరివారముతో నరుదెంచి వేగమే
    జేరెద మామె నంచనుము చింతను వీడుమటంచు చెప్పవో.

    రిప్లయితొలగించండి
  6. జానకిని వెదుకన్ బోవు సమయమందు
    గుర్తుగా రాముడిచ్చెను కూర్మితోడ
    హనుమకు తనకళ్యాణపు నంగుళీక
    మానవాలుగ నవనిజ కంద జేయ

    రిప్లయితొలగించండి
  7. అమ్మ నమ్మునెటులనుచు యడుగ బంటు
    చేతి ఉంగరమ్ము హనుమ చేత నుంచి
    రుజువు చేయగ సీతకు రూఢి గాను
    రాము డంపెను దూతను రక్ష పలికి

    రిప్లయితొలగించండి
  8. టి.బి.యస్. శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణ, యతి దోషాలు. ఆ పాదాన్ని ‘పద్రవముల జేయు దనుజవర్గము, గొనుమా| ముద్రిక...’ అందామా?
    *****
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘అనుచు నడుగ’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. నాదో చిన్న సందేహం
    అన్నపురెడ్డి వారి పద్యంలోని కళ్యాణపు నంగుళీకము(మూడవపాదం) అన్నారు. అది సాధువేనా లేక కళ్యాణపు టంగుళీకము అని అనాలా. కాస్త వివరించండి శంకరయ్యగారూ.

    రిప్లయితొలగించండి
  10. కామేశ్వర శర్మ గారూ,
    అది దోషమే. నేను గమనించలేదు. ధన్యవాదాలు.
    *****
    అన్నపరెడ్డి వారూ,
    మీ పద్యంలో ‘కళ్యాణపు టంగుళీయకము’ అని సవరించుకొనండి.

    రిప్లయితొలగించండి
  11. ఏ తావుల వెదకిన భూ
    జాతను గను గొనఁగ లేని శ్రమతో ప్రభువే
    వాతాత్మజు నంపె మహిని
    సీతాన్వేషణ సలుపఁగ చిరుముద్రికతో!

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం ధారాశుద్ధితో అలరారుతున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  13. పద్య రచన: "హనుమ!నీవొక్కరుడవు నా యవనిజను గ
    నగలవని నాయెడద లోన నమ్మినాను"
    యనుచు యిచ్చె రాముడు ముద్రికను గురుతుగ
    సీతకున్ జూపి యామెకు చింత దీర్చ

    రిప్లయితొలగించండి
  14. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. రాముడు,లక్ష్మనుండిటులరమ్మన-వాయుసుతుండువెళ్లి,శ్రీ
    రామ|దయాకరాయనగ'రాముడుదెల్పెనులంకజేరి-నా
    ప్రేమగుముద్దుటుంగరమువేదనమాన్పగసీతకిమ్ము,నా
    క్షేమముదెల్పుగన్పడగకీడునొసంగనితోడునీకగన్|

    రిప్లయితొలగించండి
  16. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. కామేశ్వర శర్మ శ్రీఆదిభట్ల గారి సవరణకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. ఉంగరమ్మును గొనుమయ్య పింగళుండ
    మంగళంబులు కలుగులే మహిత చరిత
    యానవాలుగ చూపుమా జానకికిని
    వేగ మమ్ముల దరిజేర్చు విశ్వవినుత

    రిప్లయితొలగించండి
  19. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి